31, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4295

1-1-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆత్మ పూనఁగా నూఁగు మహాత్ముఁ దలఁతు”
(లేదా...)
“ఆత్మలు పూన నూఁగు మహితాత్ముల నేను దలంతు నాత్మలోన్”
(విట్టుబాబు పంపిన సమస్య)

30, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4294

31-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చంద్రుఁ డుదయింప వికసించె సారసములు”
(లేదా...)
“శశి యుదయింప విచ్చుకొనె సారసముల్ ముకుళించెఁ గల్వలున్”

29, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4293

30-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాశి కేగిన కవికిఁ గాంక్షలు సెలంగె”
(లేదా...)
“కాశికి వెళ్ళినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా”
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో)

28, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4292

29-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంగరమ్ము సంతసముఁ బ్రశాంతి నొసఁగు”
(లేదా...)
“సంగరమిచ్చు సంతసము సత్ఫల మిచ్చు మనుష్యజాతికిన్”
(డా. వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో)

27, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4291

28-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్షీరాంబుధి తనయ మగఁడు శ్రీకంఠుండౌ”
(లేదా...)
“క్షీరాంభోధి కుమారియౌ గిరిజకున్ శ్రీకంఠుఁడే భర్తయౌ”

26, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4290

27-12-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దోషంబులు లేక యుంట దోషము గాదే!”
(లేదా...)
“దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్”
(విట్టుబాబు పంపిన సమస్య)

25, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4289

26-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుందరి వెన్నెలవె యనుట చోద్యంబెటులౌ”
(లేదా...)
“సుందరి నీవు వెన్నెలవె చోద్యము గాదిటులన్ వచించినన్”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సంస్కృత సమస్య 

'సుందరి రాకాసి నాత్ర సందేహః')

24, డిసెంబర్ 2022, శనివారం

దత్తపతి - 191

25-12-2022 (ఆదివారం)
సిలువ - చర్చి - యేసు - క్రీస్తు
ఈ పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
విష్ణుస్తుతి వ్రాయండి.

23, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4288

24-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునకు నత్త యగునఁట రమణి సీత”
(లేదా...)
“రామచంద్రుని భార్య యొక్కతె రాజసంబున నత్తయౌ”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సమస్య)

22, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4287

23-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శకునిం గూల్చెను రామచంద్రుఁడు రణోత్సాహైకశీలున్ ఖలున్”
(లేదా...)
“శకునిన్ రాముండు గూల్చె రణవీరుండై”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సమస్య)

21, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4286

 22-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అభిమన్యుఁడు భారతమున నతివృద్ధుఁ డగున్”
(లేదా...)
“వృద్ధుం డందరికంటె భారతమునన్ వీరాభిమన్యుండగున్”
(శ్రీకాకుళం లలితాదిత్య శతావధాన సమస్య)

20, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4285

21-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీకాకుళమునఁ గవులకుఁ జేసి రవమతిన్”
(లేదా...)
“చేయం జూచి రవజ్ఞనున్ గవులకున్ శ్రీకాకుళంబందునన్”

(మొన్న శ్రీకాకుళంలో లలితాదిత్య శతావధానంలో నేనిచ్చిన సమస్య)

19, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4284

20-12-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవికర్ణరసాయనములు గాకుల గోలల్”
(లేదా...)
“కాకుల గోల నేఁడు గవికర్ణరసాయన మెయ్యె వింటివా”

18, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4283

19-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంసునిన్ మించు సుజనుఁడు గలఁడె భువిని”
(లేదా...)
“కంసుని మించు సజ్జనునిఁ గానము భాగవతమ్మునన్ సఖా”

17, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4282

18-12-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాస్త్రదూర కార్యమ్ములు సౌఖ్యమొసఁగు”
(లేదా...)
“శాస్త్ర విరుద్ధ కార్యములె సౌఖ్య మొసంగును మానవాళికిన్”

16, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4281

17-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అద్దమందుఁ గాంతు నన్యు నొకని”
(లేదా...)
“అద్దమునందుఁ గాంచినపు డన్యుఁడు గన్పడు నెల్లవేళలన్”

15, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4280

16-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తక్షకుఁడు హితకారి యుదంకునకును”
(లేదా...)
“తక్షకుఁ డాప్తుఁడై హిత ముదంకునకుం బొనరించె మేలుగన్”

14, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4279

15-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా”
(లేదా...)
“భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో”

13, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4278

14-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గరిటతోఁ దోడవచ్చు సాగరజలమును”
(లేదా...)
“గరిటం దోడఁగవచ్చు వార్ధిజలముం గామేశ్వరా వింటివా”

12, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4277

12-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పక్షమ్ములు దెగిన పక్షి పైపైకెగసెన్”
(లేదా...)
“పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్”

11, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4276

12-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్య విముఖులఁట విజయవాడ ప్రజలు”
(లేదా...)
“పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే”

(ఆముదాల మురళి గారి 200వ అష్టావధానంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిచ్చిన సమస్య)

10, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4275

11-12-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కొట్టె నత్తనుఁ బ్రేమతో కోడలమ్మ”
(లేదా...)
“అత్తనుఁ గొట్టెఁ గోడలు సమాదరభావము పొంగి పొర్లఁగన్”

9, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4274

10-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁ డుదయించె రావణు రాజ్యమందు”
(లేదా...)
“రాముఁడు పుట్టె రావణుని రాజ్యమునందున ధర్మరక్షకై”

8, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4273

9-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాఙ్నగమున నర్జునుఁడు సుభద్రకుఁ బుట్టెన్”
(లేదా...)
“ప్రాఙ్నగమందు శంభుఁడు సుభద్రనుఁ గూడఁగఁ బుట్టె క్రీడియే”

7, డిసెంబర్ 2022, బుధవారం

సమస్య - 4272

8-12-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భాదానమునఁ గవలు గల్గిరి సతికిన్”
(లేదా...)
“గర్భాదానము నాఁడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడఁగన్”

6, డిసెంబర్ 2022, మంగళవారం

సమస్య - 4271

7-12-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునకు సౌఖ్యమ్ము శాంతి సమకూరవలెన్”
(లేదా...)
“జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమకూరగా వలెన్”

5, డిసెంబర్ 2022, సోమవారం

సమస్య - 4270

 6-12-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారమెత్తె భువి నుదారముగను”
(లేదా...)
“దారము భూమినెత్తె సముదారముగా సురలెల్ల మెచ్చగన్”

4, డిసెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4269

5-12-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాటకి పూజ్యురాలనుచుఁ దాపసులెల్లరు గొల్చి రింపుగన్”
(లేదా...)
“పూజ్యురాలు తాటకి యని మునులె యనిరి”

3, డిసెంబర్ 2022, శనివారం

సమస్య - 4268

4-12-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏమేమీ పులిపిల్లలన్ గదిసి లేళ్ళీరీతి లాలించెనా”
(లేదా...)
“ఎవ్విధిఁ బులిపిల్లలను లాలించె లేళ్ళు”

2, డిసెంబర్ 2022, శుక్రవారం

సమస్య - 4267

3-12-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మునిఁగినవాఁడు మూర్ఖుఁడగు మోక్షము దక్కున గౌతమీ నదిన్”
(లేదా...)
“మునుఁగ గౌతమిలో నెట్లు మోక్షమబ్బు”

1, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4266

2-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్”
(లేదా...)
“రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్”