కవిమిత్రులారా!
ఈరోజు పూరింప వలసిన సమస్య ఇది...
"సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు"
(లేదా...)
"క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్"
కవిమిత్రులారా!
ఈరోజు పూరింప వలసిన సమస్య ఇది...
"సాహితీ సంస్థ లేప్రయోజనము కొఱకు"
(లేదా...)
"క్షతి లేనట్టి ప్రయోజనం బిడు నొకో సాహిత్య సంస్థల్ భువిన్"
కవి మిత్రులారా!
ఈరోజు పూరింప వలసిన సమస్య ఇది...
సతి మరణము పతి కొసంగె సంతోషమ్మున్
లేదా
సతి మరణించగా పతికి సంతసమెంతయొ కల్గె బిట్టుగన్
27-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అద్దమందుఁ గాంతు నన్యు నొకని”
(లేదా...)
“అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్”
26-3-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కౌత్సునకుం దక్షకుండు గడు మేల్సేసెన్”
(లేదా...)
“కౌత్సున కెంతొ మేల్గలుఁగఁగా నొనరించెను తక్షకుండహో”
25-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కుఁ గోసి తీర్చె ముచ్చటఁ బతి”
(లేదా...)
“ముక్కును గోసి వల్లభుఁడు ముచ్చట తీర్చెను ముద్దుముద్దుగన్”
24-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాను నిలుచున్న కొమ్మనుఁ దగును నరుక”
(లేదా...)
“తగును సుబుద్ధికిన్ నరుకఁ దా నిలుచుండెడి కొమ్మఁ దానుగా”
23-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి చచ్చుట మంగళంబు భామామణికిన్”
(లేదా...)
“పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ పురంధేశ్వరి గారి సమస్య)
22-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాలు నీరు గలిపి చేసె పచ్చడి సతి”
(లేదా...)
“పాలను నీటిలోఁ గలిపి భామిని సేసె నుగాది పచ్చడిన్”
(ఈ సమస్యను పంపిన అక్కెర కరుణాసాగర్ గారి ధన్యవాదాలు)
21-3-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లెక్కలు రానట్టివాఁడు లెక్కలు నేర్పెన్”
(లేదా...)
“లెక్కలు రాని వాఁడొకఁడు లెక్కలు నేర్పెను మేలనన్ జనుల్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి సమస్య)
20-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భీముఁడు పార్వతిన్ వలచి పెండిలియాడెను మెచ్చ దేవతల్”
(లేదా...)
“భీముఁడు పార్వతిని మెచ్చి పెండ్లాడెఁ గదా”
(ఆముదాల మురళి గారి శతావధానంలో మాలేపట్టు పురుషోత్తమాచారి గారి సమస్య)
19-3-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగిన మానవుని బ్రతుకు ధన్యంబగురా”
(లేదా...)
“త్రాగినవాని జీవనము ధన్యమగున్ ధరలోనఁ జూడఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ జయమ్మ గారి సమస్య)
18-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామిడి నిలువెల్లఁ బూచి మారేడాయెన్”
(లేదా...)
“రేపున్ మాపునుఁ బూచి మామిడియె మారేడాయెఁ గన్విందుగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ కృష్ణవేణి గారి సమస్య)
17-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నామంబునుఁ బెట్టితే జనంబులకుఁ గవీ”
(లేదా...)
“నామముఁ బెట్టినాఁడవు జనంబులకున్ మురళీ కవీశ్వరా”
(ఆముదాల మురళి గారి శతావధానంలో పైనేని తులసీనాథం నాయుడు గారి సమస్య)
16-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోమంబుల కూరఁ జేయ రుచిగ భుజించెన్”
(లేదా...)
“రోమంబుల్ వడిఁ దెచ్చి వండినఁ గడున్ రుచ్యంబుగా మెక్కెనే”
(ఆముదాల మురళి గారి శతావధానంలో తిరువాయిపాటి చక్రపాణి గారి సమస్య)
15-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మేఁక కావుకావనెను మేమే యనదఁట”
(లేదా...)
“మేఁకకు మేఁతఁ బెట్ట నది మే యనకుండఁగఁ గావుకావనెన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో బ్రాహ్మణపల్లి తారకరామ గారి సమస్య)
14-3-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రెండు రెండును కలువంగ రెండు వచ్చె”
(లేదా...)
“రెండును రెండుతోఁ గలుప రెండు లభించెను లోకులౌననన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో చమర్తి సుబ్బరాఘవరాజు గారి సమస్య)
13-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్త కిచ్చెను తన్వి పావన జననము”
(లేదా...)
“తాళి గట్టిన భర్తకిచ్చెను తన్వి పావనజన్మమున్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో చలంకోట బురుజు మునస్వామి గారి సమస్య)
12-3-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాంసము విడి పండితుండు మాన్యుం డగునా”
(లేదా...)
“మాంసముఁ గోరకున్నఁ దరమా ఘనపండితుఁడై చరింపఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
11-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రణము సేయ వచ్చితి విచిత్రంపు నుడుల”
(లేదా...)
“రణముల్ సేయఁగ వచ్చినాఁడను విచిత్రంబౌ వచోవృత్తితో”
(ఆముదాల మురళి గారి శతావధానంలో ఎమ్మెస్వీ గంగరాజు గారి సమస్య)
10-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నము మెలఁకువ సుషుప్తి సమకాలమగున్”
(లేదా...)
“స్వప్నమునున్ సుషుప్తియును జాగ్రదవస్థలు నేకకాలమౌ”
(ఆముదాల మురళి గారి శతావధానంలో తిప్పన్న గారి సమస్య)
9-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా కొని హితముఁ గనిరి సద్బ్రాహ్మణులే”
(లేదా...)
“సారా త్రాగి తరించిపోయిరి గదా సద్బ్రాహ్మణుల్ భూమిలో”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా।। దేవణ్ణ గారి సమస్య)
8-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తారా రమ్మనుచుఁ బిల్చె దాశరథి దమిన్”
(లేదా...)
“తారా రమ్మని పిల్చె రాముఁ డెలమిన్ దానంద సౌఖ్యమ్ములన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో గంగుల నాగరాజు గారి సమస్య)
7-3-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంశీనాదము చెవులకుఁ బాపమ్మొసఁగున్”
(లేదా...)
“వంశీనాదము విన్నచో శ్రుతులకున్ బాపమ్ము సంధిల్లుగా”
(ఆముదాల మురళి గారి శతావధానంలో వైష్ణవ వేంకట రమణమూర్తి గారి సమస్య)
6-3-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ములుకులైనట్టి పలుకులు చెలిమిఁ బెంచు”
(లేదా...)
“ములుకులు పల్కులైనఁ గడుఁ బొల్పు వహింపవె స్నేహబంధముల్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో కాశిరాజు లక్ష్మినారాయణ గారి సమస్య)
5-3-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తుంటరి జనమాన్యుఁడగును దొడ్డపనులచే”
(లేదా...)
“తుంటరివాఁడె చేయుఁగద దొడ్డపనుల్ జనులెల్ల మెచ్చఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో ఎన్.సిహెచ్. చక్రవర్తి గారి సమస్య)
4-3-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లడ్డుకొనఁగ నేర మవధాన సత్సభన్”
(లేదా...)
“లడ్డుకొనంగ నేరమగునందు వధానమునందు సత్కవీ”
(ఆముదాల మురళి గారి శతావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి సమస్య)
3-3-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆముదంబన్న ప్రీతియే యందఱకును”
(లేదా...)
“ఆముదమెంత గొప్పదగు నందఱి మోములు దేజరిల్లఁగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో కెవియన్ ఆచార్య గారి సమస్య)
2-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆముదాల మురళి నవధాని యనరాదు”
(లేదా...)
“లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో నా సమస్య)
1-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరిని హరియె వేడె హరిని హరియింపంగన్”
(లేదా...)
“హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్”
28-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంతి తగిలి గొనియెఁ బ్రాణములను”
(లేదా...)
“బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో”
27-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వజ్రపుటుంగరము మ్రింగవలె మేలుఁ గనన్”
(లేదా...)
“వజ్రపుటుంగరమ్మును శివా యని మ్రింగిన మేలు నీకగున్”
26-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు”
(లేదా...)
“రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్”
25-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో”
(లేదా...)
“ప్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో”
24-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చనుపాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్”
(లేదా...)
“చనుపాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్”
23-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాఘ్రము మగవాఁడు నమ్మవచ్చునె మగువా”
(లేదా...)
“వ్యాఘ్రము వంటివాఁడు దగవా మగువా మగవాని నమ్ముటల్”
22-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకుల్ గర్జించెఁ గుక్క గాండ్రించె నయో”
(లేదా...)
“కాకుల్ గర్జన సేయఁగా శునకముల్ గాండ్రించె నుగ్రమ్ముగన్”
21-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్”
(లేదా...)
“కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్”
20-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నలుగురి యంగవిభవమన నచ్చిరి సర్వుల్”
(లేదా...)
“నలుగురి యంగవైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్”
19-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామ యల్లుఁడయ్యె నేమి వింత”
(లేదా...)
“మామయె యల్లుడయ్యెను కుమారియె యత్తగ మారె వింతగన్”
(కన్నేపల్లి వరలక్ష్మి గారికి ధన్యవాదాలతో...)
18-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”
(లేదా...)
“పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్”
17-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతిరి యుత్తరమునందు రవి యుదయించెన్”
(లేదా...)
“రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే”
16-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్”
(లేదా...)
“కంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే”
15-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్”
(లేదా...)
“పువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్”
14-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్ములు బువ్వులయ్యె శోభ వహింపన్”
(లేదా...)
“శునకమ్ముల్ గుసుమంబులయ్యె మిగులన్ శోభావిశేషంబునన్”
13-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్”
(లేదా...)
“బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”
12-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో”
(లేదా...)
“సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే”
11-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూగ వినిపించె షట్శాస్త్రములను జదివి”
(లేదా...)
“చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్”
10-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలిఁ బూని వధించె శత్రుగణముల నెల్లన్”
(లేదా...)
“కలిఁ బూనెన్ వధియించె శత్రుగణమున్ గంజాక్షి క్రోధమ్మునన్”
9-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్”
(లేదా...)
“సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్”
8-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమ మందిరమునకు నరిగి రతిహర్షమునన్”
(లేదా...)
“యమ సదనంబుఁ జేరి రతిహర్షమునన్ దమ భాగ్యమం చహో”
7-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలలోనే యిమిడియుండెఁ దత్త్వంబెల్లన్”
(లేదా...)
“తలలోనే నెలకొన్నదందు నిఁకఁ దత్త్వంబెల్ల యోచించినన్”
6-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తునిలోఁ బెనుగొండ భయముతో డాఁగెఁ గనన్”
(లేదా...)
“తునిలోనన్ బెనుగొండ డాఁగె భయసందోహమ్ము వెన్నాఁడఁగన్”
5-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము”
(లేదా...)
“కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్”
4-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా”
(లేదా...)
“పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే”
(ఆముదాల మురళి గారి విజయవాడ అష్టావధానంలో నేనిచ్చిన సమస్య)
3-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారా క్రోలంగనొప్పు సౌఖ్యంబందన్”
(లేదా...)
“సారా క్రోలుము శాంతి సౌఖ్యములకై సంసారబంధమ్మునన్”
(వాడ్రేవు వేంకట సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
2-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా”
(లేదా...)
“భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే”
1-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామగర్వభంగ మొనర్చి రాముఁ డలరె”
(లేదా...)
“రాముని గర్వభంగమును రాముఁ డొనర్చెను దీమసమ్ముగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ అష్టావధానంలో ఆదూరి ఫణీంద్ర రావు గారి సమస్య)
31-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కామమును గోపమే కదా కామ్యము లిడు"
(లేదా...)
"కామక్రోధములే కదా నరులకున్ గామ్యంబులిచ్చున్ సదా"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో శ్రవణ్ కుమార్ గారి సమస్య)
30-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమ్ముఁ దెచ్చె హనుమ రామున కని"
(లేదా...)
"రమ్మునుఁ దెచ్చె మారుతియె రామునకై ముదమంద వానరుల్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ముదిగలం బాబు గారి సమస్య)
29-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాడ నేర్పుమనుచు పాము లడిగె"
(లేదా...)
"పాటలు పాడ నేర్పుమని పాములు వేడెను కోయిలమ్మలన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ఆర్. కళ్యాణి గారి సమస్య)
28-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోఁతినిఁ బెండ్లాడఁ గోరెఁ గోమలి యిచ్ఛన్"
(లేదా...)
"కోఁతినిఁ బెండ్లి సేసికొనఁ గోరెను సుందరనారి యిచ్ఛతో"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో కలికిరి గురుదేవ్ గారి సమస్య)
27-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాకొమరుఁడు బిచ్చమిమ్మురా యని వేడెన్"
(లేదా...)
"రాకొమరుండు బిచ్చమిడరా యని వేడెను పేద వాకిటన్"
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో పి. జమున గారి సమస్య)
26-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నులున్నవంచుఁ గలఁత యేల”
(లేదా...)
“కన్నులు గల్గినం గలఁత గాంచుట యేలఁ గనంగఁ జాలవా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో దాసరి చంద్రయ్య గారి సమస్య)
25-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంట లేని యింట బంధువు దినె”
(లేదా...)
“వంటయె లేని యింటఁ దిని బంధువు ద్రేన్చెను పొట్ట నిండఁగన్”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో గీతా శైలజ గారి సమస్య)
24-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెల్లని రూకనిడి మగఁడు చీరన్ దెచ్చెన్”
(లేదా...)
“చెల్లని రూకతో మగఁడు చీరను దెచ్చెను భార్య కోసమై”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో ప్రదీప్ గారి సమస్య)
23-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పలుకన్ రానట్టి వాఁడు పాటలు పాడెన్”
(లేదా...)
“పలుకులు రానివాఁడు పలు పాటలు పాడె జనమ్ము మెచ్చఁగా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో మల్లెల నాగరాజు గారి సమస్య)
22-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆఁకలి యని కేక లిడఁగ రోఁకలి నిడె”
(లేదా...)
“ఆఁకలి యంచు కేకలిడ నమ్మ యొసంగెను రోఁకలిన్ కటా”
(జంధ్యాల సుబ్బలక్ష్మి గారి శతావధానంలో రంగరాజు పద్మజ గారి సమస్య)
21-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కను సహియింప ననుచు యుగ్మలి పలికెన్”
(లేదా...)
“కుక్కను సైపలేననుచు యుగ్మలి చేరెను పుట్టినింటికిన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
20-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకా పట్టిననె వచ్చుఁ గాన్కల్ బిరుదుల్”
(లేదా...)
“కాకా పట్టినఁ గాని రావఁట కదా కాన్కల్ పురస్కారముల్”
(గరికిపాటి వారికి ధన్యవాదాలతో...)
19-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ పదధూళి తలవ్రాత లేమి మార్చు”
(లేదా...)
“రాముని పాదధూళి తలవ్రాతల మార్చునె నమ్ము టొప్పునే”
18-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వారధినిం గట్టలేదు వానరు లెవరున్”
(లేదా...)
“వారధిఁ గట్టలేదు గద వానరు లెవ్వరు రామభృత్యులై”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పిలకా శాంతమ్ము గారి సమస్య)
17-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండధరుఁ డిచ్చు ముక్తిని దర్శనమున”
(లేదా...)
“దండధరుం డొసంగునఁట దర్శన మాత్రమునన్ విముక్తినిన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాడుగుల నారాయణ మూర్తి గారి సమస్య)
16-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాఁడు వేంకటేశుండు గాపాడువాఁడు”
(లేదా...)
“కాఁడఁట వేంకటేశ్వరుఁడు గాచెడి దైవము మానవాళికిన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)
15-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
'కల - తల - వల- వెల'
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
సంక్రాంతి సంబరాలపై
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
14-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
భోగిమంటను గురించి ఉత్పలమాల వ్రాయండి
1వ పాదం 1వ అక్షరం 'భో'
2వ పాదం 2వ అక్షరం 'గి'
3వ పాదం 10వ అక్షరం 'మం'
4వ పాదం 17వ అక్షరం 'ట'
13-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో”
(లేదా...)
“కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కన్నేపల్లి వరలక్ష్మి గారి సమస్య)
12-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శుంఠల వలన దేశమ్ము శోభఁ గనును”
(లేదా...)
“బాలురు శుంఠలైన యెడ భారత కీర్తి మహోన్నతంబగున్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో వేదాల గాయత్రి గారి సమస్య)
11-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాకికిం గాకి పుట్టఁగఁ గాకు లఱచె”
(లేదా...)
“కాకికిఁ గాకి పుట్టెనని కాకులు గోలిడె గుంపు కట్టుచున్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఉపాధ్యాయుల గౌరీశంకరరావు గారి సమస్య)
10-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్దు సేయదు పికము వసంతమందు”
(లేదా...)
“సద్దు సేయదు కోకిలమ్మ వసంతకాలము వచ్చినన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మాచవోలు శ్రీధరరావు గారి సమస్య)
9-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కురుకులమున రాఘవుండు కోరి జనించెన్”
(లేదా...)
“కురువంశంబునఁ బుట్టి కీర్తిఁ బడసెన్ కోదండరాముం డహో”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో అ.స.నా.రె. గారి సమస్య)
8-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్ననుఁ బెండ్లాడె నతివ యందఱు మెచ్చన్”
(లేదా...)
“అన్ననుఁ బెండ్లియాడె సుగుణాంబుధి బంధువులెల్ల మెచ్చఁగన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ముద్దు రాజయ్య గారి సమస్య)
7-1-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సద్యఃస్ఫూర్తియె బుధులకు సంకటము లిడున్”
(లేదా...)
“సద్యఃస్ఫూర్తి యొసంగుఁ గష్టములు నష్టంబుల్ బుధశ్రేణికిన్”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో పోచిరాజు కామేశ్వర రావు గారి సమస్య)
6-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చురచుర చూడ్కుల దినమణి సుధలం గురిసెన్”
(లేదా...)
“చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి గారి సమస్య)
5-1-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భరతునకున్ వేణుధరుఁడు పాదము నిచ్చెన్”
(లేదా...)
“భరతున కిచ్చెఁ బాదము శుభంబనుచున్ మురళీధరుం డహో”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో మైలవరపు మురళీకృష్ణ గారి సమస్య)
4-1-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁడు భీరు వతిలోభి క్ష్మాపతులందున్”
(లేదా...)
“కర్ణుఁడు లోభియై మసలె క్ష్మాపతులందున భీరువాతఁడే”
(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో ఆకెళ్ళ బాలభాను గారి సమస్య)
3-1-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనువు శాశ్వతము సుకీర్తి గన క్షణికము”
(లేదా...)
“కలకాలంబు శరీరముండును తటిత్కల్పంబు సత్కీర్తియే”
2-1-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పార్వతికి రమాదేవి సపత్ని యగును”
(లేదా...)
“పార్వతికిన్ రమాసతి సపత్ని యటంచు వచింత్రు విజ్ఞులే”