అయ్యా శ్రీ సంపత్కుమార శాస్త్రి గారు: శుభాశీస్సులు. మీ పద్యములో: సత్ + శీలవతి + సఛ్ఛీలవతి అని సంధి చేయవలెను. 2. రుక్మిణీ మగువ అనే సమాసము బాగులేదు. మార్చండి. స్వస్తి.
పండిత నేమాని వారూ, మొట్టమొదటి పూరణ శూర్పణఖ ప్రస్తావనతో వస్తుందను నేను ఊహించినట్టుగానే చక్కని మీ పూరణ వచ్చింది. బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం ఉంది. ‘శూర్పణఖయె/ శూర్పణఖయు’ అని సవరిస్తే...? * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, ‘బెంగుళూరు శివన్న’ వృత్తాంతం నాకు క్రొత్త. అన్న గుట్టు చెల్లెలు చెప్పగా పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్ చేశారా? పూరణ మొత్తానికి వైవిధ్యంగా ఉంది. చాలా బాగుంది. అభినందనలు. ‘అన్న + ఒక’ అన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది కదా! అక్కడ ‘శివన్నయె’ అందాం. * మిస్సన్న గారూ, మీ భావన లెప్పుడూ విలక్షణంగా, వినూత్నంగా ఉంటాయి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. నేమాని వ్యాఖ్యను గమనించారు కదా! * సహదేవుడు గారూ, మీ పూరణ వైవిధ్యంగా చాలా బాగుంది. నేనూహించిన రెండవ పూరణ మీనుంచి వచ్చింది. సంతోషం. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, మీ పూరణ చదవగానే మనసు ఆర్ద్రమయింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొన్నేళ్ళ క్రితం చెల్లెలితో రాఖీ కట్టించుకొనడానికి బయలుదేరి ఆక్సీడెంట్‌కు గురి అయి మరణించాడు. సమయోచితమైన పూరణ నిచ్చారు. అభినందనలు. * కమనీయం గారూ, హిడింబ గురించిన ఆలోచనే రాలేదు నాకు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు. * లక్ష్మీ నరసింహం గారూ, మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు. కాని సమస్య తేటగీతి పాదం. మీరు ఆటవెలది వ్రాసారు. మీ ఆటవెలదికి నా తేటగీతి రూపాంతరం..... రమణి రుక్మిణి చనె హరి రథము నెక్కి ఆగు మని సోదరుడు రుక్మి యడ్డు దగుల తలను గొరిగి వదలెను దాదాపుగ నిటు లన్న చావునకు నిమిత్త మయ్యె ననుజ.
అయ్యా! ఈ సమస్యలో "చావుకు" అనే ప్రయోగము సరియైనదేనా? వ్యాకరణము ప్రకారము "చావునకు" అని ఉండవలెను అని నా భావము. స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండినిజమే! అది వ్యాకరణ విరుద్ధమే.
‘కువర్ణకంబు పరంబగునపుడు ఉకార ఋకారంబులకు నగాగమం బగు’ అని సూత్రం.
సవరించాను. ధన్యవాదాలు.
పండిత నేమాని వారి పూరణ....
రిప్లయితొలగించండిశూర్పణఖ కామార్తయై సుఖము బడయ
లేక యవమానమొంది ప్రేరేపణమ్ము
జేసి రావణునకు దెచ్చి చిక్కులెన్నొ
అన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామపత్నిని గొనిదెచ్చి రామచంద్రు
రిప్లయితొలగించండిశరమునకు బలియగుటకు సమరమునను,
రావణుని దుష్టతనమును రగులజేసి
యన్నచావునకు నిమిత్తమయ్యెననుజ.
గుండు మధుసూదన్ గారి పూరణ.....
రిప్లయితొలగించండికామ వాంఛను దరిఁజేరి, రాముఁ గోర,
"లక్ష్మణుఁడు దీర్చు"ననఁ, బోవ, లక్ష్మణుండు
ముక్కు సెవుఁ గోయఁ, బౌలస్త్యు మ్రోలఁ జెప్పి,
యన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ!
బెంగళూరు శివన్నొక బెబ్బులిపులి
రిప్లయితొలగించండివాని జాడది తెలియ దెవరికి కాని
కక్ష్య తప్పక చేరును రక్ష్యమంద
రక్షకభటులది తెలిసి రచ్చజేయ
చెల్లి వాని రహస్యముఁ జెప్పి తా శి
వన్న చావునకు నిమిత్త మయ్యె ననుజ.
రామ బాణమ్ము తాకగ రాలె వాలి
రిప్లయితొలగించండి' అన్న చావునకు నిమిత్త మయ్యె నను జ-
నమ్ము నకు నెట్లు జూపుదు నాదు మొగము '
ననుచు దుఃఖించె సుగ్రీవు డతని జూచి.
చేదిరాజ్యమ్మునందు సత్శీలవతియు
రిప్లయితొలగించండిసుగుణవారాశి రుక్మిణీ మగువ హరిని
వలచి, తప్పులఁజేయించె భ్రాతచేత
అన్న చావునకునిమిత్తమయ్యెఁననుజ.
అయ్యా శ్రీ సంపత్కుమార శాస్త్రి గారు:
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యములో: సత్ + శీలవతి + సఛ్ఛీలవతి అని సంధి చేయవలెను.
2. రుక్మిణీ మగువ అనే సమాసము బాగులేదు. మార్చండి. స్వస్తి.
ధర్మసంస్థాప నార్థము ద్వాపరమున
రిప్లయితొలగించండివిష్ణుభగవానుడేఁదాల్చెకృష్ణరూపు
దేవకీగర్భుడైకంసునేవధింపఁ
అన్నచావునకునిమిత్తమయ్యెననుజ!
శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
రిప్లయితొలగించండిరుక్మిణీ సుదతి అని మార్చుదాము. సమాసము బాగుంటుంది. స్వస్తి.
చెల్లి రాఖీని కట్టగ చేతి కొకటి
రిప్లయితొలగించండిసోదరికికానుకిచ్చెను సుఖము గోరి
నోటు నూతిన బడదిగి నీటజచ్చె
అన్న చావునకు నిమిత్తమయ్యె ననుజ !!!
(నేడు ఒక కుటుంబములో జరిగిన విషాదం . నూఱు రూపాయల నోటు ట్యాంకులోపడ దానిని తీయ బాలుడు అతన్నితీయ ఆతని తండ్రి మరో ఇద్దరుదిగి మృతిచెందారట . మన A P లో కాదు )
శ్రీ నేమాని గురువర్యులకు,
రిప్లయితొలగించండిమీ సూచన సర్వదా ఆచరణీయమే. ఒక మంచి పదాన్ని పరిచయం చేశారు.
శతథా ధన్యవాదాలు.
చిత్తచోరుడౌ
రిప్లయితొలగించండియాభీమసేనుగూడ
కామరూపమునహిడింబకలిసెనతని
వచ్చినపనిమరచిపోయ్యివలచినంత
అన్నచావునకునిమిత్తమయ్యెననుజ
లక్ష్మీ నరసింహం గారి పూరణ......
రిప్లయితొలగించండిరమణి రుక్మిణి హరి రథము నెక్కి వెడల
ఆగు మనుచు రుక్మి యడ్డు దగుల
తలను గొరిగి వదలె దాదాపుగా నిటు
లన్న చావునకు నిమిత్త మయ్యె ననుజ.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమొట్టమొదటి పూరణ శూర్పణఖ ప్రస్తావనతో వస్తుందను నేను ఊహించినట్టుగానే చక్కని మీ పూరణ వచ్చింది. బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం ఉంది. ‘శూర్పణఖయె/ శూర్పణఖయు’ అని సవరిస్తే...?
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
‘బెంగుళూరు శివన్న’ వృత్తాంతం నాకు క్రొత్త. అన్న గుట్టు చెల్లెలు చెప్పగా పోలీసులు అతన్ని ఎన్‌కౌంటర్ చేశారా?
పూరణ మొత్తానికి వైవిధ్యంగా ఉంది. చాలా బాగుంది. అభినందనలు.
‘అన్న + ఒక’ అన్నప్పుడు సంధి జరుగక యడాగమం వస్తుంది కదా! అక్కడ ‘శివన్నయె’ అందాం.
*
మిస్సన్న గారూ,
మీ భావన లెప్పుడూ విలక్షణంగా, వినూత్నంగా ఉంటాయి. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
నేమాని వ్యాఖ్యను గమనించారు కదా!
*
సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చాలా బాగుంది. నేనూహించిన రెండవ పూరణ మీనుంచి వచ్చింది. సంతోషం. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ చదవగానే మనసు ఆర్ద్రమయింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి కొన్నేళ్ళ క్రితం చెల్లెలితో రాఖీ కట్టించుకొనడానికి బయలుదేరి ఆక్సీడెంట్‌కు గురి అయి మరణించాడు.
సమయోచితమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
*
కమనీయం గారూ,
హిడింబ గురించిన ఆలోచనే రాలేదు నాకు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీ నరసింహం గారూ,
మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
కాని సమస్య తేటగీతి పాదం. మీరు ఆటవెలది వ్రాసారు. మీ ఆటవెలదికి నా తేటగీతి రూపాంతరం.....
రమణి రుక్మిణి చనె హరి రథము నెక్కి
ఆగు మని సోదరుడు రుక్మి యడ్డు దగుల
తలను గొరిగి వదలెను దాదాపుగ నిటు
లన్న చావునకు నిమిత్త మయ్యె ననుజ.