ఛందస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఛందస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఛందస్సు పాఠాలు - 4

ప్రాసమైత్రి
పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రతిపాదంలో రెండవ అక్షరం ఒకే హల్లై ఉండడం ప్రాసమైత్రి. యతిమైత్రిలో వలె కాకుండా కేవలం హల్లు యొక్క సామ్యం ఉంటే చాలు. అచ్చుల సామ్యం అవసరం లేదు.  మొదటిపాదంలో ప్రాసాక్షరానికి ముందు లఘువుంటే మిగిలిన పాదాల్లో లఘువే ఉండాలి. గురువుంటే గురువే ఉండాలి.

ఉదా...
(అ)
సు(ర)మునిగణవినుతపదా!
ము(రాం)తకా! చక్రహస్త! పురవైరిసఖా!
(రి)రక్షక! కిరిశిక్షక!
సు(రు)చిరపీతాంబరధర! శోకవినాశా!
(పై పద్యంలో ప్రాసస్థానంలో ర,రా,రి,రు అని రకారం ఉంది. ప్రాసాక్షరానికి ముందు అన్నీ లఘువులే)

(ఆ)
(మం)దిడి యతఁ డరిగిన
భూ(మీ)సురుఁ డరిగెఁ దుహినభూధరశృంగ
శ్యా()ల కోమల కానన
హే(మా)ఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో మ,మీ,,మా అని మకారం ఉంది. ప్రాసాక్షరానికి ముందు అన్నీ గురువులే)

మొదటిపాదంలో ప్రాసస్థానంలో సంయుక్తాక్షరం ఉంటే మిగిలిన పాదాలలోను సంయుక్తాక్షరమే ఉండాలి.
ఉదా...
(ర్యు)లు దేవతల్ మునుల కా రమ విందు నొసంగుచుండఁగా
కా(ర్య)నిమగ్నురా లగుచుఁ గాంతుని భారతి పల్కరించ దా
(ర్య) సమర్థనీయ మని చప్పునఁ దాఁ బరిహాస మాడుచున్
భా(ర్య)కు భాష రా దనుచు బ్రహ్మయె పల్కె సభాముఖమ్మునన్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో ర్యు,ర్య,ర్య,ర్య అని అన్నీ సంయుక్తాక్షరాలే ఉన్నాయి).

మొదటిపాదంలో ప్రాసస్థానంలో ద్విత్వాక్షరం ఉంటే మిగిలిన పాదాలలోను ద్విత్వాక్షరమే ఉండాలి.
ఉదా...
(న్నా)తిఁ గూడ హరుఁడవె
(న్నా)తిని గూడకున్న నసురగురుడవే!
(న్నా) తిరుమలరాయా
(న్నొ)క్కటి కలదు కాని కౌరవపతివే.
(పై పద్యంలో ప్రాసస్థానంలో న్నా,న్నా,న్నా,న్నొ అని అన్నీ ద్విత్వాక్షరాలే ఉన్నాయి).

మొదటిపాదంలో ప్రాసస్థానంలో అనుస్వారంతో కూడిన అక్షరం ఉంటే మిగిలిన పాదాలలోను అనుస్వారంతో కూడిన అక్షరమే ఉండాలి.
ఉదా...
కాం(చె)న్ వైష్ణవుఁ డర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశా
ఖాం()జ్ఝాట చరన్మరుద్రయ దవీయఃప్రేషితోద్యచ్ఛదో
దం()త్కీటకృత వ్రణ చ్ఛలన లిప్యాపాదితాధ్వన్య ని
స్సం(చా)రాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వటక్షాజమున్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో ంచె,ంచ,ంచ,ంచా అని అన్నీ అనుస్వారంతో కూడిన చకారమే ఉంది).

స్థూలంగా ఇవి తెలుసుకుంటే చాలు. ప్రాసభేదాలు అని కొన్ని ఉన్నాయి. వాటిని గురించి వివరంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు క్రింది లింకులను నొక్కి చూడండి.

ప్రాసయతి
యతి వేయవలసిన స్థానంలో ప్రాసను వేస్తే అది ప్రాసయతి అనబడుతుంది. ఉదాహరణకు  ఆటవెలది అనే పద్యంలో నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం.  అక్కడ యతి వేయకుండ ప్రాసమైత్రిని పాటిస్తే అది ప్రాసయతి.

ఉదా...
()ఘుకులాబ్ధిసోమ! (రా)వణాంతక! రామ! (యతిమైత్రి)
(ఆంజ)నేయ హృదయ (రంజ)క! హరి! (ప్రాసయతి)
(శి)వుని విల్లు విఱిచి (సీ)తను పెండ్లాడి (యతిమైత్రి)
(వని)కిఁ దరలినావు (జన)కునాజ్ఞ.  (ప్రాసయతి)
పై పద్యంలో 1, 3వ పాదాలలో నాలుగవ గణం మొదటి అక్షరాలకు (ర-రా; శి-సీ లకు) యతిమైత్రి పాటింపబడింది.  కాని 2, 4వ పాదాలలో నాలుగవ గణం మొదటి అక్షరాలకు (ఆ-ర; వ-జ లకు) యతిమైత్రి లేదు. ఆ పాదాలలో (ఆంజ-రంజ; వని-జన) ప్రాసమైత్రి పాటింపబడింది.


ఉత్పలమాల మొదలైన వృత్తాలలో, కందపద్యంలో ఈ ప్రాసయతి నియమం లేదు. కేవలం ఆటవెలది, తేటగీతి, సీసం మొదలైన పద్యాలలోనే ఉంది. ఆ పద్యాలను గురించి చెప్పుకున్నపుడు వివరంగా తెలుసుకుందాం.  

27, జనవరి 2016, బుధవారం

ఛందస్సు పాఠాలు -3

యతి ప్రాసలు
క్రింది పద్యాన్ని గమనించండి.
నిరుపమగుణజాలా *నిర్మలానందలోలా
దురితఘనసమీరా *దుష్టదైత్యప్రహారా
శరధిమదవిశోషా *చారుసద్భక్తపోషా
సరసిజదళనేత్రా *సజ్జనస్తోత్రపాత్రా.
ఈ పద్యం పేరు మాలినీవృత్తం.  దీని గణాలు న-న-మ-య-య. యతిస్థానం 9. ప్రాసనియమం ఉంది.
వృత్తంఅంటే ఏమిటో తరువాత తెలుసుకుందాం.
గణాలగురించి తెలుసుకున్నాం.
యతిస్థానం 9’ అని ఉంది. అదేమిటో చూద్దాం... మొదటిపాదంలో మొదటి అక్షరం ని’, తొమ్మిదవ అక్షరం ని’. రెండవపాదంలో మొదటి అక్షరం దు’, తొమ్మిదవ అక్షరం దు’. నాల్గవపాదంలో మొదటి అక్షరం ’, తొమ్మిదవ అక్షరం ’. ఈ విధంగా ప్రతి పాదంలో మొదటి అక్షరం, తొమ్మిదవ అక్షరం ఒకేవిధంగా ఉన్నాయి. దీనిని యతిమైత్రి అంటారు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క స్థానం యతిగా గుర్తింపబడింది. పై పద్యంలో మూడవపాదంలో మొదటి అక్షరం కాగా, తొమ్మిదవ అక్షరం చాఉంది. అంటే యతిస్థానంలో ఆ పాదంలోని మొదటి అక్షరమే కాక, దానితో మిత్రత్వం కలిగిన వేరే అక్షరాలు వేయవచ్చు. అవేమిటో యతిమైత్రిఅన్న శీర్షికలో వివరంగా తెలుసుకుందాం.
ప్రాసనియమం ఉందిఅంటే ఏమిటో తెలుసుకుందాం... పై పద్యంలో ప్రతిపాదంలో రెండవ అక్షరంగా వరుసగా రు, రి, , ర అనే అక్షరాలు ఉన్నాయి. ఈ విధంగా అన్నిపాదాలలోని రెండవ అక్షరం ఒకే హల్లై ఉండడం ప్రాస అంటారు. దీని గురించి ప్రాసమైత్రిఅనే శీర్షికలో వివరంగా తెలుసుకుందాం.

యతిమైత్రి
ఛందస్సులో యతి అనేది ఒక పారిభాషికపదం. సంస్కృతంలో దీనికి విచ్ఛేదమని అర్థం. విచ్ఛేదమంటే ఏ పదానికి ఆ పదం విడిపోవడం అని తాత్పర్యం. కస్తూరీతిలకే లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభంఇది శార్దూలవృత్తం. దీని యతిస్థానం 13. అంటే 12వ అక్షరంతో ఒక పదం పూర్తయి 13వ అక్షరంతో మరొక పదం ప్రారంభం అవుతుంది. ఇది సంస్కృత సంప్రదాయం.
కాని తెలుగులో పదవిచ్ఛేదం కాకుండా పాదంలోని మొదటి అక్షరంతో మైత్రి కలిగిన మరో అక్షరాన్ని  ఆ స్థానంలో వేయవచ్చు.
ఈ మైత్రి అచ్చులకు, హల్లులకు వేరువేరుగా ఉంటుంది. యతిమైత్రి హల్లులకే కాక, వాటితో కలిసిన అచ్చులకు కూడ వర్తిస్తుంది.
పదాలమధ్య సంధి జరిగినపుడు రెండవపదం మొదటిఅచ్చుకు యతి చెల్లించాలి. ఉదా- *అతులవిక్రముఁ డతఁడు వి*ద్యాధికుండు (విద్యా +*అధికుండు).
ఒకటికంటె ఎక్కువ హల్లులు కల సంయుక్తాక్షరం పాదం మొదటి అక్షరంగా కాని, యతిస్థానంలో కాని ఉంటే అందులో ఏదో ఒక హల్లుకు మైత్రిని పాటించవచ్చు. ఉదా-  (i) *స్మరజనకా వాసుదేవ *సజ్జనవినుతా (స్మఅనే సంయుక్తాక్షరంలోని కు యతి). (ii) *క్రతురక్షక దీనబంధు *రాక్షసవైరీ (క్రఅనే సంయుక్తాక్షరంలో కు యతి). (iii) *పరిపాలింపు మని నిన్ను *ప్రార్థింతు హరీ (ప్రాలోని కు యతి). (iv) *రక్షించెడి దేవుడవని *ప్రార్థింతు సదా (ప్రాలోని కు యతి).

యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక - హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా యతిమైత్రి పాటించాలి. ఉదా- i)క-కా-కై-కౌ; ii)కి-కీ-కృ-కౄ-కె-కే; iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) -ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే (i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; (ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; (iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.
ఇవి ముఖ్యమైన యతిభేదాలు. ఇంకా ఎన్నో భేదాలున్నాయి. అవి తరువాత వివరంగా తెలిసికొనవచ్చు.  ఆసక్తి కలవారు క్రింది లింకులను చూడండి.


(తరువాతి పాఠంలో ప్రాసమైత్రిని గురించి తెలుసుకుందాం)

3, జనవరి 2016, ఆదివారం

ఛందస్సు నేర్చుకుందాం - 2

ఛందస్సు - పాఠం 2
గణాలు
గణం అంటే సమూహం. వ్యాకరణంలో అక్షరాల సమూహం పదమైనట్లు ఛందస్సులో అక్షరాల సమూహం గణం అవుతుంది. పదాల వలెనే ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, చతురక్షర గణాలున్నాయి.
ప్రధానంగా ఈ గణాలు రెండు వర్గాలుగా విభజింపబడ్డాయి. అవి (i) అక్షర గణాలు, (ii) మాత్రాగణాలు.
చతుర్మాత్రాగణాలు అని మరొక భేదం ఉంది.

(i) అక్షర గణాలు :- గణంలోని అక్షరసంఖ్యను బట్టి ఏర్పడిన గణాలు ఇవి. వీటిలో మూడక్షరాల గణాలు ప్రధానమైనవి.

1) ఏకాక్షర గణాలు :- ఒకే అక్షరం ఉన్న గణాలు 2.
ఒక లఘువు - దీనిని అంటారు. దీని చిహ్నం I.
ఒక గురువు - దీనిని అంటారు. దీని చిహ్నం U.

2) ద్వ్యక్షర గణాలు :- రెండక్షరాలున్న గణాలు 4.
UU - రెండు గురువులు - దీనిని గగము (గా)అంటారు.  (ఉదా. రామా)
UI - ఒక గురువు ఒక లఘువు - దీనిని హగణము (గలము)అంటారు. గురువుకు ’, లఘువుకు రెంటిని కలిపి గలముఅన్నారు. కాని హగణముఅనడమే ప్రసిద్ధం.  (ఉదా. రామ)
IU - ఒక లఘువు ఒక గురువు - దీనిని వగణము (లగము)అంటారు. లఘువుకు ’, గురువుకు రెంటిని కలిపి లగముఅన్నారు.  (ఉదా. హరీ)
II - రెండు లఘువులు - దీనిని లలము (లా)అంటారు. పద్యాలలో దీని ఉపయోగం లేదు.  (ఉదా. హరి)

3) త్ర్యక్షర గణాలు :- మూడక్షరాల గణాలు 8.
UUU - మగణము (సర్వ గురువు) - శ్రీరామా.
UII - భగణము (ఆది గురువు) - మాధవ.
IUI - జగణము (మధ్య గురువు) - ముకుంద.
IIU - సగణము (అంత్యగురువు) - వరదా.
III - నగణము (సర్వ లఘువు) - వరద.
IUU - యగణము (ఆది లఘువు) - ముకుందా.
UIU - రగణము (మధ్య లఘువు) - మాధవా.
UUI - తగణము (అంత్య లఘువు) - శ్రీరామ.
ఈ మూడక్షరాల గణాలు తెలిసికొనడానికి ఒక సూత్రం ఉంది. అది యమాతారాజభానసలగమ్’.  దీనిని వ్రాసి దీని క్రింద గురు లఘువులను గుర్తించండి. గణాలను క్రింది విధంగా తెలిసికొనవచ్చు.
యమాతారాజభానసలగమ్
  I U  U U I U I  I I   U
యమాతా - IUU - యగణము.
మాతారా - UUU - మగణము.
తారాజ - UUI - తగణము.
రాజభా - UIU - రగణము.
జభాన - IUI - జగణము.
భానస - UII - భగణము.
నసల - III - నగణము.
సలగమ్ - IIU - సగణము.
గణాలను గుర్తించడానికి మరొక సూత్రం ఉంది. అది ఇది...
సర్వగురువు మ - ఆదిమధ్యాంత గురువులు భజస.
సర్వలఘువు న - ఆదిమధ్యాంత లఘువులు యరత
సర్వగురువు మగణము - అన్నీ గురువులు - UUU.
ఆదిగురువు భగణము - మొదట గురువు, తరువాత రెండు లఘువులు - UII.
మధ్యగురువు జగణము - మొదట లఘువు, మధ్యలో గురువుచివర లఘువు - IUI.
అంత్యగురువు సగణము - మొదట రెండు లఘువులు, చివర గురువు - IIU.
సర్వలఘువు నగణము - అన్నీ లఘువులు - III.
ఆదిలఘువు యగణము - మొదట లఘువు, తరువాత రెండు గురువులు - IUU.
మధ్యలఘువు రగణము - మొదట గురువు, మధ్యలో లఘువు, చివర గురువు - UIU.
అంత్యలఘువు తగణము - మొదట రెండు గురువులు, చివర లఘువు - UUI.

4) చతురక్షర గణాలు :- నాలుగక్షరాల గణాలు 16. మూడక్షరాల గణాలు తెలిస్తే నాలుగక్షరాల గణాలను తెలిసికొనడం సులభం. ఎలాగంటే III - ఇది నగణము. దీని తరువాత లఘువు చేరితే న(గణము)+ల(లఘువు)= నలము - IIII. నగణము తరువాత గురువు చేరితే న(గణము)+గ(గురువు)=నగము - IIIU. ఇలాగే మిగిలినవి.
UUUU - మగము (మగణము+గురువు) - శ్రీలక్ష్మీశా
UUUI - మలఘువు (మగణము+లఘువు) - శ్రీలక్ష్మీశ. (మలము’ అనరాదు)
UIIU - భగురువు (భగణము+గురువు) - చక్రధరా. (‘భగము’ అనరాదు)
UIII - భలము (భగణము+లఘువు) - చక్రధర.
IUIU - జగము (జగణము+గురువు) - మురాంతకా.
IUII - జలము (జగణము+లఘువు) - మురాంతక.
IIUU - సగము (సగణము+గురువు) - మురవైరీ.
IIUI - సలము (సగణము+లఘువు) - మురవైరి.
IIIU - నగము (నగణము+గురువు) - మురహరా.
IIII - నలము (నగణము+లఘువు) - మురహర.
IUUU - యగము (యగణము+గురువు) - మురధ్వంసీ.
IUUI - యలము (యగణము+లఘువు) - మురధ్వంసి.
UIUU - రగము (రగణము+గురువు) - శ్రీనివాసా.
UIUI - రలము (రగణము+లఘువు) - శ్రీనివాస.
UUIU - తగము (తగణము+గురువు) - లక్ష్మీపతీ.
UUII - తలము (తగణము+లఘువు) - లక్ష్మీపతి.
పై 16 గణాలలో కేవలం నలము (IIII), నగము (IIIU), సలము (IIUI) అనే మూడు గణాలు మాత్రమే ఉపయోగపడతాయి.  అదికూడ ఆటవెలది, తేటగీతి, ద్విపద, సీసపద్యాలకు మాత్రమే. కనుక మిగిలినవాటిని నేర్చుకొనవలసిన అవసరం లేదు. 

(ii) మాత్రాగణాలు :- అక్షరసంఖ్యకు ప్రాధాన్యం లేకుండ ఏర్పడినవి మాత్రాగణాలు.  ఇవి సూర్య, ఇంద్ర, చంద్రగణాలని మూడు విధాలు.
1. సూర్యగణములు :- ఇవి రెండు. హగణము (UI), నగణము (III).
2. ఇంద్రగణములు :- ఇవి ఆరు. నల, నగ, సల, , , గణాలు.
నలము - IIII
నగము - IIIU
సలము - IIUI
భగణము - UII
రగణము - UIU
తగణము - UUI
3. చంద్రగణాలు :-  రగము (UIUU), నగగము (IIIUU), తగము (UUIU), సలగము (IIUIU), భగురువు (UIIU), నలగము (IIIIU), మలఘువు (UUUI), సగలము (IIUUI), రలము (UIUI), నగలము (IIIUI), తలము (UUII), సలలము (IIUII), భలము (UIII), నలలము (IIII).
పైన చెప్పిన మాత్రాగణాలలో కేవలం సూర్య, ఇంద్ర గణాలు మాత్రమే ప్రధానం. చంద్రగణాలు అక్కరలుఅనే ఛందస్సుకు చెందినవి. వీటిని ఇప్పుడు నేర్చుకోవలసిన అవసరం లేదు.

గణ విభజన :-
      పద్యపాదానికి గురు లఘువులను గుర్తించి, అందులో ఏ గణాలున్నవో తెలిసికొనడం. ఉత్పలమాల మొదలైన వృత్తాలకు, కందం మొదలైన జాతులకు, ఆటవెలది మొదలైన ఉపజాతులకు ఈ గణ విభజన వేరువేరుగా ఉంటుంది.
        ముందుగా వృత్తాల గణవిభజన చేద్దాం. ఈ వృత్తాలు కేవలం మూడక్షరాల గణాలతో ఏర్పడతాయి. చివర ఒక అక్షరం లేదా రెండక్షరాలు మిగలవచ్చు. సాధారణంగా గురువు మిగిలితే ‘గ’ అనీ, ఒక లఘువు, గురువు మిగిలితే ‘వ’ అనీ, రెండు గురువులు మిగిలితే ‘గగ(గా)’ అనీ గుర్తించాలి.

ఉదా…
శ్రీవేంక టేశద యితే త వ సుప్ర భాతమ్
UU I  UI  I   I  U  I  I  U I   U  U
   త     భ      జ      జ     గగ.

విజయీ భవ వేం కటశై లపతే
I  I  U   I  I  U   I I U I I U
   స       స      స     స

ఇంతలు గన్నులుం డఁ దెరు వెవ్వరి వేడేదు భూసురో త్తమా
U  I  I  U  I   U    I   I  I   UI  I  U I I   U  I  I    I U
    భ       ర            న       భ      భ        ర       వ

స్తుతమ తి యైన యాంధ్రక వి ధూర్జ టి పల్కు ల కేల కల్గెనో
 I  I  I   I   U  I   U   I  I  I  U  I  I   U  I   I U I  U I U
    న         జ        భ        జ         జ        జ      ర

తల్లీ ని న్నుఁ దలం చి పుస్త కము చే తంబూ ని తిన్ నీ వు నా
UU U  I     I   U  I  U  I  I  I   U  U  U   I  U  U  I   U
  మ         స          జ       స          త          త      గ

సరి బే సై రిపు డేల భా స్కరులు భాషానా థ పుత్రా వసుం
I I  U  U I I   U I U   I   I  I   U  U U  I  U U  I U


ఇలాగే మీరు కొన్ని వృత్తాలను (ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం) తీసికొని గణవిభజన చేయండి.