మిత్రులారా! నేను శ్రీ లక్ష్మీ నరసింహ శతకమును 2008లో 124+ పద్యములతో ఒకే ప్రాసతో సంపూర్ణ పాద మకుటముతో వ్రాసేను. అందులోని తొలి 3 పద్యములను ఈరోజు ఈ బ్లాగులో మీ ముందు ఉంచేను. స్వస్తి.
పూజ్య గురువులు , శ్రీ పండితుల వారి " శ్రీ లక్ష్మీ నృసింహ శతకము " నేను వారి స్వహస్తాముల మీదుగా పొద గలగడం నా అదృష్టము . అందుండి తర్వాతి పద్యము [ ౪ ] , ఇక్కడ ఉంచు తున్నాను. వారు అనుమతించ గలరని కోరుతూ ! క్షమాపణలతో . ౪ పతి వీవేకద సర్వ లోకములకున్ బ్రహ్మాండ భాండోదరా ! దృతి నీవే సకలాపదాపహ ! మహా దేదీప్య మానోజ్జ్వలా ! గతి నీవే మము బోంట్లకున్ సకల లోకత్రాణ ధౌరేయ ! ఆ శ్రిత బృందావన తత్పరా ! పరమ లక్ష్మీ నారసింహ ప్రభో !
లక్ష్మీదేవి గారూ, మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ శతకాన్ని మీరిచ్చిన "లింకు" ద్వారా చూసాను. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. రెండవ పాదాదిని యడాగమం ఉంటే బాగుంటుంది. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, ధన్యవాదాలు. అదృష్టవంతులు మీరు. * కమనీయం గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
జననీ గర్భమునందున
రిప్లయితొలగించండివినెనట నారదు పలుకుల వీనులవిందౌ
ఘనుడా విష్ణుని కథలను,
మనమున భక్తిని నిలిపెను మాయని విధమున్
పుట్టె నాతడపుడు దాను, పుడమియందు బాలుడై,
పట్టినాడు విష్ణువ్రతము, పట్టువిడకనుండి దా
గట్టిగాను నిలిచి చూపె ఘనతతోడ భక్తితో
చిట్టి తండ్రి తండ్రికిచ్చె శ్రీకరమగు ముక్తినిన్.
జపమ్ము మానమంచు తండ్రి సంతతమ్ము చెప్పగా
తపమ్ము వీడియుండజాల, తల్లి దండ్రి విష్ణువం
చు పంతమూని జూపెనంత చోద్యమేమి? స్తంభమున్
ప్రపంచమెల్ల రక్ష జేయు భర్త నారసింహునిన్.
లోకమెల్లను పాడవచ్చెను లోకనాథుని మంగళమ్!
నాకమందున జేర పాడుడు నారసింహుని మంగళమ్!
భీకరమ్ముగ గాన వచ్చెడు పెద్ద స్వామికి మంగళమ్!
శ్రీకరుండగు నారసింహుని సేవకాళికి మంగళమ్!
నా రచన శ్రీలక్ష్మీనరసింహ శతకము నుండి:
రిప్లయితొలగించండిశ్రుతిసంవేద్య! సహస్ర శీర్ష! పురుషా! శ్రుత్యంత సారాద్భుత
ద్యుతిమల్లోక విహారలోల! విలసఛ్ఛుద్ధాంతరంగాన సా
దృతి ధ్యానింతును శ్రీనిధాన వరమై దీపించు నీ తత్త్వమున్
శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహప్రభూ!
ధృత మీనాది దశావతారవిభవా! దేవేంద్ర ముఖ్యామరా
ర్చిత దివ్యాంఘ్రి సరోరుహా! హృదయ లక్ష్మీ ప్రేమ దృగ్జాల వ
ర్ధిత తేజోవిభవాభిరామ! నిను ప్రార్ధింతున్ మహాజ్ఞేయ! సం
శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహప్రభూ!
సతి వక్షస్థల వేది నొప్పును విరాజత్ పద్మరాగ ప్రభా
వతియై "యభ్రజయౌ తటిల్లత" వలెన్ భాసిల్లు తన్మంగళ
ద్యుతులే నిండి జగమ్ములందు సుఖ శాంతుల్ కూర్చు విశ్వంభరా!
శ్రిత బృందావన తత్పరా! పరమ! లక్ష్మీ నారసింహప్రభూ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినరసహిత సింహ రూ పుడ !
నురమున నే నిల్పు కొందు నో నర సింహా !
నిరతము నీ దయ జూపుము
పరమాత్మా ! నన్ను జూడు ప్ర హ్లాదు వలెన్ .
మిత్రులారా!
రిప్లయితొలగించండినేను శ్రీ లక్ష్మీ నరసింహ శతకమును 2008లో 124+ పద్యములతో ఒకే ప్రాసతో సంపూర్ణ పాద మకుటముతో వ్రాసేను. అందులోని తొలి 3 పద్యములను ఈరోజు ఈ బ్లాగులో మీ ముందు ఉంచేను. స్వస్తి.
పండితనేమానివారు మిగతావి కూడా చదివే అదృష్టం కల్పిస్తారని ఆశిస్తాను. మీ బ్లాగులో పెట్టి ఆ లంకె ఇక్కడ ఇవ్వమని మనవి.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఎందును జూచిన తప్పక
రిప్లయితొలగించండినందందే యుందు ననుచు నసురుని కపుడే
సందేహము దీర్చిన కను
విందగు నరసింహ రూప విష్ణువు నకు జే !
పూజ్య గురువులు , శ్రీ పండితుల వారి " శ్రీ లక్ష్మీ నృసింహ శతకము " నేను వారి స్వహస్తాముల మీదుగా పొద గలగడం నా అదృష్టము . అందుండి తర్వాతి పద్యము [ ౪ ] , ఇక్కడ ఉంచు తున్నాను. వారు అనుమతించ గలరని కోరుతూ ! క్షమాపణలతో .
రిప్లయితొలగించండి౪
పతి వీవేకద సర్వ లోకములకున్ బ్రహ్మాండ భాండోదరా !
దృతి నీవే సకలాపదాపహ ! మహా దేదీప్య మానోజ్జ్వలా !
గతి నీవే మము బోంట్లకున్ సకల లోకత్రాణ ధౌరేయ ! ఆ
శ్రిత బృందావన తత్పరా ! పరమ లక్ష్మీ నారసింహ ప్రభో !
చిన్న సవరణ తో...
రిప్లయితొలగించండిఎందెందు వెదకి చూచిన
నందందే యుందు ననుచు నసురుని కపుడే
సందేహము దీర్చిన కను
విందగు నరసింహ రూప విష్ణువు నకు జే !
Hi all well wishers!
రిప్లయితొలగించండిYou can have look at my publoication Sree Lakshmi Narasimha Satakam at the following web site:
http://panditha-nemani.info/pdfs/LakshmiNarasimhaSatakamu.pdf
రిప్లయితొలగించండినరసిమ్హావతార ఘట్టంలో పోతనగారి పద్యాలు చదివాక ఏం రాస్తామనిపించింది.ఐనా చంద్రునికో నూలుపోగు లాగ ఒక పద్యం రాసాను.
ఎచట నున్నాడు నీ యిష్టదైవము హరి ?
లేని చోటెక్కడ లేదు తండ్రి.
కనిపించునే యిట కంబమందున వాడు?
కనుపించు నామాట కల్ల కాదు .
స్తంభమ్ము జరచిన జండభీకరముగ
వెనువెంట నావిర్భ వించె నచట
నరసిమ్హమూర్తియై నారాయణస్వామి
శిష్ట రక్షణ దుష్ట శిక్ష జేయ
భక్తవరుడైన ప్రహ్లాదు బాలు బ్రోవ
కనకకశిపుని ఘోరమ్ము గావధించె
మునులు,దివ్యులు ,మానవుల్ ముజ్జగముల ,
పరమపావను ,శ్రీహరి బ్రస్తుతింప.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
నరసింహావతారము :
01)
_______________________________
నాడు ప్రహ్లాదు రక్షింప - నరహరి గను
నిట్ట బ్రద్దలుగొట్టుక - నిలచి నట్టి
నరహరికి వందన మిడరె ! - వరము లిచ్చు !
నమ్మి కొలిచిన రక్షించు - నమ్మకముగ !
_______________________________
నిట్ట = స్తంభము
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ శతకాన్ని మీరిచ్చిన "లింకు" ద్వారా చూసాను. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవ పాదాదిని యడాగమం ఉంటే బాగుంటుంది.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
ధన్యవాదాలు. అదృష్టవంతులు మీరు.
*
కమనీయం గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారి పద్యము.....
రిప్లయితొలగించండిమత్తేభము(పంచపాది):
జననీ గర్భిత విష్ణుభక్తిపరుఁడై; సద్వంద్యుఁడై; తండ్రికిన్ దన హృత్స్థేశ్వరుఁడౌ హరిం దెలుపఁగా దైత్యేంద్రుఁ డుగ్రుండునై
చని గర్వమ్మున విష్ణుఁ జూపు మనుచున్ స్తంభమ్మునున్ మోదఁగన్
వనజాక్షుండు నృసింహ రూపుఁ డయి తత్ప్రహ్లాదుఁ గావంగ, త
ద్దనుజేంద్రున్ జఠరమ్ముఁ జీల్చి యెసఁగెన్; దచ్ఛౌరిఁ గొల్తున్ సదా!
ఆది నారసింహుడిగను అవతరించి జగతి, యా
రిప్లయితొలగించండివేద మునులు, దేవతలును, వేడుకొనగ ధరణి, ప్ర
హ్లాద జనక సంహరణము అద్భుతముగ జేసి, స
మ్మోదమున వసించినావు మోహనాంగ రాఘవా !
వసుధ యందు శుభము జరుగవలెనని తలచు ఘన,తా
పసుల యజ్ఞ యాగములను పట్టి భంగ పరచు యా
నసుర రాజు సంహరించి అవని జనుల గాచి, మా
వెసలు దీర్చినావు నీవు వీరునిగను రాఘవా !
వామన కుమార్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.