30, జూన్ 2016, గురువారం

సమస్య - 2075 (పతితులె పుణ్యజీవులని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పతితులె పుణ్యజీవులని వాదనఁ జేసెద రంగనామణుల్”
లేదా...
“పతితులె పుణ్యపురుషులని వాదింత్రు సతుల్”

29, జూన్ 2016, బుధవారం

సమస్య - 2074 (దయ్యమె భార్య యైనపుడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“దయ్యమె భార్య యైనపుడు దక్కును భర్తకు సర్వసౌఖ్యముల్”
లేదా...
“దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్”

28, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2073 (భైరవుఁ డిచ్చుచుండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భైరవుఁ డిచ్చుచుండు నశుభంబులు నమ్మిన భక్తకోటికిన్”
లేదా...
“భైరవుం డిచ్చు నశుభముల్ భక్తులకును”

పద్యరచన - 1226

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

27, జూన్ 2016, సోమవారం

సమస్య - 2072 (మద్దెల లెన్నియో...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మద్దెల లెన్నియో గగనమధ్యము నందున మ్రోగె శ్రావ్యతన్”
లేదా...
“మద్దెలలే మ్రోగె గగనమధ్యము నందున్”

పద్యరచన - 1225

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

26, జూన్ 2016, ఆదివారం

సమస్య - 2071 (శవసందర్శన మిచ్చు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“శవసందర్శన మిచ్చు పుణ్యముల సత్సంపత్తులన్ మిత్రమా!”  
లేదా...
“శవసందర్శనము పుణ్యసంపద లిచ్చున్”

పద్యరచన - 1224

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

25, జూన్ 2016, శనివారం

సమస్య - 2070 (పాలన్ వీడి ముదంబుతోడుత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పాలన్ వీడి ముదంబుతోడుత పయఃపానంబు సేయం దగున్”
లేదా...
“పాలను విడి చేయు క్షీరపానము మేలౌ”

24, జూన్ 2016, శుక్రవారం

సమస్య - 2069 (రాతినిఁ గాంచి కాంత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రాతినిఁ గాంచి కాంత యనురక్తినిఁ బొందె మనోజకేళికై”
లేదా...
“రాతినిఁ గని కాంత రక్తి నందె”

23, జూన్ 2016, గురువారం

సమస్య - 2068 (తరుణుల వాలుచూపులను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“తరుణుల వాలుచూపులను దాటఁగ ధాతకునైన శక్యమే” 
ఈసమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
లేదా...
“తరుణుల చూపులను దాట ధాతకు వశమే”

22, జూన్ 2016, బుధవారం

సమస్య - 2067 (శుని సంపంగి సుమాల...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“శుని సంపంగి సుమాల శోభలను మెచ్చున్ మేలు మేలంచుఁ దాన్”
లేదా...
“శునకము సంపంగిపూల శోభను మెచ్చున్”
ఈ సమస్యను సూచించిన రెండుచింతల రామకృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

21, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2066 (కరుణాసాగరుఁ డన్న నొప్పు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కరుణాసాగరుఁ డన్న నొప్పు దశదుష్కంఠుండు చిత్రంబుగన్” 
(ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు)
లేదా...
“కరుణాపాథోనిధి దశకంఠుం డనఁగన్”

20, జూన్ 2016, సోమవారం

సమస్య - 2065 (పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ జంపె సద్ద్విజుఁడు వేదమతమ్ముగ యజ్ఞవాటికన్”
(ఒకానొక అవధానంలో గరికిపాటివారు పూరించిన సమస్య)
లేదా...
“పిల్లిని సద్ద్విజుఁడు చంపె వేదోక్తముగన్”

19, జూన్ 2016, ఆదివారం

న్యస్తాక్షరి - 35 (రా-మ-దా-సు)

అంశము- భద్రాచల రాముఁడు
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా వరుసగా 
‘రా - మ - దా - సు’ ఉండాలి.

18, జూన్ 2016, శనివారం

ఆహ్వానం!


సమస్య - 2064 (అల్లుఁడ నయ్యెదన్...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“అల్లుఁడ నయ్యెదన్ సుతుఁడ నయ్యెద ప్రాణవిభుండ నయ్యెదన్”
లేదా...
“అల్లుఁడఁ బుత్రుండ మగఁడ నయ్యెద వరుసన్”

17, జూన్ 2016, శుక్రవారం

దత్తపది - 90 (తాత-మామ-బావ-మరది)

కవిమిత్రులారా,
తాత - మామ - బావ - మరది
పై పదాలను అన్యార్థంలో ఉపయోగించి వానదేవుని ఆహ్వానిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

16, జూన్ 2016, గురువారం

ఆహ్వానము!


సమస్య - 2063 (రావణుఁడున్ విభీషణుఁడు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రావణుఁడున్ విభీషణుఁడు రాముని పుత్రులు ధర్మవర్తనుల్”
లేదా...
“రావణ విభీషణులు రఘురాము సుతులు”
(మొన్న ఎడమకంటి శస్త్రచికిత్స (కాటరాక్ట్) విజయవంతమయింది. 
నాలుగైదు రోజులు కంటికి శ్రమ కలిగే పనులు చేయరాదన్నారు. 
రేపటినుండి సాధ్యమైనంత వరకు మీ పూరణలను సమీక్షిస్తాను)

15, జూన్ 2016, బుధవారం

నిషిద్ధాక్షరి - 33

కవిమిత్రులారా,
అంశం - కుచేల వృత్తాంతము.
నిషిద్ధాక్షరము - క (క, దాని గుణితములు, అది సంయుక్తమైన అక్షరములు)
ఛందస్సు - మీ ఇష్టము.

14, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2062 (పాశుపతమ్ము వేసి హరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“పాశుపతమ్ము వేసి హరి పార్థునిఁ జంపెను నిర్దయాత్ముఁడై”
లేదా
“పాశుపతము వేసి హరియె పార్థునిఁ జంపెన్”
(ఈరోజు నాకు కంటి శస్త్రచికిత్స. రెండు రోజులు బ్లాగును చూడలేనేమో? రేపటికి ‘నిషిద్ధాక్షరి’ని షెడ్యూల్ చేశాను. దయచేసి పరస్పర గుణదోషాల విమర్శ చేసికొనండి)

13, జూన్ 2016, సోమవారం

న్యస్తాక్షరి - 34 (జ-న్మ-భూ-మి)

అంశము- భారతమాతృ స్తుతి
ఛందస్సు- ఆటవెలఁది
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘జ - న్మ - భూ - మి’ ఉండాలి.

12, జూన్ 2016, ఆదివారం

సమస్య - 2061 (కవ్వడి తేరు టెక్కెమున...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కవ్వడి తేరు టెక్కెమున గారుడరూపము శోభఁ గూర్చెడిన్”
లేదా...
“కవ్వడి రథపతాకాన గరుడుఁ డుండు”

11, జూన్ 2016, శనివారం

దత్తపది - 89 (మబ్బు-వాన-జల్లు-వరద)

కవిమిత్రులారా,
మబ్బు - వాన - జల్లు - వరద
పై పదాలను ఉపయోగించి భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

10, జూన్ 2016, శుక్రవారం

సమస్య - 2060 (బక ముద్వృత్తిని...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“బక ముద్వృత్తిని జింక ప్రాణముఁ గొనెన్ బాపంబుగా నెంచదే”
లేదా...
“బకము రేగి జింక ప్రాణముఁ గొనె”

9, జూన్ 2016, గురువారం

అత్యద్భుతమైన రెండు బ్లాగులు!

మిత్రులారా!
నిన్న కాకతాళీయంగా రెండు బ్లాగులను చూశాను. అవి ‘చిత్రకవితాప్రపంచం’, ‘సాహితీనందనం’ అనేవి. చిత్రకవిత్వాన్ని, సాహిత్యంలోని చమత్కారాలను ఆస్వాదించి ఆనందించేవారికి విందుభోజనం లాంటివి ఈ బ్లాగులు. వీనిని ఎ.వి. రమణరాజు గారు నిర్వహిస్తున్నారు. వారిని గురించి ఇంతకంటె వివరాలు తెలియవు.
ఈ రెండు బ్లాగులలో చమత్కార పద్యాలు, శ్లోకాలు, ప్రహేళికలు కోకొల్లలుగా ఉన్నవి.
ఆసక్తి కలిగిన మిత్రులు క్రింది లింకులను క్లిక్ చేసి ఆ బ్లాగులను వీక్షించి, అమందానందాన్ని పొందవచ్చు.

‘చిత్రకవితాప్రపంచం’

‘సాహితీనందనం’


సమస్య - 2059 (భాగవతమ్ము మానవుల...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భాగవతమ్ము మానవులఁ బాపముఁ జేయఁగఁ బ్రోత్సహించురా!”
లేదా...
“భాగవతము ప్రోత్సహించుఁ బాపముఁ జేయన్”

8, జూన్ 2016, బుధవారం

సమస్య - 2058 (భీష్మాచార్యుఁడు పాండవుల్...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భీష్మాచార్యుఁడు పాండవుల్ వొగడఁగాఁ బెండ్లాడె పాంచాలినిన్”
లేదా...
“భీష్ముఁడు ద్రుపదనందనన్ బెండ్లియాడె”

7, జూన్ 2016, మంగళవారం

సమస్య - 2057 (సరసీజాతములు విరియ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్”
లేదా
“సరసీజాతములు విరియఁ జంద్రుఁడు వెల్గెన్”
(ఒక సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాదు వెళ్తున్నాను. బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. 
దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి)

6, జూన్ 2016, సోమవారం

నిన్నటి కవిసమ్మేళనంలో నేను సమర్పించిన పద్యాలు...

తెలంగాణ!

సీ.        ఎనలేని పాలనం బనయమ్ము వర్ధిల్లె
ననఁ గాకతీయుల ఘనత సాక్షి!
అసమాన సాహిత్య రసమాధురి కురిసె
నఁగఁ బోతన్న పద్యములు సాక్షి!
ప్రతిలేని శిల్పసంపదలు శోభిలె నని
పలుక రామప్ప దేవళము సాక్షి
సరిలేని పోరాటశక్తికి నెల విది
యన రాష్ట్రసాధనోద్యమము సాక్షి
తే.        యిట్టి బహుళప్రశస్తమై యెసఁగినట్టి
నా తెలంగాణ రాష్ట్రమ్ము నవ్యజాగృ
తీ సమారంభకృషిని సంధించి మించి
సర్వతోముఖప్రగతికై సాగు నింక.                                     (1)

కం.       శ్రీలకు తావలమై వి
ద్యా లలితకళలు, పరస్పరాత్మీయతలున్
మేలుగ వర్ధిల్లఁగ, మురి
పాల తెలంగాణ ప్రగతి పథమున సాగున్.             (2)

కం.       కోకిలవలె, మేఘమువలె,
కేకివలెన్, చిల్కవలెను, శ్రీకృష్ణుని వం
శీకృతనినాదగతి, మో
దాకర తెలఁగాణ కవిత యలరించు నిఁకన్.            (3)

సీ.        బతుకమ్మ బోనాల పాటలు ద్రాక్షాస
వంబయి తన్మయత్వంబు నిడఁగ
ముడాల యాదాద్రి కొమురెల్లి దేవుళ్ళ
కరుణామృతమ్ము మేల్గలుగఁ జేయ
రామప్ప లక్నవరమ్ము పాకాల త
టాకముల్ మేటిపంటల నొసంగ
నానాట వర్ధిల్లు నవ్యపరిశ్రమల్
జీవనోపాధికిఁ ద్రోవఁ జూప
తే.        సర్వరంగమ్ములందు ప్రశస్త వృద్ధి
నంది, కలలెల్ల సాకారమై చెలంగ,
ప్రజలు పాలకుల్ సత్సమన్వయము గలిగి
సాగ బంగారు తెలఁగాణ సాధ్య మగును.               (4)

తే.        పెక్కు పోరాటములఁ జేసి విక్రమించి
స్వంతరాష్ట్రమ్ము సాధింపఁ జాలినార
మన్ని రంగాలలో వృద్ధి నందగలము;
నా తెలంగాణ తల్లి వందనము నీకు!                                (5)
--oOo—

సమస్య - 2056 (రతిపాదాలకు మ్రొక్కి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“రతిపాదాలకు మ్రొక్కి యీ కవనసామ్రాజ్యాన పేరొందుమా”
లేదా...
“రతిపాదారాధనఁ గవిరాజువు గమ్మా!”

5, జూన్ 2016, ఆదివారం

సమస్య - 2055 (కవితల్ వ్రాసి పఠించినంత...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కవితల్ వ్రాసి పఠించినంతఁ గవి సత్కారమ్ములన్ బొందునే?”
లేదా...
“కవితఁ జెప్పిన కవికి సత్కారమేల?”

4, జూన్ 2016, శనివారం

‘పద్య తెలంగాణం’

తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావదినోత్సవాలలో భాగంగా 
రేపు (5-6-2016 నాడు) 
తెలంగాణ ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖ, ‘తెలంగాణ పద్యకవితా సదస్సు’ అధ్వర్యంలో 
‘పద్య తెలంగాణం’ పేరుతో 
వివిధ జిల్లాలనుండి ఎన్నుకున్న 116 మంది పద్యకవుల సమ్మేళనం, సన్మానం 
హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగనున్నది. 
ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం వరకు కవుల కవితాగానం. తదుపరి ఆ కవులకు సత్కారం.
ఆ సమ్మేళనంలో ఒక పద్యకవిగా పాల్గొనడానికి నాకు అవకాశం లభించిందని తెల్పడానికి సంతోషిస్తున్నాను.

సమస్య - 2054 (మంచుంగొండలు మండుచున్న...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మంచుంగొండలు మండుచున్న వవిగో మాహేంద్రనీలద్యుతిన్”
లేదా...
“మంచుమల యింద్రనీలమై మండుచుండె”

3, జూన్ 2016, శుక్రవారం

సమస్య - 2053 (మరణమునందు తోడ్పడెను...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“మరణమునందు తోడ్పడెను మాధవుఁ డెంతయొ మోదమందఁగన్”
లేదా...
“మరణమందు  తోడు మాధవునకు”

2, జూన్ 2016, గురువారం

సమస్య - 2052 (శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“శ్రీకృష్ణున్ గని సిగ్గుతోడ వడిఁ బాఱెన్ సీత పూఁదోటలోన్”
లేదా...
“శ్రీకృష్ణునిఁ జూచి సీత సిగ్గిలి పాఱెన్”

1, జూన్ 2016, బుధవారం

సమస్య - 2051 (కాముఁడవైన ముక్తియె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“కాముఁడవైన ముక్తియె సుఖంబుగ దక్కును లోక మౌననన్”
లేదా...
“కాముఁడవు ముక్తి దక్కుట కడు సులభము”