28, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 805 (కమలమునకు చంద్రుఁడే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్.
(కన్నడ బ్లాగు "పద్యపాన" సౌజన్యంతో)
కన్నడ సమస్య...
ಕಮಲಂ ಚಂದ್ರಂಗೆ ತಕ್ಕುದೆನಿಸಿತ್ತಲ್ತೇ!

25 కామెంట్‌లు:

  1. కమలము వేడిని గోరును
    కమనీయపు చలువ తాను కలువకు నిచ్చున్
    విముఖత మనసులు గలువక
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్?

    రిప్లయితొలగించండి
  2. ప్రమదమును నింపు, నింపుగ
    సుమశరు లీలలను దేల్చు శోభలు పెంచున్
    రమణీమణి తారాముఖ
    కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి
  3. ప్రమదకు ముదమది కల్గిన
    సమయము నందున, సఖుండు చందనచర్చల్
    సుముఖత జేసిన, నా ముఖ
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్.

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ....

    కమలాప్తుండు సుఖమ్మిడు
    కమలమునకు! చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్
    విమల సుశోభిత కల్హా
    రమునకు! హితులౌట కతన రాగిలఁ జేయున్!!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    గురువుగారి సవరణలకు ధన్యవాదములు
    -------
    కమలము భామల కర స్పర్శ కంటెను చంద్రుని దర్శనమునకై వేచియుండును
    ------
    కమలమును జూచి భామలు
    తమ కమనీయ వదనమును దడుము గొనునుగా
    జమున కర స్పర్శ గంటెను
    కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్ | .
    --------
    కేరళ లో చంద్రుని వెన్నెల హాయినిచ్చును
    -----
    సొగసు గానిల్వ కొలనులో, సుఖము నిచ్చె
    దనుజ కర స్పర్శలు కమలమునకు,చంద్రు
    డే సుఖమ్మును గూర్చు పాండేశ పురము
    నందు స్వామి దర్శనమున ముందు గాను |

    రిప్లయితొలగించండి
  6. అమలకు, ప్రమదకు నిచ్చెను
    సమయము రమణుడు, మరచెను సాంగత్య మునన్ |
    విముఖత్వము నున్నను హృ
    త్కములమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి
  7. యమునైన గాల్చు శంభో!
    తమ మూడవ కన్ను దాని తాపము బాపన్
    అమరెను తలపై మీ ముఖ
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వేశ్యాలోలుడైన , కమలం భర్త , చంద్రం
    పాండురంగ మహత్మ్యంలో పుండరీకుని వలె
    పరివర్తన జెంది , ఆమె సంసారము చక్కబడినప్పుడు :
    01)
    _______________________________

    కమలాక్షుల వెంట దిరుగు
    కమనుడయిన భర్త , తిరిగి - కనుదెరవగనే
    కమనీయమైన, భావము
    కమలమునకు చంద్రుఁడే సు - ఖమ్మును గూర్చున్ !
    _______________________________
    కమనుడు = కాముకుడు
    కనుదెరచు = మేలుకొను (మార్పుజెందు)
    కమనీయమైన = మనోహరమగు(సుఖమయమగు)
    భావము = సంసారము (, ప్రవర్తన, మనసు, తలపు, ప్రేమ)

    రిప్లయితొలగించండి
  9. ప్రమథ గణంబులకధిపతి,
    సుమశరుని జ్వలించి చెలగు శుభ శంకరుకున్,
    అమరెను తలపై తన్ముఖ
    కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్.

    రిప్లయితొలగించండి
  10. అమరేం ద్రుని వనమం దున
    కుముదము లవి కొలను నిండ కన్నుల విందౌ !
    రమణీ యపు కౌముది గన
    కమల మునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్ !

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ బాగుంది.
    "అమరేం ద్రుని వనమం దున
    కుముదము లవి కొలను నిండ కన్నుల విందౌ !

    రిప్లయితొలగించండి
  12. ప్రమలంబయ్యెడి తన విర
    హములన్ పరిమార్చు నెపమునందున రేయిన్
    సుమశరునితలచు స్త్రీముఖ
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    ప్రమలము అని మీరు వాడిన పదము సరియైనదేనా లేక టైపు పొరపాటు కలదా? అర్థము వివరించ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. వానలు లేక సూర్య ప్రతాపము పెరిగిన సంధర్భంలో:

    చెమరించె చందురునకున్!
    దుమదుమలన్బెంచిసూరి దూకుడు రేగన్
    కమలేశు కాకకు కమరు
    కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్!

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీ నరసింహం గారి పూరణ....
    (1)
    చిమచిమలాడెడు నెండకు
    తమ యింట కరెంటు కోత తాపము పెంచన్
    కమిలెడు జనులకు, కలువకు,
    కమలమునకు చంద్రుడే సుఖమ్ముల గూర్చున్.
    (2)
    సుమ మనమున విరబూసిన
    సుమధుర మకరంద భావ సుకుమార సరా
    గ మధురిమలు జిల్కు వదన
    కమలమునకు చంద్రుడే సుఖమ్ముల గూర్చున్.

    రిప్లయితొలగించండి



  16. ద్యుమణియె సంతస మొసగును ,
    కమలమునకు; చంద్రుడే సుఖమ్మును గూర్చున్
    విమల నిశీధిని కల్ హా
    రములను వికసింపజేసి రాజిల్లంగన్.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ నేమాని గురువర్యులకు,

    ప్రణామములు. ప్రమలు అంటే ద్యోతకమగు, చిగురించు, ప్రబలు అనే అర్థము ఉంది కదా గురువుగారు. దానినే ప్రమలంబగు అని వ్రాసినను. తప్పయితే మరియొక ప్రయత్నము చేస్తాను.

    రిప్లయితొలగించండి
  18. సమముగ "నారా" చంద్రుడె
    సమాదరింపంగ నాడు శక్తిని పొందెన్
    కమిలెను బీజేపి తుదకు
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి
  19. తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా తెలుగు భాషాభిమానులైన అందరికీ నా శుభాకాంక్షలు.
    http://andhraamrutham.blogspot.in/2012/08/blog-post_28.html
    శుభమస్తు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    ప్రమలు అనే పదము నాకు అందుబాటులో నున్న నిఘంటువులలో కనబడలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ‘ముఖకమలము’ నాశ్రయించిన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీరూ ముఖకమలాన్నే ఆశ్రయించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా కంద పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    ‘కరస్పర్శ’ అన్నప్పుడు గణదోషం.
    *
    మిస్సన్న గారూ,
    మీ ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. తాపోపశమనానికి శివుడు చంద్రుని ధరించాడా? మనోహరమైన ఊహ... అభినందనలు.
    *
    వసంత్ కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    వామన కుమార్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మనోహరంగా సాగింది మీ పద్యపు నడక.. అభినందనలు.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ప్రమలము’ శబ్దం నాకూ ఎక్కడా లభించలేదు. అక్కడ ‘కుములగ జేసెడి’ అంటే?
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. సమరము జేసెడి నేతగ
    కుములుచు కుందుచు తెరాస కూడబలుకగా
    న.మొ. భాజపార్టి గురుతౌ
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి
  23. నములుచు పండ్లను తిమురున
    కుములుచు కుందుచు నరచుచు కుత్సిత మతితో
    చెమరుచు వీడగ భాజప
    కమలమునకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

    రిప్లయితొలగించండి