22, ఆగస్టు 2012, బుధవారం

సమస్యాపూరణం - 800 (బలరాముని ధర్మపత్ని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
బలరాముని ధర్మపత్ని వైదర్భి కదా!
లేదా
భామ రుక్మిణి సతి బలరామునకును.

16 కామెంట్‌లు:

  1. కవి రచించెను లెస్సగా గాని దాని
    జదివి ముద్రించు నాతడు చవట యగుట
    నటు నిటుగ మార్చె పదముల నౌర కనుము
    భామ రుక్మిణి సతి బలరామునకును

    రిప్లయితొలగించండి
  2. హలియని తెలిపెద రెవనిని?
    నిలాతనయ రామవిభుని కేమగునొకదా?
    నలు భార్యామణి యెవ్వరు?
    బలరాముని, ధర్మపత్ని, వైదర్భి కదా

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    భార్య లెందరొ బలరామ - భ్రాత కందు
    భాగ్యశాలురు , ముఖ్యులౌ - వారె , సత్య
    భామ, రుక్మిణి ! సతి బల - రామునకును
    భామ రేవతి , బహు భాగ్య - వంతురాలు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. 01అ)
    _______________________________

    భార్య లెందరొ హలధరు - భ్రాత కందు
    భాగ్యశాలురు , ముఖ్యులౌ - వారె , సత్య
    భామ, రుక్మిణి ! సతి బల - రామునకును
    భామ రేవతి , బహు భాగ్య - వంతురాలు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  5. 2)
    _______________________________

    యిల రేవతి , బహు గుణవతి
    బలరాముని ధర్మపత్ని ! - వైదర్భి కదా
    అల కృష్ణుని సతి , భక్తిగ
    తులతూచెను; ఘనముగ సవ - తులు వినుతించన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  6. 2అ)
    _______________________________

    యిల రేవతి , బహు గుణవతి
    బలరాముని ధర్మపత్ని ! - వైదర్భి కదా
    అల కృష్ణుని సతి , భక్తిగ
    తులతూచెను కృష్ణు నపుడు - తులసీ దళమున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి

  7. ఇల సద్గుణ వతి రేవతి
    బలరాముని ధర్మ పత్ని, వైదర్భి కదా
    విలసిత వదనుడు మఱి గో
    కుల నాయకు కృష్ణు భార్య కూరిమి సఖి యౌ .

    రిప్లయితొలగించండి
  8. చక్రి శశియభిమన్యుల జంట మెచ్చి
    యన్న గారినొప్పింపగ నదను జూచి
    గొప్పవాడభియనిజెప్పెఁ గూడి సత్య
    భామ, రుక్మిణిసతి, బలరామునకును

    రిప్లయితొలగించండి


  9. విలసద్ గుణవతి రేవతి
    బలరాముని ధర్మపత్ని ; వైదర్భి కదా
    యెలమిని పరిణయ మాడెను
    వలపుల రేడైన కృష్ణు వరునిగ తొల్లిన్.

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి
    ......... అభినందనలు, ధన్యవాదాలు.
    దూరప్రయాణం చేసి వచ్చి, అలసట శిరోవేదనతో బాధపడుతున్నందువల్ల వివరంగా వ్యాఖ్యానించలేక పోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీ నరసింహం గారి పూరణ.....

    గోపగోపికాజనగణోద్దీపయుగళ
    నృత్యకేళివిలాస ప్రదర్శనము, ప్రియ
    భామ రుక్మిణి సతి, బలరామునకును
    మధ్య కూర్చుండి వీక్షించె మాధవుండు.

    రిప్లయితొలగించండి
  12. లక్ష్మీ నరసింహం గారూ,
    మీ పూరణ భావం వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది.
    సమాసంలో ‘కేళీవిలాస’ అవుతుంది. రుక్మిణి అనబడే సతి అనే అర్థంలో ‘రుక్మిణీసతి’ అవుతుంది.

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారి పూరణ....

    పొలతి సుగుణవతి రేవతి
    బలరాముని ధర్మపత్ని! వైదర్భి కదా
    యల రుక్మిణి నామక సతి
    నలమేన్ దొర పట్టమహిషి; నారాయణియే!

    రిప్లయితొలగించండి