ఉ. ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్ము; పై కెత్తఁగదోయి స్వీయ గళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్య తీ వెత్తఁగదోయి, నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!
శా. కేలన్ శీర్షములం గదల్చుచును, సుక్షేత్రాంశులౌ వీరు లీ నేలన్ నెత్తురు పంట కీయ, మన జెండే యాకసమ్మందు, స ల్లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిన్ దగన్ నిండఁగ న్వ్రాలన్ జేసి విరోధులన్, గొనుఁడు సద్భ్రాజత్పతాకమ్మునే!
మత్తకోకిల: అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్ వ్యర్థభాగ్యులునున్ నియంతలు భారతమ్మున లేనిచో, స్వార్థపరతకు స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్షమ న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!
మ. కులమున్ దాఁటి, మతమ్ము దాఁటి, కొలఁదుల్ గొప్పల్ విచారించకన్, గల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములన్ నాఁటఁగన్, వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపించంగ నీ భారతిన్ విలువన్ బెంచఁగ నెత్తుమోయి భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సహదేవుడు గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనులు. కాని అవనిసుతులు అంటే అపార్థం వస్తున్నట్టుంది. (అంగారకుడు, నరకుడు భూమిసుతులు కదా!) * మిస్సన్న గారూ, అంబరాన్నంటిన సంబరంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు. * గుండు మదుసూదన్ గారూ, ఈనాటి పద్యరచనలో మీకే అగ్రతాంబూలం. అద్భుతమైన పద్యాలకు అభినందనలు, ధన్యవాదాలు. * జిగురు సత్యనారాయణ గారూ, ‘ఖండాంతరాన తెలి పిండారబోసినటులుండాలి పేరు మనకున్!!’ ఎంత చక్కని భావన! పద్యం బాగుంది. అభినందనలు. కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలు దొర్లాయి.
మూడగ బ్రిటీషు వారికి
రిప్లయితొలగించండిమూడగు వర్ణము ల జెండ ముద్దుగ నెగిరెన్
నీడగ నిలచుచు దానికి
చీడలు పట్టక నిరతము సేవించవలెన్.
బాపూజీ కన్న కలలు
రిప్లయితొలగించండిరూపంబే దిద్దుకొనక,రూపాయే యే
పాపాన్నైనా గడుగగ
కోపంబున తలను వంచె గొప్పగు జెండే!
రిప్లయితొలగించండిమూడు రంగుల తోడను ముచ్చ టుండి
శాంతి శౌర్యము చాగము చాటి చెప్పె
వాటి నాచ రించు చు నిల బ్రదుక వలయు
నపుడ యగుదుము నిజమైన యవని సుతులు .
రెపరెప లాడెను జండా
రిప్లయితొలగించండితపతప మనె గుండెలపుడు దానిని కనగా
రిపులకు భారతమాతా
అపురూపము నీదు కీర్తి యంబర మంటెన్.
గుండు మధుసూదన్ గారి పద్యములు........
రిప్లయితొలగించండికవిపండితమిత్రులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో...
ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్ము; పై
కెత్తఁగదోయి స్వీయ గళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్య తీ
వెత్తఁగదోయి, నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!
శా.
కేలన్ శీర్షములం గదల్చుచును, సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట కీయ, మన జెండే యాకసమ్మందు, స
ల్లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిన్ దగన్ నిండఁగ
న్వ్రాలన్ జేసి విరోధులన్, గొనుఁడు సద్భ్రాజత్పతాకమ్మునే!
మత్తకోకిల:
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులునున్ నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థపరతకు స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్షమ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!
మ.
కులమున్ దాఁటి, మతమ్ము దాఁటి, కొలఁదుల్ గొప్పల్ విచారించకన్,
గల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములన్ నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపించంగ నీ భారతిన్
విలువన్ బెంచఁగ నెత్తుమోయి భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!
-:శుభం భూయాత్:-
అశ్వధాటి:
రిప్లయితొలగించండిగూండాల రాజ్యమున తొండాడు నాయకులు, పిండాలె నీతికి యికన్
దండాలు బెట్టెదను జెండాల పండగకు గండాలు బాపుమనుచున్
చండాశు వోలె ప్రజ మండాలి కోపమున చండాడ నీచ జనులన్
ఖండాంతరాన తెలి పిండారబోసినటులుండాలి పేరు మనకున్!!
రిప్లయితొలగించండిమూడు రంగుల తోడను ముచ్చ టుండి
శాంతి శౌర్యము పంటలు చాటి చెప్పె
వాటి నాచ రించు చు నిల బ్రదుక వలయు
నపుడ యగుదుము నిజమైన యవని సుతులు .
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనులు.
కాని అవనిసుతులు అంటే అపార్థం వస్తున్నట్టుంది. (అంగారకుడు, నరకుడు భూమిసుతులు కదా!)
*
మిస్సన్న గారూ,
అంబరాన్నంటిన సంబరంతో చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
*
గుండు మదుసూదన్ గారూ,
ఈనాటి పద్యరచనలో మీకే అగ్రతాంబూలం. అద్భుతమైన పద్యాలకు అభినందనలు, ధన్యవాదాలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
‘ఖండాంతరాన తెలి పిండారబోసినటులుండాలి పేరు మనకున్!!’ ఎంత చక్కని భావన! పద్యం బాగుంది. అభినందనలు.
కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలు దొర్లాయి.
రిప్లయితొలగించండివీరుల త్యాగముల్,ప్రజల విప్లవకాంక్షలకున్ బ్రతీకయై
భారతజాతి గర్వమున భావనజేయు పతాక ,యుజ్జ్వల
స్ఫారవిలోలమై,యుదయసంధ్య,త్రివర్ణవిశోభితమ్ము,నా
హా,రమణీయమై యెగురు నాకసమందు,సలాము జేయుడీ !
మధుసూదన్ గారి పద్యాలు గురువుగారన్నట్లు అగ్ర తాంబూలార్హములు.
రిప్లయితొలగించండిజిగురు వారి పద్యం మాంచి ధాటితో సాగింది.
ఇక కమనీయమే.
భారతదేశమన్న తమ పాలిటి తల్లిగ నెంచి ధీరతన్,
రిప్లయితొలగించండికూరిమి గల్గి యుండి యొక కూటమి రూపున పోరిరెల్లరున్!
వారల త్యాగమున్ దలచు పాఠము జెప్పుట ధర్మమందు, నే
పౌరుల కెల్ల విన్నపము భక్తిని జేయుదు నిట్లు సోదరా!
నేలను శ్రద్ధతో గొలిచి నిత్యము తల్లిగ పూజచేయగా,
బాలల విద్య యందు తగు పాఠము జేర్చి పఠింపజేసినన్,
శీలము గొప్పదై జనులు సేవలు చేయ దలంతురెప్పుడున్.
మాలిమి జెప్పినన్ మదిని మక్కువ జూపరె దేశమాతపై?
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిచక్కని ధారతో శోభిల్లుతున్న మీ పద్యానికి సలాము చేస్తున్నాను. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ సహృదయానికి ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
ప్రబోధాత్మకములైన మీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిమిస్సన్న గారికి ధన్యవాదములు.