22, ఆగస్టు 2012, బుధవారం

పద్య రచన - 89


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. బలరామ దేవుడై యదు
    కులమణియయి యగ్రజుడయి గోవిందునకున్
    హలి రోహిణీసుతుండయి
    యలరెను రిపుమర్దనునిగ నతనికి జేజే

    రిప్లయితొలగించండి
  2. హలధరునిగ మరి హాలా
    హలధరునకు ప్రియ సఖుడగు హరి కగ్రజు గా
    నిల రోహిణి సుతు రేవతి
    నలరించిన పతిగ నిలచు యాదవునకు జే !

    రిప్లయితొలగించండి
  3. పానుపు దానుగా హరిని బాయక నుండెడి యాదిశేషుఁడా
    దానవ హంతతో కలిసి ధాత్రి నదో, బల రామదేవుఁడై
    మానవ మాత్రుగా నిలను మాధవు నీడగ నిల్చియుండె దా
    కానక యుండలేక దిగె; కంజదళాక్షుని సోదరుండుగా.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  5. హలమును బూనిన నాతడు
    బలరాముడె నిక్క మయ్య ! బహు బల యుతుడున్
    నిల హరికిన్నగ్రజుడును
    నలవోకగ జంపె రిపుల ననుజుని తోడన్ .

    రిప్లయితొలగించండి
  6. హరునికి, బలరాముడింట యన్నగా వసించగా (జనించగా),
    శరుడును,బలభద్రుడనుచు జనులు గొప్ప జేయగా,
    నిరతము తన తోడ యుండి, నేర్పు రాజ్యమేలగా,
    నరహరి! భళి! కృష్ణ జన్మమందినావు రాఘవా!

    రిప్లయితొలగించండి
  7. పై పద్యంలో తప్పులు ఉన్నాయి. ఈ బ్లాగులోనుండి తీసివేయుటెలాగో నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  8. తమ కడుపు నిండఁ దామే
    శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
    కమలాక్షుడు హల ధారిగఁ
    శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!

    రిప్లయితొలగించండి


  9. అగ్రజుండు మురారికి ,ఆదిశేషు
    నంశయై ,రేవతీమనోహరుడునాయె,
    రోహితాస్యుడు ,నీలాంబరుండు,నమిత
    బలుడు ,హల,గదాధారియౌ పావనుండు.

    రామావతారమందున
    సౌమిత్రిగ నిరతము పరిచర్యల జేసెన్
    ఆమీదట నగ్రజ బల
    రాముండయి సేవలందె రాధాపతిచే.

    రిప్లయితొలగించండి
  10. కవిమిత్రులారా,
    ఈ నాటి బలరాముని చిత్రాన్ని చూసి స్పందించి చక్కని పద్యాలను వ్రాసిన కవిమిత్రులు
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    వామన్ కుమార్ గారికి,
    సహదేవుడు గారికి,
    కమనీయం గారికి
    ......... అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    బలరామావతారము :

    01)
    _______________________________

    బాల గోపాల దేవుని - భ్రాత గాను
    బాల్య చేష్టల నలరించె - బాలకులను
    భాను తేజుడు బలరామ - పార్థివుండు !
    బలము యశమును శౌర్యము - కలుగు కతన
    బలిమి యమునను హలమున - బాట మార్చి
    బాగు పరచెను వ్యవసాయ - పద్ధతులను
    పాడి పంటలు మెండుగా - పండునటుల !
    భక్తి బలరాము పూజింప - భాగ్యమబ్బు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    భూమి భారముఁ దీర్ప భువిలోన జన్మించి,
    రౌహిణేయునిగాను రహిని వెలిఁగె;
    దేవకీ గర్భస్థుఁడే మాత రోహిణీ
    గర్భానఁ బుట్టి సంకర్షణుఁ డయె;
    నల ప్రలంబునిఁ జంపి,యధివహించె నతండు
    వర బిరుదము ప్రలంబఘ్నుఁ డనఁగ;
    నీలాంబరము నెప్డు నెఱి ధరియించి వె
    లసియుఁ దా నిలను నీలాంబరుఁ డయె;
    నతఁడె శ్రీకృష్ణు నగ్రజుం; డతఁడె సీర
    పాణి; తాళాంక; బలభద్ర వర బిరుదుఁడు;
    నట్టి రేవతీ రమణుఁడు నతని నెపుడు
    సంస్తుతింతును నిత్యమ్ము స్వాంతమందు!

    రిప్లయితొలగించండి