28, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2295 (మాన్య యయ్యెఁ బతివ్రత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"మాన్య యయ్యెఁ బతివ్రత మగని రోసి"
లేదా...
"మగనిన్ రోసి పతివ్రతామణి కడున్ మాన్యత్వముం బొందెరా"

27, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2294 (బాలుర సంహరించి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"బాలుర సంహరించి శిశుపాలుఁడు కీర్తి గడించెఁ బుణ్యుఁడై"
లేదా... 
"బాలురఁ బరిమార్చిన శిశుపాలుఁ డనఘుఁడౌ"

26, ఫిబ్రవరి 2017, ఆదివారం

దత్తపది - 107 (గాయము-వాపు-పుండు-రసి)

గాయము - వాపు - పుండు - రసి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
కీచక వధను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

25, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2293 (భక్తుని దైవమ్మె కొలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్"
లేదా...
"భక్తుని దైవమే కొలుచువాఁడయి పొందె వరమ్ము లెన్నియో"

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2292 (క్రైస్తవుల పండుగయె...)

కవి మిత్రులారా!
మహాశివరాత్రి శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"క్రైస్తవుల పండుగయె శివరాత్రి యనఁగ" 
లేదా...
"క్రైస్తవు లెల్ల భక్తి శివరాత్రికిఁ జేతురు శంభుపూజలన్"

23, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2291 (బీరతీఁగకుఁ గాచెను...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
.
"బీరతీఁగకుఁ గాచెను బెండకాయ" 
లేదా...
"బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా"

22, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2290 (ఖరపాదమ్ముల సేవ...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్"
లేదా...
"ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్"

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2289 (రాముఁడు వియ్యమందె...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"రాముఁడు వియ్యమందె బలరామునితో రవిచంద్రసాక్షిగాన్"
లేదా...
"రాముఁడు వియ్యంకుఁడు బలరామునకుఁ గదా"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.

20, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2288 (కులటం గని పిలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్"
లేదా...
"కులటను గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా"
(మొన్న టి.వి.లో వచ్చిన 'కథానాయిక మొల్ల' చిత్రంలో తెనాలి రామకృష్ణుడు మొల్లను అడిగిన సమస్య...)

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2287 (పృచ్ఛకులఁ గాంచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"పృచ్ఛకులఁ గాంచి యవధాని బెదరి పాఱె"లేదా...
"బెదరి పలాయితుం డయెను పృచ్ఛకులం గనఁగన్ వధానియే"

18, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2286 (ఆలు లేని మగఁడు...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"ఆలు లేని మగఁడు హాయినందు"లేదా...
"ఆలిన్ వీడిన పూరుషుం డెపుడు బ్రహ్మానందముం బొందురా"

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2285 (కుందేటికిఁ గొమ్ము మొలిచి...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"కుందేటికిఁ గొమ్ము మొలిచి కులుకుచు నడచెన్"
లేదా...
"కొమ్ముల్ మొల్చియు గుల్కుచున్ నడచెరా కుందేలు నల్దిక్కులన్"

16, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2284 (రాధనుఁ బెండ్లియాడె...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"రాధనుఁ బెండ్లియాడె రఘురాముఁడు భూజను లెల్ల మెచ్చఁగన్"
లేదా...
"రాధ నుద్వాహమాడెను రామవిభుఁడు"

15, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2283 (గద్వాల ప్రభవాగ్ని...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"గద్వాల ప్రభవాగ్ని కాల్చెగద లంకాపట్టణంబున్ వడిన్"
లేదా...
"గద్వాలానలము గాల్చెగద లంక నయో"
ఈ సమస్యను అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలు.

14, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2282 (కుసుమమందునఁ గుసుమముల్...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కుసుమమందునఁ గుసుమముల్ బ్రసవమగును"
లేదా...
"సుమమున రెండు సూనములు శోభిలుచున్ జనియించెఁ గాంచుమా"
ఈ సమస్యను అందించిన వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలు.

13, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2281 (భయపడఁగ వీరుఁడని...)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....

"భయపడఁగ వీరుఁడని జనుల్ ప్రస్తుతింత్రు" 
లేదా....
"భయపడినంత వీరుఁడని పల్కుచు మెచ్చిరి లోకులెల్లరున్"

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2280 (కర్ణుఁడు చచ్చుటన్...)

కవిమిత్రులారా!
(సమస్యలను ఇవ్వడంలో 'ఛందోనిగూఢం' అన్న పద్ధతి ఒకటి ఉంది. సాధారణంగా సమస్యను ఒక పద్యపాదంగా ఇవ్వడం సంప్రదాయం. కాని పృచ్చకుడు పాదంలోని కొన్ని అక్షరాలను వదిలి కాని, పాదానికి కొన్ని అక్షరాలు కలిపి కాని సమస్యను ఇవ్వవచ్చు. అది ఏ పద్యపాదమో వెంటనే స్ఫురించకుండా అవధానిని తికమక పెట్టడం పృచ్ఛకుని ఉద్దేశం. అవధాని దానిని మననం చేసికొని అది ఏ పద్యపాదమో తెలిసికొని అక్షరాలను కలుపుకొని పూరణ చేస్తాడు. ఈరోజు ఇచ్చిన సమస్య రెండు విధాలుగా ఉంది. గమనించి పూరించండి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"కర్ణుని యాయువు చెల్లఁగ గెలిచెనట సుయోధనుఁ డనిలోన్"
లేదా...
 "కర్ణుఁడు చచ్చుటన్ విజయలక్ష్మిన్‌ బొందె రారా జనిన్"
ఈ సమస్యను పంపిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు.

11, ఫిబ్రవరి 2017, శనివారం

దత్తపది - 106 (నిధనము-శవము-పాడె-చితి)

నిధనము - శవము - పాడె - చితి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
పెండ్లి వేడుకలను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

10, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2279 (పితృవాక్పాలనమె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..

"పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్"
లేదా...
"వర పితృవాక్య పాలనమె పాపులఁ జేయును పుత్రసంఘమున్"

9, ఫిబ్రవరి 2017, గురువారం

చమత్కార పద్యం - 248

ఇటీవల ద్రాక్షారామంలో తాతా సందీప్ శర్మ గారి అష్టావధానం జరిగింది. ఆ అవధానంలోని ఒక విశేషం...

సమస్య - 2278 (పంటల నొసంగని...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పంటల నొసంగని పొలము పసిఁడి నిచ్చు"
లేదా...
"పంటల్ పండని భూమి రైతుల కిడున్ బంగారమున్ చిత్రమే"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

8, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2277 (ఖ్యాతినిఁ గన్న వీరుఁడు....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"ఖ్యాతినిఁ గన్న వీరుఁ డెవఁ డన్నపు డుత్తరు నేఁ దలంచెదన్"
లేదా...
"ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే"

7, ఫిబ్రవరి 2017, మంగళవారం

సమస్య - 2276 (గురుల దోషంబులన్....)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గురుల దోషంబులన్ శిష్యకోటి పట్టు"
లేదా...
"గురువుల తప్పు పట్టుటయె కూర్చు యశంబిల శిష్యకోటికిన్"

6, ఫిబ్రవరి 2017, సోమవారం

సమస్య - 2275 (గణయతులు లేని పద్యంబు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"గణయతులు లేని పద్యంబు గణన కెక్కు"
లేదా...
"గణయతు లుజ్జగించిననె గారవ మందును పద్యకావ్యముల్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

సమస్య - 2274 (రమణి యజ్ఞోపవీత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రమణి యజ్ఞోపవీత ధారణముఁ జేసె"
లేదా...
"అలరుంబోడి ధరించె సంతసమునన్ యజ్ఞోపవీతమ్మునున్"

4, ఫిబ్రవరి 2017, శనివారం

సమస్య - 2273 (శంకరుఁ డవతరించి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"శంకరుఁ డవతరించి దాశరథి యయ్యె"
లేదా...
"ఈశుఁడు శంకరుం డవతరించెను రాముఁడుగా ధరాస్థలిన్"

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

సమస్య - 2272 (దూరముగాఁ జరింపకుఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా"
లేదా...
"ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్"

2, ఫిబ్రవరి 2017, గురువారం

సమస్య - 2271 (హారము లేకున్న నగు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"హారము లేకున్న నగు మహాప్రళయమ్మే"
లేదా...
"హారము లేకపోయిన మహాప్రళయమ్మె సముద్భవించెడిన్"

1, ఫిబ్రవరి 2017, బుధవారం

సమస్య - 2270 (సరములు జీవులకుఁ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"సరములు జీవులకుఁ గడు నసహ్యము లయ్యెన్"
లేదా...
"సరములు సర్వజీవుల కసహ్యము లయ్యెను దుర్నిరీక్ష్యతన్"