31, అక్టోబర్ 2015, శనివారం

సమస్య - 1841 (యోగము భోగేచ్ఛ...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్.

పద్యరచన - 1050

కవిమిత్రులారా!
“ఆకలి దప్పులన్ మఱచి యాడిన రోజులు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(కాటేపల్లి సీతారామ మూర్తి గారికి ధన్యవాదాలతో...)

30, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్య - 1840 (జింక చంపి తినును...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జింక చంపి తినును చిఱుతపులిని.
ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు. 

పద్యరచన - 1049

కవిమిత్రులారా!
“సామాన్యుఁడు వీఁ డనుకొని...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

29, అక్టోబర్ 2015, గురువారం

సమస్య - 1839 (మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మత్స్యయంత్రమ్ముఁ గొట్టెను మాద్రి సుతుఁడు.

పద్యరచన - 1048

కవిమిత్రులారా!
“ఎన్ని చదువఁ బ్రయోజన మేమి గలదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

28, అక్టోబర్ 2015, బుధవారం

సమస్య - 1838 (జనులఁ జంపఁ గల్గు...)


కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనులఁ జంపఁ గల్గు ఘనయశమ్ము.

పద్యరచన - 1047

కవిమిత్రులారా!
“ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

27, అక్టోబర్ 2015, మంగళవారం

మా కాశీ యాత్ర

కవిమిత్రులకు నమస్కృతులు!
నేను నా భార్యతో కాశీయాత్రకు వెళ్తున్నాను. ఎన్నోసార్లు దక్షిణ భారతదేశ యాత్ర చేశాను కాని ఇంత వరకు ఉత్తర భారతానికి ఎప్పుడూ వెళ్ళలేదు. కాశీ దర్శించాలని నా చిరకాల వాంఛ.
కవిమిత్రుడు చంద్రమౌళి సూర్యనారాయణ గారు కాశీకి రాను, పోను రైల్వే టికెట్లు రిజర్వ్ చేయించారు. వారికి ధన్యవాదాలు.
31-10-2015 వరంగల్ నుండి బయలుదేరి 1-11-2015 నాడు అలహాబాదు త్రివేణీసంగమం దర్శించి ఆరోజు రాత్రికాని, నవంబర్ రెండున కాని కాశీకి చేరుకుంటాను. 7-11-2015 నాడు తిరుగు ప్రయాణం.
పదిరోజుల కొరకు సమస్యలను, పద్యరచనలను షెడ్యూల్ చేస్తున్నాను. వెంట టాబ్‍లెట్ ఉంటుంది కనుక మీ పద్యాలను వీలైనప్పుడల్లా సమీక్షిస్తుంటాను.
కాశీలో ఉండడానికి చవకగా, సౌకర్యంగా ఉండే (అన్ని కులాల వారికి అవకాశం ఉండే) సత్రం గురించిన సమాచారాన్ని తెలిసిన మిత్రు లెవరైనా అందించవలసిందిగా మనవి.

సమస్య - 1837 (కలఁడా విజ్ఞుండు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్.

పద్యరచన - 1046

కవిమిత్రులారా!
“నవవికచ సరసిరుహము...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ నచ్చిన ఛందలో పద్యం వ్రాయండి.

26, అక్టోబర్ 2015, సోమవారం

సమస్య - 1836 (మన్మథుండు ముక్కంటికి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మన్మథుండు ముక్కంటికి మాతులుండు.

పద్యరచన - 1045

కవిమిత్రులారా!
“ఔరా కలయా నిజమా...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

25, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్య - 1835 (బుద్ధుఁడు హింసయె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బుద్ధుఁడు హింసయె హితమని బోధించె నిలన్.

పద్యరచన - 1044

కవిమిత్రులారా!
“విను మిదె నా హితవాక్యము...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(భారతార్థంలో వ్రాయరాదని సూచన)

24, అక్టోబర్ 2015, శనివారం

సమస్య - 1834 (వాలమ్ములు గలవు...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వాలమ్ములు గలవు రెండు బంట్రోతునకున్.
(‘కవిజనోజ్జీవని’ గ్రంథంనుండి)

పద్యరచన - 1043

కవిమిత్రులారా!
“కటకట యిట్టి మాట లనఁగాఁ దగునే...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

23, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్య - 1833 (అమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమరావతి రాజు చంద్రుఁడై శోభిల్లెన్.

పద్యరచన - 1042

కవిమిత్రులారా!
“బలము గలదేని నాతో...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

22, అక్టోబర్ 2015, గురువారం

సమస్య - 1832 (కరి మహిషాసురుని...)

విజయదశమి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కరి మహిషాసురునిఁ జంపి కాచెన్ జగతిన్.
(ఒంగోలులో 19-10-2015న జరిగిన అవధానంలో కప్పగంతు జయరామయ్య గారు ఇచ్చిన సమస్య)

పద్యరచన - 1041

దసరా శుభాకాంక్షలు
కవిమిత్రులారా!
ఈనాటి పద్యరచనకు అంశము...
“విజయదశమి”

21, అక్టోబర్ 2015, బుధవారం

సమస్య - 1831 (రాక్షసుఁడు రచించె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాక్షసుఁడు రచించె రామకథను.

పద్యరచన - 1040

కవిమిత్రులారా!
“వికసించెను ముఖపద్మము...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

20, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్య - 1830 (లలిత మృదూక్తులన్...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లలిత మృదూక్తులన్ కవితలన్ రచియించిన మెచ్చ రెవ్వరున్.

పద్యరచన - 1039

కవిమిత్రులారా!
ఈనాటి పద్యరచనకు అంశము...
‘బతుకమ్మ’

19, అక్టోబర్ 2015, సోమవారం

సరస్వతీ స్తుతితల్లీ !నా మదిలో నినుందలతు, నే తాత్సారముంజేయ, నీ

కల్లోలంబగు మోహసింధువులఁ జిక్కంబట్టి నాపాపముల్
యల్లాడించుచునున్నవో జనని! మా యమ్మా! సుతంత్రంబుతో
నీళ్ళన్ పాలను వేరుజేయు గుణముల్ నీవే ప్రసాదింపవే!హంసపై కొలువైన మానిని! యక్కరన్ కనిపెట్టుమా!
ధ్వంసమవ్వగ నాదు భ్రాంతులు, దక్షురాలనుఁ జేసి, వి
ద్వాంసురాలుగఁ జూడుమమ్మ! సదా మదిన్ నిను దల్తు,నే
యంసమైనను విద్యనిచ్చిన నజ్ఞగానిక నుందునే?సరస్వతీ, దయామయీ! విశాల నేత్రి! చూడుమా!
పరమ్మునందిహమ్మునందు పాలనమ్ము సేయుమా!
వరమ్ము నన్ను కోరమందువా, విరించిరాణి, శ్రీ
కరమ్ము నీదు దీవనమ్ము , కాంచనమ్ము చాలునే?


రచన - లక్ష్మీదేవి

సరస్వతీ పూజ

రచన - గురుమూర్తి ఆచారిమ.
తరమే యెవ్వనికేని నిత్యము సమస్త౦బైన లోకావళిన్
దరహాసద్యుతి న౦ధకారమును విధ్వ౦స౦బు గావి౦చుచున్
కరపద్మస్థిత వైణికాస్వరతర౦గశ్రేణి నాన౦ద డో
ల రహి౦ప౦గ నొనర్చు త్వద్విమల లీలాకేళి వర్ణి౦పగన్.

చ.
లలితకళావితాన సమల౦కృత సౌమ్య ముఖస్థల౦బు, శీ
తల కరుణాసుధారస నిధాన సునేత్రయుగ౦బు, ధర్మ ని
ర్మల హృదయా౦శమున్, కవిసమాజ నుతా౦చిత పాదపద్మముల్,
గలిగి తనర్చు నిన్నెద దల౦చెద బ్రోవుము తల్లి భారతీ!

ఉ.
తల్లి! విప౦చికాస్వర సుధారసధారల మీరు పల్కులన్
చల్లని మ౦దహాస మృదుచ౦ద్రిక కన్నను శుభ్రమౌ మదిన్,
మెల్లని రాజహ౦స గతి మి౦చిన వర్తనమున్, సత౦బు రా
జిల్లగ నీ పదాబ్జముల చేరువ నన్నిడు మమ్మ శారదా!

సీ.
తేనియ లొలుక౦గ వీణియ మీటుచు
నాన౦దలహరిలో నలరుచున్న
చేరువ నాట్య౦బు జేయు మయూరమున్
గనుల ప౦డుగ గాగ గా౦చుచున్న
జలజాత స౦భవు చతురాననములతో
వేదవాదమ్ము గావి౦చు చున్న
చేత బూనిన ముద్దుచిలుక తేటపలుకు
వీనుల వి౦దుగా వినుచునున్న
తే.గీ.
ఆ సరస్వతీ జనని నా కనవరతము
సర్వ లోకోన్నత౦బైన జ్ఞానధనము
మరియు దానితో కైవల్య మార్గ మొసగి
బ్రోచు చు౦డగ నాకి౦క లోప మేది?

సమస్య - 1829 (కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కృష్ణుఁ డాడెనఁట క్రికెట్టు క్రీడ.

పద్యరచన - 1038

కవిమిత్రులారా!
“కలయో వైష్ణవమాయయొ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

18, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1828 (పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పురుషపుంగవు నోడించి పొలఁతి నెగడె.

పద్యరచన - 1037

కవిమిత్రులారా!
“ఔరా యెవ్విధి నమ్ముదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

17, అక్టోబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1827 (చేఁతకానివాఁడు సేసె సృష్టి)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చేఁతకానివాఁడు సేసె సృష్టి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్యరచన - 1036

కవిమిత్రులారా!
ఈరోజు పద్యరచనకు అంశము...
“సూర్యోదయ వర్ణనము”
ఛందము - సీసము.

16, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1826 (యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్.

పద్యరచన - 1035

కవిమిత్రులారా, 
“కమలములవంటి కన్నులు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

15, అక్టోబర్ 2015, గురువారం

దత్తపది - 84 (కారు-లారీ-జీపు-వ్యాను)

కవిమిత్రులారా,
కారు - లారీ - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ `రామాయణార్థం'లో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
(డా. విష్ణునందన్ గారి సూచనను గౌరవిస్తూ...)

పద్యరచన - 1034

కవిమిత్రులారా, 
“మగఁడా! పోటుమగండ వీవె యని సంభావింప ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

14, అక్టోబర్ 2015, బుధవారం

దత్తపది - 83 (కారు-లారి-జీపు-వ్యాను)

కవిమిత్రులారా,
కారు - లారి - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

పద్యరచన - 1033

కవిమిత్రులారా, 
“కవికలమున కున్న మహిమ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

13, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1825 (సజ్జనులు చేరుదురు యమసదనమునకు)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సజ్జనులు చేరుదురు యమసదనమునకు.

పద్యరచన - 1032

కవిమిత్రులారా, 
“ఎక్కడ దాగినాఁడొ కనిపించఁడు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

12, అక్టోబర్ 2015, సోమవారం

సమస్యాపూరణం - 1824 (బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బతుకమ్మల నాడిరి మగవారలు వేడ్కన్.

పద్యరచన - 1031

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
‘మహాలయ అమావాస్య’

11, అక్టోబర్ 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1823 (శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీరామా యని పిలిచిన శివుఁ డేతెంచెన్.

పద్యరచన - 1030

కవిమిత్రులారా, 
“నమ్ము మీ మాట నిజము మోసమ్ము గాదు...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

10, అక్టోబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1822 (పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
పురుషుఁడు పసుపాడి ముడిచెఁ బూమాల నొగిన్.

పద్యరచన - 1029

కవిమిత్రులారా, 
“భర్త భరించెడివాఁ డఁట...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

9, అక్టోబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1821 (కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
కాంతఁ గోరఁగ తానె యేకాంతుఁ డయ్యె.
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

పద్యరచన - 1028

కవిమిత్రులారా, 
“అనిశము సర్వభూతములయందు....”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.

8, అక్టోబర్ 2015, గురువారం

సమస్యా పూరణం - 1820 (దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా)


కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
దుర్భర దారిద్ర్య పీడితుఁడవు కుబేరా. 

పద్యరచన - 1027

కవిమిత్రులారా, 
"ఇద్దరు భార్యలు గలిగిన..."
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి. 

7, అక్టోబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1809 (చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చీమ కుట్టెఁ జచ్చె సింహ మయ్యొ.

పద్య రచన - 1026

కవిమిత్రులారా,
“ఎంత సుదిన మిద్ది యేమని వివరింతు...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

6, అక్టోబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణం - 1808 (రాముఁ డేలినాఁడు రోము ప్రజల)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డేలినాఁడు రోము ప్రజల.

పద్య రచన - 1025

కవిమిత్రులారా,
“పుడమిఁ గల జనులు పొగడఁగ...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

5, అక్టోబర్ 2015, సోమవారం

సమస్యాపూరణం - 1807 (కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కావేరీతీరమందు గలదఁట ఢిల్లీ.

పద్య రచన - 1024

కవిమిత్రులారా,
“ఏమని వర్ణింతును నీ....”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

4, అక్టోబర్ 2015, ఆదివారం

నిన్నటి అవధాన విశేషాలు.


నిన్న (3-10-2015) సాయంత్రం సికిందరాబాద్, సీతాఫల్‍మండిలోని వీరమాచనేని పడగయ్య హైస్కూల్‍లో శ్రీమతి యం.కె. ప్రభావతి గారి 103వ అష్టావధానం జరిగింది. ఆ విశేషాలు...

1. నిషిద్ధాక్షరి (ప్రజలకు వాక్శుద్ధి కలిగించమని భారతిని కోరుతూ కందపద్యం)
అవధాని పూరణ (కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. కొన్ని నాకు వినిపించలేదు).....
శ్రీ(వ)ర(మ)ంజి(త)ంపన్(భ)అ(?)ంబా
చేర(గ)న్నీ(క)వే(?)ప్ర(భ)కా(శ)ర సి(ర)ద్ధిన్(?)ని(ర)త్తే
భారతి వాగామృతమును
ధీరత నిమ్మా ప్రజలకు తెలివిన్ దయతో.

2. సమస్య (రంకువు జూచి ముద్దుగని రాక్షసుఁ డయ్యె నదేమి చిత్రమో)
అవధాని పూరణ....
శంకులు చక్రముల్ లతలు చక్కగ నేసెను నేతగాఁడు నా
వంకల వన్నెలన్ దెలుపు బంగరు చేతల హస్తకృత్యమున్
ఉంకువ గాగ నిచ్చెఁ దన యుర్వర నేలెడి రాజుకు న్నిసీ
రంకువుఁ జూచి ముద్దుగని రాక్షసుఁ డయ్యె నదేమి చిత్రమో.

3. దత్తపది (కలము, బలము, హలము, పొలము పదాలతో స్వేచ్ఛావృత్తంలో ఆత్మహత్యలు చేసుకొనవద్దని రైతులకు ధైర్యం చెప్తూ పద్యం)
అవధాని పూరణ....
కలమును నాయుధమ్ముగను గట్టిగ వాడుము సోదరా కవీ
బలమును నింపుఁడయ్య ప్రజబాధలఁ దీర్పఁగ రైతుసోదరుల్
హలములఁ జేగొనంగఁ గని హర్షముతోడుత మెచ్చు మాతనిన్
పొలములు నిండి పంటలను మోదము గూర్చును జాతి కంతకున్.

4. వర్ణన (స్వేచ్ఛాభారతంలో స్వచ్ఛభారతి)
అవధాని పూరణ....
స్వేచ్ఛాభారతభూమియే యయిన నీ విశ్వంబులో మచ్చయే
తుచ్ఛంబైన ననాగరీకములు పోద్రోలంగ కల్గుం గదా
అచ్ఛా భారతి స్వచ్ఛమయ్యె నని యాహా కీర్తి నందున్ గదా
స్వచ్ఛత్వంబును కోర మోడియును నాస్వాదించు మేళ్ళెన్నియో.

5. న్యస్తాక్షరి (మొదటిపాదం 10వ అక్షరం ‘ప’, రెండవపాదం 11వ అక్షరం ‘డ’, మూడవపాదం 15వ అక్షరం ‘గ’, నాల్గవపాదం 16వ అక్షరం ‘య’. ఆ పాఠశాల వ్యవస్థాపకుడు పడగయ్య గారిపై శార్దూలంలో పద్యం)
అవధాని పూరణ....
ఔరా యెంతటి పాఠశాల (ప)ని నా ధీరుండె నిల్పెం గదా (యతి?)
సారాచారవిచారదృష్టి న(డ)కల్ చక్కంగ నేర్పున్ గదా
పేరెన్నంగల మాచినేని ప్రభు విఖ్యాతుంగ నిల్పుం గదా (యతి?)
ఈరీతిన్ బహుకీర్తి ఛాత్రులకు నెన్నేనిన్ వరాలీయగన్
(ప్రక్కనున్ను కోడిహళ్ళి మురళీమోహన్ గారితో మాట్లాడుతూ పై రెండు పాదాల యతిదోషాలను గమనించలేదు. చివరిపాదంలో యతిదోషాన్ని నేను తెలియజేస్తే సవరించారు)

మిగిలిన పురాణ పఠనము, నామగణనములను నేను వ్రాసికొనలేదు.
మొత్తానికి అవధాన కార్యక్రమం బాగుగా జరిగింది. అవధానికి నా అభినందనలు.

సమస్యాపూరణం - 1806 (స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్తనవస్త్రము విడిచి వధువు తలఁచెను మామన్.
(నిన్న అవధానంలో ఒక వక్త చెప్పిన ‘స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి’ అన్న సంస్కృత సమస్యకు తెనుఁగుసేత)

పద్య రచన - 1023

కవిమిత్రులారా,
“నే నొక పూలతోటకడ నిల్చితి నొంటిరినై...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

3, అక్టోబర్ 2015, శనివారం

సమస్యాపూరణం - 1805 (తెలివి లేనివాఁడె దేశికుండు)

కవిమిత్రులారా!
(నిన్నటి ‘సెలవు’ను good bye అనే అర్థంలో కాకుండా casual leave గా పరిగణించమని మనవి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తెలివి లేనివాఁడె దేశికుండు.

పద్య రచన - 1022

కవిమిత్రులారా,
(నిన్నటి ‘సెలవు’ను good bye అనే అర్థంలో కాకుండా casual leave గా పరిగణించమని మనవి)
“కటకట యెన్ని కష్టములు గల్గెను...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యరచన చేయండి.

2, అక్టోబర్ 2015, శుక్రవారం

‘సెలవు’ ప్రకటన నేపథ్యం...

మిత్రుల కోరికపై పోస్టును, పోస్టుపై వచ్చిన వ్యాఖ్యలను తొలగించాను.
ఇక ఈ విషయాన్ని  ఒక పీడకలగా భావించి  మరిచిపోదాం.

సెలవు!

సెలవు!

1, అక్టోబర్ 2015, గురువారం

సమస్యాపూరణం - 1804 (ద్రుపదరాజకన్య ద్రోణు వలచె)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ద్రుపదరాజకన్య ద్రోణు వలచె.
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

పద్య రచన - 1021

కవిమిత్రులారా,
“గురుశబ్ద వాచ్యుఁ డెవ్వఁడు...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.
(పద్యప్రారంభం అని స్పష్టంగా పేర్కొన్నా కొందరు కవిమిత్రులు పాదభ్రంశం చేస్తున్నారు. అలా చేయవద్దని మనవి.)