26, జూన్ 2019, బుధవారం

సమస్య - 3059 (అంబనుఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంబను బెండ్లాడె భీష్ముఁ డందరు మెచ్చన్"
(లేదా...)
"అంబను బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ భీష్ముఁ డయ్యెడన్"

25, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3058 (కారాగృహ సుఖము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్"
(లేదా...)
"కారాగారమునందు లభ్యమగు సౌఖ్యం బున్నదే యొండెడన్"

24, జూన్ 2019, సోమవారం

సమస్య - 3057 (శిశుపాలుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్"
(లేదా...)
"వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే"

23, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3056 (ఫుల్ల సరోజ నేత్రలకు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె"
(లేదా...)
"ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్"

22, జూన్ 2019, శనివారం

సమస్య - 3055 (కలముం గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలముం   గని   కవివరుండు   కలవరమందెన్"
(లేదా...)
"కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

21, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3054 (శునకమ్మున్ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్"
(లేదా...)
"శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

20, జూన్ 2019, గురువారం

సమస్య - 3053 (స్తనములు నాలుగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్"
(లేదా...)
"స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

19, జూన్ 2019, బుధవారం

సమస్య - 3052 (అధర మెటుల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అధరము  మధురం బెటులగు నంబుజ వదనా"
(లేదా...)
"అధర మెటుల్ సుధామధురమౌను సరోజముఖీ వచింపవే"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

18, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3051 (ప్రాణము లేని వస్తువులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాణమే లేని వస్తువుల్ పరుగులెత్తె"
(లేదా...)
"ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్రమే సుమీ"
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

17, జూన్ 2019, సోమవారం

సమస్య - 3050 (నీతులఁ జెప్పంగరాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నీతులఁ జెప్పంగరాదు నిరవధికముగన్"
(లేదా...)
"నిరవధికంబుగాఁ జెలఁగి నీతులఁ జెప్పఁగ రా దెవారికిన్"
(ఈ సమస్యను పంపిన విట్టుబాబు గారికి ధన్యవాదాలు)

16, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3049 (జాషువ జాడకై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జాలిగ గబ్బిలము వెదకె జాషువ కొఱకై"
(లేదా...)
"జాషువ జాడకై వెదకె జాలిగ గబ్బిల మిప్పుడీ గడిన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో మంథెని శంకరయ్య గారి సమస్య)

15, జూన్ 2019, శనివారం

సమస్య - 3048 (జలజల జాలువారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జలజములు చాలును మనకు జాతు లేల"
(లేదా...)
"జలజల జాలువారు జలజంబులు చాలును జాతు లేలొకో"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో డా. ఎన్.వి.ఎన్. చారి గారి సమస్య)

14, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3047 (వాలమ్మొక్కటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాలమ్మే తక్కువ కద వసుధాసుతకున్"
(లేదా...)
"వాల మ్మొక్కటి తక్కువయ్యెను గదా వామాక్షి సీతమ్మకున్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో సిద్దంకి బాబు గారు ఇచ్చిన ప్రసిద్ధ సమస్య)

13, జూన్ 2019, గురువారం

సమస్య - 3046 (మాధుర్యమ్మది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాధుర్యము తగ్గెనేమి మద్దూరి కవీ"
(లేదా...)
"మాధుర్యమ్మది తగ్గెపోయెను గదా మద్దూరి పద్యమ్ములన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో చేపూరి శ్రీరామారావు గారి సమస్య)

12, జూన్ 2019, బుధవారం

సమస్య - 3045 (కారణము లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారణము లేని కార్యమె ఘనతఁ గాంచు"
(లేదా...)
"కారణమేమి లేనిదగు కార్యమదే ఘనతం గనుం గదా"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో దోమల భిక్షపతి గారి సమస్య)

11, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3044 (కుపిత రాముఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె"
(లేదా...)
"కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో 
ఎన్.సిహెచ్. శ్రీనివాస రంగాచార్యులు గారి సమస్య)

10, జూన్ 2019, సోమవారం

సమస్య - 3043 (చింతన లోపించిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చింతన లోపించిన యతి సిద్ధినిఁ బొందెన్"
(లేదా...)
"చింతన సుంత లేని యతి సిద్ధినిఁ బొందె జనుల్ నుతింపఁగన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో పాతూరి రఘురామయ్య గారి సమస్య)

9, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3042 (జారిణి పంచిపెట్టిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్"
(లేదా...)
"జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో అక్కెర సదానందాచారి గారి సమస్య)

8, జూన్ 2019, శనివారం

సమస్య - 3041 (చెడువాఁ డీతఁడు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెడువాఁడని రామమూర్తిఁ జెప్పెదరు కవుల్"
(లేదా...)
"చెడువాఁ డీతఁ డటంచుఁ బల్కెదరయా శ్రీరామమూర్తిన్ గవుల్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో గుండు మధుసూదన్ గారి సమస్య)

7, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3040 (పారెద రోరుగల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఓరుగల్ వాసు లవధాన మొప్ప మనిరి"
(లేదా...)
"పారెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో నేనిచ్చిన సమస్య)

6, జూన్ 2019, గురువారం

సమస్య - 3039 (నెరజాణల్ గనరారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నెరజాణలు గానరారు నెల్లూరు పురిన్"
(లేదా...)
"నెరజాణల్ గనరారుపో వెదకినన్ నెల్లూరులో నయ్యయో"

5, జూన్ 2019, బుధవారం

సమస్య - 3038 (హరుఁడె లోకవిత్త...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము"
(లేదా...)
"హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో చిటితోటి విజయకుమార్ గారి సమస్య)

4, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3037 (చీమ కఱచి చచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమ కఱచి చచ్చె సింహబలుఁడు"
(లేదా...)
"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"
(మద్దూరి రామమూర్తి గారి భువనగిరి అష్టావధానంలో సమస్య)

3, జూన్ 2019, సోమవారం

సమస్య - 3036 (రంగాచారి నమాజుఁ జేసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్"

2, జూన్ 2019, ఆదివారం

న్యస్తాక్షరి - 63

సరస్వతీ దేవిని స్తుతిస్తూ ఆటవెలది వ్రాయండి.
నాలుగు పాదాల యతిస్థానంలో వరుసగా 'స-ర-స్వ-తీ' అనే అక్షరాలుండాలి. 
(లేదా...)
సరస్వతీ దేవిని స్తుతిస్తూ చంపకమాల వ్రాయండి.
న్యస్తాక్షరములు.....
1వ పాదం 1వ అక్షరం 'స'
2వ పాదం 6వ అక్షరం 'ర'
3వ పాదం 15వ అక్షరం 'స్వ'
4వ పాదం 21వ అక్షరం 'తీ'

1, జూన్ 2019, శనివారం

'The News Minute' పత్రికలో నా గురించి పరిచయం...

https://www.thenewsminute.com/article/love-poetry-meet-70-yr-old-reviving-telugu-padyams-his-blog-102693

సమస్య - 3035 (రాముని రాఘవుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముని రాఘవునిఁ బొగడరా దనిలసుతా!"
(లేదా...)
"రాముని రాఘవున్ బొగడరా దనిలాత్మజ భక్తితో నిటన్"

31, మే 2019, శుక్రవారం

సమస్య - 3034 (ఉత్పలగంధి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఉత్పలగంధి యిప్పు డూహూ యనకే"
(ఛందోగోపనము)
(లేదా...)
"ఉత్పలగంధిరో యిపుడు నీ వూహూ యనం బాడియే"
(ఛందోగోపనము)

30, మే 2019, గురువారం

సమస్య - 3033 (దంష్ట్రలమీఁద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దంష్ట్రలపై శంకరుండు దాండవమాడెన్"
(లేదా...)
"దంష్ట్రలమీఁద శంకరుఁడు దాండవమాడెను రాము కైవడిన్"

29, మే 2019, బుధవారం

సమస్య - 3032 (తాఁబేలును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తాఁబేలునుఁ జెవులపిల్లి తవిలి గెలుచునా"
(లేదా...)
"తాఁబేలును గెల్వఁగాఁ జెవులపిల్లికి సాధ్యమె స్పర్థఁ బూనినన్"
(ఛందోగోపనము)

28, మే 2019, మంగళవారం

సమస్య - 3031 (అన్నమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అన్నమే పరబ్రహ్మమౌ ననుట తప్పు"
(లేదా...)
"భావ్యంబౌనొకొ ప్రాజ్ఞు లన్నముఁ బరబ్రహ్మంబుగా నెంచఁగన్"

27, మే 2019, సోమవారం

ఆహ్వానం (శతావధానం)

సమస్య - 3030 (గవ్వకుఁ గొఱగావు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గవ్వకుఁ గొఱగావు మేటి కవి నందువొహో"
(లేదా...)
"గవ్వకుఁ గూడఁ జూడఁ గొఱగావు కవీంద్రుండ నందువే యొహో"

26, మే 2019, ఆదివారం

సమస్య - 3029 (ఉష్ణీషముతోడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఉష్ణీషముతోడఁ గట్ట నొప్పును గజమున్"
(లేదా...)
"ఉష్ణీషంబునఁ గట్టవచ్చును మదవ్యూఢోగ్ర శుండాలమున్"

25, మే 2019, శనివారం

సమస్య - 3028 (కలహమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలహమ్ములు గల్గు భువినిఁ గాంతలచేతన్"
(లేదా...)
"కలహము లీభువిన్ గలుగఁ గాంతలె కారణమౌదు రెప్పుడున్"

24, మే 2019, శుక్రవారం

సమస్య - 3027 (కామిని పాదనూపురము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"
(తేటగీతిలో పూరించరాదు)

(లేదా...)

"కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతువేమొకో"
(ఉత్పలమాలలో పూరించరాదు)

'...ఖంగున మ్రోగదు...' అని ప్రశస్తమైన సమస్యయే. కొద్దిగా మార్చవలసి వచ్చింది.

23, మే 2019, గురువారం

సమస్య - 3026 (కలలు కల్లలైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలలు కల్లలైనఁ గల్గె ముదము"
(లేదా...)
"కలలవి కల్లలైనపుడు కల్గెడి మోద మదెంత గొప్పదో"

22, మే 2019, బుధవారం

దత్తపది - 157

కడ, జడ, దడ, వడ
పై పదాలను ప్రయోగిస్తూ
ఎన్నికల ఫలితాలకై ఎదురుచూసే
అభ్యర్థుల ఉత్కంఠస్థితిని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

21, మే 2019, మంగళవారం

సమస్య - 3025 (మార్జాలము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మార్జాలము సింహమయ్యె మర్మంబేమో"
(లేదా...)
"మార్జాలంబట సింహమయ్యె నవురా మర్మం బెదో చెప్పుమా"

20, మే 2019, సోమవారం

సమస్య - 3024 (కావ్యమ్మును వ్రాసి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కావ్యమ్మును వ్రాసి తీయఁగా నగు నుసురుల్"
(లేదా...)
"కావ్యము వ్రాసి తీయనగుగాదె రసజ్ఞుల ప్రాణముల్ కవీ"

19, మే 2019, ఆదివారం

సమస్య - 3023 (పుస్తకావిష్కరణోత్సవము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గ్రంథావిష్కరణోత్సవము లేల వెఱ్ఱివె సుమ్మీ" 
(ఛందోగోపనం)
(లేదా...)
"పుస్తకావిష్కరణోత్సవమ్ములను వేడ్క నొనర్పగ నేల వెఱ్ఱివే" 
(ఛందోగోపనం)

18, మే 2019, శనివారం

ఆహ్వానం (పుస్తకావిష్కరణ)


మన్నించండి. తేదీ తప్పు పడింది. 19-5-2019 గా చదువుకొనండి.

సమస్య - 3022 (శర్కర చేఁదగును....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శర్కర చేఁదగును మఱి విషమ్ము మధురమౌ"
(లేదా...)
"శర్కర చేఁదుగా నగు విషంబు గొనన్ మధురంబునౌ సఖా"

17, మే 2019, శుక్రవారం

సమస్య - 3021 (హింస లేనిచోట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హింస లేనిచోట హితము లేదు"
(లేదా...)
"హింసయె లేనిచో హితము నెట్టులఁ బొందగ వచ్చు నీ ధరన్"
(ఈ సమస్యను పంపిన విట్టుబాబు గారికి ధన్యవాదాలు)

16, మే 2019, గురువారం

సమస్య - 3020 (మూఢమె ముద్దటంచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మూఢమె శుభకార్యములకు ముద్దనిరి జనుల్"
(లేదా...)
"మూఢమె శ్రేష్ఠమౌచు శుభముల్ బొనరించును కార్యసిద్ధికిన్"

15, మే 2019, బుధవారం

సమస్య - 3019 (గాడిద కాల్పట్ట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్యమగున్"
(లేదా...)
"గాడిద కాలుఁ బట్టుకొనఁ గల్గును మోక్షము తన్నకుండినన్"

14, మే 2019, మంగళవారం

సమస్య - 3018 (పుఱ్ఱెలు మాటలాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్"
(లేదా...)
"పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపురీతి సజీవులో యనన్"

13, మే 2019, సోమవారం

సమస్య - 3017 (దేవుఁడు లేని....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దేవుడే లేని గుడి కడు దివ్యమయ్యె"  
(లేదా...)  
"దేవుడులేని మందిరము దివ్యమునై విలసిల్లు నిచ్చలున్"
(ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాదరావు గారికి ధన్యవాదాలు)

12, మే 2019, ఆదివారం

సమస్య - 3016 (సారా తెమ్మనెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సారా తెమ్మనెను రామచంద్రుఁడు హనుమన్"
(లేదా...)
"సారా తెమ్మనె రాఘవుండు హనుమన్ సంరంభమే పొంగఁగన్"

11, మే 2019, శనివారం

సమస్య - 3015 (కలనుఁ దలఁచుకొన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలనుఁ దలఁచుకొన్నఁ గలుఁగు సుఖము"
(లేదా...)
"కలను స్మరించినంతనె సుఖమ్ము ముదమ్ము శమమ్ముఁ జేకుఱున్"

10, మే 2019, శుక్రవారం

సమస్య - 3014 (మకరమ్మును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మకరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్"
(లేదా...)
"మకరముఁ బట్టి ముద్దులిడె మానిని మిక్కిలి ప్రీతిఁ జూపుచున్"

9, మే 2019, గురువారం

సమస్య - 3013 (దారా సంగమము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దారా సంగమము మిగుల దౌష్ట్యము సుమ్మీ"
(లేదా...)
"దారను సంగమించుటయె దౌష్ట్యమగున్ గృహమేధి కెప్పుడున్"

8, మే 2019, బుధవారం

సమస్య - 3012 (కుంజర యూధంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్"
(లేదా...)
"కుంజర యూధ మొక్కటిగఁ గూడియుఁ జొచ్చెను దోమ కుత్తుకన్"

7, మే 2019, మంగళవారం

సమస్య - 3011 (నాలుగారులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాలుగారులు పదునాలు గగును"
(లేదా...)
"నాలుగారులు చూడఁగాఁ బదునాలుగే కద లెక్కకున్"

6, మే 2019, సోమవారం

ఆహ్వానం (పుస్తకావిష్కరణ)


సమస్య - 3007 (నీటిమీఁది వ్రాత..)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నీటిమీఁది వ్రాత నిలుచు సతము"
(లేదా...)
"నీటన్ వ్రాసిన వ్రాత శాశ్వతముగా నిల్చున్ గదా మిత్రమా"

5, మే 2019, ఆదివారం

సమస్య - 3008 (కుడ్యముపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుడ్యముపై నున్న తేలు కుట్ట దెవారిన్"
(లేదా...)
"కుడ్యము మీఁది వృశ్చికము కుట్ట దెవారిని ముట్టి చూచినన్"

4, మే 2019, శనివారం

సమస్య - 3007 (అధ్యాపక వృత్తి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అధ్యాపక వృత్తి కంటె నధమము గలదే"
(లేదా...)
"అధ్యాపక వృత్తి కంటె నధమాధమమైనది గల్గ దెద్దియున్" 
(ఛందోగోపనము)

3, మే 2019, శుక్రవారం

దత్తపది - 156 (బాల్‌-రన్‌-వికెట్‌-విన్)

బాల్ - రన్ - వికెట్ - విన్
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. 

2, మే 2019, గురువారం

సమస్య - 3004 (సత్కృతి నంకితము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సత్కృతి నంకితము గొనఁగ జంకెదరు జనుల్"
(లేదా...)
"సత్కృతి నంకితమ్ము గొన జంకెద రెల్ల జనుల్ విరక్తులై"

1, మే 2019, బుధవారం

సమస్య - 3003 (వనితాలోలుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వనితాలోలుండు వెలిఁగె పండితనుతుఁడై"
(లేదా...)
"వనితాలోలుఁడె రాజపూజ్యుఁడును విద్వద్వంద్యుఁడై వెల్గెలే"

30, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 3002 (లోఁతుఁ దెలియ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లోఁతుఁ దెలియలేరు లోకు లెపుడు"
(లేదా...)
"లోఁతు నెఱుంగ సాధ్యమొకొ లోకులకున్ బలుగాకి మూఁకకున్"

29, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 3001 (తాళము వేయఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తాళము వేయంగ నొప్పు ధర్మము నిల్పన్"
(లేదా...)
"తాళము వేయఁగా వలెను ధర్మము నిల్పగ బుద్ధిజీవికిన్"

28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఒక విన్నపం!

          'మధురకవి'గా ప్రసిద్ధులైన గుండు మధుసూదన్ గారిది నిజానికి ప్రౌఢ కవిత్వం. అయితే వారు కొన్ని బాలల కథలను సరళమైన భాషలో పద్యఖండికా రూపంలో వ్రాసారని కొందరికే తెలుసు.
          కొందరు మిత్రులం ఆ ఖండికలను 'బాలల పద్య కథలు' అనే పేరుతో బొమ్మలతో సహా పుస్తక రూపంలో తీసుకురావాలని సంకల్పించాము. అయితే ముద్రణావ్యయాన్ని భరించే స్థితిలో మధుసూదన్ గారు లేరు. ముద్రణ కర్చు అంతా ఒక్కరే భరించే దాతలు దొరకలేదు.(ఎవరైనా ముందుకు వస్తే అంతకంటె అదృష్టమా?) అందుకే మేము తలా కొంత వేసుకుంటున్నాము. డి.టి.పి. నేనే చేస్తున్నాను. సహృదయులు, పద్యకవితాభిమానులు స్పందించి తమకు తోచినంత ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. నిర్బంధం ఏమీ లేదు. ఐచ్ఛికమే. పదిమందికి (ముఖ్యంగా పిల్లలకు) ఉపయోగపడే ఈ పుస్తకం వెలుగు చూడడానికి మనవంతు సాయం మనం చేద్దాం.
          డబ్బులు పంపవలసిన అకౌంటు వివరాలు క్రింద ఇస్తున్నాను.
MADHUSUDHAN GUNDU
STATE BANK OF INDIA,
Khammam Road Branch,
WARANGAL
A/c No. 62021705201
IFSC: SBIN0021851

సమస్య - 3000 (చాలు నింక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చాలు నింక కంది శంకరయ్య"
(లేదా...)
"చాలును కంది శంకరయ! చాలిక నీ గుణదోష చర్చలున్"
(ఈనాటితో సమస్యల సంఖ్య 3000 అయిన సందర్భంగా...)

27, ఏప్రిల్ 2019, శనివారం

సమస్య - 2999 (కాంక్షలె యుండవు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంక్షలె యుండవు జనులకుఁ గలియుగమందున్"
(లేదా...)
"కాంక్షలె యుండవీ కలియుగంబున మానవజాతికిన్ గనన్"

26, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2998 (రవికయె చాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రవికయే చాలుఁ గద చీర రమణి కేల"
(లేదా...)
"రవికయె చాలు నొక్కటి కురంగవిలోచన కేల చీరయున్"

25, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2997 (పరులకు మేలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరులకున్ మేలుఁ జేసినఁ బాపమబ్బు"
(లేదా...)
"పరులకు మేలుఁ జేయకుము పాప మహాబ్ధిని మున్గఁబోకుమా"

24, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2996 (ఈ వసంతమునన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఈ వసంతమునన్ బాడవేల పికమ"
(లేదా...)
"ఈ వసంత సమాగమమ్మున నేలఁ బాడవు కోకిలా"

23, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2995 (కుక్కకుఁ గొమ్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుక్కకుఁ గొమ్ములు గలవని కోవిదు లనిరే"
(లేదా...)
"కుక్కకు కొమ్ము లున్నవని కోవిదు లెల్లరుఁ జెప్పి రేకమై"

22, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2994 (కందమునందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కందమ్మునఁ బ్రాస వలదు గద యప్పకవీ"
(లేదా...)
"కందమునందుఁ బ్రాస నిడఁగన్ వల దప్పకవీ యెఱుంగుమా"

21, ఏప్రిల్ 2019, ఆదివారం

సమస్య - 2993 (చినవాఁడే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చినవాఁ డొనరించెనా యిసీ దుష్కృతముల్"
(లేదా...)
"చినవాఁడే యొనరించెనా యిటుల ఛీఛీ పెక్కు దుష్కృత్యముల్"

20, ఏప్రిల్ 2019, శనివారం

సమస్య - 2992 (రమ్ము జగమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమ్ము జగమ్మునఁ గరము వరమ్మగును సుమా"
(లేదా...)
"రమ్ము జగమ్మునందునఁ గరమ్ము వరమ్ము నిజమ్ము నమ్ముమా"

19, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2991 (భవుని ముఖమ్మునన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భవుని ముఖమ్మునను వెలుఁగు వాణిఁ గొలువుమా"
(లేదా...)
"భవుని ముఖమ్మునన్ వెలుఁగు వాణికి వందన మాచరింపుమా"

18, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2990 (అరిషడ్వర్గమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము నొసఁగుమని వేడఁ దగున్"
(లేదా...)
"అరిషడ్వర్గ మొసంగ శ్రీహరిని నిత్యం బీవు ప్రార్థింపుమా"

17, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2989 (ప్రాఙ్నగమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రాఙ్నగమున నస్తమించె భాస్కరుఁ డంతన్"
(లేదా...)
"ప్రాఙ్నగమందుఁ జూడఁగ విభాకరుఁడౌ రవి యస్తమించెరా"

16, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2988 (చితిలోఁ బరమేశుఁ డిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చితిలోఁ బరమేశుఁ డిచ్చుఁ జిరసౌఖ్యంబున్"
(లేదా...)
"చితిలోఁ జంద్రకళావతంసుఁ డిడు నిశ్శేషంబుగా సౌఖ్యమున్"

15, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2987 (శ్రీనాథుండు రచించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీనాథుఁడు భారతకృతిఁ జేసె ఘనుండై"
(లేదా...)
"శ్రీనాథుండు రచించె భారతము మా శ్రీనాథుఁ డౌరా యనన్"

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రధ బంధ సీసము


                          శ్రీ హరి ప్రార్ధన

శ్రీకరా!  రఘురామ!  శ్రీపతీ! పుష్కరాక్షా!  మధుసూధనా!   సోమగర్భ!
నరహరీ!నారాయణ!భరిమ!యతి!మేదినీ పతి!పురుజిత్తు! మాపతి!వన
మాలి!సిరి వరుణ!మధుజిత్తు! రవినేత్ర!  వట పత్ర శాయి!పావన! రమేశ!
అనిరుద్ధ! కేశవా! ఆది వరాహ! పీతాంబరా! ముక్తి దాత!   పరమేశ!

కపిల!పురుహూతి!శ్రీనాధ!కమల నయన!
చక్రి! పద్మనాభ! మనోజ జనక! శేషి!
నీరజోదర !నందకీ!నేత!నాకు
సరస మౌ మేధ  నొసగుచు  సాక వలెను

పద్యము చదువు విధానము.    (శ్రీ )తో  మొదలు పెట్టి క్రింది గడిలో (కరా) అనుచు ఎడమనుంచి కుడికి కుడి నుంచి ఎడమకు చదువుచు క్రింద చక్రములలో  ఉన్న అక్షరములు  (క   వలెను)అని ముగించాలి .   ఈ  పద్యములో పసుపు పచ్చ గడిలో (శ్రీ రామ రామ రామేతి  రమే రామే మనోరమే ) అన్నవాక్యము బంధించ బడినది   అది  విశేషము
                                                       
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

సమస్య - 2986 (సోదరినిఁ బెండ్లియాడెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"సోదరినిఁ బెండ్లియాడెను సోదరుండు" 
(లేదా...)
"సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డాగమ శాస్త్ర పద్ధతిన్" 

13, ఏప్రిల్ 2019, శనివారం

ఆహ్వానం!


సమస్య - 2985 (వేసవి కాలమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేసవిని మిక్కిలిగఁ జలి వేయుటేల"
(లేదా...)
"వేసవి కాలమందు చలి వేయుచు నున్న దిదేమి చిత్రమో"

12, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2984 (సినిమా దేవత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సినిమా దేవతఁ గొలిచినఁ జేకూరు సిరుల్"
(లేదా...)
"సినిమా దేవత ప్రేమమూర్తిఁ గొలువన్ జేకూరు సత్సంపదల్"

11, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2983 (రంభా శివ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రంభా శివ సంగమమున రక్కసి పుట్టెన్"
(లేదా...)
"రంభయు శంభుఁడున్ గలియ రక్కసి పుట్టె సురల్ వడంకఁగన్"

10, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2982 (మోహన రాగమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మోహన రాగమ్ము ఖేదమును గూర్చుఁ గదా"
(లేదా...)
"మోహన రాగ గానమది మోదముఁ ద్రోసియుఁ గూర్చు ఖేదమున్"

9, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2981 (కాంతను బెండ్లాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంతను బెండ్లాడి నరుఁడు గాంచు నరకమున్"
(లేదా...)
"కాంతను బెండ్లియాడి నరకమ్మును గాంచును మానవుం డయో"

8, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2980 (చీమలు భక్షించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమలు భక్షించె భీము శిరమున్ బ్రీతిన్"
(లేదా...)
"చీమలు భీమసేను ఘనశీర్షమునున్ భుజియించెఁ బ్రీతితోన్"

7, ఏప్రిల్ 2019, ఆదివారం

ఆహ్వానం¡


సమస్య - 2979 (సన్మానము సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సన్మానము సేయఁ దగదు సత్కవి కెపుడున్"
(లేదా...)
"సన్మానం బొనరింపరాదు కవికిన్ సౌజన్యముం జూపుచున్"

6, ఏప్రిల్ 2019, శనివారం

న్యస్తాక్షరి - 62 (శ్రీ-వి-కా-రి)


నాలుగు పాదాలను వరుసగా 
శ్రీ - వి - కా- రి 
అనే అక్షరాలతో ప్రారంభిస్తూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 
'ఆటవెలది' వ్రాయండి.
(లేదా...)
నాలుగు పాదాలలో యతిస్థానంలో వరుసగా
శ్రీ - వి - కా- రి 
అనే అక్షరాలను ప్రయోగిస్తూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 
చంపకమాలను వ్రాయండి.

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

సమస్య - 2978 (తల్లికిం దిండి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తల్లికిం దిండి నిడుట వ్యర్థమ్ము సుమ్ము"
(లేదా...)
"తల్లికిఁ దిండి పెట్టుట వృథా యని చెప్పును ధర్మశాస్త్రముల్"

4, ఏప్రిల్ 2019, గురువారం

సమస్య - 2977 (కరిముఖుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరిముఖుండు లక్ష్మి కన్నకొడుకు"
(లేదా...)
"కరిముఖుఁ డబ్ధినందనకు కన్నకుమారుఁ డనంగుఁ డన్నయున్"

3, ఏప్రిల్ 2019, బుధవారం

సమస్య - 2976 (వాక్చాతురిఁ జూపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాక్చాతురిఁ జూపి మంత్రి వ్యర్థుం డయ్యెన్"
(లేదా...)
"వాక్చాతుర్యముఁ జూపి మంత్రివరుఁ డబ్బా వ్యర్థుఁ డయ్యెన్ గదా"

2, ఏప్రిల్ 2019, మంగళవారం

సమస్య - 2975 (కుండం జేయఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుండం జేయంగ నొప్పు కుంభిని నెల్లన్"
(లేదా...)
"కుండం జేయఁగ నొప్పు కుంభినిని లోకుల్ మెచ్చి కీర్తింపఁగన్"

1, ఏప్రిల్ 2019, సోమవారం

సమస్య - 2974 (నగములు దలలూఁచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నగములు దలలూఁచి మెచ్చె నాదక్రియలన్"
(లేదా...)
"నగముల్ శీర్షము లూఁచి మెచ్చుకొనియెన్ నాదక్రియా మాధురిన్"

31, మార్చి 2019, ఆదివారం

శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం

నిన్న 30-3-2019 (శనివారం) 'శంకరాభరణం' సమూహ సభ్యుల ఆత్మీయ సమావేశంలో శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారి అష్టావధానం జరిగింది.
వేదిక - కవిశ్రీ సత్తిబాబు గారి నివాసం, మియాపూర్, హైదరాబాదు.
సంచాలకులు - కంది శంకరయ్య
ప్రార్థన -
శ్రీగిరిజావరనందన!
భోగీంద్ర విభూష! సకల బుధనుత దేవా!
ఓ గణనాయక! శుభకర!
బాగున నవధానమునకుఁ బల్కుల నిడుమా!

భారతి! దేవి! నిన్ను మదిఁ బ్రస్తుతిఁ జేసెద లోకమాత! యో
వారిజనేత్ర! నీదు పదపద్మములన్ భజియింతు భక్తితోఁ
జేరఁగ రమ్ము తల్లి! సువశీకరవౌచును నాదు జిహ్వపై
వారక నిల్చి మిక్కిలిగ వాక్కు లొసంగుము శారదాంబికా!

శ్రీ శంభో! ఫణిభూషణా! బుధనుతా! శ్రీకంఠ! లోకేశ్వరా!
యీశా! శాంభవి నాథ! భక్తవినుతా! యేణాంకచూడా! ప్రభూ!
కాశీక్షేత్రవిహార! శంకర! శివా! కారుణ్యగంగాధరా!
యాశీర్వాద మొసంగుమా శుభకరా! యానంద సంధాయకా!

శ్రీలక్ష్మీ హృదయాంతరంగ! జయహే శ్రీకంఠ సంసేవితా!
కాలాతీత! ముకుంద! కేశవ! హరీ! కారుణ్య రత్నాకరా!
లీలామానుష వేషధారి! వనమాలీ! లోక సంరక్షకా!
ధీలోలా! యవధానమున్ విజయమై దీపింప దీవింపుమా.

నను గన్న తల్లిదండ్రుల
మనమున స్మరియింతు నెపుడు మరువని భక్తిన్
ఘనముగ నవధానములో
నను విజయునిగా నొనర్చి నాణ్యత నొసఁగన్.

మాధవానంద యతివరున్ మదినిఁ దలఁచి
కంది శంకరార్యునకును వందన మిడి
యరయ సీవీ కుమారున కంజలించి
తక్కిన కవివరుల కెల్ల మ్రొక్కి యిచటఁ
జేసెద నవధానము నిదె వాసికెక్క.

1. నిషిద్ధాక్షరి - శ్రీ చిటితోటి విజయకుమార్ గారు
(శంకరస్తుతి)
[మొదటి రెండు పాదాలకే నిషేధం విధింపబడింది. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు]
శ్రీ(గ)శ(మ)ంభో(హ)రా(ద)వే(హ)రా
ఈశా(భ)కా(ర)మా(న)క్షి(న)వ(ర)ంద్య హే(-)ర(క)మ్యా(-)ంగా.....

శ్రీ శంభో! రావే రా
ఈశా! కామాక్షివంద్య! హే రమ్యాంగా!
కాశీవిశ్వేశా! హర!
ఓ శంకర! వందన మిదె యోంకారేశా!

2. సమస్య - శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
(వీడు వీడు వీడ వాడు వీడ)
లేడు లేడటంచు లేశమాత్రంబైనఁ
దలంపవలదు కలఁడు దైవ మిలను
హరిహరాదు లొకటె యంతట వారె పో
వీడు వీడు వీడ వాడు వీడ.

3. దత్తపది - శ్రీ తాతా ఫణికుమార్ శర్మ
(నీతి, జాతి, భాతి, రీతి పదాలతో ఎన్నికల ప్రచారంపై స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం)
'నీతి' విడనాడి తిరుగుచు నేతలెల్ల
'జాతి' వైరమున్ గలిగించి భీతిలేక
'భాతి' కోసమై ప్రజలను బలి యొనర్చి
తిరుగుచున్నార లీ'రీతి' తెగువతోడ.

4. న్యస్తాక్షరి - శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
(స,త్తి,బా,బు అన్నవి ప్రథమాక్షరాలుగా కవిత్వంపై ఆటవెలదిలో పద్యం)
'స'రసమైన కవిత సభలందు నిలిచి వ
'త్తి' పలుకవలెను గద దివ్యముగను
'బా'గు బాగనంగ భావికవుల నెల్లఁ
'బు'ట్టఁజేయు కవన పుణ్య మిలను.

5. వర్ణన - శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు గారు
(శిశిర ఋతువును వర్ణిస్తూ ఉత్పలమాల)
వ్రాలవె యాకులెల్లఁ జిగురాకులు వచ్చుటకోసమై ధరన్
కాలము మారు సూచనగ గాలులు వేడిమి హెచ్చి వీచఁగన్
ధూళియె లేచి యాకసము దూరిన యట్టుల తోఁచుచుండఁగన్
బాల వసంతమాస మిఁక వచ్చెడి చిహ్నము లెల్లఁ దోఁచెడిన్.

6. ఆశువు - శ్రీ కటకం వేంకటరామ శర్మ గారు
i) (అఖండయతిని గురించి పద్యం)
దండిగాను నే నఖండయతిని వేసి
చెప్పువాఁడ కవిత మెప్పుగాను
శంకరయ్య వంటి సత్కవీశులు కొంత
వలసు వలదు వలదనిను వదలఁబోను.

ii) (శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రస్తుతిస్తూ పద్యం)
అవరోధము కావలదని
భువియందలి మానవాళి పూజింతురుగా
భవబంధములను బాపుచు
నవనీతముఁ గొన్న సత్యనారాయణుఁడున్.

iii) (సీతను చూచిన హనుమంతుని ఆనందాన్ని తెలుపుతూ పద్యం)
సీతమ్మను గనినంతనె
వాతాత్మజుఁ డందినట్టి బ్రహ్మానందం
బే తీరుగ వర్ణింతును?
నా తరమా? కాదు కాదు నమ్ముడి మీరల్.

7. వారగణనం - శ్రీ కవిశ్రీ సత్తిబాబు గారు
(పృచ్ఛకులు అడిగిన తేదీలు ఏ వారమో తెలిపారు)

8. అప్రస్తుత ప్రసంగం - శ్రీ భమిడిపాటి వేంకటేశ్వర రావు గారు.

సమాపన పద్యాలు, ఆతిథ్య మిచ్చిన కవిశ్రీ దంపతులపై చెప్పిన పద్యాలు నావద్ద లేవు.
అవధానానంతరం కవిశ్రీ సత్తిబాబు గారు అవధానిని, పృచ్ఛకులను దుశ్శాలువలతో సత్కరించారు. 

సమస్య - 2973 (రాముని రాజ్యమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామరాజ్యాన ధర్మము రాక్షసమ్మె"
(లేదా...)
"రాముని రాజ్యమం దెపుడు రాక్షస ధర్మమె చెల్లుబాటగున్"

30, మార్చి 2019, శనివారం

సమస్య - 2972 (చీకటిని మించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీకటిని మించు వెలుఁగున్నదా కనులకు"
(లేదా...)
"చీకటి కంటె మేలయిన చెన్నలరారెడు కాంతి యున్నదే"

29, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2971 (రణము సెలరేఁగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"
(లేదా...)
"రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"

28, మార్చి 2019, గురువారం

సమస్య - 2970 (గౌతమీ స్నానము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గౌతమీ స్నాన మొనరించెఁ గాశి కేఁగి"
(లేదా...)
"కుతుకం బొప్పఁగఁ గాశి కేఁగి జరిపెన్ గోదావరీ స్నానమున్"

27, మార్చి 2019, బుధవారం

సమస్య - 2969 (సతియే కద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సతియే కద పూరుషునకు సద్గురువు గనన్"
(లేదా...)
"సతియే భర్తకు నొజ్జయౌఁ బరమ సంస్కారమ్ము నేర్పింపఁగన్"

26, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2968 (కమలాప్తుఁడు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కమలాప్తుఁడు చంద్రుఁ డనుట కల్ల యెటులగున్"
(లేదా...)
"కమలాప్తుండు శశాంకుఁ డౌననుట నిక్కంబే కదా మిత్రమా"

25, మార్చి 2019, సోమవారం

సమస్య - 2967 (విఘ్నం బగునని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విఘ్నం బగునని గణపతి భీతిం జెందెన్"
(లేదా...)
"విఘ్నము సంభవించునని భీతినిఁ జెందె గణేశుఁ డత్తఱిన్"

24, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2966 (పుస్తకావిష్కరణ....)

కవిమిత్రులారా,
నేడు విశాఖపట్టణంలో 
నా 'శంకర శతకము' ఆవిష్కరణోత్సవానికి 
అవకాశ మున్నవారు తప్పక రావలసిందిగా ఆహ్వానిస్తూ...
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పుస్తకావిష్కరణ సభఁ బోఁ దగ దఁట"
(లేదా...)
"గ్రంథావిష్కరణోత్సవమ్మునకు నేగన్ రాదు ముమ్మాటికిన్"

23, మార్చి 2019, శనివారం

సమస్య - 2965 (హరుఁడు గౌరితో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుఁడు గౌరితో వెలసె సింహాచలమున"
(లేదా...)
"శివుఁ డంబాసహితుండు కోరి వెలసెన్ సింహాచలస్వామిగన్"

22, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2964 (మధుపానాసక్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మధు పానాసక్తులు గద మౌని వరేణ్యుల్"
(లేదా...)
"మధుపానాంకిత మత్త చిత్తులు గదా మౌనుల్ సదాచారులున్"

21, మార్చి 2019, గురువారం

సమస్య - 2963 (సంసారుల కెందులకొ...)

కవిమిత్రులారా, 

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది....
"సంసారుల కెందులకొ యీ వసంతోత్సవముల్"
(లేదా...)
"వసంతోత్సవముల్ ముదంబు నిడునొక్కొ గృహస్థునకున్ దలంపఁగన్"
(ఛందోగోపనము)

20, మార్చి 2019, బుధవారం

దత్తపది - 155

హాయ్ - హలో - గుడ్ - బై 
పై పదాలను ప్రయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. 

19, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2962 (కాకులు మానవులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కాకులు మానవుల కెపుడు కష్టముల నిడున్"
(లేదా...)
"కాకులు మానవాళి కతి కష్టములన్ గలిగించు నెప్పుడున్"

18, మార్చి 2019, సోమవారం

ఆహ్వానం (పుస్తకావిష్కరణ)


సమస్య - 2961 (సరి రాఁ డెవ్వఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బొంకఁగా హరిశ్చంద్రునిఁ బోలు నెవఁడు"
(లేదా...)
"సరి రాఁ డెవ్వఁ డసత్యమాడఁగ హరిశ్చంద్రాఖ్య భూజానికిన్"

17, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2960 (సుజన పరాభవంబున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సుజన పరాభవ మొసంగు సుఖ సంపత్తుల్"
(లేదా...)
"సుజన పరాభవంబున యశోవిభవంబులు దక్కు నెప్పుడున్"

16, మార్చి 2019, శనివారం

సమస్య - 2959 (ధనముం గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ధనముఁ గోరువాఁడె ధన్యజీవి"
(లేదా...)
"ధనముం గోరి పరిశ్రమించు నరుఁడే ధన్యుండు మోక్షార్థియౌ"

15, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2958 (శంకరు గెల్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శంకరు గెల్చి రఘువరుఁడు జనులను బ్రోచెన్"
(లేదా...)
"శంకరు నాజి గెల్చి జనసంఘముఁ బ్రోచెను రామభద్రుఁడే"

14, మార్చి 2019, గురువారం

సమస్య - 2957 (సత్కవి కాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నాగఫణి శర్మ సుకవి యనం దగండు"
(లేదా...)
"సత్కవి కాని నాగఫణి శర్మ వధానముఁ జేయు టెందుకో"
(మొన్న బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

13, మార్చి 2019, బుధవారం

సమస్య - 2956 (హరునిన్ మృత్యువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హరు మృత్యువు మ్రింగ లోక మానందించెన్"
(లేదా...)
"హరునిన్ మృత్యువు మ్రింగఁగా భువన మత్యానందమున్ బొందెరా"

12, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2955 (క్రూరుని మార్గమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్"
(లేదా...)
"క్రూరుని మార్గమే మనకుఁ గూర్చును ముక్తి నటన్న సత్యమౌ"

11, మార్చి 2019, సోమవారం

సమస్య - 2954 (కన్న కుమారుండె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కన్న కుమారుండె నా మగండని పల్కెన్"
(లేదా...)
"కన్న సుతుండె నా మగఁడు గాఁడె యటంచన మెచ్చి రెల్లరున్"

10, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2953 (మరణము లేనివారు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మరణమే లేనివారలు మనుజు లెల్ల"
(లేదా...)
"మరణము లేనివారు గద మానవు లెల్లరు దివ్యమూర్తులున్"

9, మార్చి 2019, శనివారం

సమస్య - 2952 (యుద్ధము శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్"
(లేదా...)
"యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

8, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2951 (పరులు సేయనొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పరులు సేయ నొప్పు పాలనమ్ము"
(లేదా...)
"పరులు సమస్త రాజ్యమును పాలన సేయఁగ నొప్పు నెప్పుడున్"

7, మార్చి 2019, గురువారం

సమస్య - 2950 (కారాగారమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారాగారమున మధుర గానము వింటిన్"
(లేదా...)
"కారాగారమునందు వింటి నవురా గాంధర్వ సంగీతమున్"

6, మార్చి 2019, బుధవారం

సమస్య - 2949 (ప్రేమించినఁ గీడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ప్రేమించినఁ గీడు గల్గు ద్వేషింపు మిఁకన్"
(లేదా...)
"ప్రేమయె కీడొనర్చుఁ గద ద్వేషమె మేలొనఁగూర్చు నిచ్చలున్"

5, మార్చి 2019, మంగళవారం

సమస్య - 2948 (బస్సే సాధనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బస్సే సాధనము గద దుబాయినిఁ జేరన్"
(లేదా...)
"బస్సె దుబాయిఁ జేర్చఁదగు వాహన మన్యము లేలఁ గోరఁగన్"

4, మార్చి 2019, సోమవారం

సమస్య - 2947 (రామ భజన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రామ భజన సేయుము శివరాత్రికి భక్తిన్"
(లేదా...)
"శ్రీరఘురామ సద్భజన సేయఁ దగున్ శివరాత్రికిన్ దమిన్" 

3, మార్చి 2019, ఆదివారం

సమస్య - 2946 (కలహము సుఖమిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కలహము సుఖ మిచ్చు ననెను గాంధీ మునుపే"
(లేదా...)
"కలహమ్ముల్ సుఖశాంతు లిచ్చు ననియెన్ గాంధీజి మున్పెప్పుడో"

2, మార్చి 2019, శనివారం

సమస్య - 2945 (బెదరుచుఁ గార్యముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బెదరి కార్యముల్ విడుచుటె విజ్ఞత యగు"
(లేదా...)
"బెదరుచుఁ గార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

1, మార్చి 2019, శుక్రవారం

సమస్య - 2944 (క్షుద్బాధల్ సను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్షుద్బాధ దొలంగుఁ గాలకూటముఁ గొనినన్"
(లేదా...)
"క్షుద్బాధల్ సనుఁ గాలకూట విషమున్ గొన్నంత సత్యం బిదే"