31, అక్టోబర్ 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 48 (స-ర-స్వ-తి)

అంశము- సరస్వతీ స్తుతి
ఛందస్సు- తేటగీతి (లేదా) చంపకమాల
స్యస్తాక్షరములు... 
అన్ని పాదాల మొదటి అక్షరములు వరుసగా "స - ర - స్వ - తి" ఉండవలెను.
(దయచేసి మొత్తం పద్యాన్ని సంబోధనలతో నింపకండి)

30, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2507 (దుర్యోధనుఁ బెండ్లియాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుర్యోధనుఁ బెండ్లియాడి ద్రోవది మురిసెన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

29, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2506 (తండ్రితో రతికేళిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తండ్రితో రతికేళినిఁ దనయ కోరె"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

28, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2505 (నాగపూజ సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాగపూజ సేయ నరకమబ్బు"
(లేదా...)
"నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

27, అక్టోబర్ 2017, శుక్రవారం

దత్తపది - 125 (తల-మెడ-కడుపు-వీపు)

తల - మెడ - కడుపు - వీపు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

26, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2504 (జిహ్వికకుఁ బంచదార...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జిహ్వికకు పంచదారయె చేదు గాదె?"
ఈ సమస్యను పంపిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

25, అక్టోబర్ 2017, బుధవారం

లింగ బంధ ఈశ్వర స్తుతి


సీ.
శంభుడు,యచలుడు,చంద్రశేఖరుడు,పంచాస్వుడు,ఈశుడు, చదిర ధరుడు,
కాంతిమంతుడు,కురంగాంకుడు,సాంబుడు, ఫాలుడు,జలజుడు,భర్గుడు,శశి,
శ్రీవర్దనుడు, శూలి,సింధు జన్ముడు, అంబుజన్ముడు,బుద్నుడు, చండుడు,పుర
హరుడు,అఘోరుడు,యక్షికౌక్షేయుడు, నభవుడు, భానువు, నటన ప్రియుడు,
ముక్కంటి,పురభిత్తు,మృడుడు,కంకటీకుడు,అంధకరిపువు,కోడె రౌతు,
అంగమోముల వేల్పు,అంబర కేశుడు,,బుడిబుడి తాల్పుడు, బూచులదొర,
మదనారి,సుబలుడు,మరుగొంగ,వామార్ధజాని,గజరిపువు,జంగమయ్య,
జడముడి జంగము,శంకువు,,శర్వుడు,సగమాట దేవర,జ్వాలి,ఖరువు,
గోపాలుడు,విలాసి,కోకనదుడు, విష ధరుడు, జోటింగుడు త్ర్యంగటముడు,
అంబరీషుడు, స్వామి,  అజితుడు నకులుడు  , చండీశుడు ,పురారి, చంద్ర ధరుడు
హరకుడు అభవుడు హంసుడు  సాంఖ్యుడు, అనిరుద్ద్డుడు,కపర్ది, అజుడు. విధుడు,
రాజధరుడు మందరమణి, భూతేశుడు, ధూర్జటి,తుంగుడు ధూర్తుడు పశు
తే.గీ.
పతి,అసమనేత్రుడు, కపాలి  భార్గవుండు,
పంచ వక్త్రుడు ,కామారి, పంచ ముఖుడు,
శమన రిపుడు మలహరుడు ,  శశివకాళి,
గరళ కంఠుడు   సతతము కాచు చుండు                  

కవి : పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సమస్య - 2503 (గట్రాచూలికిఁ బతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గట్రాచూలికిఁ బతి హరి కంతుఁడు సుతుఁడే"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

24, అక్టోబర్ 2017, మంగళవారం

శుభవార్త!

ఆకాశవాణి, హైదరాబాదు వారు 
'సమస్యాపూరణం' కార్యక్రమాన్ని 
ప్రారంభిస్తున్నారు. 
4-11-2017 (శనివారం) నుండి ప్రారంభం.
ప్రతి శనివారం ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది. 
ప్రారంభ సమస్య....
"పద్యము వ్రాయుటన్న సులభమ్మది పాలను గ్రోలునట్లుగన్"
పూరణలను పంపవలసిన చిరునామాలు....
email :
padyamairhyd@gmail.com

Postal Address :
సమస్యాపూరణం,
c/o స్టేషన్ డైరెక్టర్,
ఆకాశవాణి,
హైదరాబాద్ - 500 004.

సమస్య - 2502 (దశకంఠునిఁ గొల్చు నరులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దశకంఠునిఁ గొల్చు నరులు ధన్యులు గదరా"
(లేదా...)
"దశకంఠుం గడు భక్తిఁ గొల్చు నరులే ధన్యుల్ గదా చూడఁగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

23, అక్టోబర్ 2017, సోమవారం

సర్ప బంధ తేట గీతిక

సుబ్రహ్మణ్య స్వామి పార్ధన

కార్తికేయుడు, కాంతుడు, కొమరసామి,

అంబికేయుడు, శరజుడు, అగ్నిసుతుడు 

చాగ ముఖుడు, విశాఖుడు, షణ్ముఖుండు,

సౌరసేయుడు, స్కందుడు, శక్తి ధరుడు,

భద్ర శాఖుడు, కందుడు, బ్రహ్మచారి,       

శరవణ భవుడు, చండుడు, షడ్వదనుడు,

అగ్ని సంభవుడు, స్దిరుడు, అగ్నినంద

నుడు, భవాత్మజుడు, షడాననుడు, కొమరుడు,

నెమ్మి రౌతు, అగ్నేయుడు, నెమ్మిరేడు,

అగ్ని నందనుడు, గుహుడు, అగ్నిజుడు, మ

హౌజసుడు, యుద్ధ రంగుడు, హవన సుతుడు,

శంభుజూడు, మహా సేనుడు, షడ్లపనుడు,

క్రౌంచభేదిగాంగేయుడు,  క్రౌంచరిపుడు,

పార్వతీ సుతుడు, సతము  బాధ లన్ని

తీర్చుచు ఘనముగ మనకు దీవెనలిడు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సమస్య - 2501 (చరణముతోఁ బతికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చరణముతోఁ బతికి సేవ సలిపెను సతియే"
(లేదా...)
"చరణముతోడ భర్తృ పరిచర్య లొనర్చె లతాంగి వేడుకన్"
(ఆకాశవాణి వారి సమస్య)

22, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2500 (పంచవింశతిశత...)

కవిమిత్రులారా,
నేటితో 'శంకరాభరణం' బ్లాగులో ప్రకటించిన సమస్యల సంఖ్య
2500 అయింది. 
ఇది మీ అందరి సహకారం వల్లనే సాధ్యమయింది.
అందరికీ ధన్యవాదాలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పంచవింశతిశత సమస్యాంచిత మిది"

21, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2499 (మారీచుఁడు రాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మారీచుఁడు రాముఁ జంపి మాన్యుం డయ్యెన్"
(లేదా...)
"మారీచుండు ధరాత్మజాపతిని దుర్మార్గుండునై చంపెరా"

20, అక్టోబర్ 2017, శుక్రవారం

చతురస్ర బంధ కందము

 


హరి వడువును ,హరి తనయుడు,
హరిత వనిన,  హరితము వలె ,హరి పై బడగన్
హరి శరము, హరికి తగులగ, 
హరి హరి యనుచు, హరిపురికి, హరి పయనించెన్
పూసపాటి కృష్ణ సూర్యకుమార్

సమస్య - 2498 (రాణ్ముని దుర్యోధనుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాణ్ముని దుర్యోధనుండు రాముని సుతుఁడే"

19, అక్టోబర్ 2017, గురువారం

దీప, పద్మ బంధ సీసములో శ్రీకృష్ణ ప్రార్ధన

సీ.
నందునింట  పెరిగిన  గిరిధరా, ఘోర
          నందుల నెదిరించిన  బక వైరి, 
భద్రనాథ, సతము భక్తిన పూజించు
          నట్టి రుక్మిణి పతి, నవ్వు తోన
మోర భాసిల్లగా నారి గణము కెల్ల 
          నసను గల్గించెడు  ససి  విభుండ 
ఘన  నగధారి, సకల భాగ్య దాయకా, 
          పూతన పాతంగి, బుధుడ , మాధ
వా పద్మనయన, శ్రీవత్సాంకితా,  రాస
          నాట్య విలాసితా నరసఖ, ఘన
మౌ  చక్రధర, కృష్ణ మాన సంరక్షకా,
          సోమ భాస్కర నేత్ర ,సూరి, నరక
సంహారకా, దాసి జన  రక్షకా, నల్ల
          నయ్య, బుధుడ, దేవి నాగ్న జితి
మానస చోర అమర, కీశ, గంధర్వ,
          నాగ, నర, విహగ నాధ, తపసు
ల మనమున వసించి లబ్ధిని వారల
          కిచ్చెడు వనమాలి,  గీత బోధ
దేవ, కంసారాతి, దీన జనోద్దార
          కుండ, యాదవ నాయకుండ, నర్త
న  వరాసనా, వేండ్రనట్టు పరచు నవ
          నీత  చోరుడ, కాముని జనక, ఘన
మౌళిపై పురి యమరిన దేవరా,  దాన
          వరిపువు, కృష్ణ,యమరుడ, జినుడ,
నగశయన, విధి, వేన  గళరూపా, ఘన
          లక్షణ పాతి, యలంకరణము
కోరునట్టి  మురారి, గోపాల, మల్లారి,
          వజ్ర కిశోరుడ, వజ్ర నాద,
తే:   
నంద నందనా, రుక్మిణీ నాధ, సత్య
భామ మానస మాచలా, భాగ్య దాత,
దేవకీ సుత ,  శ్రీ వాసుదేవ, యాద
వేంద్ర , కాచుమయ్య యన్ని వేళలందు.         

రచన -  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సమస్య - 2497 (ధనలక్ష్మీవ్రత మొసంగు...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే"
(లేదా...)
"ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా"

18, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2496 (కాలు పెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలు పెండ్లియాడె కరము వలచి"
(ఆకాశవాణి వారి సమస్య)

17, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2495 (కాంతను సేవించువారె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతను సేవించువారె ఘనులు జనహితుల్"
(లేదా...)
"కాంతాసేవలఁ జేయువారలె జగత్కళ్యాణ సంధాయకుల్"
(ఆకాశవాణి వారి సమస్య)

16, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2494 (బాలభానుఁడు నేలపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బాలభానుఁడు నేలపై పరుగులెత్తె"
(ఆకాశవాణి వారి సమస్య)

15, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2493 (తమ్ముల నిరసించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

14, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2492 (తనయుఁడు పతి యయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తనయుఁడు పతి యయ్యె తరుణి మురిసె"
(లేదా...)
"తనయుఁడు భర్త యయ్యె వనితామణి చేసిన పుణ్య మెట్టిదో"

13, అక్టోబర్ 2017, శుక్రవారం

సమస్య - 2491 (కరణ మేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణ మేల కావ్య కరణమునకు"

12, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2490 (కారము నయనముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

11, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2489 (వడ్డించెడివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"
(లేదా...)
"వడ్డనఁ జేయువాఁడు పగవాఁడె తినం దగు శంక వీడియున్"

10, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2488 (నెలఁ జూచి లతాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నెలఁ జూచి లతాంగి యేడ్చె నేరుపు మీరన్"
(ఆకాశవాణి వారి సమస్య)

9, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2487 (పసుల సేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పసుల సేవ పరమపద మొసంగు"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

8, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2486 (పుణ్య మార్జింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుణ్య మార్జింపఁ బొరుగింటి పొలఁతిఁ గూడె"
ఈ సమస్యను సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

7, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2485 (కరుణను గురిపించ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరుణను గురిపించఁ దలఁచి కఠినుఁడ నైతిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

6, అక్టోబర్ 2017, శుక్రవారం

సమస్య - 2484 (సత్పుత్రుఁ డొకఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

5, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2483 (సోమరితనమ్మె జనులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సోమరితనమ్మె జనులకు సొబగుఁ గూర్చు"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

4, అక్టోబర్ 2017, బుధవారం

సమస్య - 2482 (జనహననముఁ జేయువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జనహననముఁ జేయువాఁడె జనవంద్యుఁ డగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

3, అక్టోబర్ 2017, మంగళవారం

సమస్య - 2481 (రాధ నాలింగనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాధ  నాలింగనము జేసె రాఘవుండు"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

2, అక్టోబర్ 2017, సోమవారం

సమస్య - 2480 (గాంధి స్వాతంత్ర్యయోధుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గాంధి స్వాతంత్ర్యయోధుఁడు గాడు నిజము"

1, అక్టోబర్ 2017, ఆదివారం

నా చార్ ధామ్ యాత్ర

          ఇంతకాలం 'చార్ ధామ్ యాత్ర' నాకొక తీరని కల! నా ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంలో ఈ యాత్ర చేస్తానని కలలో కూడా ఊహించలేదు. కాని ఆ కోరిక తీరుతున్నది. 
          మన బ్లాగు మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి సౌజన్యంతో యాత్రకు బయలుదేరుతున్నాను. వారు ఆ 'టూర్స్ అండ్ ట్రావెల్స్' వారితో ఏం మాట్లాడారో, ఎంత ఇచ్చారో తెలియదు. (ఈ యాత్ర పాకేజీ ₹24000). నాతో మాత్రం "వాళ్ళు నాకు తెలిసినవాళ్ళు. ప్రతి ట్రిప్పులో ఒకరిని ఫ్రీగా తీసుకువెళ్తుంటారు. ఈసారి మిమ్మల్ని తీసుకువెళ్ళమని సూచించాను" అన్నారు. 
          గతంలో మేం దంపతులం కాశీ, రామేశ్వర యాత్రలు కూడా వారి సౌహార్దం వల్లనే సాధ్యమయ్యాయి. భగంతుడు వారికి ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించు గాక!
          రేపే నా ప్రయాణం. ఆ ఏర్పాట్లలో ఉన్నాను. 18వ తేదీన తిరిగి నా నెలవు చేరుకుంటాను. నిరంతర ప్రయాణం వల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పటిదాకా రోజుకొక సమస్య వచ్చే విధంగా షెడ్యూల్ చేశాను. మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

చక్ర బంధ సీసములో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రార్థన


సీ.
శ్రీ లక్ష్మి వల్లభ, శ్రీ గోపికాలోల,
          శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస,
శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ,
          శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
శ్రీ శార్ఙ్గ పాణయే, శ్రీ కటిహస్తాయ,
          శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే,
          శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
శ్రీ హయగ్రీవాయ, శ్రీ జగదీశ్వరా, 
          శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేశ,
శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా, 
          శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,     
శ్రీ యజ్ఞరూపాయ, శ్రీ ఖడ్గధారిణే,
          శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ,
          శ్రీ సురపూజితా, శ్రీ శిరీశ,       
తే. 
నంద నందనా, దశరధ నందన, మధు
సూదన, పశుపాలకుడ, అనాధ రక్ష
కా, దినకర తేజా, సాలగ్రామ హర,  పు
రాణ పురుష,  కాపాడు  పరమ దయాళు.

పద్యము చదువు విధానము - 
1 అన్న చోటునుంచి “శ్రీ లక్ష్మీ వల్లభ” తో మొదలు పెట్టి మధ్యలో ఉన్న  శ్రీ తో కలిపి “ శ్రీ గోపికా లోల" అని చదువు కోవాలి  చివరిగా “శ్రీ శిరీష” తో  ఆపి,   పైన “నంద నందనా” నుంచి చదువుకొని “పరమ దయాళు” వద్ద ముగించాలి.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

దత్తపది - 124 (కిక్-లక్-చెక్-నెక్)

కిక్ - లక్ - చెక్ - నెక్
పై పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.