30, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4601

1-12-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలమును త్యజియించి కనె సుకవిగ యశమ్మున్”
(లేదా...)
“కలమును వీడి సత్కవిగఁ గౌరవమందెను లోకమందునన్”

29, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4600

30-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్ని నార్పవచ్చు నగ్నితోడ”
(లేదా...)
“అగ్నిని నగ్నితోడఁ దగ నార్పఁగవచ్చు నటంద్రు పండితుల్”

28, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4599

29-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జారులు పూజింతురు తొలిజామున శౌరిన్”
(లేదా...)
“జారులు సేయకున్నఁ దొలిజామున శౌరికిఁ బూజ లేదుగా”
(ఆముదాల మురళి గారి అష్టావధానంలో దండిభొట్ల దత్తాత్రేయశర్మ గారిచ్చిన సమస్య)

27, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4598

28-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టా లెక్కకయె రైలు పరువులు దీసెన్”
(లేదా...)
“పట్టాలెక్కక రైలు పర్వులిడె దుర్వారంపు వేగంబునన్”

26, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4597

27-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పేరు లేనివాఁడె పెద్దదిక్కు”
(లేదా...)
“పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్”

25, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4596

26-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని సత్కథను మొల్ల వ్రాయననెఁ గటా”
(లేదా...)
“రాముని గాథ నెన్నఁడును వ్రాయను పొమ్మనె మొల్ల యయ్యయో”

24, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4595

25-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిను నిను నిను నిన్ను నిన్ను నిను నిను నిన్నున్”
(లేదా...)
“నిను నిను నిన్ను నిన్ను నిను నిన్ను నినున్ నిను నిన్ను నిన్నునున్”
(పాత సమస్యే అనుకుంటాను)

23, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4594

24-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తులువల మేల్వొగడవలె యథోచితరీతిన్”
(లేదా...)
“తులువ లొనర్చు మేలును యథోచితరీతిని మెచ్చగా వలెన్”

(అఖండయతిని పట్టించుకోకండి)

22, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4593

23-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్”
(లేదా...)
“చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్”

21, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4592

22-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భాగవతమును పోతన వ్రాయలేదు"
(లేదా...)
"భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో"

20, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4591

21-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునిఁ బెండ్లాడెను బలరామానుజయే”
(లేదా...)
“రాముని కేలుఁ బట్టె బలరాముని సోదరి ధర్మపత్నియై”
(ఇచ్ఛాపురం అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

19, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4590

20-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము నిడి చల్లఁబఱచెఁ గన్నుల నెల్లన్”
(లేదా...)
“కారము వెట్టి యందఱకుఁ గన్నులు చల్లగఁ జేసి రెంతయున్”
(మరికల్ అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

18, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4589

19-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్”
(లేదా...)
“సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో”

17, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4588

18-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిల్లెను రావణుఁ డవనిజఁ గ్రీగంటఁ గనెన్”
(లేదా...)
“గిల్లెన్ సీతను రావణాసురుఁడు దాఁ గ్రీగంట వీక్షించుచున్”
(ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక నుండి)

16, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4587

17-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింహముపై వచ్చి శివుఁడు సీతను బట్టెన్”
(లేదా...)
“సింహముపైన వచ్చి వెస సీతనుఁ బట్టె శివుండు వింతగన్”
(తిరుపతి అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

15, నవంబర్ 2023, బుధవారం

దత్తపది - 205

16-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అసి - కసి - పసి - మసి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సూర్యోదయ వర్ణనను స్వేచ్ఛాఛందంలో చేయండి.

14, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4586

15-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వులందుఁ గనుము పుట్టె నగ్ని”
(లేదా...)
“పువ్వులలోనఁ దీవ్రముగఁ బుట్టిన దగ్ని యెదన్ రగుల్చుచున్”

13, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4585

14-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”
(లేదా...)
“భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?”
(ఆముదాల మురళి గారికి ధన్యవాదాలతో...)

12, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4584

13-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కిరణమ్మే దారి దప్పఁ గీలకము గదా”
(లేదా...)
“కిరణము మాత్రమే మనకుఁ గీలకమైనది దారి దప్పఁగన్”
(ఒంగోలు అష్టావధానంలో ఆముదాల మురళి గారు పూరించిన సమస్య)

11, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4583

12-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్”
(లేదా...)
“బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్”

10, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4582

11-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలుఁగుఁ గోరి యార్పుము దీపములను వేగ”
(లేదా...)
“వెలుఁగును గోరి దీపముల వేగమె యార్పుట యుక్తకార్యమౌ”

9, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4581

10-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పామును ముద్దాడి శిశువు పక్కున నవ్వెన్”
(లేదా...)
“పామును ముద్దు బెట్టుకొని పక్కున నవ్వెను బాలుఁ డత్తఱిన్”

8, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4580

9-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివనామముఁ దలఁపఁ దగున శ్రీశైలమునన్”
(లేదా...)
“శివనామస్మరణమ్ము సేయఁ దగునా శ్రీశైలమం దెప్పుడున్”

7, నవంబర్ 2023, మంగళవారం

దత్తపది - 205

8-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
క్రికెట్టు - టెన్నిసు - పోలో - హాకీ
పై పదాలను ప్రయోగిస్తూ
మహాభారతాంశంపై
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

6, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4579

7-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేకువ వినిపించు జోల వీనులవిందౌ”
(లేదా...)
“వేకువ జామునందు శ్రుతిపేయమగున్ గద జోలపాటయే”

5, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4578

6-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిష్టులకు ధూర్తచర్యయె శ్రేష్ఠమగును”
(లేదా...)
“చెల్లును ధూర్తవర్తనము శిష్టులకున్ సభలందు శ్రేష్ఠమై”

4, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4577

5-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధుఁడా కాఁడు గనఁడు వర్ణాంతరముల”
(లేదా...)
“అంధుఁడు గాఁడు వర్ణముల యంతర మింతయుఁ గానలేఁ డయో”

3, నవంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4576

4-11-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జలముఁ గ్రోలినంతఁ జచ్చు నదియె”
(లేదా...)
“జలమును గ్రోలినంతటనె చచ్చుఁ గదా యది దాని తత్త్వమౌ”

2, నవంబర్ 2023, గురువారం

సమస్య - 4575

3-11-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చదువే నశియింపఁజేయ శస్త్రములేలా?”
(లేదా...)
“చదువే మూలము సర్వనాశమునకై శస్త్రాదులింకేలొకో?”
(మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)

1, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4574

2-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్మశ్రువు గడు శోభఁ గూర్చెఁ జక్కని సతికిన్”
(లేదా...)
“శ్మశ్రువు  సుందరంబు గద జక్కని భామ కపోలమందునన్”
(నేమాని లక్ష్మీనరసింహ సోమయాజులు  గారికి ధన్యవాదాలతో...)