కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
(ఈరోజు సమస్య ఏమివ్వాలా అని ఆలోచిస్తుంటే
పక్కింట్లోంచి ‘ప్రేమ్‌నగర్’ సినిమా పాట వినిపించింది)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
(ఈరోజు సమస్య ఏమివ్వాలా అని ఆలోచిస్తుంటే
పక్కింట్లోంచి ‘ప్రేమ్‌నగర్’ సినిమా పాట వినిపించింది)
గోలగ నుండెడు పాటల
రిప్లయితొలగించండినీలలు వేయుచును 'స్టెప్పు' లేవేయవలెన్
ఈలా తరములు మారెను
'లే లే నా రాజ' యనిన లేవఁడు రాణీ!
ఏల దిగాలుగ నుంటివి?
రిప్లయితొలగించండిలీలగ మనుమండు నిదుర లేచుట కనియా?
బాలుడ! నిదురించిన మే
లే లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!
రాజు గారి చిన్న భార్య పెద్ద భార్యతో మొరపెట్టుకొంటున్నట్లు (సరదాగా):
రిప్లయితొలగించండివాలుజడల చింతామణి
లాలన చేయ నిక మమ్ములన్మరచితివో
చాలిక చేతులు కాలును
లే! లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
నా పూరణ "The Other" గా పడింది. దయచేసి గమనించగలరు.
రిప్లయితొలగించండిరాలే పువ్వులె మనుజులు
రిప్లయితొలగించండికాలుని పాశమరుదేర కాదన గలరే?
కాలముఁ జేసె మన ప్రభువు
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!!
వేళాయె పాఠశాలకు
రిప్లయితొలగించండినేలాగుర లేవకున్న నేమిటి నిద్రా ?
యీ లాగు నయిన నెటులనె?
లేలేనారాజ యనిన లేవడు రాణీ!
లేలే నారాజ! యనుట
రిప్లయితొలగించండిచాలా యపచారమగును జనపతి యెడలన్
మేలిడు రీతిన్ బలుకుము
లేలే నా రాజ యనిన లేవడు రాణీ!
(క్రొత్తగా కాపురమునకు వచ్చిన రాణికి రాజగురువు చేసిన బోధ)
పాలకునికి వంచనతో
రిప్లయితొలగించండిమాలిమిగా మందుబెట్టి మందుని జేయన్
ఆలించగ రిపు గర్జన
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ!
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండి(ప్రణయకలహాన నలిఁగి, దొంగనిద్రనటించు రాజును లేప యత్నించు రాణితో, గడుసరియౌఁ బరిచారిక పలికిన సందర్భము)
"కైలాటకాఁడు రాజును,
'లేలే నా రాజ' యనిన, లేవఁడు రాణీ!
కాలి పయి వాఁతఁ బెట్టిన
మేలౌఁ; గపటంపు నిదుర మేల్కొనుఁ ద్వరఁగన్!"
మనుమడి గురించి కూతురు రాణి తో తల్లి సంభాషణ:
రిప్లయితొలగించండిగోలయని నీ కుమారుని
మేలని మాయింటవిడువ మీరలు, చదువన్
నీ లా వేకువ జామున
లే!లే! నా రాజ యనిన లేవడు రాణీ!
ఏలా వదినా శోకము
రిప్లయితొలగించండిలే లే నా రాజ యనిన లేవఁడు రాణీ
కూలెను దశ కంధరుడే
యాలించక మంచిమాట నకటా నేలన్.
సరదాగా నా కూతురు జాహ్నవి ఇచ్చిన భావంతో:
రిప్లయితొలగించండివేళకు సమస్య నీయగ
లీలగ మేళ్కొని గురువులు లే!లే! పాటన్
మేలౌ రీతి నిటు లొసఁగె
"లే లే నా రాజ యనిన లేవడు రాణీ!"
శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి, ఆర్యులందరికీ
రిప్లయితొలగించండిప్రణామం!
శ్రీమదాదిశంకరాచార్యుల వారు అమరుకుని మృతదేహాన్ని చూసి భార్యలు విలపిస్తుండగా చూచిన దృశ్యం –
“లీలావతు లిందఱ మరు
కేలినిఁ దనియించు ప్రియుఁ డి కేఁడి? యమరు భూ
పాలకశిఖామణి! జగము
లేలే నా రాజ! యనిన, లేవఁడు రాణీ!”
విధేయుడు,
ఏల్చూరి మురళీధరరావు
యేలీల వెదకి జూచిన
రిప్లయితొలగించండిచాలదు యీ మనుజ జన్మ సారూప్యము నన్ !
కాలగతి నిలఛి పొయిన
లేలే నారాజ యనిన లేవడు రాణీ !
లీలావినోదమనుకొనొ?
రిప్లయితొలగించండిమేలెంచెనొకీడుఁగనకమేలములాడెన్
ఫాలాక్షునిబారిబడెన్
'లే లే నా రాజ' యనిన లేవఁడు రాణీ!
భక్తప్రహ్లాద సినిమాలో
రిప్లయితొలగించండిభర్త మాట మీరలేక కన్నతల్లి యిచ్చిన విషము త్రాగి , రూపు మారి
నేల మీద పడిపోయిన ప్రహ్లాదకుమారుని జూచి మరణించాడని
తలచిన హిరణ్యకశిపుడు , దుఃఖ్ఖిస్తున్న లీలావతితో :
01)
_________________________________
పాలను బట్టిన చందము
బాలకునకు పట్టి నట్టి - పాషాణముచే
కాలము తీరెను వానికి !
లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
_________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ బాలుని శవము తన కుమారునిదే ననీ, ఆమె తన భార్యయైన
రిప్లయితొలగించండిచంద్రమతీదేవి యనీ గుర్తించిన హరిశ్చంద్రుడు దుఃఖ్ఖించి
పిమ్మట తెప్పరిల్లి , శోకవివశయైన చంద్రమతి నూరడిస్తూ :
02)
_________________________
బాలున కాయువు దీరెను !
ఫాలాక్షుని దరమె వీని - బ్రతికింపంగా ?
బేలా ! శోకము వీడుము !
లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
_________________________
ఆ బాలుని శవము తన కుమారునిదేననీ, ఆమె తన భార్యయైన
రిప్లయితొలగించండిచంద్రమతీదేవి యనీ గుర్తించిన హరిశ్చంద్రుడు దుఃఖ్ఖించి
పిమ్మట తెప్పరిల్లి , శోకవివశయైన చంద్రమతి నూరడిస్తూ :
03)
_________________________
లేలేత ప్రాయ మందున
లోలాక్షీ ! పాటు నొందె - లోహితు డయ్యో !
లోలోన కుంది లాభమె ?
లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
_________________________
ప్రమాదంలో మరణించిన కుమారుడు రాజును దలచి దుఃఖ్ఖిస్తున్న
రిప్లయితొలగించండిభార్య రాణి నోదార్చుతూ ఆమె భర్త :
04)
_________________________
జాలే లేనిది మృత్యువు !
చాలింపగ జేసె సుతుని - చక్కని తనువున్ !
చాలింక నూరడిల్లుము !
లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
_________________________
అగ్ని ప్రమాదంలో మరణించిన కుమారుడు రాజును దలచి దుఃఖ్ఖిస్తున్న
రిప్లయితొలగించండిభార్య రాణి నోదార్చుతూ ఆమె భర్త :
05)
_________________________
జ్వాలా మాలికలం బడి
కాలుటచే జేరె నయ్యొ- కాలుని దరికే !
కూలెను మన కల లన్నియు !
లే, లే , నా రాజ యనిన - లేవఁడు రాణీ !
_________________________
శ్రీ సరస్వత్యై నమః:
రిప్లయితొలగించండిమిత్రులారా! - అందరికీ అభినందనలు.
నిన్నటి సమస్య - సినీ సమస్యే కాని వివిధములైన పూరణలు వచ్చినవి. బాగు బాగు.
1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి స్టెప్పులు ఈలలు వేయుటకు తగినది అనిపించినది. చాల బాగున్నది.
2. అజ్ఞాత గారు : నిద్రిస్తున మనుమడిని గురించి బాగుగ వ్రాసేరు.
3. శ్రీ చంద్రశేఖర్ గారు: రాజు గారి చిన్న భార్య & పెద్ద భార్యలను ప్రవేశ పెట్టేరు. చాల బాగున్నది.
4. శ్రీ జిగురు సత్యనారాయణ గారు: కాలుని రాకను సూచించేరు. చాల బాగున్నది.
5. శ్రీ సుబ్బరావు గారు పాఠశాలకి వెళ్ళే తొందరలో నున్నారు. చాల బాగున్నది. వైవిధ్యమైన భావము.
6. శ్రీ తుమ్మల శిరీష కుమార్: పాలకునికి చేసిన మందు విందు గురించి వినూత్నముగా వర్ణించేరు. చాల బాగున్నది.
7. శ్రీ గుండు మధుసూదన్ గారు ప్రణయ కలహము తరువారి ఘట్టమును ఎంచుకొనినారు. వైవిధ్యముతో నున్నది పూరణ. బాగు బాగు.
8. శ్రీ సహదేవుడు గారు: 2 విధాలుగా పూరించేరు (1) మనుమడు వేకువజామున లేవడని (2) ఈ సమస్యనే విషయమునే ఎంచుకొన్నారు. చాలా బాగున్నాయి.
9. శ్రీ మిస్సన్న గారు రావణ నిర్యాణము - విభీషణుడు వదినెకి చెప్పిన మాటలను ఉట్టంకించేరు. బాగున్నది.
10.డా. ఏల్చూరి వారు జగద్గురువులు శ్రీమదాది శంకరులను ప్రస్తావించేరు - పవిత్రమైన భావము.
11. శ్రీమతి రాజేశ్వరి గారు: సారూప్యము నొందిన వానిని గూర్చి వ్రాసేరు. బాగున్నది.
12. శ్రీ రామకృష్ణ గారు: ఫాలాక్షుని బరిన పడిన వానిని (మన్మథుడు కాబోలు) వర్ణించేరు. చాల బాగున్నది.
13. శ్రె వసంత కిశోర్ గారు: చక్కని 5 పద్యములలో వివిధ సినీమాలలో విషయములను వర్ణించేరు అందముగా వర్ణించేరు. బాగు బాగు.
అందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు.
స్వస్తి.
చాలిక నీ మొద్దు నిదుర!
రిప్లయితొలగించండిశ్రీలత, మాలతి, ఇషాని, శ్రీకృప, లలితల్
నీలా లేటుగ లేవరు!
లే! లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!
కాలగ ముక్కున్ మూతియు
రిప్లయితొలగించండివాలమ్మును ముడుచు కొనుచు వడిగా నేలన్
కూలిన రాహులు బాబను
లే! లే! నా రాజ! యనిన లేవఁడు రాణీ!
రిప్లయితొలగించండిలాలించుము నీవా గో
పాలుని ముదమారగాను బాలకుమారీ !
కాలేయము కుంటువడెను
లేలే నా రాజ యనిన లేవఁడు రాణీ!
జిలేబి