31, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2832 (కోడినిఁ బట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్"
(లేదా...)
"కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్"

30, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2831 (పుష్టినిఁ దుష్టి నిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్"
(లేదా...)
"పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్"
(విజయనగరం అవధానంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి పూరించిన సమస్య)

29, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2830 (ముదిత నపుంసకున్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్"
(లేదా...)
"ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్"

28, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2829 (అంద ఱొకనిలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "
(లేదా...)
"అందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే"

27, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2828 (ఖర పాదార్చనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్"
(లేదా...)
"ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

26, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2827 (అష్టమి నాడె...)


కవిమిత్రులారా,
అట్ల తదియ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ"
(లేదా...)
"అష్టమి నాడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్" 

25, అక్టోబర్ 2018, గురువారం

సమస్య - 2826 (సానిన్ గొల్చిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"
(లేదా...)
"సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్" 

24, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2825 (చిన్నయసూరి చేత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"
(లేదా...)
"చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"

23, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2824 (శాల్యోదన మిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్"
(ఛందోగోపనంగా వృత్తంలోను పూరించవచ్చు)

22, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2823 (స్నాన జపము లేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"స్నాన జపము లేల జంద్య మేల"
(లేదా...)
"స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా"

21, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2822 (మగనిన్ వాకిటనె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే"
(లేదా...)
"మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా"

20, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2821 (నవరాత్రోత్సవము లొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)
(లేదా...)
"నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్"

19, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2820 (అల్లునిఁ జంపఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లుఁ జంపఁ దలఁచె నాహవమున"
(లేదా...)
"అల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ క్రుద్ధుఁడై"

18, అక్టోబర్ 2018, గురువారం

న్యస్తాక్షరి - 60 (ద-శ-హ-ర)


అంశము - దసరా సంబరములు
ఛందస్సు- తేటగీతి
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ద - శ - హ - ర' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - మత్తేభము
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 1వ అక్షరం - ద
2వ పాదంలో 6వ అక్షరం - శ
3వ పాదంలో 12వ అక్షరం - హ
4వ పాదంలో 16వ అక్షరం - ర.

17, అక్టోబర్ 2018, బుధవారం

దత్తపది - 147 (ఈశ-హర-శివ-భవ)


ఈశ - హర - శివ - భవ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
దుర్గాదేవిని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

16, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2819 (కాపురము కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాపురము కంటె కన నరకమ్ము గలదె"
(లేదా...)
"కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్"
(వూర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

15, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2818 (ప్రమథులు విష్ణుభక్తిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు"
(లేదా...)
"ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్"

దశ దళ పద్మబంధము

దేవి స్త్రోత్రముసీ: తామసీ! శాoభవీ! దశభుజా! సాత్వికి!
          బాలచంద్ర! కన(కా)భరణ భూషి 
     తా! విజయ! భవాని! సావిత్రి! రంజనీ!
          కాత్యాయనీ!(చ)ర్చ! కామ పూజి
     తా! యమునా! పింగ! ఛాయ! శాకంబరీ! 
          విశ్వజనని!  బాబ్రవి! పరదే(వ)
     తా! కిరాతీ! హిండి! శాకినీ! నగజాత!  
          నిర్గుణా! సక(ల) మునిగణ సేవి
     తా! గిరిజా! శాక్రి! యోగినీ! నిస్తులా!
          వారుణీ!సతి!  పంచ వదన సం(యు)
     తా! సురస! మలయ వాసి(నీ)! మాతృక! 
          మాలిని! మంగళ! మారి పురల!                                             
     తారుణ్య దాయిని! కారుణ్య కౌము(దీ)!
          పురుహూతి! శాంకరి! పుత్రి! భంజ!                                
    తాపిత ధారిణి! దాక్షి! సురాసుర   
          వి(ను)త! భవ్య!  నగనందిని! భగవతి!
    తాలికా వితరిణి! దాక్షాయణి! స(ని)! 
          నారాయణీ! ఉమ! యోగమాయ! బుద్ది!                     
    తాతోటు నాశిని! ధర్మ స్వరూపిణి!   
          (కరు)ణాoత  రంగిణీ!   గట్టు పట్టి !
తే: తాయి! ఖర్పర  గు(ణ)నిక ధారిణి! శివ!     
     నిత్య సం(తో)షి! శ్యామలా! సత్య! ధిషణ !
     భక్తితో(డ) జేతును పూజ భద్రకాళి
     కాచ వలయు నీ దీనుని  కరుణ తోడ.

పద్యము చదువు విధానము

దేవి నామములతో దశ దళ పద్మము ఇది. సీస పద్యములో ప్రార్ధన.    ముందుగా వృత్తములో గులాబీ రంగు వద్ద బాణము గుర్తు పెట్టిన చోటు నుంచి ”తా“తో మొదలు బెట్టి తామసీ అని చదువుకుంటూ ఆ దళము చివరకు వచ్చిభూషితా అని మరల విజయ అనే పాదము చదువు కొంటు పెద్ద వృత్తములో పది పాదాలు పూర్తి చేసుకోవాలి. చివరి పాదము గట్టు పట్టి దగ్గిర ఆపి మరల తా తో క్రింద బాణము గుర్తు గల కొస భాగములో అక్షరములు కలిపి చదువుకోవాలి. కొస భాగములలో 3 పాదములు  మాత్రమే కనిపిస్తాయి. భద్రకాళి వరకు మాత్రమే. ఈ బంధములో విశేషము   తా అన్న అక్షరము తోటి 10 పాదాలు మొదలు అవుతాయి.  దానితో బంధము జరిగింది. అంతటితో అయి పోలేదు. ఎత్తుగీతిలోని ఆఖరి పాదములోని ఒక్కొక అక్షరము పద్యములోని అన్ని పాదములలో  బంధించబడినది.  కాషాయ రంగు బుల్లి వృత్తములలో అక్షరములు బంధించ బడినవి.  మొదటి గులాబీ రంగు దళములో కా రెండవ దళములో  అలా వరుసగా బంధించ బడినవి. అవి మొత్తము కలిపి చదువుకున్న చిత్రం పూర్తి  అవుతుంది. ఇది ఈ చిత్ర బంధ విశేషము.

(అర్ధములు) 
తాళికా వితరిణి = ఓర్పు ప్రసాదిoచునది, తాకత్తు రూపిణి = బలమైన రూపము గలది, తాటోటు నాశిని = మోసం నాశనము చేయునది,తాపిత ధారిణి  =పట్టు చీర ధరించినది,తామ్రాక్ష =  ఎర్రని కనులు కలది, తాయి = తల్లి, తారుణ్య దాయిని = యవ్వనము ప్రసాదిoచునది, తారణ తరింప చేయునది, ఖర్పరము = కపాలము, గుణనిక=  హారము.

పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధకవి

14, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2817 (మృత్యువు మనుజులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్"
(లేదా...)
"మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్"

13, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2816 (వాడిన పూవులే తగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్"
(లేదా...)
"వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య...)

12, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2815 (జ్ఞానము లేనివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను"
(లేదా...)
"జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్"

దిక్సూచి బంధ సీసము

వరలక్ష్మి దేవి ప్రార్ధన

వనితలు చేతురు ఘనమౌ వ్రతములన్ని  
          శ్రావణ మాసాన సరస గతిని,  
దేవి మంగళగౌరి దీవించి స్త్రీల కి
          డు నెపుడు నైదవ తనము సని ము
దముతోడ జేసినన్, తరుణు లెల్ల రు  ముఖ్య
          మైన వార మనుచు మనసు బెట్టి 
చేతురు పూజలు సింధుజకున్ శుక్ర
          వార పుదయమున వాసి తోడ, 
మేలు నిడు సిరీ! ముదముగ జాలి జూపి 
సతము నిడు రక్ష, తప్పులు సరసముగ  గొ
నుచు మము కరుణించి ముద మ్మిడుచు సతతము 
నెమ్మి తోడ చూచుచు మాకు నీడ నిమ్ము. 

పద్యము చదువు విధానము గులాబి రంగు గడిలో ఉన్న (వ) తో మొదలు బెట్టి 'వనితలు చేతురు ఘనమౌ వ్రతము' అని చదివి మరల గులాబీ రంగు గడిలోని ( ల) తోటి 'లన్ని శ్రావణ మాసాన సరస గతిని' అని వరుసగా చదువుతూ గులాబీ రంగు వృత్తము (వాసితోడ)తో  పూర్తి చేసి  ఆకు పచ్చ రంగు వృత్తము (మే)తో మొదలు  పెట్టి నిమ్ముతో  ముగించాలి.  ఈ పద్యములోని విశేషము   గులాబీ రంగు వృత్తములోని   అక్షరములు కలిపి చదివిన వరలక్ష్మి దేవికి వందనములు చేసెదము  అని గులాబీ రంగు వృత్తములో అక్షరములు బంధించ బడినాయి. ఇంతటి తోటి అయి పోలేదు. అకుపచ్చ రంగు వృత్తములో గల పసుపు పచ్చ రంగు చిన్న వృత్తములలోని  అక్షరములు కూడా కలిపి చదివితే   మొత్తము వాక్యము పూర్తీ  అవుతుంది.   మొత్తము వాక్యము 'వరలక్ష్మి దేవికి వందనములు  చేసెదము  మేము సతము ముదము తోడ' అన్న వాక్యము వస్తుంది.

బంధకవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్, గుంటూరు 

11, అక్టోబర్ 2018, గురువారం

సమస్య - 2814 (వాలిని భార్యగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్"
(లేదా...)
"వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్"

10, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2813 (తిరుమలలో వెలసినట్టి...)

కవిమిత్రులారా,
నేటి నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే"
(లేదా...)
"తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్"

చక్ర సీస బంధము

    శ్రీ  వెంకటేశ్వర  ప్రార్ధన 


శ్రీ వేంకటరమణా! శ్రీ నంద నందనా! శ్రీ గోపికాలోల! శ్రీనివాస!
శ్రీలక్ష్మి వల్లభా! శ్రీ అర విందాక్ష! శ్రీ గరుడ గమనా! శ్రీ గిరీశ!
శ్రీ పుండరీకాక్ష! శ్రీ నీరజోదరా! శ్రీ బలి బంధనా! శ్రీ శుభాంగ!
శ్రీదానావారాతి! శ్రీ ద్విజ వాహనా! శ్రీఅపరాజితా! శ్రీ సిరీశ!
శ్రీ శతానందుడా! శ్రీ వర్దమానుడా! శ్రీ భక్తవత్సలా! శ్రీ రమేశ!
శ్రీమధు సూధనా! శ్రీ సామ గర్భుడా! శ్రీ సహస్రవదనా! శ్రీధరుండ!
శ్రీగోవర్ధన ధరా! శ్రీ సుడివాల్దొరా! శ్రీ పురుషోత్తమా! శ్రీకరుండ!
శ్రీ సచ్చిదానంద! శ్రీఅవ్యయానంత! శ్రీ నేత! శ్రీజాని! శ్రీ శిఖండి!
అంబు జోదరా! యమకీల! యజ్ఞపురుష !
జలశయన! రమా కాంతుడా! చక్రపాణి!
పాంశు జాలికా! దైత్యారి! పరమ పురుష! 
కాచు మయ్య మమ్ము సతము కరుణ తోడ 

పద్యము చదువు విధానము : మధ్య వృత్తములో  పసుపు పచ్చ రంగు గల( శ్రీ)తో మొదలు పెట్టాలి. (శ్రీ వెంకట రమణా) అని చదివి చిన్న వృత్తములో గల  (శ్రీ )తో కలిపి 'నందనందనా' అని  చదువుకొంటు పైకి వెళ్ళి   మరల గులాబీ రంగు గడిలో గల (శ్రీ)తో మొదలై 'గోపికాలోల' అని చదివి చిన్న వృత్తములో గల (శ్రీ) కలుపు కొని 'శ్రీనివాస' అని చదువు కోవాలి.   అలా అన్ని గడులు పూర్తి చేసి చివరిలో (శ్రీ శిఖండి) చదివి పైన పసుపు పచ్చ రంగు వృత్తములో  (అంబుజోదరా)   అనుకొనుచు పూర్తి వృత్తము చుట్టి (మమ్ము) తో ఆపి పైన కోణములలో (సతము కరుణ తోడ) అని పూర్తి చేసుకోవాలి. ఈ పద్య విశేషము  (శ్రీ)  అన్న అక్షరము చిన్న వృత్తములో బంధించ  బడి ప్రతి పదము మరల( శ్రీ ) తోటే ప్రారంభము అవుతుంది.   
బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్


9, అక్టోబర్ 2018, మంగళవారం

ఆహ్వానం (అష్టావధానం)

శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం
రోడ్ నంబర్ 1,  టెలిఫోన్ కాలనీ
కొత్తపేట, హైదరాబాద్ 500102.

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు.......
తేది. 10-10-2018. బుధవారము, సా. గం. 6-00 ని.లకు 
అష్టావధానము

అవధాని .... శ్రీ ముద్దు రాజయ్య గారు (అవధాన శిరోమణి)

సంచాలకులు  ----- శ్రీ చింతా రామకృష్ణారావు గారు

*పృచ్ఛకులు*

1. నిషిద్ధాక్షరి----- శ్రీ కంది శంకరయ్య గారు

2. సమస్య----- శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు

3. దత్తపది----- శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు

4. ఆశువు----- శ్రీ ధనికోండ రవి ప్రసాద్ గారు.

5. వర్ణన----- శ్రీ బండకాడి అంజయ్య గౌడు గారు

6. పురాణ పఠణం----- శ్రీ తిగుళ్ళ నరసింహమూర్తి గారు

7. వారగణనం----- శ్రీ వెన్ను చక్రపాణి గారు.

8. అప్రస్తుత ప్రసంగం---- శ్రీ విరించి గారు.

          *అందరూ ఆహ్వానితులే*

*ఆహ్వానించువారు*
మహావాది అరవిందు (ఛైర్మన్)
ఎలిమినేటి సంజీవరెడ్డి (కార్యదర్శి)
మధుసూదన్ (సాంస్కృతిక కార్యక్రమ ఆర్గనైజర్ )

సమస్య - 2812 (ఖరమా జీవన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా"
(లేదా...)
"ఖరమా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా"

8, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2811 (ఖగపతి కిడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్"
(లేదా...)
"ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ "

7, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2810 (భార్యలు మువురు...)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యలు మువురు శ్రీరామభద్రునకును"
(లేదా...)
"భార్యలు మువ్వు రా పరమపావనుఁడౌ రఘురామమూర్తికిన్"
(ఒక అవధానంలో వీర రాఘవాచార్యులు గారు పూరించిన సమస్య
డా. అనంత్ మూగి గారికి ధన్యవాదాలతో)

6, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2809 (కలవాఁ డిల్లిల్లు...)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్"
(లేదా...)
"కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్"

5, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2808 (శంకరుఁ డెత్తె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ"
(లేదా...)
"శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

4, అక్టోబర్ 2018, గురువారం

దత్తపది - 146 (వన-జన-ధన-మన)

వన - జన - ధన - మన
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

3, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2807 (భీముని సతి తార...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్"
(లేదా...)
"భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్"

2, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2806 (కలు సేవింపుఁ డని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్"
(లేదా...)

"కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్"

1, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2805 (అంబలితో సమంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంబలికి సమం బగునె భక్ష్యములు దినఁగ"
(లేదా...)
"అంబలితో సమంబు లగునా చవిఁ జూచినఁ బంచభక్ష్యముల్"