అయ్యా! శ్రీ పంతుల రాజారావు గరూ! మీరు భాగవతములోని పద్యమును సూచించేరు. ధన్యవాదములు. ఇక్కడి సంప్రదాయము ప్రకారము పాల్గొనే వారు వారి వారి స్వంత "పద్య కవితలనే" పంపించాలి. స్వస్తి.
అయ్యా! శ్రీ సుబ్బా రావుగారూ: "సహకరించుట లేదయ్య దేహమింక" అనే పాదములో మీరు ప్రాస యతిని వేసేరనుకొనినారు. కానీ, ప్రాసయతి నియమమును మీరు పాటించలేదు. సరిజేయండి. స్వస్తి.
పండిత నేమాని వారూ, గజేంద్రమోక్ష ఘట్టాన్ని పద్యఖండిక ద్వారా మనోహరంగా చెప్పారు. ధన్యవాదాలు. * చిత్రాన్ని చూచి ప్రేరణ పొంది ఆహ్లాదకరంగా పద్యాలు వ్రాసిన సహదేవుడు గారికి, సుబ్బారావు గారికి, అభినందనలు, ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా నంపెస
రిప్లయితొలగించండిత్వరితాకంపితభూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా,
పరిభూతాంబరశుక్రమున్ బహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం,
తరనిర్వక్రము( బాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్
(క్షమించండి గజేంద్రమోక్షము లో పై చిత్రానికి నాకు తట్టిన పద్యము ఇక్కడ సూచించాను.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్రగ్ధరా వృత్తము:
రిప్లయితొలగించండిశ్రీవైకుంఠాధినాథా! శ్రితజనవరదా! శ్రీమదబ్ధీంద్రజేశా!
గోవిందా! పక్షివాహా! గుణగణరహితా! కుంజరేంద్రార్తినాశా!
సేవింతున్ నీ పదమ్ముల్ స్మితవదన! సదా శ్రీధరా! చక్రపాణీ!
దేవా! మోక్షప్రదాతా! దివిజగణనుతా! దీనపాలా! నమస్తే
కరిరాజేంద్రుం డొక్కడు
కరిణీబృందమును గూడి కడు మోదముతో
కర మాహ్లాదకరమ్మగు
సరసింగని యందు జొచ్చి సంరంభముతో
జలకములాడుచు నొప్పుగ
జలకేళిం దేలుచున్న సమయమునందున్
జలమునగల యొక మకరము
బలిమిన్ గజరాజు కాలు పట్టుచు లాగెన్
సరసిలో మకరితో కరి పోరు సల్పెను
కరియు మకరియు భీకరముగ తమ
తమ బలమ్ముల జూప తగ్గె నేనుగు చేవ
యలిసెను డస్సె నాయాసపడెను
పదివేల వర్షముల్ పట్టు వీడక పోరి
చివరికి ప్రార్థించె శ్రీరమేశు
దిక్కవీవేయంచు మ్రొక్కుచు మొరవెట్ట
విని విష్ణుదేవుడు వేగవేగ
సిరికి జెప్పక యాయుధశ్రేణి గొనక
గరుడు జీరక చనెనంత కరిని బ్రోచు
వేడ్కతో నంత నాహరి వెనుక జనిరి
సిరియు, గరుడుండు నాయుధ శ్రేణియు వెస
హరి చక్రమ్మును వేయగ
సరసిన్ గల మకరి విష్ణు సాయుజ్యము చె
చ్చెర పొందెను గజరాజును
కరమలరెను సుఖమునొందె కష్టము దీరెన్
హరిని గొలువ గోరికతో
గరిరాజున కార్తి దొలగె, గాని మకరికిన్
హరి సాయుజ్యం బొదవెను
హరిలీలల దెలియనగునె యద్భుతములహో
వనమయూర వృత్తము:
మంగళము శ్రీశ! పరమాత్మ! భువనేశా!
మంగళము శౌరి! వనమాలి! గిరిధారీ!
మంగళము దేవగణ మాన్య! ప్రియ భావా!
మంగళము నీకు జయ మంగళము స్వామీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ పంతుల రాజారావు గరూ! మీరు భాగవతములోని పద్యమును సూచించేరు. ధన్యవాదములు. ఇక్కడి సంప్రదాయము ప్రకారము పాల్గొనే వారు వారి వారి స్వంత "పద్య కవితలనే" పంపించాలి. స్వస్తి.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ సుబ్బా రావుగారూ: "సహకరించుట లేదయ్య దేహమింక" అనే పాదములో మీరు ప్రాస యతిని వేసేరనుకొనినారు. కానీ, ప్రాసయతి నియమమును మీరు పాటించలేదు. సరిజేయండి. స్వస్తి.
రిప్లయితొలగించండినీవుఁదప్పయన్యమెరుంగ నీరజాక్ష
రిప్లయితొలగించండిగరుడగమన!రా!రా!యని గజముయేడ్వ
భక్తశరణాగతికిచక్రిపరుగుఁదీసి
కరినిఁ గాపాడ వచ్చెమకరినిఁజంప
బలము లేదింక మూర్చయు వచ్చె నకట
రిప్లయితొలగించండిపోవు చున్నవి ప్రాణాలు బొంది నుండి
దినము దినమును కృ శి యింche దేహమింక
కావ రావయ్య! పరమాత్మ! కదలి రమ్ము
శ్రీ సహదేవుడు గారూ:
రిప్లయితొలగించండిమీ పద్యము బాగున్నది. అభినందనలు.
మీ పద్యములో 2వ పాదమును ఇలా మార్చుదాము:
"గరుడగమన రా రా యని కరి మొరలిడ"
శ్రీ సుబ్బారావు గారూ!
అభినందనలు.
మీ సవరించిన పద్యము చాల బాగున్నది.
స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిగజేంద్రమోక్ష ఘట్టాన్ని పద్యఖండిక ద్వారా మనోహరంగా చెప్పారు. ధన్యవాదాలు.
*
చిత్రాన్ని చూచి ప్రేరణ పొంది ఆహ్లాదకరంగా పద్యాలు వ్రాసిన
సహదేవుడు గారికి,
సుబ్బారావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
అంతరార్థ మున్నదా చిత్రపటమున
రిప్లయితొలగించండిగరుణ జూపి కరిని గాచు కథయె
కాదు; మానవునికి కఠినమౌ భవబంధ
ములను బాప,శరణ మొకటె దారి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరి మకరి పట్ట కష్టపు
రిప్లయితొలగించండివరదను పడిపోయి కావ వరదుని వేడన్
సరగున పరుగిడి వచ్చిన
గరుడ గమన చక్రి హరికి కరములు మోడ్తున్.