31, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 923 (శివనామము చేదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివనామము చేదు నరుల జిహ్వల కెపుడున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 207

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 922 (ఎవఁడో యెవ్వఁడొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఎవఁడో యెవ్వఁడొ యెవ్వఁడో యెవఁడొ తా నెవ్వాఁడొకో యెవ్వఁడో.

పద్య రచన - 206

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 921 (తల బాష్పంబులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 205

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 920 (ధునిఁ గొలిచినఁ దొలఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధునిఁ గొలిచినఁ దొలఁగు సకల దుఃఖచయంబుల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 204

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 919 (రామ మనోరథమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రామ మనోరమ్ము భళిరా నెరవేర్చెను కైక రాణియై!
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.పద్య రచన - 203

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 918 (వమ్ము సర్వమ్ము)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వమ్ము సర్వమ్ము నేత్రపర్వమ్ము సుమ్ము
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 202

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 917 (భోగరక్తుఁడె మేటి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భోగరక్తుఁడె మేటి బైరాగి యగును.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 201

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 916 (వేళ్ళు పైభాగమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేళ్ళు పైభాగమున నుండు వృక్షమునకు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 200

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

ఆహ్వానము

నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా 

ప్రభుత్వము వారి ఆధ్వర్యవములో 
జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు 
విశాఖపట్నము.

అష్టావధాన కార్యక్రమముఅవధాని  
రాంభట్ల పార్వతీశ్వర శర్మ,
ఎం.ఏ తెలుగు, పరిశోధక విద్యార్థి, ఆంధ్రవిశ్వకళాపరిషత్.

సంచాలకులు
పండిత నేమాని రామజోగి సన్యాసిరావు - అష్టావధాని.


వేదిక
గురజాడ కళాక్షేత్రము, సిరిపురము, విశాఖపట్నము.

తేది 
24 - 12 - 2012 సోమవారము.


సమయము
సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు
 

అందరూ ఆహ్వానితులే

23, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 915 (ఏకాదశి శివుని పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఏకాదశి శివుని పూజకే తగు నెపుడున్.

పద్య రచన - 199

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22, డిసెంబర్ 2012, శనివారం

త్రిశత్యక్షర సంక్షేప రామాయణము

                      సోపాన దండకము

రామ!
భూమీశ!
కౌసల్యజా!
సద్గుణస్తోమ!
కారుణ్యవారాశి!
ధర్మప్రభాభాసురా!
తాటక ప్రాణసంహార!
గాధేయ యజ్ఞావనోత్సాహ!
మౌనీంద్ర సంస్తుత్య వీర్యోన్నతా!
ధారుణీనందినీ మానసారామ!
దేవేంద్ర ముఖ్యామర స్తుత్య చారిత్ర!
కళ్యాణ శోభాన్వితానంద రూపోజ్వలా!
పైతృకాజ్ఞా ప్రకారాంచిత త్యక్తసామ్రాజ్య!
సోర్వీసుతా లక్ష్మణారణ్య సంవాస సంప్రీత!
ఘోరాటవీప్రాంత వాసర్షి బృందావనానందితా!
క్రూర దైత్యాంగనా దుష్ట కామార్తి విధ్వంసనోత్సాహ!
మాయామృగాకార మారీచ ఘోరాసుర ప్రాణసంహార!
ధాత్రీతనూజా వియోగాతి దుఃఖాగ్ని సంతప్త హృన్మందిరా!
అంజనాపుత్ర సంశుద్ధ వాగ్భూషాణానీక సంశోభితాత్మాబ్జ!
వాతాత్మసంజాత రంహత్సమానీత భూమీసుతా క్షేమ సందేశ!
సంగ్రామ రంగస్థ లంకాధినాథాది ఘోరాసురానీక సంహారకా!
దేవతానీక దిక్పాల గంధర్వ యక్షోరగవ్రాత సంస్తుత్య సత్కీర్తి!
విశ్వసర్గాది నాశాంతలీలా వినోదాభిరామా! నమస్తే నమస్తే నమః 


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం - 914 (రాతిరి తూర్పుకొండలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాతిరి తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్.

పద్య రచన - 198

1                                     2
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 913 (ఓరుగల్లులోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఓరుగల్లులోన నుండరాదు.

పద్య రచన - 197

నేటినుండి మూడు రోజులు వరంగల్‌లో ‘కాకతీయ ఉత్సవాలు’
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, డిసెంబర్ 2012, గురువారం

సమస్యా పూరణం - 912 (హనుమత్పుత్రుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హనుమత్పుత్రుఁడు వివాహ మాడె హిడింబిన్.

పద్య రచన - 196

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, డిసెంబర్ 2012, బుధవారం

శ్రీరామ సుప్రభాతము

శ్రీరామ సుప్రభాతము

సరసిజేక్షణా! రామ! జ్ఞానసాగరా!
పరమపూరుషా! రామ! భక్తపాలకా!
సరసవాఙ్మయా! రామ! జానకీప్రియా!
సురవరస్తుతా! రామ! సుప్రభాతమౌ!


త్రిజగదీశ్వరా! రామ! దివ్యవిగ్రహా!
విజయభూషణా! రామ! విక్రమోన్నతా!
అజ ముఖార్చితా! రామ! యజ్ఞరక్షకా!
సుజనబాంధవా! రామ! సుప్రభాతమౌ!


శుకవరస్తుతా! రామ! సూర్యవంశజా!
సకలయోగదా! రామ! సర్వదర్శనా!
అకలుషాత్మకా! రామ! హర్షవర్ధనా!
సుకృతవైభవా! రామ! సుప్రభాతమౌ!


లలిత భావనా! రామ! రాజశేఖరా!
కలితవైభవా! రామ! జ్ఞానభాసురా!
అలఘుదర్శనా! రామ! ఆగమస్తుతా!
సులభసిద్ధిదా! రామ! సుప్రభాతమౌ!


కమలలోచనా! రామ! కర్మమోచనా!
సమరభీకరా! రామ! శత్రుతాపనా!
అమరరక్షకా! రామ! ఆర్తినాశకా!
సుముఖశోభితా! రామ! సుప్రభాతమౌ!


త్రిభువనాధిపా! రామ! దీనబాంధవా!
శుభఫలప్రదా! రామ! సుస్మితాననా!
సుభుజభాసురా! రామ! శూరశేఖరా!
శుభగుణాకరా! రామ! సుప్రభాతమౌ!


జగదభిష్ఠుతా! రామ! సాధుసేవితా!
సుగతిదాయకా! రామ! సూరిసన్నుతా!
నిగమవందితా! రామ! నిత్యవైభవా!
సుగుణభూషణా! రామ! సుప్రభాతమౌ!


ఘనయశోధనా! రామ! కామితార్థదా!
మునిజనావనా! రామ! పూరుషాగ్రణీ!
దనుజనాశకా! రామ! ధర్మతత్పరా!
సునయనాంబుజా! రామ! సుప్రభాతమౌ!


పండిత రామజోగి సన్యాసిరావు గారి
‘శ్రీమదధ్యాత్మరామాయణము’ నుండి

సమస్యా పూరణం - 911 (మువ్వలు గువ్వలై మొలచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మువ్వలు గువ్వలై మొలచె మోదము మోహన రాగ మయ్యెడిన్.
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 195

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 910 (సంతానము లేని వారలకె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంతానము లేని వారలకె తప్పక కల్గును సద్గతుల్ సఖా!

పద్య రచన - 194

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 909 (శవ సాన్నిధ్యమ్ము మనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శవ సాన్నిధ్యమ్ము మనకు సౌఖ్యముఁ గూర్చున్.

పద్య రచన - 193

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 908 (పోరు సేయలేఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పోరు సేయలేఁడు పోటుకాఁడు.

పద్య రచన - 192

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 907 (రాతికి మన్మథుఁడు పుట్టి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాతికి మన్మథుఁడు పుట్టి రతిఁ బెండ్లాడెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 191

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 906 (తమ్ముఁడ రమ్మనెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తమ్ముఁడ రమ్మనెన్ నగుచుఁ దామరసాక్షి మనోజకేళికిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 190

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, డిసెంబర్ 2012, గురువారం

బాపురే! తెలుగు

బాపురే! తెలుగు
భండారు శ్రీనివాసరావు గారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన క్రింది విషయాన్ని పోస్ట్ చేసారు.

AN AMAZING SENTENCE IN ENGLISH
Remarkable indeed ! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness."

పై వాక్యంలో మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవయ్యవ పదం ఇరవై అక్షరాలతో ఉన్నాయి.

దీనికి ప్రతిగా ఏల్చూరి మురళీధరరావు గారు ఫేస్‌బుక్‌లో వ్రాసిన తెలుగు వాక్యం.  “మిత్రవినోదంకరణగా మీకు విన్నవిస్తున్నాను; మేధావద్విశిష్టతకు కాదు ...” అని కూడా ప్రకటించారు.

“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!పై వాక్యంలో 26 పదాలున్నాయి. మొదటి పదం ఒక అక్షరం, రెండవ పదం రెండక్షరాలు, మూడవ పదం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ పదం ఇరవైయారు అక్షరాలతో ఉన్నాయి.

1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

ఫేస్‌బుక్‌లో కనిపించిన దీనిని అనుమతి లేకుండా బ్లాగులో ప్రకటించినందుకు మన్నించమని వారికి విన్నపం. భండారు శ్రీనివాస రావు గారికి, ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదములు.

సమస్యా పూరణం - 905 (పిల్లవానితోఁ బోరాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పిల్లవానితోఁ బోరాడి భీముఁ డోడె.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదములు.

పద్య రచన - 189

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 904 (నక్రంబుల్ జలగల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 188

కాకినాడ కాజాలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, డిసెంబర్ 2012, మంగళవారం

సమస్యా పూరణం - 903 (రాముఁడు క్రూరాత్ముఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముఁడు క్రూరాత్ముఁడు గద రావణుఁ జంపెన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 187

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, డిసెంబర్ 2012, సోమవారం

సమస్యా పూరణం - 902 (శివనామము మనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శివనామము మనకుఁ గలుగఁజేయు నిడుములన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 186

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 901 (సద్గుణోపేతుఁడఁట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సద్గుణోపేతుఁడఁట తిక్క శంకరయ్య.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు

పద్య రచన - 185

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 900 (ప్రశ్నకు ప్రశ్నయె జవాబు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ప్రశ్నకు ప్రశ్నయె జవాబు భామిని పలికెన్.
(ఆశావాది ప్రకాశరావు గారు అవధానంలో ఎదుర్కొన్న సమస్య)
ఈ సమస్యను సూచించిన చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదములు.

పద్య రచన - 184

మేఘ సందేశం 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7, డిసెంబర్ 2012, శుక్రవారం

సమస్యా పూరణం - 899 (కారుపై దాశరథులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారుపై దాశరథులు లంకకు నరిగిరి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 183

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

6, డిసెంబర్ 2012, గురువారం

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రము

వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్|
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయమహమ్||


వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్|
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయమమ్||


వందే వల్లీసహితం
వందే కరుణాకరం శుభప్రద మూర్తిమ్|
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయమహమ్||


వందే వీరవరేణ్యం
వందే వందారు భక్తవర సురభూజమ్|
వందే భవ భయహారిం
వందే గణపానుజం శివాతనయమహమ్||


వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభావిభాసుర మమలమ్|
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయమహమ్||


వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్|
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయమహమ్||


వందే సుందరరూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్|
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయమహమ్||


వందే భవ్యచరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్|
వందే పరమపవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయమహమ్||


తారకు సంహరించుటకు ద్ర్యక్షకుమారుడవై జనించి నీ
వారు దినాల ప్రాయమున నాహవరంగమునందు శత్రు సం
హారమొనర్చినాడవు కదా! బళిరా! అరి వీర భీకరా!
ఆరుమొగాలసామి! రిపు లార్వుర గూల్చుము నా మనమ్ములో.


భవసుత వాసమ! పళనీ!
వివిధైశ్వర్యముల నిధిగ వెలుగొందు గిరీ!
ప్రవిమలమతి నిను గాంచిన
భవ భయహర మగును పరమ పావన చరితా!


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం - 898 (గోతులను ద్రవ్వువారలే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గోతులను ద్రవ్వువారలే గొప్పవారు.

పద్య రచన - 182

పళని మల
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, డిసెంబర్ 2012, బుధవారం

సమస్యా పూరణం - 897 (భాగ్య నగరాన దిరుగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భాగ్య నగరాన దిరుగ వైరాగ్య మొదవు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 181

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీ లక్ష్మీ స్తవము

శ్రీ లక్ష్మీ స్తవము
రచన
పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు

ఓం నమామి శుభయోగ దాయినీం
ఐం నమామి విజయాం జయప్రదామ్|
హ్రీం నమామి సురబృంద సేవితాం
శ్రీం నమామి సరసీరుహాలయామ్||


జయ జయ! వేద సంస్తుత! ప్రసన్నముఖాంబురుహా! శుభాస్పదా!
జయ జయ! లోకమాత! సురసన్నుత! విష్ణు హృదబ్జవాసినీ!
జయ జయ! శీతలాంశు సహజాత! సుధాంబుధి కన్యకా! రమా!
జయ జయ! ఇందిరా జనని! సర్వ సుఖప్రద! శాంతభూషణా!


శ్రీవిష్ణు హృత్కమల వాసిని! విశ్వమాతా!
శ్రీవాసుదేవ కరుణామృత పానలోలా!
దేవేశి! భక్తవరదా! త్రిదశప్రపూజ్యా!
దేవీ! శుభేక్షణ! ప్రమోదిని! నిన్ను గొల్తున్.


నీ వీక్షణల్ శుభదముల్ నిగమాంత వేద్యా!
వేవెల్గులన్ జగములన్ విలసిల్లజేయున్
నా విన్నపమ్ము వినుమా నను బ్రోవుమమ్మా!
దీవింపుమా శుభమతీ! దివిజప్రపూజ్యా!


ఆనందరూప కలితా! హరిణీ! పురాణీ!
జ్ఞానార్ణవాన్వయ మణీ! సదయాంతరంగా!
దీనార్తి నాశిని! క్షమాది గుణప్రపూర్ణా!
ధ్యానింతు నీదు పదపద్మములన్ మహేశీ!


కమలా! కమలదళాక్షీ!
కమలాసన ముఖ్య దేవ గణ సద్వంద్యా!
కమలాక్ష హృదయవాసిని!
కమలాలయ నీదు చరణ కమలము గొల్తున్


పరితోషమ్మును గూర్చుచు
హరి కరుణామృతము నొంది యనవరతమ్మున్
సిరులు గురియు నీ చూడ్కులు
వరలక్ష్మీ దేవి! మాకు వరదము లగుతన్


త్రిభువన పాలకుడగు శ్రీ
విభునికి పులకలను గొలుపు ప్రేమమయములౌ
శుభవీక్షణములు సంపద్
విభవ ప్రదములగు గాక విమలా! మాకున్.


శ్రీ విభు పాదములొత్తుచు
సేవాభాగ్యమ్ము వలన చెలువొందెడు శ్రీ
దేవీ! మా విన్నపమున
కీవే సంసిద్ధి శ్రీమహేశీ! మాతా!


నీ ముఖమ్ము నుండి ప్రేమతో వెలువడు
చుండు మందహాస సుమము లెపుడు
మమ్ము బ్రోచు గాక మంగళ దేవతా!
పాలకడలి పట్టి! శ్రీలతాంగి!


గాన మొనరింతు నీ దివ్య గాధ లెపుడు
పాన మొనరింతు నీ కృపా పాయసమ్ము
ధ్యాన మొనరింతు నీదు తత్త్వ ప్రశస్తి
దీన జన పోషిణీ నమస్తే శుభాంగి!


సేవింతు నీదు పదముల్ శ్రితపారిజాతా!
భావింతు నీదు గుణ వైభవముల్ కృపాబ్ధీ!
కావింతు నీ భజనముల్ కమలాయతాక్షీ!
దీవింపుమా నను రమా! త్రిజగత్ ప్రపూజ్యా!


శ్రీమహాలక్ష్మి! వరలక్ష్మి! సిద్ధలక్ష్మి!
మోక్షలక్ష్మి! విద్యాలక్ష్మి! ముఖ్య వివిధ
నామరూప సంశోభితా! ప్రేమ హృదయ!
నీ కటాక్షంబు మాకగు నిత్య రక్ష!


వందే హిరణ్మయీం లక్ష్మీం
వందే విష్ణు మనోహరీమ్|
వందే వందారు మందారం
వందే చంద్ర సహోదరీమ్||


వందే సంపత్ప్రదాం దేవీం
వందే దారిద్ర్య నాశినీమ్|
వందే సకల లోకేశీం
వందే మంగళ దేవతామ్||


((శ్రీ చింతా రామకృష్ణారావు గారి ‘ఆంధ్రామృతం’ బ్లాగునుండి ధన్యవాదాలతో)

సమస్యా పూరణం - 896 (దురద కందకు లేదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దురద కందకు లేదు కత్తులకు హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 180

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, డిసెంబర్ 2012, సోమవారం

భారతీ కటాక్షము

భారతీ కటాక్ష లబ్ధ కవిత్వ యోగము

నిలిచితి భక్తి భావమున నేను శుభోదయ వేళ భారతిన్
దలచి నమస్కరించుచును తద్విభవమ్ములు మన్మనమ్ములో
నలరుచు దర్శనంబొసగ హర్ష పయోనిధిపైని దేలుచున్
గొలుచుచు మానసార్చన నిగూఢ విధానమునందు తత్కృపా
ఫలముగ నాదు డెందమున భావ పరంపర లుప్పతిల్లుచున్
గలగల పారు నేరువలె క్రన్నన నాదు ముఖమ్మునుండి వే
వెలుగుల జిమ్ముచున్ దగు వివేక వికాసముతోడ దివ్య సూ
క్తుల కనురూప వైభవముతో రసపుష్టిని సంతరించుచున్
వెలువడె స్తోత్రరాజములు పెక్కగు ఛందములందు పద్య రా
శులు మది వేడ్కగూర్చు పలు సొంపులు నింపులు నింపుచున్ బళా!
లలిత పదప్రశస్తి, సరళంబగు శైలి దనర్చు చంపకో
త్పలముల మాలికల్, ద్విపద, పాదప, స్రగ్ధర, సీస, కంద, గీ
తులు మొదలైన రీతులును తోటక, పృథ్వి, సుగంధు లొప్పుగా
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమిచెప్పుదున్?
మలచితి కావ్య రత్నముగ మంచి ముహూర్తమునన్ సరస్వతీ
లలిత పదాబ్జ సన్నిధి నలంకరణమ్ముగ జేసి మ్రొక్కితిన్
బులకితమయ్యె నా తనువు పొంగెను డెందము సంతసమ్ముతో
నలరె రసజ్ఞులౌ బుధులు, నాప్తులు గూర్చ ప్రశంస లొప్పుగా
దలచుచు మాటిమాటికినితల్లి యనుగ్రహ వైభవమ్ము ని
స్తుల బహు యోగదాయియని చొక్కి రచించితి దివ్య లీలలన్

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం - 895 (పలికిన పల్కు లన్నియును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?
(ఆకాశవాణి సౌజన్యంతో)

పద్య రచన - 179

అయ్యప్ప పడిపూజ 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 894 (గ్రహణకాలమ్మునఁ దినిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గ్రహణకాలమ్మునఁ దినినఁ గలుఁగు మేలు. 

పద్య రచన - 178

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 893 (కోడిం దినె కోమటయ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.
(ప్రసిద్ధమైన సమస్యే)

పద్య రచన - 177

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.