31, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3177 (తామసచిత్తుండె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తామసచిత్తుండె జనుల దైవం బయ్యెన్"
(లేదా...)
"తామసచిత్తుఁడే జనుల దైవముగా ప్రణతుల్ గొనెం గదా"

30, అక్టోబర్ 2019, బుధవారం

దత్తపది - 163

కవిమిత్రులారా,
"గుఱ్ఱం - మైలవరపు - గుండా - రావెల"
మన కవిమిత్రుల ఇంటిపేర్లైన
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

29, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3176 (భగినీ హస్తాన్నమనిన...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భగినీ హస్తాన్న మనిన వడఁకె ననుజుఁడే"
(లేదా...)
"అడలెన్ సోదరుఁ డారగింప భగినీ హస్తాన్నమున్ భీతుఁడై"

28, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3175 (కేదారేశు వ్రతమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కేదారేశ్వరుని నోమఁ గీడొనఁగూడున్"
(లేదా...)
"కేదారేశు వ్రతమ్ముఁ జేసిన జనుల్ గీడొంది దుఃఖింపరా"

27, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3174 (శంకరుఁ డుగ్రుఁడై...)

కవిమిత్రులారా,


ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంకరుండు నరకుఁ జంపె నలిగి"
(లేదా...)
"శంకరుఁ డుగ్రుఁడై నరకుఁ జంపెను లోకహితైకకాంక్షియై"

26, అక్టోబర్ 2019, శనివారం

సమస్య - 3173 (నవదీపమ్ము లవేలకో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవ్య దీపముల్ గృహవితానమున నేల"
(లేదా...)
"నవదీపమ్ములవేలకో గృహవితానమ్మందు నీవేళలో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

25, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3172 (వ్యాసుఁడు దెనుఁగున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వ్యాసుఁడు దెనుఁగున రచించె భాగవతమ్మున్"
(లేదా...)
"వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును దెన్గుబాసలో"

24, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3171 (జనహననాసక్తుఁడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జనహననాసక్తుఁడే యశంబుఁ గను ధరన్"
(లేదా...)
"జనహననైకతత్పరుఁడె సజ్జనుఁడై యశమందు నిద్ధరన్"

23, అక్టోబర్ 2019, బుధవారం

దత్తపది - 162 (నేల-మన్ను-పుడమి-మట్టి)

కవిమిత్రులారా,
'నేల - మన్ను - పుడమి - మట్టి'
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

22, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3170 (రామ కథామృతంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"...రామ కథామృతంబు చింతలఁ గూర్చున్" (ఛందో గోపనము)
(లేదా...)
"..శ్రీరామ కథామృతంబు విన నిర్వేదమ్ము హెచ్చున్ గదా" (ఛందో గోపనము)

21, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3169 (కలలం గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంకల్పము సిద్ధిఁ గాంచు స్వప్నములఁ గనన్"
(లేదా...)
"కలలం గాంచి ముదంబు నందిననె సంకల్పంబు సిద్ధించులే"

20, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3168 (అమ్మపాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అమ్మపాలు విషమ్మగు నర్భకులకు"
(లేదా...)
"విషమగు నమ్మపాలనుచుఁ బిల్లలు గ్రోలఁగ నిచ్చగింపరే"

19, అక్టోబర్ 2019, శనివారం

సమస్య - 3167 (అల్లుఁడు రాకయున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అల్లుఁడు రాకున్న మురిసి రత్తయు మామల్"
(లేదా...)
"అల్లుఁడు రాకయున్న ముదమందిరి పండుగ నత్తమామలున్"
(ఈరోజు పూరణలు ప్రసార కానున్న ఆకాశవాణి వారి సమస్య)

18, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3166 (పాపమే దక్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపమే దక్కు పాదాభివందనమున"
(లేదా...)
"పాపమె దక్కు సుమ్ము పదవందనముల్ వొనరించువారికిన్"

17, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3165 (కారాగారము నుండి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారాగృహముక్తుఁ డితఁడె కాఁగల రాజౌ"
(లేదా...)
"కారాగారమునుండి వచ్చె నిపుడే కాబోవు రాజీతఁడే"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

16, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3164 (నిదురించెడువాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిదురించెడువాఁడె ధారుణిన్ యశమందున్"
(లేదా...)
"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

15, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3163 (శ్రీరాముని పెద్దభార్య...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీరాముని పెద్దభార్య సీతకు మ్రొక్కెన్"
(లేదా...)
"శ్రీరఘురాము పెద్ద సతి సీతకు మ్రొక్కెను భక్తి మీఱఁగన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

14, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3162 (తనయుని తల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనయుని తల నరికినట్టి తల్లికి జేజే"
(లేదా...)
"తనయునిదౌ తలన్ నరుకు తల్లికి వందన మాచరించెదన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

13, అక్టోబర్ 2019, ఆదివారం

సమస్య - 3161 (రంగమ్మున నోడిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంగమ్మున నోడిన కవి రాణిని గెల్చెన్"
(లేదా...)
"రంగమునందు నోడి యొక రాణిని గెల్చెఁ గవీంద్రుఁ డొక్కఁడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

12, అక్టోబర్ 2019, శనివారం

ఆహ్వానం!


సమస్య - 3160 (దుర్గా నీవలనన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్గా నీవలన జగము దుఃఖమ్మందెన్"
(లేదా...)
"దుర్గా నీవలనన్ జగద్వలయ మెంతో దుఃఖమందెన్ గదా"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

11, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3159 (మోదీ పెండ్లికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోదీ పెండ్లికిఁ జనిరఁట ముక్కోటి సురల్"
(లేదా...)
"మోదీ పెండ్లికి పోయినారు గదరా ముక్కోటి దేవుళ్ళహో!"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

10, అక్టోబర్ 2019, గురువారం

సమస్య - 3158 (కోఁతినిఁ బెండ్లాడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోఁతినిఁ బెండ్లాడు మింకఁ గూటికి లోటా?"
(లేదా...)
"కోఁతినిఁ బెండ్లియాడు మిఁకఁ గూటికి గుడ్డకు లోటు లేదు పో"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

9, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3157 (ప్రాగ్దిగ్గ్రావమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాగ్దిగ్గ్రావమునఁ గ్రుంకె రవి యుదయమునన్"
(లేదా...)
"ప్రాగ్దిగ్గ్రావమునందుఁ గ్రుంకె రవియున్ బ్రత్యూషకాలమ్మునన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

8, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3156 (ఆయుధపూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆయుధమ్ముల పూజ లనర్థకములు"
(లేదా...)
"ఆయుధపూజ సేయుట యనర్థకమే కద పర్వమందునన్"

7, అక్టోబర్ 2019, సోమవారం

సమస్య - 3155 (భారతమ్మును జదువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భారతమ్మును జదువ వైభవము లడఁగు"
(లేదా...)
"భారతమున్ బఠింప ఘనవైభవముల్ నశియించు నందురే"
('తపస్వి' పంతుల వేంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

6, అక్టోబర్ 2019, ఆదివారం

ఆహ్వానం (Remainder)


సమస్య - 3154 (శతకములన్ రచించుట...)

కవిమిత్రులకు దుర్గాష్టమి, చద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శతకముల రచనమ్ము నిష్ఫలమె సుమ్ము"
(లేదా...)
"శతకములన్ రచించుట ప్రశస్తము గాదది నిష్ఫలమ్మె పో"
(ఈరోజు నా 'శంకర శతకము' ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సందర్భముగా...)

5, అక్టోబర్ 2019, శనివారం

ఆహ్వానం!


సమస్య - 3153 (మనిషికి మోదమిచ్చును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మనుజునకుఁ బ్రమోదమిడు సమస్యలు సతమున్"
(లేదా...)
"మనిషికి మోద మిచ్చును సమస్యలు నిత్యము జీవితమ్ములో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

4, అక్టోబర్ 2019, శుక్రవారం

సమస్య - 3152 (రాతిం గాంచిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతినిఁ గన నాతికి ననురాగము పుట్టెన్"
(లేదా...)
"రాతిం గాంచిన నాతి నెమ్మనమునన్ రాగమ్ము పుట్టెం దమిన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతవధాన సమస్య)

3, అక్టోబర్ 2019, గురువారం

ఆహ్వనం


సమస్య - 3151 (నరకమునందుఁ జూచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవ్వుల స్వర్గమును జూచె నరకమునందున్"
(లేదా...)
"నరకమునందుఁ జూచె నొక నవ్వుల స్వర్గము మోద మందుచున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతవధాన సమస్య)

2, అక్టోబర్ 2019, బుధవారం

సమస్య - 3150 (దేశ జనులకు వలదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దేశ జనులకు వలదు గాంధీ జయంతి"
(లేదా...)

"కలనైనన్ దలపోయరే జరుపఁగన్ గాంధీ జయంతిన్ జనుల్"

1, అక్టోబర్ 2019, మంగళవారం

సమస్య - 3149 (నన్నయభట్టు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నన్నయ కవివరుండు తెనాలివాఁడు"
(లేదా...)
"నన్నయభట్టు వాసము తెనాలి యటంద్రు చరిత్రశోధకుల్"