30, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3355

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బడులన్నియు మూఁతపడఁగ భారతి మెచ్చెన్"
(లేదా...)
"బడులను మూసివేయఁగనె భారతి మెచ్చెను మోదమందుచున్"
(ఈ సమస్యను పంపిన జి. సీతాదేవి గారికి ధన్యవాదాలు)

29, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3354

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడియారము సిగ్గుపడును గమనము నాపున్"
(లేదా...)
"అలయక చూచినంత గడియారము సిగ్గిలి యాగిపోవురా"
(జి. ప్రభాకర శాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

28, ఏప్రిల్ 2020, మంగళవారం

సమస్య - 3353

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్" 
(లేదా...)
"సిగరెట్టున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులం గూర్చెడిన్"

27, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3352

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పెక్కు సమస్యలు గలుగుట పెన్నిధియె కదా"
(లేదా...)
"పెక్కు సమస్యలుండుటయె పెన్నిధియౌఁ గద చిత్ప్రభాసమై"
(ఈ సమస్యను పంపిన విట్టుబాబుకు ఆశీస్సులు)

26, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3351

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపాత్ముఁడు విట్టుబాబు పక్కున నవ్వెన్"
(లేదా...)
"వెస పాపాత్ముఁడు విట్టుబా బపుడు నవ్వెం బక్కునన్ వింతగన్"

25, ఏప్రిల్ 2020, శనివారం

ఆహ్వానం!


సమస్య - 3350

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎలుక పాము నెమలి యెద్దు కపులు"
(లేదా...)
"ఎలుక భుజంగమున్ నెమలి యెద్దు గజమ్ము మృగేంద్రమున్ కపుల్"

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఆహ్వానం


సమస్య - 3349

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్త్రీ కడు ధన్యతను గనుము స్త్రీఁ బెండ్లాడన్"
(లేదా...)
"స్త్రీ కడు ధన్యతం గనుము స్త్రీని వరించి వివాహమాడినన్" 

23, ఏప్రిల్ 2020, గురువారం

ఆహ్వానం!


సమస్య - 3348

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూర్ఖుండు శకారుఁ డనుట పోలునె మీకున్"
(లేదా...)
"మూర్ఖుఁ డటంచు మీరనుట పోలునె శిష్టు శకారు నివ్విధిన్"

22, ఏప్రిల్ 2020, బుధవారం

ఆహ్వానం


సమస్య - 3347

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కన్నవారినిఁ దల్లియే కాటికంపె"
(లేదా...)
"అంత మొనర్చె సంతతిని నమ్మయె మిక్కిలి సంతసించుచున్"

21, ఏప్రిల్ 2020, మంగళవారం

ఆహ్వానం


సమస్య - 3346

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గంగఁ బెండ్లియాడెఁ గన్య యొకతె"
(లేదా...)
"గంగ వివాహమాడె నొక కన్యను మోదము చెంగలింపఁగన్"

20, ఏప్రిల్ 2020, సోమవారం

ఆహ్వానం


సమస్య - 3345

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శవ విభవముఁ గాంచి వడఁకె శక్రుఁడు భీతిన్"
(లేదా...)
"శవ విభవంబు చూడఁగనె శక్రుఁడు భీతిలె మేన్వడంకగన్"

19, ఏప్రిల్ 2020, ఆదివారం

ఆహ్వానం


సమస్య - 3344

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామునికి వనంబులుండ రాజ్యంబేలా"
(లేదా...)
"రాముని కేల భార్య మఱి రాజ్యము లేల వనంబు లుండఁగన్"

18, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3343

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మఱ్ఱాకున విడెముఁ దినఁగ మనసాయె సఖీ!"
(లేదా...)
"మనసాయెన్ గద భామినీ! తినుటకై మఱ్ఱా కునన్ వీడ్యమున్"

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

సమస్య - 3342

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరునకుఁ దోఁక గలదు చర్చింపంగన్"
(లేదా...)
"పరమేశుండగు శూలికిం గలదు పో వాలంబు చర్చింపఁగన్"

16, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3341

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తండ్రి కూఁతుండ్రు చంపిరి తల్లినయ్యొ" 
(లేదా...)
"తనయయుఁ దండ్రియున్ గలిసి తల్లినిఁ జంపిరి సంతసంబునన్"

15, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3340

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంతికిఁ బురుషత్వమబ్బె నెంతయొ వేడ్కన్"
(లేదా...)
"సకియకుఁ గోరుకొన్న పురుషత్వము దక్కెను పూర్వపుణ్యమై"

14, ఏప్రిల్ 2020, మంగళవారం

సమస్య - 3339

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కృష్ణుఁడు సావిత్రిఁ గూడి కిలకిల నవ్వెన్"
(లేదా...)
"కేళీమగ్నత నుండి నవ్వెనఁట యా కృష్ణుండు సావిత్రితోన్"

13, ఏప్రిల్ 2020, సోమవారం

సమస్య - 3338

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఖరహతితో ధన్యుఁడయ్యెఁ గాలుఁ డలరుచున్"
(లేదా...)
"ఖరహతిఁ గాంచె ధన్యతను గాలుఁడు ప్రాణహరుండు చయ్యనన్"

12, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3337

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్"
(లేదా...)
"కవితతికిన్ మృగంబులకుఁ గల్గెను సామ్యము చిత్రమేటికిన్"

11, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3336

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిదను వివాహమాడెఁ గాంత ముదమునన్"
(లేదా...)
"గాడిదనున్ వరించి యొక కాంత ముదమ్మునఁ బెండ్లియాడెరా"

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఆహ్వానం!


సమస్య - 3335

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పిల్లికి జనియించె నల్లకోఁతి"
(లేదా...)
"పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా"

9, ఏప్రిల్ 2020, గురువారం

సమస్య - 3334 (రాతికిఁ బెండ్లి యయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతికిఁ బెండ్లయ్యె మిగుల రమ్యముగ నహా"
(లేదా...)
"రాతికిఁ బెండ్లి యయ్యెనట రమ్యముగా జనులెల్ల మెచ్చఁగన్"

8, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3333 (మూడును మూడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూడు మూడు మూడును మూడు గూడె నిచట"
(లేదా...)
"మూడును మూడు మూడు మఱి మూడును నయ్యె సమస్య లియ్యెడన్"

7, ఏప్రిల్ 2020, మంగళవారం

సమస్య - 3332 (స్తంభాగ్రంబున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గ్రద్దా స్తంభాగ్రమెక్కఁగాఁ బెద్దవొకో"
(లేదా...)
"స్తంభాగ్రంబునఁ గూరుచుంటి విదె గ్రద్దా పెద్దవైనావటే"

6, ఏప్రిల్ 2020, సోమవారం

ప్రకటన


శంకరాభరణ సమూహ మిత్రులకు🌹 శుభోదయం 🌹
మిత్రులారా! పెద్దలారా!  మీకు  నమస్కారం🙏
          ఈ శార్వరి ఉగాది కాస్త కరోనా ఉగాదిగా మారిన సంగతి అందరికీ తెలిసిందే .అయితే మన శంకరాభరణ సమూహం దానిని అధిగమించి అద్భుతమైన పద్య సమర్పణలతో ఉగాదిని జరుపుకున్నది. ఇందులో ఉత్సాహంగా పాల్గొని పద్యాలను పంపిన కవీశ్వరులకు పాదాభివందనాలు.🙏
          మన ఉత్సాహాన్ని వృధా పోనీయక పద్యాలను అన్నింటిని డిటిపి చేసి ఇ- పుస్తకరూపంలో  చేసిన గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి కవులు అందరి తరపున నమస్కారాలు  చెల్లిస్తున్నాను. వారు చేసిన శ్రమకు వెలకట్టలేము. ఇప్పుడు మనం అందరూ కలిసి  దానిని  ప్రచురించు కుంటే అది  మనకు  కరోనా చేసిన అల్లకల్లోలం నుండి  ఊరట కలిగిస్తుంది . దీనికి మనందరం ఆర్థిక సహకారంతో ముందడుగు వేద్దాం. లాక్ డౌన్ తీరిన వెంటనే పుస్తక ముద్రణ జరిగేందుకు సంకల్పించి ఇప్పుడే గురువుగారి అకౌంటుకు డబ్బులు పంపిస్తే తర్వాత కార్యక్రమాలు వేగవంతం అవుతాయి అని భావిస్తున్నాను. డబ్బులు పంపిన వారు శంకరాభరణం సమూహంలో తమ ట్రాన్సాక్షన్ నెంబర్‌తో తెలియజేయాలి. శ్రీమాన్ కంది శంకరయ్య గారి అకౌంట్ వివరాలు అందిస్తున్నాను. 
Kandi Shankaraiah
State Bank of India,
Warangal Main.
A/c No. 62056177880
IFC : SBIN0020148
ఈ అకౌంట్ కు ఫోన్ పే ,పేటీఎం ,గూగుల్ పే (7569822984) సౌకర్యం కూడా ఉన్నది .
పద్యాలు పంపని వారెవరైనా ఉంటే ఇప్పటికైనా పంపించవచ్చు. సంకలనంలో చేరుస్తారు.
నా ఈ అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరిస్తారని మరొక్కమారు నమస్కారాలతో సెలవు 🙏
మీ 
ఆముదాల మురళి ,
శతావధాని, తిరుపతి.
🙏🙏🙏🌹🙏🙏🙏

సమస్య - 3331 (అహహా దుఃఖము వచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలఁగిరి యష్టావధానిఁ గని జనులు సభన్"
(లేదా...)
"అహహా దుఃఖము వచ్చె సభ్యులకు నీ యష్టావధానిన్ గనన్"

5, ఏప్రిల్ 2020, ఆదివారం

సమస్య - 3330 (మాసిన చీరఁ గట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మానిని పెండ్లికి ధరించె మాసిన చీరన్"
(లేదా...)
"మాసిన చీరఁ గట్టి యొక మానిని వచ్చెను పెండ్లిఁ జూడఁగన్"

4, ఏప్రిల్ 2020, శనివారం

సమస్య - 3329 (అయ్యో మాటలు రానిదై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పలుకు రాదయ్యె నాకాశవాణి నోట"
(లేదా...)
"అయ్యో మాటలు రానిదై నిలిచె నీ యాకాశవాణిన్ గనన్"

3, ఏప్రిల్ 2020, శుక్రవారం

సమస్య - 3328 (నానా శ్రేయములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూని శ్రేయమ్ము లిడె కరోనా నరులకు"
(లేదా...)
"నానా శ్రేయము లందఁజేసెను కరోనా మానవుల్ మెచ్చగన్"

2, ఏప్రిల్ 2020, గురువారం

ఆహ్వానం (అష్టావధానం)


సమస్య - 3327 (రాముఁడు పెండ్లియాడుటకు...)

కవిమిత్రులారా,
🕉శ్రీ రామ నవమి శుభాకాంక్షలు Images ...
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాఁడు పెండ్లాడ భద్రాద్రి రామవిభుఁడు"
(లేదా...)
"రాముఁడు పెండ్లియాడుటకు రాఁడట
 భద్రగిరిస్థ వేదికిన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలు)

1, ఏప్రిల్ 2020, బుధవారం

సమస్య - 3326 (విషమును మ్రింగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విషమును హరి మ్రింగె మురియ వేల్పులు దితిజుల్"
(లేదా...)
"విషమును మ్రింగె మాధవుఁడు వేల్పులు దైత్యులు సంతసింపఁగన్"