30, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3413

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జ్యోత్స్నల్ నలుదెసలఁ బర్వి క్షోభన్ గూర్చెన్"
(లేదా...)
"జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్"

డా. సి.వి. సుబ్బన్న శతవధాని గారి పూరణ...
మృత్స్నావర్ధిత పారిజాత సుమనోరేఖన్ జగన్మోహనో
ద్యత్స్నిగ్ధద్యుతి మించు కన్య వలచెన్ దా రాజవర్యున్ దదం
చత్స్నేహాదృతి నిద్రలేమి వగచెన్ జాల్చాలుఁ బొమ్మంచనున్
జ్యోత్స్నల్ నల్దెసలందుఁ బర్వి కడు సంక్షోభమ్ముఁ గల్పించెడున్.

29, జూన్ 2020, సోమవారం

సమస్య - 3412

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగలే రాత్రిగను రాత్రి పగలుగ నయ్యెన్"
(లేదా...)
"పగలే రాత్రిగ రాత్రియే పగలుగా భావంబునం దోఁచెడిన్"

28, జూన్ 2020, ఆదివారం

సమస్య - 3411

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిలువు బొట్టుఁ బెట్టె నీలగళుడు"
(లేదా...)
"నిలువుగ బొట్టుఁ బెట్టెనఁట నీలగళుండు మురారి భక్తుఁడై"

27, జూన్ 2020, శనివారం

సమస్య - 3410

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాయలు గలవెన్నొ పండ్లు గావెన్నటికిన్"
(లేదా...)
"కాయలు పెక్కులున్న వవి గావు ఫలంబులు చూడ నెన్నఁడున్"

26, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3409

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంచనతో సజ్జనుఁడుగ బ్రతుకఁగ వచ్చున్"
(లేదా...)
"వంచనఁ జేయుచున్ బ్రతుకువాని నుతింతురు సజ్జనుండుగన్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

25, జూన్ 2020, గురువారం

సమస్య - 3408

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మహిమలు గల దేవుఁ డెపుడు మంచినిఁ గనఁడే"
(లేదా...)
"మహిమలు గల్గు దేవునకు మంచి రవంతయుఁ గానుపించదే"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

24, జూన్ 2020, బుధవారం

సమస్య - 3407

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మంచి నొనర్చెడి జనులకు మరణమె దక్కున్"
(లేదా...)
"మంచి నొనర్పఁగం దలఁచు మానవులన్ వరియించు మృత్యువే"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

23, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3406

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడఁతులు సరిపోరు మధుర పద్యరచనకున్"
(లేదా...)
"ఇంతుల్ వ్రాయఁగ లేరు నిశ్చయముగా హృద్యమ్ముగాఁ బద్యముల్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

22, జూన్ 2020, సోమవారం

సమస్య - 3405

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బుద్ధి గల జనులకు బూది మిగులు"
(లేదా...)
"బుద్ధులు గల్గు వారలకు బూదియె దక్కును నిక్కువంబుగన్"
(కళ్యణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

21, జూన్ 2020, ఆదివారం


సమస్య - 3404

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద గ్రుడ్డుఁ గొనివచ్చెఁ గాశికిఁ జనియున్"
(లేదా...)
"గాడిద గ్రుడ్డుఁ దెచ్చెనఁట కాశికిఁ బోయి జనమ్ము మెచ్చఁగన్"
(కోడూరి శేషఫణి శర్మ గారికి ధన్యవాదాలతో...)

20, జూన్ 2020, శనివారం

సమస్య - 3403

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమ్ములఁ జంపంగఁ గోరెఁ దనయుఁడు దండ్రిన్"
(లేదా...)
"తమ్ములఁ జంపుమంచు నొక తండ్రిని పుత్రుఁడు కోరెఁ నమ్రుఁడై"
(పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారికి ధన్యవాదాలతో...)

19, జూన్ 2020, శుక్రవారం

న్యస్తాక్షరి - 67

కవిమిత్రులారా,
'ర-రి-రు-రె'
పై అక్షరాలను ప్రాసస్థానంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
వృద్ధావస్థను వర్ణించండి.

18, జూన్ 2020, గురువారం

సమస్య - 3402

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆరనట్టి మంట లారె నెటుల"
(లేదా...)
"ఆరని మంటలారె నెవరార్పక మున్నె విచిత్రమౌనటుల్"
(శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలతో...)

17, జూన్ 2020, బుధవారం

సమస్య - 3401

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... 
"గర్భముం దాల్చె మగఁడని కాంత మురిసె"
(లేదా...)
"గర్భముఁ దాల్చె భర్త యని కాంత వచించెను సంతసంబునన్"

16, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3400

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేలకొలఁది సమస్యలు వెతలఁ గూర్చె"
(లేదా...)
"వందలు వేలుగా ముసిరి వంతలఁ ద్రోచె సమస్య లియ్యెడన్"

15, జూన్ 2020, సోమవారం

సమస్య - 3399

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోగము నయమైన మిగుల రోదించెనయో"
(లేదా...)
"రోగము పోయి స్వస్థుఁడయి రోదనఁ జేయఁగసాగె బిట్టుగన్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

14, జూన్ 2020, ఆదివారం

ఆహ్వానం!


సమస్య - 3398

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శాంతిఁ గోరువాఁడె శత్రువు గద"
(లేదా...)
"శాంతినిఁ గోరు వారలనె శత్రువులంచుఁ దలంత్రు సజ్జనుల్"
(కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

13, జూన్ 2020, శనివారం

దత్తపది - 168

కవిమిత్రులారా,
మబ్బు - వాన - ముసురు - వరద
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

12, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3397

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సుతులే పతు లనెను కృష్ణ చొక్కఁపు మాటౌ"
(లేదా...)
"సుతులే నా పతులంచుఁ గృష్ణ వలికెం జొక్కంపు మాటే కదా"

11, జూన్ 2020, గురువారం

సమస్య - 3396

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాండవుల కంటె మూర్ఖులు వసుధఁ గలరె"
(లేదా...)
"పాండవులంత మూర్ఖులు ప్రపంచమునన్ మఱి లేరు లేరుగా"

10, జూన్ 2020, బుధవారం

సమస్య - 3395

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శస్త్రచికిత్స పిదపఁ గనె జానకి సుతులన్"
(లేదా...)
"శస్త్రచికిత్స పిమ్మటనె జానకి సంతుఁ గనెన్ ముదంబునన్"

9, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3394

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాఁటిన వేగిరమ కీడు దథ్యముగ నగున్"
(లేదా...)
"దాఁటఁగ రాదు వేగిరమ తథ్యము గీడు జనించు ఘోరమై"

8, జూన్ 2020, సోమవారం

సమస్య - 3393

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కొమరునకు మ్రొక్కె జనకుండు గూర్మితోడ"
(లేదా...)
"కొమరునిఁ గాంచి మ్రొక్కె జనకుండు జనుల్ గొనియాడఁ గూర్మితోన్"

7, జూన్ 2020, ఆదివారం

అవధానం ప్రత్యక్ష ప్రసారం...

'శంకరాభరణం' వాట్సప్ సమూహంలో ఈనాడు జరుగనున్న అవధానాన్ని క్రింది లింకు ద్వారా యూట్యూబులో ప్రత్యక్షంగా చూడవచ్చు. సరిగా మూడు గంటలకు ప్రారంభమౌతుంది.


ఆహ్వానం


సమస్య - 3392

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేశ్యల జీవితము గడుఁ బవిత్రము సుమ్మీ"
(లేదా...)
"వేశ్యల జీవిత మ్మతిపవిత్రము సాధ్వులు వారి సాటియే"

6, జూన్ 2020, శనివారం

సమస్య - 3391

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణము ముగిసిన దనుచు ననురక్తుఁడు లేచెన్"
(లేదా...)
"రణము సమాప్తమైన ననురక్తుఁడు లేచెను బంచె దుల్పుచున్"

5, జూన్ 2020, శుక్రవారం

సమస్య - 3390

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దానవ రూపమును విడిచె దానవుఁ డచటన్"
(లేదా...)
"దానవరూపియై విడిచె దానవరూపము దానవుం డటన్"

4, జూన్ 2020, గురువారం

సమస్య - 3389

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవనీతప్రతిమ లగ్ని నడుమ నటించెన్"
(లేదా...)
"నవనీతప్రతిమల్ నటించెఁ గడు నానందమ్ముతో నగ్నిలోన్"

3, జూన్ 2020, బుధవారం

ఆహ్వానం!

 

సమస్య - 3388

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁడు గోతులను దునిమె రావణ హితుఁడై"
(లేదా...)
"రాముఁడు గోతులం దునిమె రావణు నెయ్యముఁ గోరి యాజిలో"

2, జూన్ 2020, మంగళవారం

సమస్య - 3387

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆలి నడఁచి పొందుము వెలయాలి సుఖము"
(లేదా...)
"భార్యనుఁ జంపి పొందవలె వార వరానన నిత్యసౌఖ్యమున్"

1, జూన్ 2020, సోమవారం

సమస్య - 3386

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శవపూజ లొసంగును శుభసంతోషములన్"
(లేదా...)
"శవపూజాభిరతుల్ శుభంబుఁ గనరే సంతోషముం బొందరే"