మిస్సన్న గారూ, ‘గిడిగువారికి గొడుగుపట్ట ర’మ్మని అందరినీ ఆహ్వానించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, గిడుగువారికి వందనాలు తెల్పిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
ఈ రోజు , ఆంధ్ర భాషా పితామహులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మా తెలుగు తల్లికి నేను వేసుకున్న పుష్ప పద్య హారం - ఈ క్రింది పద్యం : కం. తెలుగను మూడక్షరములు తొలగించును బాధలన్ని తొలకరి వలెయున్ కలిగించును సంతోషము తలపుల వలె వ్యాప్తి చెంది దశదిశలందున్.
భాష వృద్ధి పొంద పండితులందరూ
రిప్లయితొలగించండిపంచ వలయు స్వాగతించవలయు
వ్యావహారికంపు వన్నెలు చిన్నెలు
గ్రంథ రచన లోన కైతలందు.
పండితుండు గాని పామరుం డైనను
నిత్య కృత్య మందు నెమ్మి వాడు
వ్యావహారికంపు వన్నెల సొబగుల
కీయ వలయు తగిన నింపు సొంపు.
ఇట్టి సిద్ధాంతమును నమ్మి గట్టిగాను
వ్యావహారిక భాషకు పట్టమీయ
జీవితము సర్వ మర్పణ జేసినారు
గిడుగు వారికి పట్టను గొడుగు రారె.
రిప్లయితొలగించండితెలుగు సాహిత్య రంగాన్ని తీ ర్చి దిద్ది
నీ ది యగు శైలి నొకదాని నిగ్ర హించి
తెలుగు భాషకు వన్నెను దెచ్చి నావు
గిడుగు రామ్మూ ర్తి ! వంద నా లిడుదు నీ కు .
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండి‘గిడిగువారికి గొడుగుపట్ట ర’మ్మని అందరినీ ఆహ్వానించిన మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
గిడుగువారికి వందనాలు తెల్పిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
బడుగు వారికి తెలిసెడు పలుకు లందు
రిప్లయితొలగించండిరచన గోరుచు తెలుగున (ను) రచ్చ (క్ష) జేసె
గిడుగు వారలు తెలుగింటి పిడుగు వారు
గొడుగు బట్టగ రండయ్య కోవిదులును.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
_______________________________
కావ్య భాషయు కాలాని - కనుగుణముగ
నిత్య వ్యవహార రీతులు - నేర్వ వలయు
జనుల దగ్గరగా యది - జరుగ వలయు
నవ్య తీరుల నలదుక - నడువ వలయు
ననుచు పోరాటమును జేసె - నాడు గిడుగు
నతుల నిడెదము రండయా - నుతుల తోడ !
_______________________________
ఈ రోజు , ఆంధ్ర భాషా పితామహులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని, మా తెలుగు తల్లికి నేను వేసుకున్న పుష్ప పద్య హారం - ఈ క్రింది పద్యం :
రిప్లయితొలగించండికం. తెలుగను మూడక్షరములు
తొలగించును బాధలన్ని తొలకరి వలెయున్
కలిగించును సంతోషము
తలపుల వలె వ్యాప్తి చెంది దశదిశలందున్.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి1.
గిడుగు కాదతడు చిచ్చర పిడుగుకాని ,
పండితప్రకాండుల గెల్చె వాదపటిమ ,
వ్యావహారిక భాషకు జీవమిచ్చి
తెలుగు సాహిత్యమున్ మలుపు దిప్పెనతడు.
2.
నూతనాంధ్ర సాహితికి ననూన సేవ
జేసిన త్రిమూర్తులలోన వాసికెక్కె
తెలుగుబాసకు క్రొంగ్రొత్త వెలుగు నిచ్చె
నతడె గిడుగు రామ్మూర్తి యై యలరె నాడు .
చి. వామన కుమార్ గారు ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము "తెలుగను మూడక్షరములు" బాగున్నది.
స్వస్తి.