కవిమిత్రులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిశుభా కాంక్షలు
సో దరీ మణుల కునల సోదరు లకు
శుభము గలుగుత !స్వాతం త్ర్య శుభ దినాన
శంకరా భరణ బ్లాగు సత్క వులకు
నంద జేతును నతు లను నందు కొనుడు .
రిప్లయితొలగించండిఆతాత గాంధి కతనన
స్వాతంత్ర్యము వచ్చె మనకు, సంబర మడ గన్
నీ తర పు కుర్ర కారులు
నాతృ త నే జూపు చుండి రయ్యయి దరులన్ .
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండినేటి ప్రభువులు :
01)
_______________________________
నీతీ నియమము లేకను
జాతిని పాలించు ప్రభువు - జనులను దోచే
సాతానై చెలరేగిన
స్వాతంత్ర్యము వచ్చె మనకు - సంబర మడఁగెన్ !
_______________________________
నైతిక విలువలు వీడియు
రిప్లయితొలగించండిచేతులు పొడవైన వారు సిరులన్ దోచన్
గోతులు మిగిలెన్ దూకగ
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడగెన్!
మేతలు మిక్కుట మయ్యెను
రిప్లయితొలగించండినేతలలో దేశభక్తి నీరసమయ్యెన్
జాతి నలిగె పలు రీతుల
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడగెన్
ఒక మగ మహా రాజు అక్కసు:
రిప్లయితొలగించండినే తక్కువేమి యన్నది
జీతము నాకీయ బోదు చేయదు వంటన్
ఏతావాతా నారికి
స్వాతంత్ర్యము వచ్చె మనకు - సంబర మడఁగెన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినూతన శకముకు నాందిగ
రిప్లయితొలగించండిస్వాతంత్ర్యము వచ్చినంత సత్వరమె గనన్
జాతిపితనైన జంపెడి
స్వాతంత్ర్యము వచ్చె మనకు, సంబర మడఁగెన్
శ్వేతప్రభువులు తమ దు
రిప్లయితొలగించండిర్నీతినిఁ బ్రకటించుచుఁగొన నిర్ణయ మిస్సీ!
జాతిని, దేశముఁ జీల్చుచు
స్వాతంత్ర్యము వచ్చె మనకు, సంబర మడఁగెన్.
చేతిని దాటిరి పిల్లలు
రిప్లయితొలగించండికాతరు సేయరు పలుకును గర్వము తోడన్
రోతగు, ప్రియతమ! వారికి
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్!!
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారి పూరణం.....
రిప్లయితొలగించండినేతల యౌదార్యముచే
స్వాతంత్ర్యము వచ్చె మనకు! సంబర మడఁగెన్
మూతులు నాకుచు నిప్పటి
నేతలు పలు కాని పనుల నెన్నియొ సేయన్!
ఈ మధ్య కాలంలో నా కంప్యూటర్ సమస్య రావటం వల్ల నేను బ్లాగులో ఆబ్సెంట్. ఇంక రెగ్యులర్ గా ప్రెజెంట్ అవుతాను.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిబ్లాగు సోదరీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు.
మూడవ పాదంలో గణదోషం. ‘శంకరాభరణము బ్లాగు’ అంటే సరి!
చక్కని విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
నేటి పాలకుల వలన మన సంబర మెలా అడగిందో చక్కని పూరణలో చెప్పారు. అభినందనలు.
కాకుంటే రెండు వ్యావహారిక పదాలున్నాయి.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
స్త్రీ స్వాతంత్ర్యం పురుషుని సంబరాన్ని అడగించిన విధానాన్ని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
ఊకదంపుడు గారూ,
గాంధీజీ హత్య, దేశ విభజన అంశాలుగా మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
‘శకమునకు’ అనవలసి ఉంది కదా!
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
సంతోషం! ధన్యవాదాలు.
*
గుండు మధుసూదన్ గారూ,
చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిజాతీయభావములుడుగ
నీతిన్ వీడుచు ధనార్జనే ముఖ్యముగా
నేతల్ పాలన జేయగ
స్వాతంత్ర్యమువచ్చె మనకు సంబరమడగెన్.
ఆ తరము పోయె నిటలీ
రిప్లయితొలగించండిమాతర మోచ్చెనికనింట మాఫియ హెచ్చెన్
నేతలిడు పరాధీనపు
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్.
మనవి: మనలను మనమే పాలించుకొంటున్నాము అనే భావన కలిగించని స్వాతంత్ర్యదేశము మనది. సాహో!
గురువులకూ వామనకుమార్ గారికీ మిత్రులన్దరికీ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండితాతల కాలము కాదిది
రిప్లయితొలగించండినీతిగ జీవించు వారు నిక్కము తగ్గెన్
నేతల జాతికి బొక్కెడు
స్వాతంత్ర్యమువచ్చె, మనకు సంబరమడగెన్.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
the other (చంద్రశేఖర్?)గారూ,
‘మనలను మనమే పాలించుకొంటున్నాము అనే భావన కలిగించని స్వాతంత్ర్యదేశము మనది’ అంటూ సముచిత పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కోతల రావులు బలుపుగ
రిప్లయితొలగించండిచేతులు త్రిప్పుచును సీట్లు చెన్నుగ గెలవన్
బేతాళులు నేతలవగ
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్