సకల విద్యలు మాకు సన్మతి నేర్పెడు గురుదేవతా! నతుల్ గూర్తు నీకు సంస్కృతి విభవమ్ము సంప్రదాయము బెంచు గురుదేవతా! నతుల్ గూర్తు నీకు ప్రీతితో నెన్నియో నీతికథలు చెప్పు గురుదేవతా! నతుల్ గూర్తు నీకు అనురాగ మలరార నాట పాటల దేల్చు గురుదేవతా! నతుల్ గూర్తు నీకు మా హితంబును గోరెడు మాతృమూర్తి మంచి మార్గాన నడిపించు మహితమూర్తి సకల దేవతారూప ప్రసన్నమూర్తి కొలుతు నీ పదములు నతుల్ గూర్తు నీకు
లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ‘ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు’ అన్న ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని పాటను గుర్తుకు తెచ్చే చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. కాకుంటే ‘దైవం’ అని వ్యావహారిక రూపాన్ని ప్రయోగించారు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * పండిత నేమాని వారూ, ‘గురుదేవత’ను సంబోధించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * మంద పితాంబర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు.
ప్రకృతి నియమాలు దెలుపు సువర్ణశాల ధర్మ మార్గమ్ము జూపు సద్దర్మశాల జ్ఞాన మార్జింప జేయు విజ్ఞానశాల బాలలను తీర్చి దిద్దుసౌభాగ్య శాల పరమ పూజ్యమై దనరారె పాఠశాల!!!
శ్రద్ధ జూపుచు నేర్వగ చదువులన్ని
రిప్లయితొలగించండిబ్రతుకు బాటను నడువగ పద్ధతిగను
పంతులమ్మననుసరించి బడికి వచ్చి
విద్యనరయను కూడిరి వినయమతులు
బడిలో జదువు కుమారా
రిప్లయితొలగించండిగుడి యది బోధించు నట్టి గురువే దైవం
బడిలో హరియే చదివెను
గుడి నుండెడు వానికైన గురువే దైవం .
క్లాసు రూమున నిలబడి కాను పిం చు
రిప్లయితొలగించండిపం తులమ్మను జూడుడు సంతసమున
పా ఠముల్ నేర్పె శ్రధ్ధ్గ గ బాల బాలి
కలకు నయ్యది ముద మయ్యె కన్ను గవకు
సకల విద్యలు మాకు సన్మతి నేర్పెడు
రిప్లయితొలగించండిగురుదేవతా! నతుల్ గూర్తు నీకు
సంస్కృతి విభవమ్ము సంప్రదాయము బెంచు
గురుదేవతా! నతుల్ గూర్తు నీకు
ప్రీతితో నెన్నియో నీతికథలు చెప్పు
గురుదేవతా! నతుల్ గూర్తు నీకు
అనురాగ మలరార నాట పాటల దేల్చు
గురుదేవతా! నతుల్ గూర్తు నీకు
మా హితంబును గోరెడు మాతృమూర్తి
మంచి మార్గాన నడిపించు మహితమూర్తి
సకల దేవతారూప ప్రసన్నమూర్తి
కొలుతు నీ పదములు నతుల్ గూర్తు నీకు
గురువు గారు,
రిప్లయితొలగించండిఅయ్యో , ఇంత సిల్లీగా తప్పుచేసి గమనించనేలేదు. ధన్యవాదాలండి మీరు సూచించినందుకు.
ఇప్పుడు సరిగ్గా ఉందండి.
తోడుగ బుట్టిన వారలు
వేడుకలను జేయు దినము, వెల్లువగునహో
కూడిన ప్రేమలును, నిజము
నేడీ బంధము బలపడు, నేడే నేడే!
గురువులు దైవ సమానులు,
రిప్లయితొలగించండితరగతి దేవాలయమ్ము, ధరణిన్ ధర్మా
చరణే చదువులు గావలె
నరులే గావలె సురలుగ నైపుణ్యమునన్
గుండు మధుసూదన్ గారి పద్యములు....
రిప్లయితొలగించండివిద్యలను బోధనముఁ జేయు విజ్ఞగురులు
పాఠశాలను భావింత్రు పావనతమ
మైన దేవాలయముగా, నియమము లేవి
తప్పనట్టి పూజారి విధాన నెపుడు!(1)
పిల్లల సత్వరితమ్ముగ
నుల్లము సంతోషపెట్టు నుద్బోధముతో
దెల్లముఁ జేసెడి రీతుల
నెల్ల నెఱిఁగి విద్య గఱపు హితులే గురువుల్!(2)
నీతి నిజాయితీ నిత్య విద్యార్థిత్వ
మున్నట్టి గురువులే యుత్తములని;
సౌగుణ్య సౌశీల్య సౌమనస్యముఁ గల్గి
యున్నట్టి గురువులే యూర్జితులని;
ధీశక్తి చతురత దీపించు వారలై
యున్నట్టి గురువులే యున్నతులని;
సత్సమయస్ఫూర్తి, శాంత స్వభావమ్ము
లున్నట్టి గురువులే యోగ్యులునని;
పూజ్యులగు పెద్దలెందఱో బోధసేయ;
వినియు, విననట్టి వారలై, పెదవి విఱిచి,
యిచ్చ వచ్చిన యట్టుల రెచ్చిపోయి,
వర్తనము సేయఁ గలుగు దుష్ఫలితములును!(3)
కావున యొజ్జలందఱును గావలె సద్గురు రత్న ముఖ్యులున్;
వేవుఱు నిచ్చ మెచ్చి "గురవే నమ" యంచు నమస్కరింపఁగా
దైవవిశిష్టతల్ గలిగి, ధర్మముఁ దప్పక నాచరించి, సం
భావిత నిత్య కర్మములఁ బాయక నిల్చిన గౌరవమ్మిడున్!(4)
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు’ అన్న ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని పాటను గుర్తుకు తెచ్చే చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
కాకుంటే ‘దైవం’ అని వ్యావహారిక రూపాన్ని ప్రయోగించారు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
‘గురుదేవత’ను సంబోధించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
మంద పితాంబర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ ఖండిక చాలా బాగుంది. అభినందనలు.
ప్రకృతి నియమాలు దెలుపు సువర్ణశాల
రిప్లయితొలగించండిధర్మ మార్గమ్ము జూపు సద్దర్మశాల
జ్ఞాన మార్జింప జేయు విజ్ఞానశాల
బాలలను తీర్చి దిద్దుసౌభాగ్య శాల
పరమ పూజ్యమై దనరారె పాఠశాల!!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండి‘పాఠశాల’పై మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.