31, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1129 (మనము శాంతించు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
మనము శాంతించు నెన్నొ సమస్య లున్న.

పద్య రచన – 419 (మయసభ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“మయసభ”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

30, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1128 (లలిత కళాభిమానము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
లలిత కళాభిమానము హలాహల సన్నిభ మెల్లవారికిన్.

పద్య రచన – 418 (ఆధునిక మయసభ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ఆధునిక మయసభ”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

29, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1127 (పండుగనాఁ డేల నాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పండుగనాఁ డేల నాకు పాఁత మగఁ డనెన్.

పద్య రచన – 417 (జయాపజయములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“జయాపజయములు”

28, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1126 (కూఁతురె తల్లియై జనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

పద్య రచన – 416 (పంచాయతీ యెన్నికలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పంచాయతీ యెన్నికలు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు

27, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1125 (వృద్ధనారిని యువకుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వృద్ధనారిని యువకుఁడు పెండ్లియాడె.
ఈ సమస్యకు స్ఫూర్తి నిచ్చిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 415 (చేదోడు వాదోడు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“చేదోడు వాదోడు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు

26, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1124 (పాడు మనుజుఁ జూడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాడు మనుజుఁ జూడ వేడుక గద!
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 414 (పేదరాసి పెద్దమ్మ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పేదరాసి పెద్దమ్మ”

25, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1123 (కారు నలుపుపైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కారు నలుపుపైనఁ గలిగె ప్రేమ.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 413 (కరతాళ ధ్వనులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“కరతాళ ధ్వనులు”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

24, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1122 (వ్రతములతో వర్ధిలును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వ్రతములతో వర్ధిలును జరామరణమ్ముల్.

పద్య రచన – 412 (కాకి - కేకి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.....
“కాకి - కేకి”

23, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1121 (దారా రమ్మని పిల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దారా రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారఁగా!
(ఆకాశవాణి సౌజన్యంతో...)

పద్య రచన – 411 (వరద)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.....
“వరద”

22, జులై 2013, సోమవారం

గురుస్తుతి




గురుస్తుతి

 ఎవఁడు ప్రణవ స్వరూపుఁడై భువన భవన
సృష్టి సంస్థితి లయ కార్య శీలి యగునొ
యతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

ఆది మధ్యాంత రహితుడై వ్యాప్తిఁ జెంది
పంచ భూతాత్ముడై కాచుఁ బ్రకృతి నెవ్వఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

ఎవడు వాచామగోచరుండెవఁడు నిఖిల
తత్త్వ విజ్ఞాన సార నిధాన చిత్తుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

నిర్గుణుండు నిరాకార నిర్వికల్ప
నియమి యెవ్వఁడు నిగమాంత నిత్య పూజ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

చిన్మయానందుఁడెవఁడు విశేష బుద్ధి
కుశలుడెవ్వఁడు శ్రీ జగద్గురువరేణ్యుఁ
డతని సత్కృపా వీక్షా మహత్త్వ ఫలమె
శిష్య రేణువు ననుఁ దరిఁ జేర్చు గాత !

డా. విష్ణు నందన్

శివ తాండవము



శివ తాండవము

 శివ తాండవం పరమ శివ తాండవం
భూతనాయక మహాద్భుత తాండవం

పరమ శివ తాండవం గిరితనయ సంయుతం
సరస నటనాద్భుతం సకల భువనోత్సవం

హరహరా పురహరా భవహరా భయహరా
రిపుహరా స్మరహరా మఖహరా సుఖకర

ప్రణవమయ శోభితం ప్రమథగణ ఖేలనం
రుచిర గుణ వైభవం పరమశివ తాండవం

త్రిగుణ విభవాన్వితం త్రికరణ విరాజితం
త్రిణయన కళాద్భుతం త్రిదశవర సంస్తుతం

సతి లాస్య వైభవం మణివిభూషణ రవం
శ్రితజనోత్సవకరం ప్రతిపదం శ్రుతిహితం 

నలువయును భారతియు శ్రుతి లయలు కూర్పగా
అమరపతి చేయగా కలవేణుగానమ్ము

హరి మృదంగము మ్రోయ తద్ధిమిత తద్ధిమిత 
పరవశంబున ప్రకృతి పులకించి యలరింప

గిరిసుతా ధృతకరం శుభనటత్ పద యుగం
ఢమఢమడ్డమరుకం ధగ ధగ ద్ధిమకరం 

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు


సమస్యాపూరణం – 1120 (శరణు కోరెఁ గపోతము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శరణు కోరెఁ గపోతము చంపెను శిబి.
ఈ సమస్యను పంపిన తాటికొండ ఓంకార్ గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 410 (గురు పూర్ణిమ)

కవిమిత్రులారా,
గురుపూర్ణిమ పర్వదిన శుభాకాంక్షలు!
ఈనాటి పద్యరచనకు అంశము.....
“గురు పూర్ణిమ”

21, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1119 (మీసము లందమ్ము సతికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మీసము లందమ్ము సతికి మెట్టెలకంటెన్.
(మల్లాది లక్ష్మణకుమార్ గారి ‘బంతిపూలు’ బ్లాగునుండి ధన్యవాదాలతో...)

పద్య రచన – 409 (వానకాలఁపు చదువు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము.....
“వానకాలఁపు చదువు”

20, జులై 2013, శనివారం

కేశవ మానస పూజ





కేశవ మానస పూజ

సీ. శ్రీకేశవా! దేవ! శ్రీరమారమణీశ!

    ....నిగమాంతవేద్య! ధ్యానింతు నిన్ను

    నారాయణా! జగన్నాయకా! నీకిదే

    ....ఆవాహనమ్ము దేవాధిదేవ!

    మాధవా! మామక మానసాంబుజవాస!

    ....సింహాసనమ్మిదే చిన్నిధాన!

    గోవింద! లోకైక గురుదేవ! ఖగవాహ!

    ....పాద్యమ్ము నీకిదే పద్మనయన!

    విష్ణుదేవా! దైత్య విధ్వంసకా! చక్రి!

    ....అర్ఘ్యమియ్యదె కరుణాలవాల!

    మధుసూదనా! భక్తమందార! వైకుంఠ!

    ....ఆచమనీయ మియ్యదె ముకుంద!

    దేవా! త్రివిక్రమా! దేవతాగణ వంద్య!

    ....స్నానమ్ము నీకిదే జ్ఞానతేజ!

    వామనా! సురహితా! వాసవ వందితా!

    ....యజ్ఞోపవీత మియ్యదె రమేశ!

    శ్రీధరా! మురహరా! శ్రితలోక రక్షకా!

    ....చందనమ్మిదె మహానందసాంద్ర!

    శ్రీహృషీకేశ! రాశీభూత వాత్సల్య!

    ....ఆభరణమ్మిదే ఆదిదేవ!

    పద్మనాభా! ఫుల్ల పద్మదళేక్షణా!

    ....పుష్పార్చనమ్మిదే మోక్షదాత!

    దామోదరా! దైత్య దానవ నాశకా!

    ....ధూప మియ్యదె పరితోషపూర్ణ!

    సంకర్షణా! మౌనిజన హృదయారామ!

    ....దీపమ్ము నీకిదే త్రిభువనేశ!

    వాసుదేవా! విశ్వపాలన తత్పరా!

    ....నైవేద్య మిదె నీకు నాగశయన!

    ప్రద్యుమ్న! విశ్వరూపా! ధర్మతత్పరా!

    ....తాంబూలమిదె సదా ధ్యాననిరత!

    అనిరుద్ధ! వివిధ దివ్యాయుధధృతకరా!

    ....మంత్రపుష్పమ్మిదే మాహృదీశ!

    పురుషోత్తమా! జగద్గురువరా! సాదర

    ....వందనమ్ములు మహానందధామ!

    త్రిజగదీశా! అధోక్షజ! నీరదశ్యామ!

    ....పొనరింతు మానసపూజ నీకు

    నారసింహా! హిరణ్యకశిపసంహార!

    ....ప్రహ్లాద వరద! శోభాకరాంగ!

    అచ్యుతా! దేవబృందార్చిత పదపద్మ!

    ....నీ సేవలనొనర్తు నెమ్మనమున

    శ్రీజనార్దన! కృపాసింధు! నీ చరితమ్ము

    ....గానమ్ము నొనరింతు దీనపాల!

    దేవా! ఉపేంద్ర! రాజీవపత్రేక్షణా!

    ....వినుతింతు నీ మహావిభవములను

    హరి హరీ! మురహరీ! ఆదరమ్మేపార

    ....నుపచారములొనర్తు యోగివంద్య!

    శ్రీకృష్ణ! మమ్ము పాలింపుమా నింపుమా

    ....జ్ఞానతేజమ్ము నా మానసమున

ఆ.వె.

    అంతరంగ నిలయ! శాంతి సౌఖ్యప్రదా!

    నిన్ను గొలుచువారిని కృప గనుచు

    బాపి దుఃఖములను పరమపదమ్మిడు

    నాదిదేవ! నీకు నంజలింతు.


పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం – 1118 (కవికుల మెల్లఁ బల్కెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కవికుల మెల్లఁ బల్కెను శకారుని కంటెను జ్ఞాని లేఁ డిలన్.

పద్య రచన – 408

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1117 (భీష్ముఁ డంబను బెండ్లాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

పద్య రచన – 407 (తొలి ఏకాదశి)

కవిమిత్రులారా,
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
ఈరోజు పద్యరచనకు అంశము....
“తొలి ఏకాదశి”

18, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1116 (మానవులారా! భజనలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మానవులారా! భజనలు మానుట శుభమౌ.

పద్య రచన – 406 (పుష్పలావిక)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదాలతో)

17, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1115 (పుక్కిటం బట్టి యుమిసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పుక్కిటం బట్టి యుమిసె సముద్రజలము.

పద్య రచన – 405 (మాయల పకీరు)

కవిమిత్రులారా,
ఈరోజు పద్యరచనకు అంశము....
“మాయల పకీరు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

16, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1114 (దురదృష్టము వలన సిరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

పద్య రచన – 404

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1113 (రాముఁ డానంద మందె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

పద్య రచన – 403 (క్రొత్త కాపురము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“క్రొత్త కాపురము”
ఈ ఆంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

14, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1112 (గాడిద లెల్లఁ జేసినవి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గాడిద లెల్లఁ జేసినవి గానముఁ గర్ణరసాయనమ్ముగన్.

పద్య రచన – 402 (ఉపాయము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“ఉపాయము”

13, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1111 (నరకమున సుఖమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నరకమున సుఖమ్ము దొరకు నయ్య!

పద్య రచన – 401 (విదూషకుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“విదూషకుఁడు”
ఈ అంశాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1110 (కాంతాలోలుండె మోక్షగామి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.

పద్య రచన – 400 (ముసురు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....

“ముసురు”

11, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1109 (చచ్చినవాఁ డాగ్రహించి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చచ్చినవాఁ డాగ్రహించి శత్రువుఁ గూల్చెన్.

పద్య రచన – 399 (రథయాత్ర)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....

“రథయాత్ర”

10, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1108 (వట్టి రాకపోక లొనర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వట్టి రాకపోక లొనర్చువాఁడె భర్త.

పద్య రచన – 398 (నవల)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“నవల”

9, జులై 2013, మంగళవారం

శివప్రియ దండకము



శివప్రియ దండకము

శ్రీమన్మహాదేవదేవాయ తేనమః ప్రాలేయ శైలాత్మజేశాయ తేనమః | 
కైలాస లోకాధివాసాయ తేనమః  హృద్యాయ వేదాంత వేద్యాయ తేనమః || 

శ్రీదక్షిణామూర్తి రూపాయ తేనమః  త్ర్యక్షాయ లోకైక రక్షాయ తేనమః | 

సత్యాయ దేవేంద్ర వంద్యాయ తేనమః  నిత్యాయ విశ్వస్వరూపాయ తేనమః || 

రుద్రాయ సంపూర్ణ భద్రాయ తేనమః  నందీశ వాహాయ సాంబాయ తేనమః | 

నాగేంద్ర భూషాయ శర్వాయ తేనమః  శాంతాయ భీమాయ సోమాయ తేనమః || 

మృత్యుంజయాయ త్రినేత్రాయ తేనమః  ముక్తిప్రదాయ త్రినాథాయ తేనమః | 

విశ్వేశ్వరాయ ప్రసిద్ధాయ తేనమః  విజ్ఞాన సర్వస్వ సాంద్రాయ తేనమః || 

నారాణాప్తాయ మాన్యాయ తేనమః  వేదస్వరూపాయ ప్రాజ్ఞాయ తేనమః |

మన్మానసాబ్జాత వాసాయ తేనమః  మాంగళ్య తేజోనిధానాయ తేనమః || 


శుభాశీస్సులు.  ఒక దండకమును వ్రాయుదమనుకొని మొదలిడితిని.  కాని వేరొక ఛందస్సులో పద్యములు తయారయినవి.  త త త ర గణములు.  సంస్కృతములో కావున యతి ప్రాసలను పాటించలేదు.  ఈ నూతన ఛందస్సునకు "శివప్రియ దండకము" అను పేరిడి మీకు పంపుచున్నాను.  స్వస్తి!

పండిత నేమాని రామజోగి సన్యాసిరావు

సమస్యాపూరణం – 1107 (శరమున్ గని జింకపిల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

పద్య రచన – 397 (రాజమహేంద్రి)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“రాజమహేంద్రి”

8, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1106 (పెండ్ల మయ్యెను బార్వతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

పద్య రచన – 396 (కుశల ప్రశ్నలు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“కుశల ప్రశ్నలు”

7, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1105 (తేలును ముద్దులాడి చెలి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.
('శతావధాన ప్రబంధము' గ్రంథమునుండి)

పద్య రచన – 395 (ఛందోబద్ధ కవిత్వము)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“ఛందోబద్ధ కవిత్వము”

6, జులై 2013, శనివారం

సమస్యాపూరణం – 1104 (సౌహార్దముఁ జూపువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సౌహార్దముఁ జూపువాఁడె శత్రు వనఁ దగున్.

పద్య రచన – 394 (అత్త లేని కోడలు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“అత్త లేని కోడలు”

5, జులై 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1103 (భరతునిఁ జంపె రాఘవుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురకోటి మెచ్చఁగన్.
("అవధాన పద్మ సరోవరం" గ్రంథం నుండి)

పద్య రచన – 393 (విందు)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, జులై 2013, గురువారం

సమస్యాపూరణం – 1102 (బాట వీడి నడచువాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బాట వీడి నడచువాఁడె జ్ఞాని.

పద్య రచన – 392 (బెత్తము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“బెత్తము”

3, జులై 2013, బుధవారం

సమస్యాపూరణం – 1101 (పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చెఁ బుణ్యఫలముగన్.

పద్య రచన – 391 (భవబంధములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“భవబంధములు”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

2, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1100 (మోదమును గూర్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!

పద్య రచన – 390 (శకునములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“శకునములు”

1, జులై 2013, సోమవారం

సమస్యాపూరణం – 1099 (ఉవిదకు నుంగరమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్.

పద్య రచన – 389 (కన్నె కలలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కన్నె కలలు”