గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, వేగంగ స్పందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు. సవరించిన సమస్యలోనూ నేను వసిష్టుని వదలలేదు. దానిని దృష్టిలో పెట్టుకొని మరొక చక్కని పూరణను మీనుండి ఆశిస్తున్నాను. స్వస్తి!
అయ్యా చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు. శ్రీ శంకరయ్య గారు ఇచ్చిన సమస్య: "చేపల పులుసడిగెరా వశిష్ఠుడు ప్రీతిన్" మీకు మరొక విధమైన పాఠము ఎలాగ వచ్చినది. వివరించండి. స్వస్తి.
శ్రీ గురువుగారికి , శ్రీ నేమాని వారికి నమస్కారములతో
భోజనశాలకు రాత్రికి వేయు వసిష్ట వేషము తో వచ్చిన వారికి ఏమి కావలెననియడిగిన యువతితో -------- కోన సీమలో "రామలు" వానగురియ లభ్యమని దెలియగ చేపల పులుసడిగె రా వసిష్టుడు ప్రీతితో, రాత్రి వేష మందు, ముందునిలచినట్టి మగువ తోడ ("రామలు" = చేపలు )
చేపట్ట కామధేనువుఁ కోపంబునశౌనకుండు కోరిన నైనన్ ఓపికవీడని వాడే చేపల పులుసడిగెరా వశిష్టుడు ప్రీతిన్? (సాత్వికుడు,బ్రహ్మర్షియైన వాడు ఉప్పు కారాల మాంసాహారము నెందుకు యడుగుతాడన్న ప్రశ్నార్థక పూరణ)
ఈరోజు చేపల పులుసునకు వచ్చినన్ని విభిన్న పూరణలు మత్స్యావతారమునకు రాలేదు. ఏం చేస్తాము? సాధు సాధు. అందుచేత అందరి అభిరుచిని ఆదరించాలి కదా. పూరణలు చేసిన వారికందరికి మంచి ప్రశంసలే. స్వస్తి.
మాస్టారూ ఈరోజు సమస్య కంద పద్య పాదం అనుకొంటే ఒక లఘువు ఎక్కువగా ఉందేమో? "చేపల పులుసారాగించె సిష్ఠుడు ప్రీతిన్" చాలేమో!
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండినిజమే స్మీ! తొందరలో గమనించలేదు. ధన్యవాదాలు. సవరిస్తున్నాను.
మాపటి వేళను శాస్త్రులు
రిప్లయితొలగించండిచేపల యక్వేరియమును చేకొని వచ్చెన్
చూపుచు సుతునకు రంగుల
చేపల, పులు సారగించె శిష్ఠుడు ప్రీతిన్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండివేగంగ స్పందించినందుకు అభినందనలు, ధన్యవాదాలు.
సవరించిన సమస్యలోనూ నేను వసిష్టుని వదలలేదు. దానిని దృష్టిలో పెట్టుకొని మరొక చక్కని పూరణను మీనుండి ఆశిస్తున్నాను. స్వస్తి!
మాస్టరు గారూ! ధన్యవాదములు. ఈ రోజు సమస్యలు రెండూ చేపలమీదే..కాకతాళీయమేనా...
రిప్లయితొలగించండిఅయ్యా చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారు ఇచ్చిన సమస్య: "చేపల పులుసడిగెరా వశిష్ఠుడు ప్రీతిన్" మీకు మరొక విధమైన పాఠము ఎలాగ వచ్చినది. వివరించండి. స్వస్తి.
బాపురె! కలకత్తా పురి
రిప్లయితొలగించండిలోపల నొక నాటకమ్ములో నటకుడు దా
నోపక క్షుద్బాధ నహో
చేపల పులుసడిగెరా వశిష్ఠుడు ప్రీతిన్
రిప్లయితొలగించండిరూపవతి పెళ్లి వారును
చేపల పులుసడి గెరా, వసి ష్టు డు ప్రీ తిన్
పాపి యగు చుప్ప నాతిని
చాపముతో జంపు మనెను సరగున రామున్
శ్రీ గురువుగారికి , శ్రీ నేమాని వారికి నమస్కారములతో
రిప్లయితొలగించండిభోజనశాలకు రాత్రికి వేయు వసిష్ట వేషము తో వచ్చిన వారికి ఏమి కావలెననియడిగిన యువతితో
--------
కోన సీమలో "రామలు" వానగురియ
లభ్యమని దెలియగ చేపల పులుసడిగె
రా వసిష్టుడు ప్రీతితో, రాత్రి వేష
మందు, ముందునిలచినట్టి మగువ తోడ
("రామలు" = చేపలు )
చూపులె చేపలు, మధురిమఁ
రిప్లయితొలగించండిజేపును,వలపును కలిపిన చేపల పులుసే!
తాపము హెచ్చగ భార్యను
చేపల పులుసడిగెరా వసిష్ఠుడు ప్రీతిన్!!
శ్రీసరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! అభినందనలు.
ఈనాటి సమస్య 2 పాఠములలో నున్నదేమో నాకు తెలియదు. చేపల పులుసడిగెరా వశిష్ఠుడు ప్రీతిన్ అనే పాఠమునే తీసుకొందాము.
1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: మీరు శిష్ఠుడు అనే పూరించేరు. మంచి విరుపుతో పద్యము బాగున్నది.
2. శ్రీ సుబ్బా రావు గారు:
(1) రూపవతి పెళ్ళివారు అనునప్పుడు "చేపల పులుసడిగిరి" అని బహువచనము రావాలి క్రియలో - అందుచేత పూరణను మార్చాలి.
(2) పాపియగు చుప్పనాతిని చంపమని వసిష్ఠుడు రామునికి చెప్పుట సమంజసముగా లేదు.
3. శ్రీ వరప్రసాద్ గారు:
కోనసీమ ప్రత్యేకము - రామల చేపలను అందరికీ పరిచయము చేసేరు.
పద్యమును తేటగీతిగా మలిచేరు.
చాల బాగున్నది.
4. శ్రీ జిగురు సత్యనారాయణ గారు:
మీనాక్షితో సరసము సరదాగానున్నది. చాల బాగున్నది.
స్వస్తి.
గుండు మధుసూదన్ గారి పూరణలు...
రిప్లయితొలగించండి(1)
(ఏకాదశి నాఁటి యుపవాస దీక్ష చెడకుండుటకై వశిష్ఠుఁడు పలికిన సందర్భము)
తాపసి కాతిథ్యం బిడఁ
గా పాఱుం డొకఁడు పిలువఁ గాదనకన్ దా
దాపది తప్పించుకొనఁగఁ
జేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
(2)
సాపాటున కొక మూఢుఁడు
చేపల పులుసడిగెరా! వశిష్ఠుఁడు ప్రీతిన్
దాపునకుఁ బిల్చి, యాతని
చాపల్యముఁ బోవఁ జేసి, సద్గురు వాయెన్!
(3)
(మిత్రసహుఁడను రాజునింటికి భోజనమునకై వెడలినపుడు వశిష్ఠునిపై నొక దనుజుఁడు మాయఁ బన్నిన సందర్భము)
సాపాటున నర మాంసము,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
దాపున నవి కని, వెంటనె
కోపము రా, నపుడు దనుజు ఘోరముఁ దెలిసెన్!
(4)
(పరస్పర శాపకారణమున వశిష్ఠుఁడు ఆడేలుగను, విశ్వామిత్రుండు బకముగను మారి, కలహించు సందర్భము)
దాపున గాధిజుఁ గని, నగి,
చేపల పులుసడిగెరా, వశిష్ఠుఁడు ప్రీతిన్!
'చేపల నీవే తిను'మని
తాపసి యాడేలు కనియెఁ దాఁ దోడేలై!
చేపట్ట కామధేనువుఁ
రిప్లయితొలగించండికోపంబునశౌనకుండు కోరిన నైనన్
ఓపికవీడని వాడే
చేపల పులుసడిగెరా వశిష్టుడు ప్రీతిన్?
(సాత్వికుడు,బ్రహ్మర్షియైన వాడు ఉప్పు కారాల మాంసాహారము నెందుకు యడుగుతాడన్న ప్రశ్నార్థక పూరణ)
ఈరోజు చేపల పులుసునకు వచ్చినన్ని విభిన్న పూరణలు మత్స్యావతారమునకు రాలేదు. ఏం చేస్తాము? సాధు సాధు. అందుచేత అందరి అభిరుచిని ఆదరించాలి కదా. పూరణలు చేసిన వారికందరికి మంచి ప్రశంసలే. స్వస్తి.
రిప్లయితొలగించండిఈరోజు మత్స్యావతారము కాబట్టి నేనొక అవధానంలో విన్న సమస్య గుర్తొస్తోంది. ఔత్సాహికులు పూరించవచ్చు.
రిప్లయితొలగించండి"మత్స్యము మత్స్యమే మరియు మత్స్యము మత్స్యము గాక యేమగున్"
రిప్లయితొలగించండికాపులెకాదీ దినముల
సాపాటున రుచి మరగిన సర్వులు ,బాంగ్లా
బాపలు కూడను తిందురు
చేపల పులుసారగించె శిష్టుడు ప్రీతిన్.
ఆ పూర్వకాలమందున
పూపము మోదకమె కాదు ,పాపము లేదా
బాపలు,నామిషమును దిన
చేపలపులుసడిగెరా,వశిష్టుడు ప్రీతిన్.
మనదేశంలో బౌద్ధ,జైన,మతాల ప్రభావంతోనే శిష్టులలో
శాకాహారం బాగా అలవాటయింది అని అంటారు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఒక నాటక వేషధారి :
01)
_______________________________
మాపుల వేషము కిచ్చెడు
రూపాయల కొరకు మునిగ - రూపము మార్చెన్ !
దాపున భోజన మందుచు
చేపల పులు సడిగెరా వ - సిష్ఠుడు ప్రీతిన్ !
_______________________________
01)
రిప్లయితొలగించండి_________________________________________
మత్స్యపు వారి యింట బహు - మంచిగ జేసెడి పెండ్లి విందుకై
మత్స్యపు జాతులెన్నొ మరి - మాపటి వేళకు జేర్చి నంతటన్
మత్సపు వాసనే పడని - మానిసి యొక్కడు బీల్చి యిట్లనెన్
మత్స్యము మత్స్యమే మరియు - మత్స్యము మత్స్యము గాక యేమగున్"
_________________________________________
ఏపని జేసిన నెపుడున్
రిప్లయితొలగించండిపాపము లేదుర కవులకు బ్రహ్మర్షులకున్
తాపము మీరగ సరయూ
చేపల పులుసడిగెరా వసిష్ఠుడు ప్రీతిన్