శాస్త్రి గారూ ఐతే ఇంకో మరదలిని కలుపుకోండి:-) ఆర్గురు మరదళ్ళ కనుఁగు బావయ్యను చూడ నా కొమరిత ఈడుదాయె నాఖరిదిక వరుస లడుగంగ నాచిట్టి తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును!
కవిమిత్రులకు నమస్కారం. లోపం మానిటర్ లోనే ఉందు. అక్షరాలు అస్పష్టంగా ముద్దముద్దగా కనిపిస్తూ మేరేం వ్రాసారో టేళీయకుండా ఉంది. మరొ రెండు రొజులు ఈ అవస్థ తప్పదు. దినిని బాగు చేయించాలి. అంతదాకా దయచేసి పరస్పరం గునదొష విచారణ చేయవలసిందిగా మనవి.
చిన్న నాటి చెలి చెప్పెద నిటు చూడు
రిప్లయితొలగించండిచిత్ర పటము నందు చేరినాము
నన్ను గలిపి చూడ నలుగురు వరుసకు
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును.
చిన్న నాటి చెలి చెప్పెద నిటు చూడు
రిప్లయితొలగించండిచిత్ర పటము నందు చేరినాము
నన్ను గలిపి చూడ నలుగురు వరుసగ
తల్లి, మగఁడు, నాకు తమ్ముఁ డగును.
ఐదుగురు మరదళ్ళ కనుఁగు బావయ్యను
రిప్లయితొలగించండిచూడ నా కొమరిత ఈడుదాయె
నాఖరిదిక వరుస లడుగంగ నాచిట్టి
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును!
శ్రీ హనుమచ్చాస్త్రిగారు,
రిప్లయితొలగించండిమొదటి పాదములో 3వ గణము సరిపోలేదు. చెలియ అని ఉండాలనుకుంటాను.
మనతెలుగు గారూ,
ఐ అనునది గురువండీ. గణము సరిపోదు.
శాస్త్రి గారూ ఐతే ఇంకో మరదలిని కలుపుకోండి:-)
రిప్లయితొలగించండిఆర్గురు మరదళ్ళ కనుఁగు బావయ్యను
చూడ నా కొమరిత ఈడుదాయె
నాఖరిదిక వరుస లడుగంగ నాచిట్టి
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును!
నమ్ముడయ్య మీ రు నాన్న యగును గద
రిప్లయితొలగించండితల్లి మగడు నాకు , తమ్ము డగును
తోడ బుట్టి నతడు తొలిసారి మలిసారి
బంధు రికము లిట్లు బంధ మగును
ఈమె పైడితల్లి మా మామకూతురు
రిప్లయితొలగించండిచదువులందు వాణి సద్గుణాఢ్య
ప్రేమ మెరయ నితని పెండ్లాడె నీ పైడి
తల్లి మగడు నాకు తమ్ముడగును
వసతి గృహపు చదువులందు వరుసల మర
రిప్లయితొలగించండిచితివొ, "అంకుల"ని పిలువ చెల్లుననుచు
భ్రమసితొవొగాని, సుకుమార! తమరి పెద్ద
తల్లి మగఁడు నాకు తమ్ముఁ డగును.
మూడవపాదం యతి చెల్లిందో లేదో అనుమానమండీ
పాఠ శాల నుండి పై చదువు వరకు
రిప్లయితొలగించండికలసి మెలసి చదివి కలయ దిరిగి
చెలిమి జెసి తుదకు చిలిపియై దుర్గమ్మ
తల్లి మగఁ డు నాకు తమ్ముఁ డగును !
నీదు యల్లుడెవరు?నిర్మలా యన రాజి
రిప్లయితొలగించండిమనువుకు నిను పిలువ మరువ, తప్పు
లెంచ వలదె ననుచు నిట్లనె నాచిట్టి
తల్లిమగడునాకుతమ్ముడగును !
కన్నతల్లి యనుచు గన్నకూతురు బిల్తు
రిప్లయితొలగించండిశుభముహూర్త మందు సోదరునకు
తనర బెండ్లి సేయ దానిచే నాకన్న
తల్లి మగడు నాకు తమ్ముడగును.
కవిమిత్రులకు నమస్కారం.
రిప్లయితొలగించండిలోపం మానిటర్ లోనే ఉందు. అక్షరాలు అస్పష్టంగా ముద్దముద్దగా కనిపిస్తూ మేరేం వ్రాసారో టేళీయకుండా ఉంది. మరొ రెండు రొజులు ఈ అవస్థ తప్పదు. దినిని బాగు చేయించాలి. అంతదాకా దయచేసి పరస్పరం గునదొష విచారణ చేయవలసిందిగా మనవి.
సంపత్ కుమార్ గారూ! ధన్యవాదములు. నిజమే అది చెలియ అనే వుండాలి. త్వరపాటు లో టైపాటు...
రిప్లయితొలగించండిచిన్న నాటి చెలియ చెప్పెద నిటు చూడు
చిత్ర పటము నందు చేరినాము
నన్ను గలిపి చూడ నలుగురు వరుసగ
తల్లి, మగఁడు, నాకు తమ్ముఁ డగును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిట్టితల్లి నాకు చిననాటి స్నేహితు
రిప్లయితొలగించండిరాలు పెండ్లి జరిగె మేలుగాను
వరస నరసి జూడ బంధువే యగు చిట్టి
తల్లిమగఁడు నాకు తమ్ముఁ డగును.