31, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3473

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బంగ్లాదేశీయు లెల్ల భర్గుని భక్తుల్"
(లేదా...)

"బంగ్లాదేశ మహమ్మదీయు లవురా భక్తాగ్రణుల్ శూలికిన్"

30, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3472

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంసారము నందిన యతి సత్పూజ్యుఁ డగున్"
(లేదా...)

"సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుం డయ్యెడున్"

29, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3471

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జలములో నూనె చుక్కల జాడఁ గనము"

(లేదా...)
"జలమునఁ దైలబిందువుల జాడఁ గనంగ నసాధ్యమే కదా"

28, ఆగస్టు 2020, శుక్రవారం

దత్తపది - 170

కవిమిత్రులారా,
పేపర్ - బుక్ - పెన్ - ఇంక్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

27, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3470

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బకునిఁ గొల్చిరి హరి వాయుసుతులు"

(లేదా...)
"బకునిం గొల్చిరి కృష్ణ భీములు గడున్ భక్తిన్ బ్రదర్శించుచున్"

26, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3469

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుఁడు నస్య మిమ్మని రాము నడిగె"

(లేదా...)
"నస్యం బిమ్మని రావణుం డడిగె విన్నాణంబుగా రామునిన్"

25, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3468

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె"

(లేదా...)
"భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

24, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3467

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తద్దినమున శ్వానపూజ తప్పదు సేయన్"

(లేదా...)
"తద్దినమందు శ్వానమును తప్పక గొల్వుము శాస్త్రపద్ధతిన్"

23, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3466

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మీనాక్షికి మీసమెంతొ మేలుగ నొప్పెన్"

(లేదా...)

"మీనాక్షిం గని మేలు మేలనిరహో మీసంబులన్ గల్గినన్"

22, ఆగస్టు 2020, శనివారం

అష్టభుజ చిత్ర బంధ తేటగీతి

వినాయకుని ప్రార్థన

 కరివదన   కలిగితివి  నిగరపు చరిత,                    
కనులలో కాంచు చుంటిమి కరుణ యివము ,           
కరుణ నిడ  మేము కాంచము  కంట నుదక,              
కర యుగళము తో పూజించ కలుగు కనురు,              
కలుగ జేయుము నిరతము  ఘనపు గడణ ,               
కలసి యుండుగా  నీతోడ  కలిమి జనని,
కటవదన నీవు లేనిచో నటమటవడు,
కనగ లేరుగా నెవరు నీ ఘనపు నెరను

(నిగరము = ఘనము; ఇవము = మంచు; ఉదక = జలము; కనురు = కరుణ; గడణ = స్తోత్రము; అటమటవడు = విచారించు; నెరను = మర్మము; కటవదనుడు = ఏనుగు ముఖము గలవాడు) 

          ఈ పద్యములో (క)  అను అక్షరము బంధించబడినది. పద్యము చదువు విధానము - ముందుగా ( 1) అను సంఖ్య  వేసిన గడి నుంచి  ప్రారంభించాలి.  (కరివదన కలిగితివి  నిగరపు చరిత)  తో  మొదలు  పెట్టి  మరల క్రింద కు వచ్చి  అదే  (క) తో వరుసగా అన్ని  గడులు చదువు కోవాలి.   చివరి గడి (కనగ లేరుగా నెవరునీ ఘనపు నెరను) అయి పోయిన తరవాత   మరల (క) అక్షరము తో  1 వ రంగు గులాబి  గడి దగ్గర మొదలు పెట్టి ప్రదక్ష్ణణముగా   గుళాబి గడులలో  ఒక్కొక్క అక్శరము కలుపు కోవాలి.  (కరివదనుడనవర)  అన్నదగ్గర  ఆగి  పైన ఆకు పచ్చ అక్షరములు (త ‌) ను కలిపి ప్రదక్షణమూగా అకు పచ్చ రంగు గడులలో  అక్షరములు చదువుకోవాలి అప్పుడు వచ్చు  వాక్యము   (కరివదనుడనవరతము కరుణ నిడును) అన్న తేటగీతిలో  వాక్యము వస్తుంది. 
తాత్పర్యము
కరివదనుడా ఘనమైన చరిత  కలిగ్నవాడ ,కనులలో చల్లని (మంచు) లాంటి  చూపు కలిగిన వాడా, నీవు కరుణ చూపగా మా కనులలో నీరు చూడము గదా, రెండు చేతులతొ పూజలు చేయగా  నీకు  కరుణ క;ఉగును గదా, నిరతము నీ  ఘనమైన స్తోత్రము చేయ అవకాశము  ఇవ్వుము, నీ తోడ ఎప్పుడు లక్శ్మి దేవి  కలసి  ఉంటుంది గదా,(లక్ష్మీ గణపతి  అంటుంటాము) ఏనుగుముఖము గలవాడ నీవు లేనిచో విచారము కలుగును గదా, నీ యొక్క మర్మము ఎవరికి తెలియదు గదా
                                                  పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 
                                                                        20/8/20

సమస్య - 3465

కవిమిత్రులారా,
వినాయక చవితి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవమి పూజలె మేలు వినాయకునకు"
(లేదా...)
"నవమియె శ్రేష్ఠమౌ తిథి వినాయక పూజకు వీడు మష్టమిన్"

21, ఆగస్టు 2020, శుక్రవారం

సమస్య - 3464

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"దారము లేకున్న సుఖము దక్కునె భావిన్"
(లేదా...)
"దారము లేక సర్వ జనతా భవితవ్యము శూన్యమే సుమా"

20, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3463

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రత్నములుగ మారెను ఱాళ్ళు ప్రజలు మెచ్చ"

(లేదా...)
"రత్నము లెయ్యె ఱాళ్ళు భళిరా యని మెచ్చఁగ లోకులెల్లరున్"

19, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3462

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అసువులం బాసె నర్జునుం డందఱేడ్వ"

(లేదా...)
"అసువులఁ బాసె నర్జునుఁ డనంత విషాదము నొంద నందఱున్"

18, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3461

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్"

(లేదా...)
"రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్"

17, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3460

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మరణమును జయించువాఁడె మర్త్యుం డన్నన్"
(లేదా...)
"మరణమునున్ జయించిననె మర్త్యుఁ డనంబడు నెవ్విధిన్ గనన్"

16, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3459

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానలం గురిపించకు వరుణదేవ"

 (లేదా...) 
"వానల్ మాకిఁక వద్దురా వరుణదేవా నీకు మా స్తోత్రముల్"

15, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3458

కవిమిత్రులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వాతంత్ర్యము వచ్చి యేడ్వసాగిరి నేతల్"
(లేదా...)

"వచ్చె స్వతంత్రమంచుఁ గడు వంతను బొందిరి నేత లెల్లరున్"

14, ఆగస్టు 2020, శుక్రవారం

సమస్య - 3457

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రసికుండని పేడినొక్క రమణి నుతించెన్"
(లేదా...)

"రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోన్"

13, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3456

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వప్నములోఁ గన్నదెల్ల వాస్తవమయ్యెన్"

(లేదా...)
"స్వప్నమునందుఁ గాంచినది వాస్తవమై ముదమందఁ జేసెరా"

12, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3455

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రవి గ్రుంకెన్ నడిరేయి"

(ఛందో గోపనము)

11, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3454

కవిమిత్రులారా,
కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీకృష్ణుఁడు దైవమగునె శిష్టజనులకున్"

(లేదా...)
"శ్రీకృష్ణుం డపరాధి దైవమగునే శిష్టాత్ములౌవారికిన్"

10, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3453

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చుక్కలు నిప్పులను మంచు సూర్యుఁడు గురిసెన్"
(లేదా...)"
చుక్కలు నిప్పురవ్వలను సూర్యుఁడు మంచును గ్రుమ్మరించెడిన్"

9, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3452

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పారిపోవలెఁ గీర్తినిఁ గోరుకొనిన"

(లేదా...)
"కాలికి బుద్ధి సెప్పవలె గ్రక్కున ధీరుఁడు గీర్తిఁ గోరినన్"

8, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3451

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అజునిఁ గోరె శివుఁడు హలాహలముఁ గ్రోల"
(లేదా...)"
బ్రహ్మనుఁ జీరె శంకరుఁడు పానము సేయ హలాహలమ్మునున్"

7, ఆగస్టు 2020, శుక్రవారం

సమస్య - 3450

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురుషులకున్ భూషణములు పూవులు గాజుల్"(లేదా...)
"పురుషులకున్ సుభూషలగుఁ బువ్వులు గాజులు గాలి మెట్టెలున్"

6, ఆగస్టు 2020, గురువారం

సమస్య - 3449

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుష్కృతమునఁ బుణ్యమబ్బు దుర్మార్గునకున్"
(లేదా...)
"దుష్కృత మాచరించు కడు దుష్టున కబ్బు నితాంత పుణ్యముల్"

5, ఆగస్టు 2020, బుధవారం

సమస్య - 3448

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంభాభోగమ్ముఁ గోరరాదు కవీంద్రా"
(లేదా...)
"రంభాభోగముఁ గోరెదేల కవిచంద్రా యర్హతల్ గాంచవే"

4, ఆగస్టు 2020, మంగళవారం

సమస్య - 3447

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సీత కరపద్మమున వెల్గె శీతకరుఁడు"
(లేదా...)
"సీత కరాంబుజంబునను శీతకరుండు వెలింగెఁ గంటివా"

3, ఆగస్టు 2020, సోమవారం

సమస్య - 3446

కవిమిత్రులారా,
రక్షాబంధన మహోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాఖీ కట్టిన కరములె ప్రాణముఁ దీసెన్"
(లేదా...)
"రాఖీ కట్టిన హస్తపద్మములయో ప్రాణంబుఁ దీసెన్ గదా"

2, ఆగస్టు 2020, ఆదివారం

సమస్య - 3445

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుని కరములు శంఖచక్రాంచితములు"
(లేదా...)
"హరుని కరంబులందు నలరారుచునుండెను శంఖచక్రముల్"

1, ఆగస్టు 2020, శనివారం

సమస్య - 3444

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో"
(లేదా...)
"కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో"