31, మే 2021, సోమవారం

సమస్య - 3738

1-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల నఱుకఁ గాంచి మెచ్చిరి తగిన పనిగ”
(లేదా...)
“తల నఱుకంగఁ గాంచి బహుధా స్తుతకార్య మటంచు మెచ్చిరే”

30, మే 2021, ఆదివారం

సమస్య - 3737

31-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దున్ననుఁ గని దోఁచితివని రుల్లంబులనే”
(లేదా...)
“దున్ననుఁ గాంచి దోఁచితివె యుల్లములంచు వచించి రెల్లరున్”

29, మే 2021, శనివారం

సమస్య - 3736

30-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోహిణి వచ్చుటను గాంచి రోసెను శశియే”
(లేదా...)
“రోహిణి వచ్చినంతఁ గని రోసె శశాంకుఁడు భీతచిత్తుఁడై”

28, మే 2021, శుక్రవారం

సమస్య - 3735

29-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హితముఁ గను గ్రహణమున భుజించువాఁడు”
(లేదా...)
“కడు హిత మబ్బులే గ్రహణకాలమునన్ భుజియించువానికిన్”

27, మే 2021, గురువారం

సమస్య - 3734

28-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భోగాసక్తుండె మోక్షమునుఁ బొందుఁ గదా”
(లేదా...)
“భోగాసక్తుఁడు రాగబద్ధుఁడు గనున్ మోక్షమ్ము వేగమ్ముగన్”

26, మే 2021, బుధవారం

సమస్య - 3733

27-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విరహముఁ బాపుమని గౌరి వెన్నుని వేడెన్”
(లేదా...)
“విరహముఁ బాపవే యనుచు వెన్నుని వేడెను గౌరి తప్తయై”

25, మే 2021, మంగళవారం

న్యస్తాక్షరి - 69

26-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
నాలుగు పాదాలలో యతి స్థానాలలో
వరుసగా పా - రా - వా - రం అక్షరాలను న్యస్తం చేస్తూ
సముద్ర మథనాన్ని వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

24, మే 2021, సోమవారం

సమస్య - 3732

25-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సతతము సంతసమొసంగు సతితో గొడవల్”
(లేదా...)
"సతతము భార్యతో గొడవ సంతస మిచ్చును భర్త కెప్పుడున్"

23, మే 2021, ఆదివారం

సమస్య - 3731

24-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోడలివని పల్కె నొకఁడు గూఁతురితోడన్”
(లేదా...)
“కోడలివంచు నొక్కరుఁడు గూఁతురితోడ వచించె నెమ్మదిన్”

22, మే 2021, శనివారం

సమస్య - 3730

23-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విటులకుఁ దావలములయ్యె విద్యాశాలల్”
(లేదా...)
“విటులకు తావలంబులుగఁ బేర్మిఁగనెన్ బడు లెల్ల తావులన్”

21, మే 2021, శుక్రవారం

సమస్య - 3729

22-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరుఁడై శిబి ఖండించెఁ బారువమును”
(లేదా...)
“క్రూరుండై శిబి ఖడ్గముం గొని వడిం గోసెం గపోతమ్మునే”

20, మే 2021, గురువారం

సమస్య - 3728

21-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సమరమును మాని కురురాజు శాంతిఁ గోరె”
(లేదా...)
“సమరము మాని రాజ్యమున శాంతినిఁ గోరె సుయోధనుండహో”

19, మే 2021, బుధవారం

సమస్య - 3727

20-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాలి విసరెను వృక్షశాఖలు గదలవు”
(లేదా...)
“గాలులు తీవ్రమై విసరెఁ గాని చలింపవు వృక్షశాఖలే”

18, మే 2021, మంగళవారం

సమస్య - 3726

19-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గానమొనరించు పికమ నిన్గాన నగునె”
(లేదా...)
“గానము సేయు నిన్నుఁ గనఁగా నగునే పికమా కలధ్వనీ”

17, మే 2021, సోమవారం

దత్తపది - 177

18-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
“ఘనము - ధనము - మనము - వనము”
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
రామాయణార్థంలో
పద్యం వ్రాయండి.

16, మే 2021, ఆదివారం

సమస్య - 3725

17-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జనకుఁ జంపినవానికి జనుల నతులు”
(లేదా...)
“జనకునిఁ జంపినట్టి గుణశాలికి మ్రొక్కెద రెల్ల సజ్జనుల్”

15, మే 2021, శనివారం

సమస్య - 3724

16-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భాధానమ్ము నాఁడె కల్గిరి పుత్రుల్”
(లేదా...)
“గర్భాధానము నాఁడె కల్గిరి సుతుల్ గంజాక్షికిన్ జంటగా”

14, మే 2021, శుక్రవారం

సమస్య - 3723

15-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలయా లొనరించు వంశవృద్ధినిఁ బ్రేమన్”
(లేదా...)
“వెలయాలే మన వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదించులే”

13, మే 2021, గురువారం

సమస్య - 3722

14-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము భక్తులనుఁ దీయగా మురిపించెన్”
(లేదా...)
“కారము తీపియై సుఖముగా మురిపించెను భక్తబృందమున్”

12, మే 2021, బుధవారం

సమస్య - 3721

13-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రవ యుత మౌనమున శంకరప్రభుఁ గొల్తున్”
(లేదా...)
“రవ యుత మౌనమూని త్రిపురద్విషు శంకరుఁ బ్రీతిఁ గొల్చెదన్”

11, మే 2021, మంగళవారం

సమస్య - 3720

12-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు గలిగినవాఁడె రాజు కలికాలమునన్”
(లేదా...)
“కలు గలవాఁడె రాజు కలికాలమునందుఁ దలంచి చూచినన్”

10, మే 2021, సోమవారం

సమస్య - 3719

11-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ పదములఁ గడుగంగ రాఁడు గుహుఁడు”
(లేదా...)
“కడుగఁగ రాఁడులే గుహుఁడు కాతరుఁడై రఘురాము పాదముల్”

9, మే 2021, ఆదివారం

సమస్య - 3718

10-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతినిఁ గాంచి బ్రహ్మ రక్తుఁ డయ్యె”
(లేదా...)
“రతిఁ గని బ్రహ్మదేవుఁ డనురక్తినిఁ బొందెను వేల్పు లౌననన్”

8, మే 2021, శనివారం

సమస్య - 3717

9-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాము రాము రాము రమణి గాంచె”
(లేదా...)
“రాముని రామునిన్ మఱియు రాముని జానకి గాంచె మువ్వురన్”

7, మే 2021, శుక్రవారం

సమస్య - 3716

8-5-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్తికిఁ గారణము విషయభుక్తియె తలఁపన్”
(లేదా...)
“ముక్తికి మూలకారణము పో విషయాదుల భుక్తి నిచ్చలున్”

6, మే 2021, గురువారం

సమస్య - 3715

7-5-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విధునిఁ గని భాస్కరుఁడు వెలవెలనవోయె”
(లేదా...)
“వెలవెలబోయె భాస్కరుఁడు వెన్నెల రాజునుఁ గాంచినంతటన్”

5, మే 2021, బుధవారం

సమస్య - 3714

6-5-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతిని బ్రోచెన్”
(లేదా...)
“నగరాడ్ధారి యనంగుఁ ద్రుంచి పిదపన్ నాతిన్ గృపన్ బ్రోచెలే”

4, మే 2021, మంగళవారం

సమస్య - 3713

5-5-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవలీలగఁ జిన్నపిల్ల యశ్వము నెత్తెన్”
(లేదా...)
“అవలీలన్ సుకుమారి బాలికయె తా నశ్వంబు నెత్తెన్ వడిన్”

3, మే 2021, సోమవారం

సమస్య - 3712

4-5-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పారిజాత గంధమ్ము దుర్భరము సతికి”
(లేదా...)
“కాంతకుఁ బారిజాత సుమ గంధము దుర్భరమయ్యెఁ దోటలోన్”

2, మే 2021, ఆదివారం

సమస్య - 3711

3-5-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిరియె మోక్షోపలబ్ధికి జీవగఱ్ఱ"
(లేదా...)
"సిరియే మోక్షము నంద సాధనమగున్ జింతించి సాధింపుమా"

(దువ్వూరి రామిరెడ్డి గారి పద్యపాదానికి రూపాంతరం)

1, మే 2021, శనివారం

సమస్య - 3710

2-5-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుశలవుల్ గారు రాముని కొడుకు లంద్రు”
(లేదా...)
“పుత్రులు గారుపో కుశలవుల్ రఘురామున కంద్రు సజ్జనుల్”
(ఈ పాపం నాది కాదు... 'కార్తికదీపం' సీరియల్‌ది!)