30, ఏప్రిల్ 2011, శనివారం

దత్త పది - 11 (కల)

కవి మిత్రులారా,
"కల" అనే పదాన్ని
"స్వప్నం" అనే అర్థంలో ప్రయోగించకుండా
నాలుగు పాదాలలో వేసి
త్రిజటాస్వప్న వృత్తాంతాన్ని
తెలుపుతూ మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 323 (చీర విడిచి వెడలెఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చీర విడిచి వెడలెఁ జిగురుఁబోఁడి.

28, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 322 (కప్పఁ దినెడి పాము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కప్పఁ దినెడి పాము కసవు మెసఁగె.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

27, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 321 (ఆవకాయ రుచుల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఆవకాయ రుచుల నతివ రోసె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 320 (బాబాయే భార్యతోడ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బాబాయే భార్యతోడ భజనకు వెడలెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

25, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 319 (మరణ మందినవాఁడె)

కవి మిత్రులారా,
ఎందరికో ఆరాధ్యదైవం, ఆధ్యాత్మిక గురువు,
మానవసేవే మాధవసేవ అంటూ ఎన్నో సమాజహితకార్యాలు చేసిన
భగవాన్ శ్రీ సత్యసాయి
శివైక్యం చెందడం బాధాకరం.
వారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మరణ మందినవాఁడె యమరుఁ డనఁ దగు.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యాపూరణం-318 (గడ్డముఁ జేసికొమ్మనుచు)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
గడ్డముఁ జేసికొ మ్మనుచుఁ
గాంతుఁడు భార్యకుఁ జెప్పె నవ్వుచున్.
ఈ సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 317 (పూలన్ దేవిని గొలిచిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పూలన్ దేవిని గొలిచినఁ బుణ్యము దక్కున్.

23, ఏప్రిల్ 2011, శనివారం

దత్త పది - 10 (అతి, గతి, చితి, పతి)

కవి మిత్రులారా,
అతి, గతి, చితి, పతి.
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో మహాభారతార్థంలో పద్యం వ్రాయండి.

316 సమస్యలు

కవి మిత్రులారా,
"శంకరాభరణం" బ్లాగులో ఇప్పటి వరకు ఇచ్చిన సమస్యలు316. సమస్యలను పూరిస్తూ, సమయోచిత వ్యాఖ్యలను, సూచనలను అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు. బ్లాగు ఇలాగే నిరాటకంగా కొనసాగడానికి మీ అందరి ప్రోత్సాహం, సలహాలను ఆశిస్తున్నాను.
ఇప్పటివరకు ఇచ్చిన సమస్యలు ఇవి. వీటిలో ఎన్నో సమస్యలను పంపిన, సూచించిన మిత్రులకు ధన్యవాదాలు.
316 సమస్యలు........
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే. (చాటువు)
అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు. (కోడీహళ్ళి మురళీ మోహన్)
అగ్నితోడ నగ్ని నార్పవచ్చు. (చంద్రశేఖర్)
అగ్నిశిఖల మీద నాడె శిశువు.
అత్తకు కన్ను గీటె నల యల్లుఁడు తాపముఁ దీర్పఁ గోరుచున్. (రవి)
అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్.
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.
అమెరికాలోన లభియించె నావకాయ.
అమ్మను పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.
అమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే.
అయ్యలకే గాని మీస మందరి కేలా? (కవి చౌడప్ప / నేదునూరి రాజేశ్వరి)
అర్జునునకు మిత్రుఁ డంగరాజు.
అర్ధరాత్రి సూరుఁ డస్తమించె.
అల్లా! కాపాడు మనుచు హరి వేడుకొనెన్.
అవధానం బొనరించి పామరుఁ డయెన్ ఖ్యాతుండు విద్వత్సభన్.
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు.
ఆంజనేయున కొప్పెను హస్తిముఖము
ఆడువారిని తన్నుటే న్యాయ మగును.
ఆదాయపు పన్నుఁ గట్టె నచ్చెరు వొందన్. (హరి దోర్నాల)
ఆలి నంపుచుంటి నేలుకొనుము.
ఇంద్రునకును మ్రొక్కె చంద్రధరుఁడు.
ఇడ్లీలే చాలు మనకు నితరము లేలా?
(రవి)
ఉత్పలమాల యందు యతి యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.(రామమోహన్ అందవోలు)
ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.
ఎలుకతోలు నుతికి తెలుపు చేసె.
ఏనుఁగులం దిను ఘనుఁ డతఁ డెలుకలు గొప్పా?
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
కంటిచూపుతోఁ జంపెడి ఘనులు కలరు.
కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు.('వరవిక్రయం' నాటకం / నేదునూరి రాజేశ్వరి)
కనుబొమలకు మీసములనఁ గన్నెఱ్ఱ గదా ! (చంద్రశేఖర్)
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.
కలమును త్యజియించి పొందెఁ గవి యను పేరున్. (ఊకదంపుడు)
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్.
కలహంసల తప్పు గాక కాకుల తప్పా? (చంద్రశేఖర్)
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము.
కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్. (ఆకాశవాణి)
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని. (అజ్ఞాత)
కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్.
కవివరుఁ గపితోడఁ బోల్చఁగా మెచ్చి రహో. (చంద్రశేఖర్)
కవులు నియమములకుఁ గట్టుపడరు.
కష్టములు దీరఁ గన్నీరుఁ గార్చినారు. (చంద్రశేఖర్)
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.
కాంక్ష లుండవు ప్రజలకుఁ గలి యుగమున. (చంద్రశేఖర్)
కాంతఁ జూచి మౌని కన్ను గొట్టె.
కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్.
కాంతాలోలుండె మోక్షగామి గనంగన్.
కాకర వేపుడె పసందు కంజదళాక్షీ! (రవి)
కాని విద్యలఁ జదువుట మానరాదు. (చంద్రశేఖర్)
కాపురముం గూల్చినట్టి ఘనునకు జేజే.
కారము గన్నులం బడినఁ గల్గును మోదము మానవాళికిన్.(మిస్సన్న)
కారమును త్యజించి ఘనత గనుము
కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్.
కార మొసఁగుఁ జల్లఁదనమ్ము కన్నుఁ గవకు.
కాశి కేఁగువాఁడు ఖలుఁడు గాఁడె. (మిస్సన్న)
కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి.
కృష్ణుఁ జంప నెంచి క్రీడి వెడలె.
కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!
కోకిలమ్మకు పుట్టెను కాకి యొకటి
కోడలు మామఁ జూచి కనుగొట్టెను రమ్మని సైగఁ జేయుచున్.(చంద్ర శేఖర్)
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.
ఖర పదములఁ బూజ సేయఁ గలుగున్ సుఖముల్.
ఖర పదముల మ్రొక్కినపుడె కలుగును సుఖముల్.
ఖర నామము సుతున కొసఁగెఁ గడు మోదమునన్. (గోలి హనుమచ్ఛాస్త్రి)
ఖరమె మన కొసంగు ఘనసుఖములు. (మందాకిని)
ఖర వదనుని కరము కన్య బట్టె. (రవి)
గణనాయకు గళమునందు గరళము నిండెన్.
గణపతిని వరించె కలువ భామ.
గర్భమునందున్న పులియె గాండ్రించె నయో!
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్
గానము వినినంత ఖరము గంధర్వుఁ డగున్. (వసంత్ కిశోర్)
గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్.(మిట్టపెల్లి సాంబయ్య)
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.
గొడు గెందుకు కుంభవృష్టి గురిసెడి వేళన్.
గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్.
చందమామఁ గన నసహ్య మయ్యె. (చంద్రశేఖర్)
చందమామను ముద్దాడసాగె చీమ. (రవి)
చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ!
చంపకమాల లేల? కడుఁ జక్కని యుత్పలమాల లుండఁగన్.(మిస్సన్న)
చచ్చి నంతనె చేఁతురు సంబరములు. (ఊకదంపుడు)
చదువు కొండెక్కినది కళాశాలలందు.
చదువు రానట్టి వారె విజ్ఞానఖనులు. (చంద్రశేఖర్)
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.
చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్. (చంద్రశేఖర్)
చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్. (ఊకదంపుడు)
చీమ తుమ్మెను బెదరెను సింహగణము.
చీర గట్టెను పురుషుండు సిగ్గుపడక.
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్.(అబ్బూరి రామకృష్ణారావు / రాజేశ్వరి నేదునూరి)
చెడు గుణములతోడ శిష్టుఁ డలరె.
చెలువుగ రామలక్ష్మణులు సీతకుఁ దమ్ములు శంభుఁ డన్నయున్.
చెల్లి యని పతి పిలువఁగా చెలియ మురిసె.
చేయవలయు గురువు శిష్యపూజ. (కోడీహళ్ళి మురళీ మోహన్)
చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్. (అజ్ఞాత)
జార చోరులఁ గీర్తించువారె ఘనులు. (చంద్రశేఖర్)
జారులు పూజ సేయఁ గని సాధుజనుల్ పులకించి రెల్లరున్. (చంద్రశేఖర్)
జ్వరపీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా! (చంద్రశేఖర్)
టంట టంట టంట టంట టంట.
టీవీ లుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్.
(ఆకాశవాణి / మిస్సన్న)
తమ్మునికి నన్న వరుసకుఁ దమ్ముఁ డయ్యె. (వసంత్ కిశోర్)
తలలు వంచి గగనతలముఁ గనుఁడు. (గోలి హనుమచ్ఛాస్త్రి)
తల లైదు కరంబు లారు తను వది యొకటే!
తల్లి తల్లి మగఁడు తాత క్యాడు
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.
తల్లిని దండించువాఁడు ధన్యుఁడు గదరా! (మిస్సన్న)
తాళి గట్టినవాఁడె నీ తండ్రి యగును. (అందవోలు విద్యాసాగర్)
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.
తిరుమలేశునిఁ దిట్టిన సిరులు గలుగు.
తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్. (మందాకిని)
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా? (కోడీహళ్ళి మురళీమోహన్)
దానవులం గొలుచువాఁడు దామోదరుఁడే.
దాని మానుప భువి నౌషధమ్ము గలదె? (చంద్రశేఖర్)
దారి తప్పువాఁడు ధర్మవిదుఁడు.
దిక్కు లేనివాఁడు దినకరుండు.
దున్న పాలు పితికె సన్నుతాంగి.
దున్న హరినిఁ జూచి సన్నుతించె. (కోడీహళ్ళి మురళీ మోహన్)
దైవ మున్నదె సుతునకు తల్లికంటె.
దోమ కేమి తెలుసు రామభక్తి?
ధనమె గొప్ప మంచితనము కంటె.
ధనమె లక్ష్య మగును తాపసులకు.
ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె.
ధూమశకట మెక్కి రాముఁ డేగె.
నక్కకు జనియించె కుక్క యొకటి.
ననన ననన నన్ను నినిని నిన్ను.
నను నుతియించెడి జనులకు నవనిధు లబ్బున్. (అజ్ఞాత)
నరసింహుని పూజ చేసె నరకాసురుఁడే.
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె.
నవమి నాఁడు వచ్చె నాగ చవితి.
నవరాత్ర్యుత్సవము లమరె నాలుగు దినముల్.
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు. (చంద్రశేఖర్)
నాకు మోదమ్ముఁ గూర్చె సునామి యిపుడు.
నా తలపైఁ బాదము లిడి నర్తింపఁ దగున్. (మందాకిని)
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!
నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ. (అజ్ఞాత)
నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు. (చంద్రశేఖర్)
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.
నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను.
నీటిలోనఁ బుట్టె నిప్పు గనుఁడు. (అందవోలు విద్యాసాగర్)
నూతన సంవత్సరమున నూటికి నూఱే.
నెలవంకన్ జూచి నవ్వ నేరము సుమ్మీ.
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్. (హరి దోర్నాల)
పంచ పాండవు లన పదుగురు కద!
పండుగ దినమందు పాత మగఁడె!
పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్. (రవి)
పగటి పూట చంద్రునిఁ గనె పద్మనయన.
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.
పచ్చనైన చెట్టు భగ్గు మనెను.
పచ్చి మాంసమ్ముఁ దినువాఁడు బ్రాహ్మణుండు.
పతికి నమస్కరించగనె ఫక్కున నవ్విరి పుత్రు లందఱున్.(గోలి హనుమచ్ఛాస్త్రి)
పతిని హత మొనర్చు సతియె సాధ్వి.
పదుగు రాడు మాట పాప మగును.(మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం)
పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁ డగున్.
పరుని పైన సాధ్వి మరులు గొనెను.
పసిబాలుడు మద్య మడిగె పాలొల్ల ననెన్.(మిట్టపెల్లి సాంబయ్య)
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.
పామరుఁడే కవిగ మారి ప్రస్తుతు లందెన్.
పామునకుఁ బాలు వోసిన ఫలిత మిదియె.
పార్లమెంటుఁ జొచ్చె పాములెన్నొ.
పాల వలన జనులు పతితులైరి.
పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్.
పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె. (చంద్రశేఖర్)
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె. (అజ్ఞాత)
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే. (ఊకదంపుడు)
పుట్టినప్పుడే లిఖియించు గిట్టు మనుచు.('వరవిక్రయం' నాటకం / నేదునూరి రాజేశ్వరి)
పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని.
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె.
పువ్వులు రాళ్ళగును, రాళ్ళు పూలుగ మారున్.
పుస్తకం బదేల హస్తమందు?
పెండ్లి సేయఁదగును ప్రేతమునకు. (మిస్సన్న)
పెద్దపులిని చంపె పిరికివాఁడు.
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.
పొగ త్రాగుమటంచు లోక పూజ్యుండయ్యెన్.
పొట్టివాఁడె కాని గట్టివాఁడు.
పోలీసును కలిసె దొంగ పొలిమేర కడన్. (మిట్టపెల్లి సాంబయ్య)
పోలేరమ్మను నుతింప ముప్పు గలుఁగురా.
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను.
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
ప్లేటు మీల్సు నడిగె ఫ్లైటులోన.
ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.
ఫాలనేత్రుండు మరునకు ప్రాణసఖుఁడు.
బమ్మకైన తిరుగు రిమ్మ తెగులు. (నేదునూరి రాజేశ్వరి)
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
బస్సు నీటఁ దేలె పడవ వోలె.
బారును సేవించి మంచి బాటను బట్టెన్. (చంద్రశేఖర్)
బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.(గోలి హనుమచ్ఛాస్త్రి)
బావా రమ్మని పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి రాధాత్మజున్.
బాసు భళి యటంచు ప్రణతుఁ డయ్యె.
బైబులుతో పాటు చదివె భగవద్గీతన్.
బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.
బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్.
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
భరతుఁ డెదిరించి రాముని భాగ మడిగె. (వంగూరు శ్యామసుందర్)
భల్లూకము చదువుకొనఁగ బడిలోఁ జేరెన్.
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు. (గోలి హనుమచ్ఛాస్త్రి)
భానుఁ డస్తమించఁగ సుప్రభాత మయ్యె. (చంద్రశేఖర్)
భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.
భార్యకుఁ బ్రణమిల్లె భక్తిభావము గదురన్. (మిస్సన్న)
భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె.
భార్య లిద్దరు శ్రీరామభద్రునకును. (చంద్రశేఖర్)
భాస్కరుఁ డుదయించె పడమటి దెస.
భీముఁడు భీష్ముఁ జంపె నతి భీకర లీల జగమ్ము మెచ్చఁగన్. (గోలి హనుమచ్ఛాస్త్రి)
భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె.
భూతములకు మ్రొక్కెఁ బురహరుండు.
మంత్రపుష్ప మేల మద్యముండ.
మందు జనుల కెల్ల విందు గాదె! (టేకుమళ్ళ వెంకటప్పయ్య)
మందు త్రాగి పొందె మరణ మతఁడు.
మందు లనారోగ్య మొసఁగు మద్యమె మేలౌ.
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.
మగని మోసగించు మగువ సాధ్వి.
మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.
మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.
మదగజయానకున్ రవిక మాత్రము చాలదె, చీర యేటికిన్?
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.
మాఘ మందున స్నానమ్ము మరణ మొసఁగు. (మిస్సన్న)
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
మాధవుఁడు మాధవునితోడ మత్సరించె. (మందాకిని)
మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే.
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్.
ముండై యుండుట మేలు గాదె జగతిన్ ముత్తైదువల్ మెచ్చఁగన్. (ఫణి ప్రసన్న కుమార్)
మునికి క్రోధమ్ము భూషణ మ్మనుట నిజము.
మెల్ల కన్ను వలన మేలు గలిగె.
మూగ గొంతెత్తి పాడును రాగ మలర.
మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!
యతి విటుఁడు గాకపోవునే యతివ బిలువ. (చంద్రశేఖర్)
యమున కేల వస్త్ర మాభరణము?
యముని మహిషము యమహా యయినది.
రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
రంభ కేలెత్తి పిలువగా రాముఁ డేగె.
రతము ముగియకుండ రమణి లేచె.
రతికై సోదరిని వేగ రమ్మని పిలిచెన్. (మిస్సన్న)
రమ్ము చేయగలదు ప్రాణరక్ష.
రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.
రాతికి నాతిపైన ననురాగము గల్గుట నైజమే కదా!
రాతికి వందనము లిడ వరమ్ములు దక్కున్.
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్. (ఆకాశవాణి)
రామచరిత్రముఁ జదువఁగ రాదు కుమారా! (గోలి హనుమచ్ఛాస్త్రి)
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.
రాముఁడు ముదమున ఖురాను చదివె.
రాముఁ డొసఁగెను జానకిన్ రావణునకు.
రాముఁ డోడె గెలిచె రావణుండు.
రామునిఁ జంపి హర్షమున రాక్షసు లెల్లరు నాట్యమాడిరే.
రాముని వెంట రాముఁ గని రాముని సంఘము మోదమందఁగన్.(గుండు మధుసూదన్)
రావణుఁడు సీత మగఁడయి రక్ష సేయు.
రుద్రుని భజించువాఁడు దరిద్రుఁ డగును.
రెక్కలు గల చాప నెక్కె రేలంగి భళా!
రొయ్యల పులు సడిగె నయ్యవారు.
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్. (హరి దోర్నాల)
రౌడీలే పాలకు లగు రాజ్య మిదయ్యెన్.
లంగానెత్తి లతాంగి చెంగు మనుచున్ లంఘించె దైత్యేంద్రుపై.(చంద్ర శేఖర్)
లంచము మేయువారలె కళంకవిదూరులు నీతివర్తనుల్.(మిస్సన్న)

వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చు మనకు?
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు. (మందాకిని)
వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.
వరుఁడను నా కేల వధువు వల దనె నతఁడున్. (గోలి హనుమచ్ఛాస్త్రి)
వాజపేయిని శ్రీదేవి వలచి వచ్చె.
వాడిన పువ్వులే తగును వారిజనేత్రుని నిత్యపూజకున్.
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.
వాణీ పుత్రునకు నెలుక వాహన మయ్యెన్.
వాపు వాపె కాని బలుపు కాదు. (చంద్రశేఖర్)
విగ్రహముల పైన నాగ్రహమ్ము.
విద్య నేర్చినవాఁడె పో వింతపశువు. (వసంత్ కిశోర్)
వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్.
వినాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్.
వినువారికి చెప్పువాఁడు వెధవగఁ దోచున్.
విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.
వృద్ధ సౌందర్యమును జూడ ప్రేమ గలిగె. (చంద్రశేఖర్)
వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్. (రవి)
వెన్నెల గురియ నావిరుల్ వెడలె నయ్యొ! (చంద్రశేఖర్)
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే. (చంద్రశేఖర్)
వేదముఁ జదివిన పురుషుఁడు వెధవగ మారున్. (వసంత్ కిశోర్)
వేళ కాని వేళఁ బిలువఁ దగునె?
వేశ్య కప్పగించె వెలఁది పతిని.
శంకరుం డొసంగు సంకటములు. (మిస్సన్న)
శతమానం భవతి యనుచు శాపము నొసఁగెన్.
శవము లేచి వచ్చె సంతసమున
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె.
శిష్టుఁ డెట్లు పల్కు శివ శివ యని? (మిస్సన్న)
శునకమ్మైనట్టి హరియె శుభముల నొసఁగున్.
శ్రమమునందు మనకు శాంతి దొరకు.
శ్రీరామునిఁ జూచి సీత చీకొట్టెఁ గదా!
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్. (చంద్ర శేఖర్)
సంయమీంద్రుండు గోరెను సంగమమును.
సంసారిగ మారి యోగి సంతసమందెన్.
సతిఁ గోరినవాని కింట స్థానం బొసఁగెన్.
సతి సతిఁ గవయంగఁ బుత్రసంతతి గలిగెన్.
సత్యభామను పెండ్లాడె శంకరుండు.
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్. (చంద్ర శేఖర్)
సరస యతుల పొందు సౌఖ్య మిడును. (చంద్ర శేఖర్)
సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?
సారా త్రాగుమని చెప్పి సద్గురు వయ్యెన్.
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!
సింహమును జయించెను గ్రామసింహ మొకటి.
(సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్) (టేకుమళ్ళ వెంకటప్పయ్య)
సిగపువ్వే వాడిపోదు చిత్రము కాదే!
సిరి వలదనువాని కిలను చిక్కులె గాదా! (విద్యాసాగర్ అందవోలు)
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.
సీతా మానస చోరుఁ డెవ్వఁ డనినన్ శ్రీకృష్ణమూర్తే కదా!
సూర్యబింబ మమరె సుదతి నుదుట.
సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె.
సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గాచెన్.
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా.(మిస్సన్న)
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె.
స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్.
హంతకుఁడు దేవుఁడై పూజలందుకొనెను.
హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్.
హనుమంతుని పెండ్లి కెన్ని యాటంకములో?
హర హర శంకరా యనుచు నాలిని గౌఁగిటఁ జేర్చెఁ బ్రేమతో. (మిస్సన్న)
హరికి వాణియె భార్య మహాత్ము లెన్న. (చింతా రామకృష్ణారావు)
హరి యహల్యను మోహించి యాపదఁ గనె.
హరుఁడు ప్రహ్లాదుఁ గాచినాఁ డసురుఁ జంపి.
హరుఁడు మోదమలర సిరిని వలచె.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 293 (నీటిలోనఁ బుట్టె నిప్పు )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నీటిలోనఁ బుట్టె నిప్పు గనుఁడు.
సమస్యను సూచించిన అందవోలు విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.

21, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 292 (చందమామఁ గన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చందమామఁ గన నసహ్య మయ్యె.
సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 291 (పిట్ట పిట్ట పోరు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పిట్ట పిట్ట పోరు పిల్లి దీర్చె.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 290 (సంజీవనిఁ దెచ్చి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సంజీవనిఁ దెచ్చి యిచ్చి చంపగ సాగెన్.
సమస్యను సూచించిన చంద్ర శేఖర్ గారికి ధన్యవాదాలు.

18, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 289 (నారాయణ యనినవాఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నారాయణ యనినవాఁడు నవ్వుల పాలౌ.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

17, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (చైత్రపు శోభలం గన)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
చైత్రపు శోభలం గన న
సహ్యము గాదె రసజ్ఞ కోటికిన్.
సమస్యను సూచించిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 288 (కల్ల లాడువాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.
సమస్యను పంపిన అజ్ఞాత మిత్రునికి ధన్యవాదాలు.

16, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 287 (నిను నిను నిను నిన్ను నిన్ను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్.

15, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 286 (వదినను ముద్దడిగె మఱఁది)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వదినను ముద్దడిగె మఱఁది పదుగురు చూడన్.

14, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 285 (మగని మోసగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మగని మోసగించు మగువ సాధ్వి.

13, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 284 (గోమాంసముఁ దినెడివాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గోమాంసముఁ దినెడివాఁడె గురువన నొప్పున్.
(రామ రామ! శివ శివా! పాపము శమించుఁగాక!)

12, ఏప్రిల్ 2011, మంగళవారం

దత్త పది - 9 (విల్, పిల్, కిల్, మిల్)

అందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు
కవి మిత్రులారా,
విల్, పిల్, కిల్, మిల్
పై పదాలను ఉపయోగించి మీకు నచ్చిన ఛందస్సులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వర్ణించండి.

11, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 283 (పిండి తక్కువైనను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పిండి తక్కువైనను దోసె పెద్ద దయ్యె.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

10, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (లంచము మేయువారలె)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
లంచము మేయువారలె క
ళంకవిదూరులు నీతివర్తనుల్.
ఈ సమస్యను సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 282 (చిన్నిల్లున్ననె కలుగు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చిన్నిల్లున్ననె కలుగు నశేషసుఖంబుల్.
ఈ సమస్యను పంపిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

9, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 281 (పరుని పైన సాధ్వి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పరుని పైన సాధ్వి మరులు గొనెను.

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 280 (అంధుఁ డానందమున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అంధుఁ డానందమున మెచ్చె నతివ సొగసు.
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి ధన్యవాదాలు.

7, ఏప్రిల్ 2011, గురువారం

సమస్యా పూరణం - 279 (నిద్ర బద్ధకము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
నిద్ర బద్ధకము లొసంగు నీకు సిరులు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

6, ఏప్రిల్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 278 (ఖరమె మన కొసంగు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖరమె మన కొసంగు ఘనసుఖములు.
ఈ సమస్యను సూచించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

5, ఏప్రిల్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 277 (ధాత వ్రాసిన వ్రాతలె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ధాత వ్రాసిన వ్రాతలె తప్పు లయ్యె.

4, ఏప్రిల్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 276 (ఖర నామాబ్దమున)

కవి మిత్రులారా,
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఖర నామాబ్దమున నొప్పు గాడిద పూజల్.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (కారము గన్నులం బడిన)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
కారము గన్నులం బడినఁ
గల్గును మోదము మానవాళికిన్.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 275 (పిల్లలు గలిగిరి సుమతికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పిల్లలు గలిగిరి సుమతికి పెండ్లికి ముందే.
ఈ సమస్యను పంపిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

2, ఏప్రిల్ 2011, శనివారం

సమస్యా పూరణం - 274 (మకరము పట్టంగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మకరము పట్టంగ నాకు మరులు గలిగెరా.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 273 (కవులు నియమములకుఁ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవులు నియమములకుఁ గట్టుపడరు.