31, అక్టోబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1541 (రాముండిటు రమ్మటంచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముండిటు రమ్మటంచు రాధను పిలిచెన్.

పద్యరచన - 721 (తేలు కుట్టిన దొంగ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
 తేలు కుట్టిన దొంగ

30, అక్టోబర్ 2014, గురువారం

దత్తపది - 51 (తీపి-కారము-పులుపు-చేదు)

కవిమిత్రులారా!
తీపి - కారము - పులుపు - చేదు
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 720

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యాపూరణ- ఛందోవైవిధ్యం


ఛందోవైవిధ్యంతో సమస్యాపూరణం ఎలా?

సాధారణంగా సమస్య ఇచ్చినపుడు అది ఏ ఛందస్సులో ఉందో వెల్లడిగానే ఉంటుంది. ఉదాహరణకు శంకరాభరణం బ్లాగులో ఒక సమస్య
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట మేలగున్
అని ఉన్నది. ఈ సమస్య ఉత్పలమాలలో ఒక పాదంగా వస్తుంది.  సంప్రదాయికంగా సమస్యాపాదాన్ని చివరిపాదంగా ఉంచి పూర్తిచేస్తారు. కాని అది అనుల్లంఘ్యనీయమైన నియమం యేమీ కాదు.  పద్యంలోని సందర్భాన్ని బట్టి సమస్యాపాదాన్ని ఏ పాదంగానైనా వాడుకో వచ్చును.
ఇచ్చిన సమస్య ఒక పూర్తిపాదంగా లేని సందర్బాల్లో తరచుగా పూరణం చేసే వారు ఫలాని ఛందస్సులోనే పూర్తిచేయాలని ఆశించలేము.  కవి ప్రతిభను బట్టి, సమస్య ఇచ్చిన అవకాశాలను బట్టి కవిగారు తనకు నచ్చిన ఛందస్సులో ఇచ్చిన సమస్యను ఇరికించి పద్యం చెప్పవచ్చును.  కవి అలా స్వేఛ్చగా ఛందస్సును ఎన్నుకొనటాన్ని నిరోధిస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యను ఇచ్చిన వారే ఫలాని ఛందస్సులో పూర్తిచేయండి అని అడుగుతూ‌ ఉంటారు.
ఏ ఛందస్సులో పూర్తిచేయాలో స్పష్టంగా ఉన్నప్పుడు మనం ఎలాగూ ఆ విషయంలో ఆలోచించటానికి ఏమీ లేదు. కాని మనకి ఛందస్సును ఎన్నుకునే స్వేఛ్ఛ ఉన్నప్పుడు తగిన ఛందస్సును ఎలా నిర్ణయించుకోవటంఈ‌ విషయంలో నా అలోచనలను మీ‌ ముందు ఉంచాలనుకుంటున్నాను.
ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, దత్తపదులవంటి ప్రక్రియలకు ఎలాగూ ఇబ్బందులు లేవు.  విడిగా ఇచ్చిన పదాలే కాబట్టి అవకాశాలు మెఱుగ్గానే ఉంటాయి. ఒక పద్యపాదమో లేదా పద్యపాదంలో కొంతభాగమో ఇచ్చినప్పుడు ఎలా మనం ఛందస్సును ఎన్నుకోవచ్చునో అన్నది ఇక్కడ చర్చనీయాంశం.

         
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఒక సమస్యను చూడండి.
పేరు లేనట్టివానికి వేయిపేర్లు.
ఇచ్చిన సమస్య "పేరు లేనట్టివానికి వేయిపేర్లు" అన్నదానికి గురులఘుక్రమం చూస్తే U I U U I U I I U I U I అని వస్తున్నది. మనం రకరకాలుగా దీన్ని గణ విభజన చేసుకోవచ్చును.   U I  -  U U I -  U I I  -  U I -  U I అని సూ-ఇం-ఇం-సూ-సూ గణాలుగా చేసి మనం తేటగీతి పాదంగా వాడుకోవచ్చును. ఇది మనం సులభంగానే గుర్తిస్తున్నాము.
ఆ సమస్యను ఇస్తూ శంకరయ్యగారు ఫలాని ఛందస్సులో పూరించండి అనలేదు. కాని అందరూ ఇది తేటగీతిపాదం అని వెంటనే కనిపెట్ట గలరు కదా. అందుచేత అందరూ తేటగీతులే వ్రాసి పంపించారు. ఈ విషయంలో ప్రస్తుత వ్యాసకర్త చేసినది కూడా అదే.
ఇప్పుడు మనం ఈ సమస్యను తేటగీతి కాకుండా ఇతర ఛందస్సులలో ఎలా ఇరికించ వచ్చునో చూదాం.
మొద సీసపద్యంలో ఎలా ఇరికించవచ్చునో చూదాం. సీసపద్యంలో ప్రతిపాదానికి గణక్రమం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అనేది. అంటే వరుసగా ఆరు ఇంద్రగణాల తరువాత రెండు సూర్యగణాలు. ఇచ్చిన సమస్యని  వేరు రకంగా గణవిభజన చేసి చూదాం.  U I U -  U I U -  I I U I -  U I అని చేస్తేమనకు ఇప్పుడు ఇం-ఇం-ఇం-సూ అని వచ్చింది.  సీసపద్యపాదం గణక్రమంలో ఇది ఒదుగుతుందని సులభంగానే గుర్తించవచ్చును. ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ లో ఎలా ఒదిగేదీ క్రీగీతతో సూచిస్తున్నాను చూడండి ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని. కాని ఇలా చేసినప్పుడు మనకు ఈ‌ సమస్యతో యతివిషయంలో చిక్కు వస్తోంది. పేరులే-నట్టివా-నికివేయి-పేర్లు అని విడదీసి సీసంలో ఇరికించితే మనకు '' తో 'పే' కు యతిమైత్రి కుదరటం‌ లేదు.
ఇంకొక విధంగా ప్రయత్నిద్దాము. మనకు ఇచ్చిన సమస్యకు చివరన సూర్యగణం వస్తున్నది కదా? అదనంగా ఒక లఘువును చేరి భ-గణంగానో అదనంగా ఒక గురువును చేర్చి ర-గణంగానో మార్చి దానిని ఇంద్రగణంగా తీర్చిదిద్దామనుకోండి.  అప్పుడు మనకు ఇం-ఇం-ఇం-సూ+(ల. లేదా గు.)  = ఇం-ఇం-ఇం-ఇం అని సిధ్ధిస్తున్నది. ఇది మనకు సదుపాయంగానే ఉంటుంది. చూడండి.  సీసం యొక్క పాదం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని కదా మనం ఒకటి కంటే ఎక్కువరకాలుగా నాలుగు ఇంద్రగణాల వరుసను ఇరికించగలం. క్రీగీతలతో చూపుతున్నాను చూడండి.   ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  లేదా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  లేదా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ  అని మూడు రకాలుగా వ్రాయవచ్చును. మనకు ఇచ్చిన సమస్యను మార్చలేము కాబట్టి ఏరకంగా అమర్చితే యతిమైత్రి కుదుర్చుతూ వ్రాయవచ్చునో చూసుకొని పూరించవచ్చును.  ఈ‌ సమస్యను చూస్తే  పేరులే-నట్టివా-నికివేయు-పేర్లుX అన్నప్పుడు పే-ని లకు యతికుదరదు కాబట్టి పాదాదినుండి సమస్యను ఉంచలేం.  పాదాది మొదటిగణం విడిచి ఇరికిస్తే మొదటిగణం ''కు  యతిమైత్రి కలిగి ఉండాలి - ఇది పెద్ద చిక్కు కాదు. పాదాది రెండు గణాలు విడిచి వ్రాస్తే పాదాది గణం 'పే'తో యతిమైత్రి కలిగి ఉండాలి - ఇదీ చిక్కు కాదు.  అందుచేత ఈ విధంగా సీసపాదంలో ఇచ్చిన సమస్యను ఇరికించగలం!  అంటే మనం ఒక సీసపాదాన్ని సమస్యతో ఇచ్చిన సమస్యతో ఈ క్రిందివిధాలుగా తయారు చేయవచ్చును.
నప్పెడు పేరులే‌నట్టి వానికి వేయి   ।పేర్లు విశదముగ వెలుగుచుండె
విశదంబుగా నొక్క పేరులే నట్టి వా ।నికి వేయి పేర్లుగా నిగిడె యశము
సీసంలో‌ప్రాసయతులు చెల్లించవచ్చును కదా అన్న సదుపాయం గమనిస్తే నిజానికి ఇలాంటి పూరణ మరికొంత సుగమం అవుతుంది.
ఇప్పుడు మనం ఈ‌ సమస్యను మధ్యాక్కరలో ఏ విధంగా ఇరికించ వచ్చునో చూదాం.
మధ్యాక్కరలో ప్రతిపాదానికి గణవిభజన ఇం-ఇం-సూ-ఇం-ఇం-సూ అన్నవిధంగా ఉంటుంది. యతిస్థానం నాలుగవగణం అని కొందరి మతం. నన్నయగారు ఐదవగణం ప్రధమాక్షరం వాడారు యతిస్థానంగా. మహాప్రతిభావంతులు కాబట్టి విశ్వనాథవారు ఉభయస్థానాల్లోనూ విధిగా యతిమైత్రి పాటిస్తూ మరీ వ్రాసారు మధ్యాక్కరలను!
ప్రస్తుత సమస్య గురులఘుక్రమం U I U U I U I I U I U I  అన్నదాన్ని U I U -  U I U -  I I U I -  U I అని ఇం-ఇం-ఇం-సూ అన్నట్లుగా గణవిభజన చేయవచ్చును అని ఇప్పతికే‌ గమనించాం.  మధ్యాక్కరలో మూడు ఇంద్రగణాలు వరసగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు.  సరే, మరొక రకంగా U I  - U U I -  U I I  - U I - U I  అని గణవిభజన చేదాం. అదనంగా మరొక గురువునో లగువునో తగిలిద్దాం అప్పుడు U I  - U U I -  U I I  - U I - U I X అంటే సూ-ఇం-ఇం-సూ-ఇం అనివస్తుంది విభజన, వీటులో మొదటి సూర్యగణాన్ని పైపాదానికి బదలాయించ వచ్చును సుబ్బరంగా. అంటే మనం ఇలా వ్రాయవచ్చునన్న మాట.
ఇంద్ర ఇంద్ర సూర్య ఇంద్ర ఇంద్ర పేరు లేనట్టి వానికి వేయి పేర్లుX ఇంద్ర సూర్య యతిస్థానం మనకు హాయిగా రెండు విధాలుగా ఉంది కాబట్టి వీలు చూసుకొని ఇక్కడ ఐదవ గణాదిని యతిమైత్రి చేయవచ్చును.  అది మన చేతిలో ఉన్నదే సమస్యకు ఆవలగా. కాబట్టి ఇబ్బంది లేదు.
ఉదాహరణకు తేటగీతి కాక రెండు ఛందస్సులలో ఈ‌సమస్యను ఎలా ఇరికించి పూర్తిచేయవచ్చునో సూచనప్రాయంగా వివరించాను.  ఇచ్చిన సమస్య యొక్క గురులఘుక్రమాన్ని బట్టి ఏ విధంగా తగిన ఛందస్సును ఎంపిక చేసుకోవాలో పూరణ చేసే వారు ఆలోచించుకోవాలి. ఇక ఇరికించటం అన్న ప్రక్రియ విషయంలో మనం అనుకున్న పధ్ధతులు ఉపయోగిస్తాయి.

తాడిగడప శ్యామలరావు

29, అక్టోబర్ 2014, బుధవారం

బ్లాగు మిత్రులు కలిసారు...

నిన్నటి జడశతకం ఆవిష్కరణ సభలో బ్లాగు మిత్రులను కలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. జడశతకంలో పద్యాలు ప్రచురింపబడ్డ చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారలకు తనికెళ్ళ భరణి గారి చేతులమీదుగా సన్మానం జరగడం కనువిందు చేసింది. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి పద్యాలు అందులో ప్రకటింపబడక పోవడంతో వారు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారు. నేను పంపిన బ్లాగు మిత్రుల (డా. విష్ణునందన్ గారు, గుండు మధుసూదన్ గారు మొదలైనవారి) పద్యాలు కూడా ప్రకటింపబడకపోవడం నాకూ నిరుత్సాహాన్ని కలిగించింది.
చంద్రమౌళి సూర్యనారాయణ గారు నాకు భోజనం చేయించి, రైల్వేటికెట్ రిజర్వ్ చేయించి, స్లీపర్ బోగీలో ఎక్కించడం వల్ల ప్రయాణం సుఖంగా జరిగింది. వారికి నా ధన్యవాదాలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, 
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారలతో నేను...

సమస్యా పూరణం – 1540 (పేరు లేనట్టివానికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పేరు లేనట్టివానికి వేయిపేర్లు.

28, అక్టోబర్ 2014, మంగళవారం

న్యస్తాక్షరి - 12

అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు.
ఛందస్సు- ఆటవెలఁది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్యా - గ - రా - జు’ ఉండాలి.

27, అక్టోబర్ 2014, సోమవారం

ఆహ్వానం!

‘జడ శతకం’ ఆవిష్కరణోత్సవ ఆహ్వానం

సమస్యా పూరణం – 1539 (దీప మ్మార్పఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దీప మ్మార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.
(ఆకాశవాణి వారి సమస్య)

పద్యరచన - 719

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, అక్టోబర్ 2014, ఆదివారం

నిషిద్ధాక్షరి - 16

కవిమిత్రులారా,
రామపట్టాభిషేకాన్ని వర్ణిస్తూ తేటగీతి వ్రాయండి.
మొదటిపాదాన్ని ‘రా’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘మ’ నిషిద్ధం.
రెండవపాదాన్ని ‘భ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘ర’ నిషిద్ధం.
మూడవపాదాన్ని ‘ల’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘క్ష్మ’ నిషిద్ధం.
నాలుగవపాదాన్ని ‘శ’తో ప్రారంభించండి. రెండవ అక్షరంగా ‘త్రు’ నిషిద్ధం.
నిషిద్ధాక్షరాలు కేవలం పాదంలో రెండవస్థానానికే పరిమితం. పద్యంలో మిగిలిన స్థానాలలో వాడవచ్చు.

పద్యరచన - 718 (వృక్షో రక్షతి రక్షితః)

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, అక్టోబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1538 (హరి హరికిన్ హరిని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.

పద్యరచన - 717

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

దత్తపది - 50 (కటి-కిటి-తటి-నటి)

కవిమిత్రులారా!
కటి - కిటి - తటి - నటి
పైపదాలను ఉపయోగిస్తూ సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 716

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23, అక్టోబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1537 (తెలుఁగుల సంవత్సరాది)

కవిమిత్రులారా,

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
 తెలుఁగుల సంవత్సరాది దీపావళియే.

పద్యరచన - 715

కవిమిత్రులారా,

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పద్యరచన చేయండి.

22, అక్టోబర్ 2014, బుధవారం

న్యస్తాక్షరి - 11

అంశం- దీపావళి.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదంలో మొదటి అక్షరం ‘దీ’, రెండవపాదంలో నాల్గవ అక్షరం ‘పా’,
మూడవ పాదంలో పదవ అక్షరం ‘వ’, నాల్గవపాదంలో పందొమ్మిదవ అక్షరం ‘ళి’.
(పదవ అక్షరం గురువు కావాలి. అంటే ‘వ’ తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)

పద్యరచన - 714 (నరకాసుర సంహారము)

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, అక్టోబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1536 (సద్గ్రంథపఠనము జనుల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సద్గ్రంథపఠనము జనులఁ జవటలఁ జేయున్.

పద్యరచన - 713

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, అక్టోబర్ 2014, సోమవారం

నిషిద్ధాక్షరి - 15

కవిమిత్రులారా,
"ల. ళ" లు లేకుండ
ఊర్మిళాదేవి నిద్రను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 712 (ఆర్త రక్షణము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"ఆర్త రక్షణము"

19, అక్టోబర్ 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1535 (మృచ్ఛకటిక శకారుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మృచ్ఛకటిక శకారుఁడు మేలు జేసె.

పద్యరచన - 711 (పదుగు రాడు మాట)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
‘పదుగు రాడు మాట’

18, అక్టోబర్ 2014, శనివారం

దత్తపది - 49 (కోపము-చాపము-తాపము-పాపము)

కవిమిత్రులారా!
కోపము - చాపము - తాపము - పాపము
పైపదాలను ఉపయోగిస్తూ ఉతరుని ప్రగల్భములను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 710

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17, అక్టోబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1534 (గంగను మున్గి పాపముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 709

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, అక్టోబర్ 2014, గురువారం

న్యస్తాక్షరి - 10

అంశం- భానుమతి.
(దుర్యోధనుని భార్య, సహదేవుని భార్య, సినీనటి వీరిలో ఎవరి గురించి వ్రాసినా సరే!) 
ఛందస్సు- ఆటవెలఁది. 
నాలుగు పాదాలలో చివరి అక్షరాలు వరుసగా భా, ను, మ, తి ఉండాలి.

పద్యరచన - 708

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, అక్టోబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1533 (గజముఖుండగు మారుతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గజముఖుండగు మారుతి కాయు జనుల.

పద్యరచన - 707

కవిమిత్రులారా,

మొన్నటి విశాఖపట్టణపు టందాలు... నేడు?
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, అక్టోబర్ 2014, మంగళవారం

నిషిద్ధాక్షరి - 14

‘ర’ అన్న అక్షరాన్ని ఉపయోగించకుండా
రామ రావణ యుద్ధాన్ని వర్ణిస్తూ
కందపద్యం వ్రాయండి.

పద్యరచన - 706

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, అక్టోబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం – 1532 (అంబను బెండ్లాడె భీష్ముఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అంబను బెండ్లాడె భీష్ముఁ డతిమోహమునన్.

పద్యరచన - 705

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, అక్టోబర్ 2014, ఆదివారం

దత్తపది - 48 (ఆది, సోమ, మంగళ, బుధ)

కవిమిత్రులారా
ఆది - సోమ - మంగళ - బుధ
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 704

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, అక్టోబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1531 (కౌంతేయుల మేనమామ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కౌంతేయుల మేనమామ కర్ణుండు గదా.
(ఈ సమస్యను సూచించిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు)

పద్యరచన - 703

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 108


రావిపాటి లక్ష్మినారాయణ

చంపకమాల(...)లో, కందద్వయము [...]లో, తేటగీతి {...}లో, ఆటవెలది “...”లోఁ దెలుపబడి, యివి గర్భితమైన సీసము
సీ.        (అతి[కరుణాత్ముడా {పతి యనంతరసాన్వి
తప్రస్ఫుటాంగ}తా])త సుగుణకలి
([త తతబలా] ప్రభూ {పతితతారక సద్ధృ
తి ప్రాజ్ఞవీర} సం)ధితరుచిర వి
(తత[వరదాయకా {యతుల నవ్యరమాయు
త ఖ్యాతియుక్త} పా)]తకరహిత ల
([లితసుభగా] విభూ {కృతి సులేఖ సుధీవ
రశ్రేష్ఠబంధు}రా) రమ్యచరిత
గీ.         నత[వరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువనభా]స
హిత [సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా]త. (౧౨౫)
(సీసములో నాలుగుపాదముల యందును ౧౬వ అక్షరములగు త, తి, , రలు సీసమునందు గురువులు, తక్కిన కంద గీత చంపకమాలలందు లఘువులు. అనఁగా సీసమునందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగ, సద్ధృతిప్రాజ్ఞ, నవ్యరమాయుతఖ్యాతియుక్త, సుధీవరశ్రేష్ఠబంధు యని యొక్కొక్కదానిని సమాసముగఁ జదువవలెను. కంద, గీత, చంపకమాలలందు అనంతరసాన్విత, ప్రస్ఫుటాంగ, సద్ధృతి, ప్రాజ్ఞ, నవ్యరమాయుత, ఖ్యాతియుక్త, సుధీవర, శ్రేష్ఠబంధు యని వేఱువేఱుగా జదువవలెను.)
గర్భిత చంపకమాల-
అతికరుణాత్ముడా పతి యనంతరసాన్విత ప్రస్ఫుటాంగతా
త తతబలా ప్రభూ పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర సం
తత వరదాయకా యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త పా
లితసుభగా విభూ కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధురా!

గర్భిత కందద్వయము-
కరుణాత్ముడా పతి యనం
తరసాన్వితప్రస్ఫుటాంగతాత తతబలా
వరదాయకా యతుల న
వ్యరమాయుత ఖ్యాతియుక్త పాలితసుభగా.

వరద రవిశశినయన పర
పరమపురుష భక్తతోష భరితభువన భా
సురమునిజనవినుత హతది
తిరుహ త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా.

గర్భిత తేటగీతి-
పతి యనంతరసాన్వితప్రస్ఫుటాంగ
పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర
యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త
కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధు.

గర్భిత ఆటవెలది-
నతవరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన
హిత సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ.

గద్యము-
ఇది విద్వద్విధేయ, రావిపాటి చలమయామాత్యపుత్ర,
లక్ష్మీనారాయణ ప్రణీతంబయిన
నిర్వచన భారతగర్భ రామాయణము
సర్వము నేకాశ్వాసము
సంపూర్ణము.

10, అక్టోబర్ 2014, శుక్రవారం

న్యస్తాక్షరి - 9

అంశం- విజయవాడ.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా బె, జ, వా, డ ఉండాలి.

పద్యరచన - 702

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 107


రావిపాటి లక్ష్మినారాయణ

కం.       శర్మదముల నీకథల వి
నిర్మలమతిఁ బాడినన్ వినినఁ జదివిన స
ద్ధర్మమయుఁడు సర్వేశ్వరుఁ
డర్మిలితోడుత నొసఁగు మనోభీష్టంబుల్. (౧౨౨)

కం.       శ్రీరావిపాటి లక్ష్మీ
నారాయణ యొనరిచె రచనన్ గర్భమునన్
భారత మిడి నిర్వచనము
గా రామాయాణముఁ జంద్రకమలాప్తముగన్. (౧౨౩)

చక్రబంధము
(మొదటి మూడుపాదములందలి మొదటినుండి మూడవ చివరినుండి మూడవ యక్షరములు కవిపేరును, మొదటినుండి యాఱవ చివరినుండి యాఱవ యక్షరములు గ్రంధముపేరును తెలుపును.)
శా.        రక్షోరాతి పరాత్పరా వరద ధీరా రమ్యశూరాన్వితా
దక్షా లక్షణ మత్తసంహర కృతీ దాతక్రమా యచ్యుతా
రక్షా నాకులభాగ్యమా వరగభీరా ముక్త బాణవ్రతా
తాక్షోణీరమణా దయాశరధి భూతాళిస్తుతా కామితా. (౧౨౪)

9, అక్టోబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1530 (గడ్డములఁ బెంచి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గడ్డములఁ బెంచి మురిసిరి కాంత లెల్ల.
(ఈ సమస్యను సూచించిన ‘పరాక్రి’ గారికి ధన్యవాదాలు)

పద్యరచన - 701

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 106


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.        అగ్నిలోఁ జొప్పించి, యతివపాతివ్రత్య
ముఁ బరీక్ష సల్పి రాముండు ప్రీతి
బ్రహ్మేంద్రముఖ్యామరనుతులఁ గొని, తండ్రి
బ్రత్యక్షమైనంత భక్తి నెఱగి,
యవనిజాతాలక్ష్మణాదులతోఁ బుష్ప
కము నెక్కి వచ్చి గరిమ నయోధ్యఁ
బట్టాభిషిక్తుఁడై ప్రబలెఁ దమ్ములు గొల్వఁ;
బుత్రులను గుశలవులనుఁ గాంచె;
గీ.         (సలిపె హయమేధ మత డలర లలి బుధులు;
ప్రజలు రామరాజ్యము మఱువన్) జన మని
(బలువిడలరొంద నేలెను; నెలకుఁ దిగ జ
డు లొలసెఁ బ్రజ నీతిగనెఁ గడున్) సుఖమున. (౧౨౧)

భారతము-
కం.       సలిపె హయమేధ మత డల
ర లలి బుధులు;ప్రజలు రామరాజ్యము మఱువన్
బలువిడలరొంద నేలెను;
నెలకుఁ దిగ జడు లొలసెఁ బ్రజ నీతిగనెఁ గడున్. (౧౨౧)
టీక- (రెంటికి) హయమేధము = అశ్వమేధయజ్ఞము; తిగ జడులు = మూడువానలు; పలువిడి = ఎక్కువ.

8, అక్టోబర్ 2014, బుధవారం

నిషిద్ధాక్షరి - 13

మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 700

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 105


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
ఉ.        తా (క్షితి నిట్లు దుష్టులను దంచి తగం బురుషోత్తముండు శ్రీ
దక్షుఁ బరీ)తభూతి ఘనతాయుతు నింద్రుని దైత్యబాధ సం
ర(క్షితు సాఁకె; రాజుగను రాజితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షే
మక్షణుఁడున్) విభీషణుఁడు మంగళుఁడై రఘురాము నానతిన్. (౧౨౦)

భారతము-
కం.       క్షితి నిట్లు దుష్టులను దం
చి తగం బురుషోత్తముండు శ్రీదక్షుఁ బరీ
క్షితు సాఁకె; రాజుగను రా
జితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షేమక్షణుఁడున్. (౧౨౦)

టీక- పురుషోత్తముఁడు = (రా) రాముఁడు, (భా) కృష్ణుఁడు; పరీత = (రా) చుట్టుకొనబడిన; యుధిష్ఠిరుండు = (రా) యుద్ధమందు స్థిరమగువాఁడు; క్షణుఁడు = (రెంటికి) ఉత్సాహముగలవాఁడు; దంచి = నాశనము చేసి; భూతి = ఐశ్వర్యము.

7, అక్టోబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1529 (వేదము లేడని గణించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్.
(ఈ సమస్యను సూచించిన ‘పరాక్రి’ గారికి ధన్యవాదాలు)

పద్యరచన - 699

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 104


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
ఉ.       రోసము మించగా (నరవరుండు నతండు నొనర్చి రాజి)నిన్
వేసెను రాముఁడున్ (బలిమి భీషణలీలనుఁ బద్మజాస్త్ర) మె
చ్చౌ సరి నెన్ని బా(ములను, నారిపు తేజము మొత్తె; వేగ) నా
దోసినిఁ గూల్చెఁ, దద్(విజయు దోర్బల మర్మిలి వేల్పు లెన్నఁ)గన్. (౧౧౯)

భారతము-
గీ.       నరవరుండు నతండు నొనర్చి రాజి
బలిమి భీషణలీలనుఁ బద్మజాస్త్ర
ములను, నారిపు తేజము మొత్తె; వేగ
విజయు దోర్బల మర్మిలి వేల్పు లెన్న. (౧౧౯)

టీక- నరవరుండు = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; ఆజి = యుద్ధమును; పద్మజాస్త్రము = బ్రహ్మాస్త్రము; (రా) ఎచ్చౌ = హెచ్చగు; బాముల = కష్టముల; విజయ = జయశీలుని; దోర్బలము = భుజబలము; అర్మిలి = ప్రేమ.