29, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4691

1-3-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీహరి యజునానతిఁ గొని శ్రీశునిఁ జంపెన్”
(లేదా...)
“శ్రీశుని సంహరించెనఁట శ్రీహరి వాక్పతి యానతీయఁగన్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

28, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4690

29-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మీనపు గర్భమునఁ బెక్కు మేకలు పుట్టెన్”
(లేదా...)
“మీనపు గర్భమందు పలు మేకలు బుట్టెను కొండకోనలన్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4689

28-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు”
(లేదా...)
“స్వర్గమునందు పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

26, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4688

27-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు”
(లేదా...)
“గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్”
(డా॥ వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

25, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4687

26-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మవిరుద్ధమ్మె యగును తండ్రికి మ్రొక్కన్”
(లేదా...)
“ధర్మవిరుద్ధమౌను గద తండ్రికి సాగిలి మ్రొక్కఁ బుత్రుఁడే”

24, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4686

25-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్”
(లేదా...)
“శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4685

24-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పులులు కరులు భూర్జపత్రములపై నిలిచెన్”
(లేదా...)
“పులు లేనుంగులు భూర్జపత్రములపై పొల్పొందఁగా నిల్చెనే”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

22, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4684

23-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్యయె భర్తగను మారె భాగ్యము గలుగన్”
(లేదా...)
“భార్యయె భర్తయైనపుడు ప్రాప్తమగున్ గద భాగ్యయోగముల్”
(శిష్ట్లా వేంకట లక్ష్మీనరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

21, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4683

22-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగు నరునకు మోక్షమ్ము దప్పదెపుడు”
(లేదా...)
“త్రాగెడువాఁడు మోక్షమును దప్పక పొందు నటంద్రు పండితుల్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4682

21-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదసంపద నాశనమగు వ్యాకరణముచే”
(లేదా...)
“పదసంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్”
(ఫేసుబుక్కులో ఇచ్చిన సమస్య అని తిరువీథి శ్రీమన్నారాయణ గారు)

19, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4681

20-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్”
(లేదా...)
“మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

18, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4680

19-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేహ మున్నంత వఱకు సందేహముండు”
(లేదా...)
“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

17, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4679

18-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చంప వచ్చువారిఁ గనిన సంతసమగు”
(లేదా...)
“జంపఁగ వచ్చువారిఁ గని సంతసమందెను శత్రు వర్గమే”
(ఊర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4678

17-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విడియమిచ్చి భార్య యడిగె వేతనమును”
(లేదా...)
“విడియమునిచ్చి భార్య తగు వేతనమిమ్మనె జంకు లేకయే”
(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)

15, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4677

16-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంగరమున నోడువాఁడె శౌర్యధనుండౌ”
(లేదా...)
“సంగరమందు నోడినను శౌర్యధనుండని మెచ్చుకొందురే”
(ఊర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

14, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4676

15-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”
(లేదా...)
“తాళీని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్”
(శతావధాని యం.వి.పట్వర్ధన్ గారికి ధన్యవాదాలతో...)

13, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4675

14-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రేమికుల దినోత్సవమని విలపింపఁ దగున్”
(లేదా...)
“ప్రేమికుల దినోత్సవం బని యమేయముగా విలపింపఁగాఁ దగున్”

12, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4674

13-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మెచ్చనట్టివారె మిత్రులకట!”
(లేదా...)
“మెచ్చనివారె మిత్రులు సుమీ కవితామృత మెంతఁ బంచినన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4673

12-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భయముఁ గూర్చువాఁడె పరమగురుఁడు”
(లేదా...)
“భయమును బెట్టువాఁడె గురువర్యుఁడుగా యశముం గడించెడిన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

10, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4672

11-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరుఁ డేతెంచెఁ గనఁగ సంపల్లక్ష్మిన్”
(లేదా...)
“వచ్చెన్ శంకరుఁ డంబతోఁ గనఁగ సంపల్లక్ష్మినిన్ వేడుకన్”
(కళ్యాణ్ చక్రవర్తి గారు మాకు కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం చేయిస్తూ ఇచ్చిన సమస్య. వారికి ధన్యవాదాలతో...)

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4671

10-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోషముడిగి చంపిరే విరోధుల బలిమిన్”
(లేదా...)
“రోషము లేనివారలు విరోధుల నుక్కడగించి రుద్ధతిన్”

8, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4670

9-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు”
(లేదా...)
“మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే”

7, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4669

8-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్”
(లేదా...)
“నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్”

6, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4668

7-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కడుపు నిండెను తీర దాకలియె సుంత”
(లేదా...)
“కడుపును నింపుకొన్నను సుఖంబుగ నాకలి దీరదయ్యయో”

5, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4667

6-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్వమ్మును మ్రింగువాని విశ్రామ మెటన్”
(లేదా...)
“విశ్వంబున్ దిగ మ్రింగువాఁ డెచటఁ దా విశ్రాంతినిం బొందునో”

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4666

5-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సోమ భాస్కరుల్ గలిసిరి క్షోభ నడఁప”
(లేదా...)
“సోమాదిత్యులు గూడి రొక్కెడ జగత్ క్షోభంబు మాన్పన్ భళా”

3, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4665

4-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యతులుఁ బ్రాసలు లేని పద్యములు మేలు”
(లేదా...)
“యతులుం బ్రాసలు లేని పద్యములు యోగ్యంబుల్ గదా మెచ్చఁగన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమస్య - 4664

3-2-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్వమ్మే లేనివాఁడు కవి గాఁడు కదా”
(లేదా...)
“గర్వము లేనివాఁడు కవి గాఁడు కదా తలపోసి చూచినన్”
(ఆముదాల మురళి గారి అష్టావధానంలో విట్టుబాబు ఇచ్చిన సమస్య)

1, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4663

2-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూర్మెన్ గోయింగ్ టు గాన్గపూర్ బై యే ట్రైన్”
(Poor men going to Gangapur by a train)
పూర్మెన్ వెంట్ టుగెదర్  వితౌట్ మని టు గాంగ్పూర్ బై వెరీ ఫాస్ట్ ట్రెయిన్
(Poor men went together without money to  Gangpur  by very fast train)  
(కందపాదం నాది. వృత్తపాదం సమకూర్చిన చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలు) 
ఇంగ్లీషులోనే పూరించాలన్న నియమం లేదు. 
నేను బాల్యమిత్రులతో తుల్జాపూర్, పండరిపూర్, కొల్హాపూర్, గాన్గాపూర్ యాత్రలో ఉన్న సందర్భంగా