30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

దత్తపది - 186

1-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
'పాపి - తులువ - పలువ - పంద'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ధర్మరాజు సుగుణాలను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(ఈరోజు ఉదయమే 'ఎవ్వాని వాకిట నిభమదపంకంబు' పద్యం విన్నాను)

29, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4205

30-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నీటికిఁ బద్యమొకటె కారణమయ్యెన్”
(లేదా...)
“కాటుక కంటి నీటికిని గారణమయ్యెను బద్యమే సుమా”

28, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4204

29-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరఁపుఁ బదియౌ”
(లేదా...)
“తొమ్మిదినుండి యొక్కటినిఁ ద్రోయఁగఁ దాఁ బది యౌను జక్కఁగన్”

27, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4203

28-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా త్రాగక రచనను సాగింతు నెటుల్”
(లేదా...)
“సారా త్రాగక పద్యలేఖన మెటుల్ సాగింతుఁ గావ్యంబునన్”

26, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4202

27-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు దుష్టాత్మకుండు రక్షోవిభుఁడౌ”
(లేదా...)
“రాముఁడు రాక్షసప్రభువు రావణుఁడే పురుషోత్తముం డిలన్”

25, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4201

26-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్యోత్స్నల్ దిశలావరింప సూర్యోదయమౌ”
(లేదా...)
“జ్యోత్స్నల్ దిక్కుల నావరించె సుదతీ సూర్యోదయం బయ్యెడిన్”

24, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4200

25-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తోరణమ్ము సర్వానర్థ కారణమ్ము”
(లేదా...)
“తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ”

23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4199

24-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాయలను మించు హీనుఁడౌ రాజు లేఁడు”
(లేదా...)
“రాయల మించు హీనుఁడగు రాజు ధరాతలమందు లేఁడు పో”

22, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4198

23-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రేపొనర్చు జనులనే పొగడెద”
(లేదా...)
“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”

21, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4197

22-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తుని దర్శించెదను నాదు దుఃఖము దొలఁగన్”
(లేదా...)
“తుని దర్శింతును జిక్కులన్నియు విడన్ దుఃఖమ్ము దూరమ్ము గాన్”

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4196

21-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోకలితోడ గిరిధరుని రుక్మిణి మోదెన్”
(లేదా...)
“రోకలితోడ మాధవుని రుక్మిణి మోదెను సత్య మెచ్చఁగన్”

19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4195

20-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”
(లేదా...)
“వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్”

18, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4194

19-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్”
(లేదా...)
“కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్”

17, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4193

18-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రైలు పట్టాలపై నిద్ర మేలొసంగు”
(లేదా...)
“రైల్పట్టాలఁ బరుండ మేల్గలుగు నార్యప్రోక్త సత్యంబిదే”

16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4192

17-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మానవులకుఁ దల్లినుడి యమంగళకరమౌ”
(లేదా...)
“మానవజాతి కంతటి కమంగళమూలము మాతృభాషయే”

15, సెప్టెంబర్ 2022, గురువారం

నిషిద్ధాక్షరి - 52

16-9-2022 (శుక్రవారం)
రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుని హెచ్చరించడాన్ని
స్వేచ్ఛాఛందంలో వ్రాయండి.
నిషిద్ధాక్షరాలు...
మొదటి పాదంలో కవర్గాక్షరాలు
రెండవ పాదంలో చవర్గాక్షరాలు
మూడవ పాదంలో తవర్గాక్షరాలు
నాల్గవ పాదంలో పవర్గాక్షరాలు.

14, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4191

15-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమ్మే తీయనయ్యెఁ గద భక్తులకున్”
(లేదా...)
“కారము తీయనై సుఖముగా మురిపించెను భక్తబృందమున్”

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4190

14-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల్లుపాకలోఁ జొచ్చెను గవివరుండు”
(లేదా...)
“కవివరుఁ డెల్లవారు గనఁగా వడిఁ జొచ్చెను గల్లుపాకలో”

12, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4189

13-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము”
(లేదా...)
“భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్”

11, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4188

12-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాసన విడి చంపకమ్మె వాసిం గాంచెన్”
(లేదా...)
“వాసన లేని చంపకమె వాసిఁ గనెన్ గవిలోకమందునన్”

10, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4187

11-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలములన్నింటను గలికాలము మేలౌ”
(లేదా...)
“కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్”

9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4186

10-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవలీలగ నెత్తెను శిశు వశ్వముఁ గనుమా”
(లేదా...)
“అవలీలన్ శిశు వెత్తెఁ జూడు మదె యా యశ్వంబు నుత్సాహియై”

8, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4185

9-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతిభావాబ్ధిని మునిఁగితె ప్రాజ్ఞ వధానీ”
(లేదా...)
“రతిభావాంబుధి నోలలాడితె కవీ రమ్యావధానంబునన్”

7, సెప్టెంబర్ 2022, బుధవారం

సమస్య - 4211

8-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్”
(లేదా...)
“మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్”

దత్తపది - 186

8-9-2022 (గురువారం)
కవిమిత్రులారా,
'మైకు - డిజే - సాంగు - లేకు'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
గణేశ నిమజ్జనను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

6, సెప్టెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4210

7-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్”
(లేదా...)
“చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్”

సమస్య - 4184

7-9-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్తికిఁ గారణము విషయముల రక్తి గదా”
(లేదా...)
“ముక్తినిఁ బొందఁగన్ విషయమోహమె కారణమౌను సంయమీ”

5, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4183

6-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పను గని పన్నగంబు వాఱె”
(లేదా...)
“కప్పను గాంచి పన్నగము కాతరభావము నంది పాఱెడిన్”

4, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4182

5-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నేఁ గుబుద్ధిని నీచుఁడ నింద్యుఁడఁ గద”
(లేదా...)
“నేను గుబుద్ధినిన్ బరమనీచుఁడ నింద్యచరిత్రుఁడన్ గదా”

3, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4181

4-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నగధారి యనంగుఁ ద్రుంచి నాతినిఁ బ్రోచెన్”
(లేదా...)
“నగధరుఁ డంగజుం దునిమి నాతినిఁ బ్రోచె సురల్ నుతింపఁగన్”

మనవి

కవిమిత్రులకు నమస్కృతులు.
        కొద్ది రోజులుగా మాటిమాటికి జ్వరం వస్తూ పోతూ ఉండడం, శారీరకంగా బలహీనంగా ఉండడం జరుగుతూ ఉన్నది. మందులు వాడుతున్నాను.
దీనికి తోడుగా...
        'అనంతచ్ఛందం' వారి 2200 ఛందాలతో వందమంది కవుల పదివేల పద్యాల సంకలనం పరిష్కారం, డిటిపి చేస్తున్నాను.
        అంతేకాక ఆ మధ్య కాశికి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తక ప్రచురణ సంస్థ వారు "కాశికి వచ్చేవారిలో తెలుగువారే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు తెలుగులో కాశికి సంబంధిచిన పుస్తకం అడుగుతున్నారు. కనుక కాశీ ప్రాశస్త్యం, చరిత్ర, చూడవలసిన ప్రదేశాల వివరాలతో ఒక పుస్తకం వ్రాసి, డిటిపి చేసి పంపవలసిందిగా కోరినారు. ఆ పని కూడా కొనసాగుతున్నది.
        అందువల్ల ఏమాత్రం సమయం చిక్కడం లేదు. బ్లాగులో, సమూహంలో మిత్రుల పద్యాలపై స్పందించలేకపోతున్నాను.
        కనుక నన్ను మన్నించి కొద్ది రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను.

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4180

3-9-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తకు గళసూత్ర మలర భామిని గట్టెన్”
(లేదా...)
“భర్తకుఁ గంఠసూత్రమును భామిని గట్టె మనంబు రంజిలన్”

1, సెప్టెంబర్ 2022, గురువారం

సమస్య - 4179

2-9-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతి కనులు దిరిగి వ్రాలె భువిని”
(లేదా...)
“రాతికిఁ గండ్లు గిఱ్ఱుమనె వ్రాలె తనూలత భస్మశేషమై”