31, అక్టోబర్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 85

1-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
అంశం - కాశీ ప్రాశస్త్యం
ఛందం - ఉత్పలమాల
న్యస్తాక్షరాలు - 1వ పాదం 1వ అక్షరం 'వా'; 2వ పాదం 2వ అక్షరం 'ర'; 

3వ పాదం 10వ అక్షరం 'ణా'; 4వ పాదం 19వ అక్షరం 'సి'
(లేదా...)
'వా-ర-ణా-సి' అనే అక్షరాలు పాదాదిలో ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి.

30, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4573

31-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మన్ననఁ బొందునొకొ మనుజమాత్రుఁడు గుణియై”
(లేదా...)
“మన్ననఁ బొందునే మనుజమాత్రుఁడు సద్గుణపూర్ణుఁడైనచో”

29, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4572

30-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రొక్కి చంపఁడు కుంభకర్ణుఁడు గపిశను” (కపిశ = చీమ)
(లేదా...)
“చావం ద్రొక్కఁడు కుంభకర్ణుఁ డెపుడున్ సచ్ఛీలుఁడై చీమనున్”

28, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4571

29-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వన్నెలు మార్చెను రవి శశివలెఁ బ్రాగ్వీథిన్”
(లేదా...)
“వన్నెల్ మార్చెను భాస్కరుండు శశియై ప్రాక్పర్వతాగ్రంబుపై”

27, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4570

28-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారముఁ గనక యొనరిచె వికారపుఁ జేష్టల్”
(లేదా...)
“కారము నిచ్చగింపక వికారపుఁ జేష్ట లొనర్చె మందుఁడున్”

26, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4569

27-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వీలగునొకొ తృణముఁ గొనఁగ వేవేలిడినన్”
(లేదా...)
“కొంద మటన్న వీలగునొకో తృణముం బదిలక్షలిచ్చినన్”

25, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4568

26-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిల యయ్యె నహల్యనుఁ గని శ్రీరాముఁ డయో”
(లేదా...)
“శిలగా నయ్యె నహల్యనుం గని వనిన్ శ్రీరామచంద్రుం డయో”

24, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 204

25-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
కృత్యము - నిత్యము - ముత్యము - సత్యము
పై పదాలను ప్రయోగిస్తూ
ఆదర్శ పురుషుడెలా ఉండాలో వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

23, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4567

24-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రొద్దుటూరున రాతిరి ప్రొద్దు వొడిచె”
(లేదా...)
“పొడిచెను ప్రొద్దుటూరున నభోమణి రాతిరి దివ్యకాంతులన్”

22, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4566

23-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లలితాలంకారము లవలక్షణములగున్”
(లేదా...)
“లలితములౌ నలంకృతులు లక్షణదూరములౌను కైతలో”

21, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4565

22-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులు ధర్మనాశకులు సంఘమ్మునందు”
(లేదా...)
“కవులన ధర్మనాశకులు గారె సమాజమునందుఁ జూడఁగన్”

20, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4564

21-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాంతుఁ డఖిలసద్గుణుఁడు కీచకుఁడు సుమ్ము”
(లేదా...)
“శాంతుఁ డమత్సరుండు గుణశాలి దయామతి కీచకుం డగున్”

19, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4563

20-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికు లొప్పని పద్యమే రమ్యమనిరి”
(లేదా...)
“రసికుల్ మెచ్చని పద్యమే నిలిచె సర్వశ్రేష్ఠమై వింతగన్”

18, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4562

19-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మదికి ముదము గలిగిన దవమానము సేయన్”
(లేదా...)
“మది ముదమందఁ జేసి రవమాన మొనర్చి సభాంగణమ్మునన్”

17, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్య - 4561

18-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కష్టమూలమ్ము గాదె రాఘవుని పూజ”
(లేదా...)
“మూలం బయ్యెను గష్టసంతతికి రామున్ నమ్మి పూజించుటే”

16, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4560

17-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదుగురాడు మాట పాడి గాదు”
(లేదా...)
“పదుగురు పల్కు మాట యెటు పాడియగున్ దలపోసి చూచినన్”

15, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4559

16-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లల్పులె కనఁగన్”
(లేదా...)
“అవధాన మ్మొనరించు వార లకటా యల్పుల్ గదా చూడఁగన్”

14, అక్టోబర్ 2023, శనివారం

సమస్య - 4558

15-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోసగించిన జనులకుఁ బుణ్యమబ్బు”
(లేదా...)
“మోసముఁ జేయు వారలకు పుణ్యము దక్కును శాశ్వతంబుగన్”

13, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4557

14-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పు ప్రజ్వరిల్లు నీటిచేత”
(లేదా...)
“నిప్పులు ప్రజ్వరిల్లుఁ గద నీటినిఁ గుండెఁడు గ్రుమ్మరించినన్”

12, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4556

13-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మనుజున కొక భార్య మంచిదగునె”
(లేదా...)
“మనుజున కొక్క భార్య యన మంచిది కాదని యంద్రు పండితుల్”

11, అక్టోబర్ 2023, బుధవారం

సమస్య - 4555

12-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవినీతికి నాటపట్టు లయ్యెను గుడులే”
(లేదా...)
“నెలకొనె నాలయమ్ము లవినీతికిఁ జూడఁగ నాటపట్టులై”

10, అక్టోబర్ 2023, మంగళవారం

దత్తపది - 203

11-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
బెండ - బీర - దోస - కాకర
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
మహాభారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయండి.

9, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4554

10-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తవముం జేయంగనొప్పు సత్కృతికి ఖలున్”
(లేదా...)
“స్తవముం జేయగనొప్పు ధూర్తుని ఖలున్ సత్కారసంసిద్ధికిన్”
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

8, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4553

9-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుజనులతో మైత్రి మిగుల క్షోభను గూర్చున్”
(లేదా...)
“సుజనులతోడి మైత్రి కడు క్షోభను గూర్చునటంద్రు విజ్ఞులే”

7, అక్టోబర్ 2023, శనివారం

విన్నపం

 కవిమిత్రులకు నమస్సులు.

కొద్ది రోజులుగా మీ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. ప్రతిరోజు సమస్యను షెడ్యుల్ చేయడంలో ఇబ్బంది లేదు. కాని మీ పద్యాలను చదివి స్పందించాలంటే 'గూగుల్ తో సైన్ ఇన్' చేయండి అంటున్నది. దానిని ఎన్నిసార్లు క్లిక్ చేసినా సైన్ ఇన్ చేయలేకపోతున్నాను. అందువల్ల మీ పద్యాలను సమీక్షించడానికి అవకాశం లేకుండా పోతున్నది. మిత్రులలో ఎవరైనా ఈ సాంకేతికమైన ఆటంకానికి పరిష్కారం చూపగలరా? 

సెల్ ఫోన్ లో ఇబ్బంది లేదు. వ్యాఖ్యలు పెట్టగలను. కాని సెల్ ఫోన్ లో టైప్ చేయాలంటే నాకు కష్టం..

సమస్య - 4552

8-10-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుస్ససేను భీముఁడు గని తొలఁగె నడలి”
(లేదా...)
“తొలఁగెన్ భీముఁడు భీతితో రణమునన్ దుశ్శాసనున్ గాంచుచున్”

6, అక్టోబర్ 2023, శుక్రవారం

సమస్య - 4551

7-10-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరమె యుద్ధరించె ధరణి నెపుడొ”
(లేదా...)
“కరమే ధారుణి నుద్ధరించె నెపుడో గంగాధరా! శంకరా!”

5, అక్టోబర్ 2023, గురువారం

సమస్య - 4550

6-10-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పీనుఁగను రమించి జాణ పిల్లలఁ బడసెన్”
(లేదా...)
“పీనుఁగనుం రమించి కడుఁ బిల్లలఁ బొందెను జాణ వింతగన్”
(గన్నమరాజు గిరిజామనోహర్ బాబు గారికి ధన్యవాదాలతో...)

4, అక్టోబర్ 2023, బుధవారం

నిషిద్ధాక్షరి - 56

5-10-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఏదైనా దైవస్తుతి పద్యాన్ని మీకు నచ్చిన ఛందంలో వ్రాయండి
నిషిద్ధాక్షరాలు - ఇ, ఈ అనే అచ్చులు, ఈ అచ్చులతో కూడిన హల్లులు

3, అక్టోబర్ 2023, మంగళవారం

సమస్య - 4549

4-10-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్ను కొనెడువాఁడు వెఱ్ఱివాఁడు”
(లేదా...)
“పెన్ను కొనంగ సిద్ధపడ వెఱ్ఱితనంబె యగున్ దలంచినన్”

2, అక్టోబర్ 2023, సోమవారం

సమస్య - 4548

3-10-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మచారికి నిద్దఱు భార్యలంట”
(లేదా...)
“ఇతఁడొక బ్రహ్మచారి యఁట యిద్దఱు భార్యల భర్త సూడఁగన్”

1, అక్టోబర్ 2023, ఆదివారం

సమస్య - 4547

2-10-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీతావల్లభుఁడు చంద్రశేఖరుఁ డయ్యెన్”
(లేదా...)
“సీత మగండు చూడ శశిశేఖరుఁడయ్యె జనుల్ స్తుతింపఁగన్”