1, ఆగస్టు 2026, శనివారం

సమస్య - 5546

2-8-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్”

(లేదా...)

“అక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్”

(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో నేనిచ్చిన సమస్య)

6 కామెంట్‌లు:

  1. లక్షణముగ నిష్కుటమున
    శిక్షకుడు ప్రొద్దున జదువు జెప్పుట జేతన్
    శైక్షుని మానసమందున
    అక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    రిప్లయితొలగించండి
  2. అక్షయ ము గాని విధముగ
    రక్షణ కల్గించు రీతి రమ్య త నిo డ న్
    దక్షత తో రచి యించిన
    న క్షర కౌముది విరిసె న హ స్కరు ప్రభ లన్

    రిప్లయితొలగించండి
  3. శిక్షణ రక్షగా‌ గలిగి
    చిత్ప్రభనిండిన పాండితిన్ గవిన్
    దక్షతజూపు ప్రాజ్ఞుల ప
    థాన లసత్కృతమైన వేదికన్
    లక్షణ లక్ష్యముల్ మెఱయు
    రశ్మిని రంజిలు స్వర్ణకాంతులం
    దక్షర చంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్!

    రిప్లయితొలగించండి
  4. దక్షతతో వధానమున ద్రష్టలు గాంచుచునుండ నిచ్చతో
    శిక్షణగొన్న ప్రష్టలకు శీఘ్రగతిన్ బదులిచ్చు నేర్పుతో
    లక్షణమైన ధారణ పరంపరగా యవధాని సల్పగా
    నక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్

    రిప్లయితొలగించండి


  5. కందం
    సాక్షిగ కవియై సంఘ వి
    వక్షత గబ్బిలము జాషువా రచియించెన్
    దక్షుడనన్ గృతియందున
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్

    ఉత్పలమాల
    సాక్షిగ నిల్చి సంఘమున సాగు వివక్షకు వేదనాంబుధిన్
    బక్షిని గబ్బిలమ్ము గొని వాసిగ జాషువ కూర్చఁగన్ గృతిన్
    దక్షుడనంగ జాతికొక తామరవిందుని బోలఁ గూర్పునం
    దక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్!

    రిప్లయితొలగించండి

  6. మోక్షం బనిన నెరుగని ని
    రక్షర కుక్షి రచియించె రామాయణమే
    దక్షతతో నాకృతి లో
    నక్షరకౌముది విరిసె నహస్కరు ప్రభలన్.


    దక్షత తోడ నచ్చట బుధానుడు ప్రాశ్నికు డౌచునా జగ
    చ్చక్షువు సాయమందు నిడు ఛాయను వర్ణన జేయమన్న నా
    శిక్షకుడౌ వధాని ప్రవచించెడి నత్తరి వాని గాత్రమం
    దక్షరచంద్రికల్ విరిసె నంబుజనాథ మయూఖదీప్తులన్.

    రిప్లయితొలగించండి