22, మే 2022, ఆదివారం

సమస్య - 4088

 23-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిరుపేద గృహంబున సిరి నెలవుండు సదా”
(లేదా...)
“సిరి నెలవుండు నెల్లపుడు చిత్రముగా నిరుపేద కొంపలో”

21, మే 2022, శనివారం

సమస్య - 4087

22-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏణాంకుఁడు చెడి కళంకహీనుండయ్యెన్”
(లేదా...)
“విధుఁడు గళంకహీనుఁడుగఁ బేరుఁ గనెన్ గురుపత్నిఁ గూడుటన్”

20, మే 2022, శుక్రవారం

సమస్య - 4086

21-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్వమునకు టెర్రరిజమె వేడ్కఁ గూర్చు”
(లేదా...)
“బావా టెర్రరిజంబె సాధనము విశ్వశ్రేయముం గూర్చఁగన్”

19, మే 2022, గురువారం

సమస్య - 4085

20-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీ మీసము పైనఁ బాఱెఁ జీమ కటకటా”
(లేదా...)
“స్త్రీ మీసమ్మునఁ జీమ వాఱె నకటా చీకాకుఁ బుట్టించుచున్”

18, మే 2022, బుధవారం

సమస్య - 4084

19-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరతుఁ డంపఁగ రాముఁడు వనికి నేగె”
(లేదా...)
“భరతుని యాజ్ఞనంది వనవాస మొనర్చెను రాముఁ డింతితోన్”

17, మే 2022, మంగళవారం

సమస్య - 4083

18-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యబింబము మధ్యలోఁ సోము గంటి”
(లేదా...)
“సూర్యుని మధ్యభాగమునఁ జూచితిఁ బూర్ణశశాంకబింబమున్”

16, మే 2022, సోమవారం

సమస్య - 4082

17-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏకమ్మేకమ్ముతోడ నేకమ్మయ్యెన్”
(లేదా...)
“ఏకముతోడ నేకమె యనేకవిధమ్ముల నేకమయ్యెనే”

15, మే 2022, ఆదివారం

సమస్య - 4081

16-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాగరమున శంకరుండు చలిమలఁ గాంచెన్”
(లేదా...)
“సాగరమందుఁ గన్గొనెను శంకరుఁ డున్నత శీతశైలమున్”

14, మే 2022, శనివారం

సమస్య - 4080

15-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జలముఁ గ్రోలి రోసిరి దేవత లమృతమును”
(లేదా...)
“జలపాన మ్మొనరించి రోసిరి సురల్ స్వర్గమ్ములోనన్ సుధన్”

13, మే 2022, శుక్రవారం

సమస్య - 4079

14-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మండుటెండలోన మంచు గురిసె”
(లేదా...)
“చిత్రము గాదె మంచు గురిసెన్ మరుభూముల మండుటెండలో”

12, మే 2022, గురువారం

సమస్య - 4078

13-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సవతినిం దెచ్చె నా భర్త సంతసిలితి”
(లేదా...)
“సవతినిఁ దెచ్చె నా మగఁడు సంతసమందుచు మెచ్చితిన్ మదిన్”

11, మే 2022, బుధవారం

సమస్య - 4077

12-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చల్లని వెన్నెల రగిల్చె సాధ్వి యెడందన్”
(లేదా...)
“చల్లని పండు వెన్నెలలు సాధ్వి యెదన్ రగిలించె మంటలన్”

10, మే 2022, మంగళవారం

సమస్య - 4076

11-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాముకులై కంట బడిరి గద మౌనివరుల్”
(లేదా...)
“కామకళావిశారదులుగాఁ గనుపించిరి మౌనులెల్లరున్”

9, మే 2022, సోమవారం

సమస్య - 4075

10-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్సాంగత్యమ్ము గూర్చు సర్వాఘములన్”
(లేదా...)
“సత్సాంగత్యము పాపకారణమగున్ సందేహమింకేలనో”

8, మే 2022, ఆదివారం

సమస్య - 4074

9-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పలుకక కూర్చున్న పతియె పడయు శుభములన్”
(లేదా...)
“పలుకక కూరుచున్ననె శుభం బొనఁగూడును భర్త కింటిలో”

7, మే 2022, శనివారం

సమస్య - 4073

8-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నెలఁతలన్ గొల్చు నరులకె కలుగు ముక్తి”
(లేదా...)
“నెలఁతలఁ గొల్చు పూరుషులె నిక్కముగాఁ గనుఁగొంద్రు మోక్షమున్”

6, మే 2022, శుక్రవారం

సమస్య - 4072

7-5-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కునుఁ గోసి పతి భార్య ముచ్చటఁ దీర్చెన్”
(లేదా...)
“ముక్కునుఁ గోసి భర్త సతి ముచ్చటఁ దీర్చెను ముద్దుముద్దుగన్”

5, మే 2022, గురువారం

సమస్య - 4071

6-5-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తామరలలోనఁ గననగుఁ దారకలను”
(లేదా...)
“తామరలందుఁ గాననగుఁ దారక లింపుగ రాత్రివేళలో”

4, మే 2022, బుధవారం

సమస్య - 4070

5-5-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్”
(లేదా...)
“కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్”

3, మే 2022, మంగళవారం

సమస్య - 4069

4-5-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మినుములఁ జల్లంగ మొలిచె మేలిమి కందుల్”
(లేదా...)
“మినుములఁ జల్లఁగా మొలిచె మేలిమి కందులు జొన్నచేనులో”
(ముడుంబై పురుషోత్తమాచార్యులకు ధన్యవాదాలతో...)

2, మే 2022, సోమవారం

సమస్య - 4068

3-5-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హర్షమ్మే కలుగును మన కాపద గలుగన్”
(లేదా...)
“హర్షము గల్గుచుండు మన కాపద గల్గిన వేళ నెప్పుడున్”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

1, మే 2022, ఆదివారం

సమస్య - 4067

2-5-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అలరులు విరిసె నని యేడ్చి రంగన లెల్లన్”
(లేదా...)
“అలరులు విచ్చుకొన్నవని యంగన లేడ్చుచు వీడిరా వనిన్”