31, మే 2023, బుధవారం

న్యస్తాక్షరి - 80

1-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
అంశం - శ్రీరాముని వనవాసము
చందం - ఉత్పలమాల
(1వ పాదం 1వ అక్షరం 'పం'; 2వ పాదం 2వ అక్షరం 'చ'; 3వ పాదం 10వ అక్షరం 'వ'; 4వ పాదం  17వ అక్షరం 'టి')
(లేదా...)
'పం, చ, వ, టి' అనే అక్షరాలను వరుసగా నాలుగు పాదాల ఆద్యక్షరాలుగా ప్రయోగిస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.

30, మే 2023, మంగళవారం

సమస్య - 4435

31-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేప గూడొనర్చి వసించుఁ జెట్టుపైన”
(లేదా...)
“చేప నెఱుంగవా వినుము చెట్టున గూడొనరించి యుండదా”

29, మే 2023, సోమవారం

సమస్య - 4434

30-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముక్కును గోయుము జలుబు మిమున్ బాధింపన్”
(లేదా...)
“ముక్కుం గోయఁగ మేలగున్ జలుపు మిమ్ముం జేరి బాధించినన్”

28, మే 2023, ఆదివారం

సమస్య - 4433

29-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చిరుగుల గుడ్డల సొబగును జెప్పఁగ వశమా”
(లేదా...)
“చిరుగుల గుడ్డలన్ సొబగుఁ జెప్ప నశక్యము నేటి కొమ్మకున్”
(మిస్సన్న గారికి ధన్యవాదాలతో...)

27, మే 2023, శనివారం

సమస్య - 4432

28-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రోహిణి మేఘతతిఁ దెచ్చెఁ ద్రోయుచు నెండన్”
(లేదా...)
“రోహిణి దెచ్చె మేఘతతి ద్రోయుచు నెండల మండువేసవిన్”
(కొరుప్రోలు గౌరినాయుడు గారికి ధన్యవాదాలతో...)

26, మే 2023, శుక్రవారం

సమస్య - 4431

27-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముని వృత్రుండు మ్రింగె ప్రజ వెరగందన్”
(లేదా...)
“రామున్ వృత్రుఁడు మ్రింగె శూరజను లౌరాయంచు శ్లాఘింపఁగన్”

25, మే 2023, గురువారం

సమస్య - 4430

 26-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రఘురాముఁడు పాంచజన్య రవమును వినిచెన్”
(లేదా...)
“రాముఁడు పాంచజన్యమును శ్రావ్యముగా వినిపించె వింటివా”

24, మే 2023, బుధవారం

సమస్య - 4429

25-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా”
(లేదా...)
“శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా”
(ఛందోగోపనం)

23, మే 2023, మంగళవారం

దత్తపతి - 196

24-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'నది - మది - గది - పది' పదాలను ప్రయోగిస్తూ
గురుశిష్యుల అనుబంధం గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.

22, మే 2023, సోమవారం

సమస్య - 4428

23-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరములు లేనట్టివాఁడు గత్తులు దూసెన్”
(లేదా...)
“కరములు లేనివాఁడు చురకత్తులు దూసె రణాంగణంబునన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

21, మే 2023, ఆదివారం

సమస్య - 4427

22-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు”
(లేదా...)
“చంద్రుఁడు రాహుకేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

20, మే 2023, శనివారం

సమస్య - 4426

21-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుఁ డనిన్ సంహరించెఁ గౌరవపతినే”
(లేదా...)
“కర్ణుఁడు గుంతి మాట విని కౌరవనేతనుఁ గూల్చె నాజిలోన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

19, మే 2023, శుక్రవారం

సమస్య - 4425

20-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామ లోభ మోహమ్ములఁ గలుగు ముక్తి”
(లేదా...)
“కామము లోభమోహములఁ గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

18, మే 2023, గురువారం

సమస్య - 4424

19-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గర్భముం దాల్చె సర్పము గప్ప వలన”
(లేదా...)
“గర్భముఁ దాల్చె సర్పమనఁ గప్పయె కారణమాయె వింతగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

17, మే 2023, బుధవారం

సమస్య - 4423

18-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలిన నేత్రములె కనెను గద సర్వమ్మున్”
(లేదా...)
“కాలిన కన్నులే మిగులఁ గాంచెఁ బ్రసన్నముగా సమస్తమున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

మనవి


 కవిమిత్రులకు నమస్కృతులు.

    డెబ్బైమూడేళ్ళ వయస్సులో ఉన్న నేను కొంతకాలంగా తరచూ అనారోగ్యం పాలవుతున్న కారణంగా మీ పూరణ పద్యాలను సమీక్షించలేకపోతున్నాను. మాటిమాటికి జ్వరం వచ్చి పోతూ ఉండడం, దానితో పూర్తిగా నీరసించిపోవడం కారణంగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ప్రయాణాలు చేయలేక ఈమధ్య కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడ వెళ్ళలేకపోయాను. డాక్టర్ గారిని సంప్రదించి మందులు వాడుతున్నాను. ఆరోగ్యం కుదుట పడగానే మీ పద్యాలను సమీక్షిస్తాను.

    ఎంతో ఆసక్తితో, కష్టపడి వ్రాసిన పద్యానికి స్పందన కరువైతే ఎంత నిరుత్సాహ పడతామో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే నేను అనారోగ్యంతో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా మిత్రులను పరస్పర గుణదోష విచారణ చేసుకొనవలసిందిగా కోరుతూ ఉంటాను. 

    నా అశక్తతను గుర్తించి నిరుత్సాహ పడకుండా మీరంతా క్రమం తప్పకుండా సమస్యాపూరణలు చేస్తూ ఉండాలని, మిత్రులు పరస్పర సమీక్షలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.

16, మే 2023, మంగళవారం

దత్తపతి - 195

17-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'కిక్, కుక్, చిక్, చెక్' పదాలను ప్రయోగిస్తూ
తెలుగు భాషా వైభవాన్ని గురించి
స్వేచ్ఛఛందంలో పద్యం వ్రాయండి.
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన దత్తపది)

15, మే 2023, సోమవారం

సమస్య - 4422

16-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భార్య కాళ్ళు వట్టె భర్త జడిసి”
(లేదా...)
“భార్య పదాంబుజద్వయము భర్తయె పట్టెను భీతచిత్తుఁడై”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

14, మే 2023, ఆదివారం

సమస్య - 4421

15-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాడి యగును మాత సుతునిఁ బరిణయమాడన్”
(లేదా...)
“పాడియగున్ గుమారుని వివాహముఁ జేసికొనంగ మాతకున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

13, మే 2023, శనివారం

సమస్య - 4420

14-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తనయ తండ్రి కిచ్చె జనన మలరి”
(లేదా...)
“తనయ మనోహరుం డయిన తండ్రికి జన్మము నిచ్చె నింపుగాన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

12, మే 2023, శుక్రవారం

సమస్య - 4419

 13-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చీఁకటిన్ వెదఁజల్లెను శీతకరుఁడు”
(లేదా...)
“చీఁకటిన్ వెదఁజల్లె చంద్రుఁడు చింతనిప్పులఁ గ్రక్కుచున్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

11, మే 2023, గురువారం

సమస్య - 4418

12-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిద్దుర వచ్చె పడక విడి నే లేచెదరా!”
(లేదా...)
“నిద్దుర వచ్చుచున్నదని నేనిక లేచెద వీడి మంచమున్”

10, మే 2023, బుధవారం

సమస్య - 4417

11-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగవారిని లొంగఁదీయు మార్గం బిదియే”
(లేదా...)
“మగవారిం దగ లొంగఁదీయుటకునౌ మార్గం బిదే నెచ్చెలీ”
('మాయని మమత' చిత్రంలో ఎన్టీయార్ పూరించిన సమస్య)

9, మే 2023, మంగళవారం

నిషిద్ధాక్షరి - 54

10-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'శ'వర్ణాన్ని ప్రయోగించకుండా 

శిశుపాల వధను గూర్చి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

8, మే 2023, సోమవారం

సమస్య - 4416

9-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నదమ్ములు దంపతు లైరి కనఁగ”
(లేదా...)
“అన్నదమ్ములు వేడ్క దంపతు లైరి లోకులు మెచ్చఁగన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

7, మే 2023, ఆదివారం

సమస్య - 4415

8-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామచంద్రమూర్తి రాక్షసుండు”
(లేదా...)
“రమ్యతనూవిలాసుఁడగు రాముఁడు రాక్షసుఁడే నిజంబుగన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

6, మే 2023, శనివారం

సమస్య - 4414

7-5-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అవధానముఁ జేయువార లబలలె కాదా”
(లేదా...)
“అవధానంబులఁ జేయ మించి రబలల్ హా పూరుషుల్ గుందఁగన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

5, మే 2023, శుక్రవారం

సమస్య - 4413

6-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవివరుల నయ్యొ కాలమ్ము గాటువేసె”
(లేదా...)
“కాలము గాటువేసినది కబ్బము లల్లెడు సత్కవీశులన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

4, మే 2023, గురువారం

సమస్య - 4412

5-5-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జిన్ సేవించినఁ గలుగును స్థిరవాగర్థాల్”
(లేదా...)
“జిన్ సేవించిన వారికిన్ స్థిరములై చేకూరు వాగర్థముల్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)


3, మే 2023, బుధవారం

సమస్య - 4411

4-5-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాండవులకుఁ బెద్ద భార్య కుంతి”
(లేదా...)
“అరయఁగఁ బంచపాండవుల కా సతి కుంతియె పెద్ద భార్యయౌ”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

2, మే 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 79

3-5-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
అంశం - భద్రాచల రామదాసు
ఛందం - శార్దూలం
1వ పాదం 1వ అక్షరం 'భ'; 2వ పాదం 2వ అక్షరం 'ద్రా'; 3వ పాదం 10వ అక్షరం 'చ'; 4వ పాదం16వ అక్షరం 'లం'
(లేదా...)
'భ - ద్రా - చ - లం' ఈ అక్షరాలను పాదాదిలో న్యస్తం చేస్తూ ఆటవెలది కాని, తేటగీతి కాని వ్రాయండి.

1, మే 2023, సోమవారం

సమస్య - 4410

2-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంగళసూత్రమును మహిళ మగనికిఁ గట్టెన్”
(లేదా...)
“మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)