31, అక్టోబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 864 (శిలయే మృదుపుష్ప మట్లు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 146

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 863 (కారమ్మే పెంపుజేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 145

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, అక్టోబర్ 2012, సోమవారం

పద్య రచన - 144

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యాపూరణం - 862 (చిత్రమ్మే మాటలాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చిత్రమ్మే మాటలాడె చిత్రము తోడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

28, అక్టోబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 861

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హరుఁ డుంగర మిచ్చి పంపె హనుమంతు నొగిన్.

27, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 860 (పొగ త్రాగనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్.
(ప్రాచీనమూ, ప్రఖ్యాతమూ అయిన సమస్యే ఇది. 
మిత్రులు వైవిధ్యంగా ఎలా పూరిస్తారో చూడాలని ఆసక్తి!)

26, అక్టోబర్ 2012, శుక్రవారం

దత్తపది - 28 (రారా - పోరా - తేరా - సారా)

రారా - పోరా - తేరా - సారా
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

ఈ దత్తపదిని సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు. 

25, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 859 (రామునకు సీత సోదరి)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రామునకు సీత సోదరి.
(ఈ సమస్యలో ఛందో గోపన మున్నది. 
అది ఏ ఛందంలో ఇముడుతుందో మీరే ఆలోచించి తగిన పూరణ చేయవలసి ఉంటుంది)

24, అక్టోబర్ 2012, బుధవారం

సరస్వతీ దండకము

 
సరస్వతీ దండకము

శ్రీ భారతీ! వేదవేదాంత తత్త్వార్థ తేజోవతీ! సర్వ భాషా విశేషాది రత్నాఢ్య సౌవర్ణ భూషాన్వితా! రమ్య సంగీత సాహిత్య ముఖ్యాద్భుతోద్యాన వాటీ విహార ప్రియా! వారిజాతాసనాస్యస్థితా! సుస్థితా! కఛ్ఛపీ దివ్య నిక్వాణ నాదాంచిత వ్యాప్త సర్వాగమా! దేవతానీక సంస్తుత్య భావోన్నతా! భక్త లోకార్థితాశేష విద్యాప్రదా! శారదా! కీరపాణీ! లసద్వేణి!  కళ్యాణి! బ్రహ్మాణి! గీర్వాణి, వాణీ! విరాజద్గుణ శ్రేణి! విద్వన్మణివ్రాత సంపూజితాంఘ్రి ద్వయీ! చిన్మయీ! భక్తితో నీదు తత్త్వంబు ధ్యానించెదన్ నీ మహత్త్వంబు కీర్తించెదన్, నీ పదాబ్జాలు పూజించెదన్  జ్ఞాన వైరాగ్య సంపద్విశేషంబు నిమ్మా, సదా మమ్ము కాపాడు మమ్మా! నమస్తే నమస్తే నమః. 

విజయ దశమి శుభాకాంక్షలతో...

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 858 (పండుగ లివి వచ్చు)

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు, హితులకు
విజయదశమి శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పండుగ లివి వచ్చు దండుగలకు.

23, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 857 (అష్టమి శ్రేష్ఠమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్.

22, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 856 (కీచకుఁడు పెండ్లియాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21, అక్టోబర్ 2012, ఆదివారం

శ్రీ రాజరాజేశ్వరీ స్తుతి

శ్రీసదాశివ మనః శృంగార సుమవన
          సీమలో విహరించు భామ యెవరు?
సర్వలోకమ్ములో సర్వశోభాకర
          పురములో నివసించు తరుణి యెవరు?
వివిధ బ్రహ్మాండాల వెలుపల లోపల
          రాజిల్లు చైతన్య రాశి యెవరు?
అఖిల భూతమ్ముల కంతరంగములలో
          జ్యోతియై వెలుగొందు మాత యెవరు?
సర్వ శక్తి స్వరూపిణి సరసహృదయ
సర్వలోక విధాయిని శాంతరూప
రాజరాజేశ్వరీదేవి ప్రణవమయిని
ధ్యానమొనరించి భక్తితో నంజలింతు. 

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు శుభాకాంక్షలు!

                       పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 855 (దయ్యము దైవమును చంపి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దయ్యమె దైవమును చంపి ధరపై వెలసెన్.
ఈ సమస్యను పంపిన జంగిడి రాజేందర్ గారికి ధన్యవాదాలు.

20, అక్టోబర్ 2012, శనివారం

అంతర్జాల అష్టావధానము


          మాలిక పత్రిక ఆధ్వర్యంలో మొట్టమొదటి అంతర్జాల అవధానం నేడు భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలనుండి తొమ్మిది గంటలవరకు   నిర్వహింపబడుతుంది. ఈ అంతర్జాల అవధానం యొక్క శీర్షిక ” వాణీ – మనోహరిణీ ” అంతర్జాలంలో అవధానం ఎలా జరుపుతారు అనుకుంటున్నారా?? ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక తుది రూపానికి తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.

మొదట నిర్వాహకుల స్వాగత వచనాలు.
తరువాత అవధాని గారి స్వపరిచయం, వరుసగా పృచ్ఛకుల స్వపరిచయం, అతిథుల స్వపరిచయం…
అవధాన ప్రారంభం
అవధానిగారి చేత దైవ ప్రార్థన, స్వవిషయం, (అవసరమనుకుంటే) అవధాన ప్రక్రియా పరిచయం, ప్రాశస్త్యాలు పద్యాలలో…
నాలుగు ఆవృత్తుల వరుసక్రమం ఇలా  ఉంటుంది.
1.నిషిద్ధాక్షరి
2.మొదటి దత్తపది
3.రెండవ దత్తపది
4.మొదటి సమస్య
5.రెండవ సమస్య
6.మూడవ సమస్య
7.వర్ణన
అప్రస్తుత ప్రసంగం నిర్వహించే పృచ్ఛకులకు ఎప్పుడైనా మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంది. నిరంకుశులు కదా!
నాలుగు ఆవృత్తుల అనంతరం ‘ధారణ’
చివర అవధాని గారు, నిర్వాహకుడు ధన్యవాదాలు తెలుపడంతో అష్టావధాన కార్యక్రమం ముగుస్తుంది.

ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు? అసలు ఈ అవధాని ఎవరు అని అడగాలనుకుంటున్నారా?? చెప్తున్నాగా..  “వాణీ -మనోహరిణీ” కార్యక్రమానికి అవధానిగా వస్తున్నవారు ..
“అవధాని రత్న” ,సాహిత్య శిరోమణి
డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్, యం.ఎ ., బి. యెడ్., పిహెచ్. డి
సంస్కృతోపన్యాసకులు
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
టి.టి.డి,, తిరుపతి

ఇక ఈ  అవధాన కార్యక్రమంలో పృచ్ఛకులుగా పాల్గొనే మిత్రుల వివరాలు….
1. నిషిద్ధాక్షరి – రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు
2. మొదటి సమస్య : లంకా గిరిధర్ గారు
3. రెండవ సమస్య : పోచిరాజు సుబ్బారావు గారు
4. మూడవ సమస్య : భైరవభట్ల కామేశ్వర రావు గారు
5. మొదటి దత్తపది :  గోలి హనుమచ్ఛాస్త్రి గారు
6. రెండవ దత్తపది : సంపత్ కుమార్ శాస్త్రి
7. వర్ణన : సనత్ శ్రీపతి గారు
8. అప్రస్తుత ప్రశంస : చింతా రామకృష్ణారావు గారు
నిర్వాహకుడు :  కంది శంకరయ్య

మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమంలో పాల్గొనలేని వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..

మాలిక పత్రిక : http://magazine.maalika.org

అవధాని గారి గురించి మరి కొన్ని వివరాలు:
అవధాని శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు 1970 జూన్ 3 వ తేదీన అనంతపూర్లో జన్మించారు. ఈయన తండ్రిగారు కీ.శే.బ్రహ్మశ్రీ మాడుగుల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు  వేదపండితులు మరియు పురోహితులుగా ఉండేవారు. తల్లిగారు సంస్కృతాంధ్ర భాషలలో పండితురాలు, సంగీత విద్వాంసురాలు. అనిల్ గారు సంస్కృత సాహిత్య శిరోమణి అభ్యసించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సంస్కృతంలో యం.ఏ చేసారు. తర్వాత ప్రస్తుత వేదిక్ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారి  పర్యవేక్షణలో రఘువంశ మహాకావ్యంపై పి.హెచ్.ఢి చేసారు. ఎన్నో పత్రికలలో వ్యాసాలు, పద్యాలు వ్రాసారు. సెమినార్లలో పత్రసమర్పణ చేసారు. ఆయన ఇంతవరకు ఎన్నో అవధానాలు చేసారు.  శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల , తిరుపతి అధ్యాపక బృందం వారు “అవధాని రత్న ” బిరుదు అందజేశారు. సంస్కృతాంధ్ర భాషలలో 13 పుస్తకముల రచన కూడా చేసారు..
ఇవి ఆయన రచనలు:
1 . శ్రీ వేంకటేశ్వర అక్షరమాలా స్తోత్రము
2. శ్రీ రాఘవేంద్ర అక్షరమాలా స్తోత్రము
3. అమందానంద మందాకిని
4. శ్రీ వేంకట రమణ శతకము
5.అనిల కుమార శతకము
6. భావాంజలి
7.వసంత కుసుమాంజలిః ( సంస్కృతం లో వివిధ దేవతలపై విభిన్న వృత్తాలలో  అష్టకాలు నవరత్నాలు )
8.రఘువంశ మహాకావ్యే సాదృశ్య విన్యాసః (పిహెచ్ .డి పరిశోధన ప్రబంధము )
9. భోజ చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము )
10. విక్రమార్క చరిత్ర ( సంస్కృత మూలమునకు అనువాదము)
11. వాల్మీకి( సంస్కృత మూలమునకు అనువాదము)
12. శ్రీ రామనామ రామాయణము ( నామ రామాయణము లోని నామములకు సందర్భసహిత వ్యాఖ్యానము )
13. శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పము ( పురుష సూక్తానుసారము సంకలనము)

సంకల్పము :- ప్రాచీనాంధ్ర భాషలో ఛందోబద్ధ కవిత్వానికి ఆదరణ చేకూర్చే ప్రయత్నము. అవధానాన్ని ప్రాచీనావదానుల వాలె  ఛాలెంజ్ లా కాక ఒక కళగా ఆరాధించి వ్యాపింప జేయడము .

సమస్యాపూరణం - 854 (అవధానముఁ జేయువారలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అవధానముఁ జేయువార లల్పులు గాదే!

19, అక్టోబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 853 (దేహము లేనట్టివాఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

18, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 852 (కొమ్ములు జనియించెఁ గనుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కొమ్ములు జనియించెఁ గనుఁడు కోమలి తలపై.

16, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 851 (పతిని బాధపెట్టు వనిత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పతిని బాధపెట్టు వనిత సాధ్వి.

పద్య రచన - 143

నేటినుండి దేవీ నవరాత్రులు ప్రారంభం
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 850 (పితృదేవుల పూజసేయ)

కవిమిత్రులారా,
ఈరోజు ‘మహాలయ అమావాస్య’ సందర్భంగా పూరించవలసిన సమస్య   ఇది...
పితృదేవుల పూజసేయఁ బెనుపడు నిడుముల్.

పద్య రచన - 142

నేటినుండి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, అక్టోబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 849 (తల లేకుండఁగఁ జూడఁగా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
(ఆకాశవాణి వారి సౌజన్యంతో...)

పద్య రచన - 141

 కృష్ణశాస్త్రి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 848 (శకుని కర్ణ దుశ్శాసనుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శకుని కర్ణ దుశ్శాసనుల్ సత్పురుషులు.

పద్య రచన - 140

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 847 (చూడుఁ డదే పట్టపగలె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
చూడుఁ డదే పట్టపగలె చుక్కలు వొడిచెన్.

పద్య రచన - 139

అల్లసాని పెద్దన
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 846 (అగ్నిపునీతవె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అగ్నిపునీతవె, యిడుముల కంతము లేదా?

పద్య రచన - 138

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 845 (కుంతికి నైదుగురు సుతలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్. 

పద్య రచన - 137

ఎర్రన
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, అక్టోబర్ 2012, సోమవారం

దత్తపది - 27 (క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్)

క్రికెట్టు - హాకీ - టెన్నిసు - చెస్
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

పద్య రచన - 136

తిక్కన సోమయాజి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7, అక్టోబర్ 2012, ఆదివారం

సమస్యాపూరణం - 844 (హెడ్మాస్టరు నేర్వసాగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
హెడ్మాస్టరు నేర్వసాగె నేబీసీడీల్.
(సమస్యలోనే ఉన్నందున పూరణలో అన్యభాషాపదాలను నిరభ్యంతరంగా ప్రయోగించవచ్చు)

పద్య రచన - 135

నన్నయ
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

అంతర్జాల అవధానం

అంతర్జాల అవధానం

అందరికి నమస్కారం..

మాలిక  పత్రిక తరఫున అవధానం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. 

అవధానిగా డా.మాడుగుల అనిల్ గారు వస్తున్నారు. ఆయన సంస్కృతాంధ్ర  పండితుడు. తిరుమలలో ఉద్యోగం చేస్తున్నారు. 

ఈ అవధాన ప్రక్రియ నిర్వహణ బాధ్యత మన కంది శంకరయ్యగారిది.. 

పృచ్ఛకులుగా పాల్గొనడానికి ఆసక్తిగలవారు చెప్పండి.

అవధాన ప్రక్రియ లైవ్ లో కాకుండా ఒక గ్రూపులో జరుగుతుంది. దీనివలన వేర్వేరు  ప్రాంతాలలో ఉన్నవారికి, ఉద్యోగాలు చేసేవారికి కూడా అణువుగా ఉంటుంది. అవధానిగారి  సమయానుకూలతను బట్టి ఈ నెల 19, 20 తేదీలలో చేయాలనుకుంటున్నాము. 

ఈ అవధానం సారాంశం మొత్తం విజయదశమినాడు మాలిక పత్రికలో ప్రచురించబడుతుంది..

ఈ అవధానంలో తీసుకొనే అంశాలు.
నిషిద్ధాక్షరి - 1
దత్తపదులు - 2
సమస్యాపూరణలు -2
వర్ణన - 1
ఆశువు -1
అప్రస్తుత ప్రసంగము - 1
 
కవిమిత్రులు ఎవరెవరు ఏయే అంశాలలో పాల్గొనే ఆసక్తి ఉన్నదో తెలియజేయండి.

అనిల్ గారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి..
https://www.facebook.com/dr.madugulaanilkumar?ref=ts&fref=ts

(మాలిక -అంతర్జాల పత్రిక సౌజన్యంతో...)

6, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 843 (వక్త్రంబుల్ పది గలిగిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
వక్త్రంబుల్ పది గలిగినవానికి జేజే!
ఈ సమస్యకు స్ఫూర్తి వావిళ్ల వారి ‘తెలుగు సమస్యలు’ గ్రంథం. 
అందులోని సమస్యను, దాని పూరణను గమనించండి....
సమస్య - వక్త్రంబుల్ పది కన్ను లైదు కరముల్ వర్ణింపఁగా వెయ్యగున్.
పూరణ....
ఈ క్త్రా ప్రాసము చెడ్డదందు విన మీ రెంతేసివా రాడఁగా
వాక్త్రాసంబది సత్కవీశ్వరులకున్ వర్ణింప నేఁ జెప్పెదన్
దిక్త్రారాతికిఁ బార్వతీశ్వరులకు దిగ్మప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్ను లైదు కరముల్ వర్ణింపఁగా వెయ్యగున్.

పద్య రచన - 134

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 842 (రమణీ రమ్మనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రమణీ రమ్మనెను సీత రామునిఁ గనుచున్.

పద్య రచన - 133

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విశేష వృత్తము - 27 (స్రగ్ధర)

మిత్రులారా! 
శుభాశీస్సులు.
ఈనాడు మనము ముచ్చటించుకొను చున్న విశేష వృత్తము - స్రగ్ధర.
స్రగ్ధర -
ఇది 21వ ఛందమైన ‘ప్రకృతి’లో 299393వ వృత్తము.
గణములు : మ ర భ న య య య
యతులు 2 చోట్ల : 8వ అక్షరము, 15వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
నా సామర్థ్యం బసామాన్యము త్రిజగములన్ గాంచె నెంతే ప్రశస్తిన్
నా సాటెవ్వారు హా హ నరులును గపు లీనాడు నన్ గాంచుడంచున్
జేసెన్ నాదంబు దిక్కుల్ చెదరెడు నటులన్ జెట్టి యింద్రారి బల్మిన్
వేసెన్ బ్రహ్మాస్త్రమంతన్ వివిధ కపులపై భీకరంబైన రీతిన్


చూచేరు కదా!  మనకు దేవతా స్తోత్రాలలో అనేక స్రగ్ధరా వృత్తాలు ఉంటాయి:

-- యా సా పద్మానస్థా విపులకటి తటీ పద్మ పత్రాయతాక్షీ ..  ..  ..

-- క్షీరోదన్వత్ ప్రదేశే శుచి మణి విలసత్ సైకతే మౌక్తికానాం ..  ..  ..

-- ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మ పత్రాయతాక్షీం  ..  .. 


స్వస్తి.
                            పండిత రామజోగి సన్యాసి రావు

4, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 841 (వినవలదయ్య దౌష్ట్యమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
వినవలదయ్య దౌష్ట్యమును బెంచును భారత మెల్లకాలమున్.
ఈ సమస్యను సూచించిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 132

కాశీక్షేత్రము
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

విశేష వృత్తము - 26 (మేఘవిస్ఫూర్జితము)

మిత్రులారా!
ఈనాటి విశేష వృత్తము - మేఘవిస్ఫూర్జితము

మేఘవిస్ఫూర్జితము -
ఇది 19వ ఛందమైన ‘అతిధృతి’లో 75715వ వృత్తము.
గణములు:  య మ న స ర ర గ
యతి : 13వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
ఘనశ్యామా! రామా! కమలనయనా! క్షత్రియాంబోధి సోమా!
మునివ్రాత త్రాతా! పురహరహితా! మోక్షయోగప్రదాతా!
అనంతా! శ్రీమంతా! అమలచరణా! ఆదిదేవా! ప్రశాంతా!
జనస్తుత్యా! నిత్యా! సరసవచనా! సత్య ధర్మ స్వరూపా!


చూచేరు కదా.  శిఖరిణికి ఈ వృత్తానికి పాదము చివరలోనే తేడా ఉంటుంది.  మీరూ ప్రయత్నించండి.  స్వస్తి. 
                     పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

3, అక్టోబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 840 (తిరుమలేశుఁడైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
తిరుమలేశుఁడైనఁ దిరిపె మెత్తు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

విశేష వృత్తము - 25 (శిఖరిణి)

మిత్రులారా!
          ఇదివరలో కొన్ని విశేష వృత్తాలను గురించి తెలుసుకొనినాము.  ఈరోజు మరొక వృత్తము "శిఖరిణి" గురించి ముచ్చటించుదాము:

శిఖరిణి -
           ఇది 17వ ఛందమైన ‘అత్యష్టి’లో 51950వ వృత్తము.
గణములు: య మ న స భ వ
యతి : 13వ అక్షరము 
ప్రాస నియమము కలదు

ఉదా-
పరంధామా! రామా! ప్రణతజన సౌభాగ్య వరదా!
సరోజాక్షా! త్ర్యక్ష ప్రముఖ వినుతా! సత్య నిరతా!
సురూపా! చిద్రూపా! సురుచివిభవా! శుద్ధ చరితా!
శరణ్యా! సమ్మాన్యా! సకల భువనేశా! సురహితా!


          శ్రీ శంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరి కావ్యము అంతా శిఖరిణీ వృత్తాలతోనే కూర్చబడినది.
          మీరు కూడా అవకాశమునుబట్టి వ్రాయుటకు ప్రయత్నించండి.
స్వస్తి!
                        పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

పద్య రచన - 131

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 839 (హింస కలుగఁజేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
హింస కలుగఁజేయు హితము భువికి.

పద్య రచన - 130

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 838 (అనుమానించు పతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అనుమానించు పతిఁ బడసి యతివ సుఖపడెన్.

పద్య రచన - 129

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

వ్యాకరణ పాఠము

          భాషకు వ్యాకరణమే మూలస్తంభము
మిత్రులారా!
          మన రచనలను సాధ్యమైనంత వరకు వ్యాకరణ బద్ధముగా నుండుటకే ప్రయత్నము చేయవలెను.  కొందరు మహాకవులు వ్యాకరణ విరుద్ధములైన ప్రయోగములు చేయుటయు వాటిని "ఆర్య వ్యవహారములు గా" వదిలివేయుటయు జరిగినది.  సమాసములలో పూర్వపదము చివరన "న్" లేక "ల్" వంటి వర్ణములు ఉన్నప్పుడు పర పదము "అ" కారము వంటి అచ్చుతో మొదలగునప్పుడు సంధి కార్యము ఎట్లుండును? 
ఉదా: వానిన్ + అక్కడ = వానినక్కడ (సాధు ప్రయోగము)
          ‘వానిన్నక్కడ’ అని సాధించుట వ్యాకరణ సమ్మతము కాదు.  కొందరు పూర్వ కవులు ఎందరో వర్తమాన కవులు ఈ విషయమును గమనించుట లేదు.  నా ఉద్దేశములో అట్టి దోష ప్రయోగములను చేయకుండుట మంచిది. 

          పూర్వపదము సంస్కృత పదము అయినప్పుడు పర పదము అచ్చుతో ప్రారంభమయినప్పుడు సంధి కార్యము ఈ క్రింది విధముగా నుంటుంది:
కస్త్వం + అనెను = కస్త్వమ్మనెను;
తుభ్యం + అనుచు = తుభ్యమ్మనుచు.
          ఈ సూత్రమును కేవల తెలుగు సంధులకు అన్వయించుట తగదు. 
ఉంచెన్ + ఇక్కడ = ఉంచెనిక్కడ మాత్రమే అగును.  ఉంచెన్నిక్కడ అని వాడరాదు.  అటులనే:
వచ్చెన్ + అంతట = వచ్చెనంతట మాత్రమే అగును.  వచ్చెన్నంతట అని సంధి చేయరాదు.

అందరకీ శుభాభినందనలతో.  స్వస్తి!
                   పండిత నేమాని రామజోగి సన్యాసి రావు