28, ఫిబ్రవరి 2018, బుధవారం

సమస్య - 2611 (నిత్యముఁ గావలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నిత్యముఁ గావలె సమస్య నెమ్మది గలుగన్"
(లేదా...)
"నిత్యముఁ గావలెన్ మనకు నెమ్మది గల్గ సమస్య మిత్రమా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

27, ఫిబ్రవరి 2018, మంగళవారం

సమస్య - 2610 (వెడలి రెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వెడలి రెల్ల భీష్ము పెండ్లిఁ జూడ"
(లేదా...)
"పిన్నలు పెద్ద లేగిరట భీష్ముని పెండ్లినిఁ జూడ వేడుకన్"

సర్వ లఘు సీస బంధములో నారసింహ స్తుతి చిత్రమాల


అడవినెల వరుల నడచగ   హరిపురి  నడయరి గెడ, పనుపడె గద  నక
రణి, బెరసె దితి తరుణి కడుపున, విధి వరము లిడ దనకు మరణము దరి
తొరలదని దలచి, సురలకు వెసనము లొసగుచు ,దురితములు సలుప ,హరి
దరికి  వెడలబడి మొరలిడె దివిజులు, వసుధన యసురిని  సిసువు  హరిని
దలచుచు సతము కొనలిడ తనయుని పెఱ
యనుచు మెరమెరల నిడగ ,హరి నరహరి
గ  పొరలి సరిగొనెను, అటి ఘన నరనెర
పరికి నమసము నిడుదును శరణుయనుచు

తాత్పర్యము
మునులను (సనకసనందులను) వైకుంఠపు  వాకిలి వద్ద అడ్డగించెను సేవక ద్వయము (జయవిజయులు) దాని కారణమున శాపము పొందెను.  ఆదితి కడుపున పుట్టి  బ్రహ్మ చే  మరణము లేకుడా వరములు పొంది దేవతలను బాధ పెట్టగ   వారు హరికి మొర బెట్టుకొనెను. భూ లోకములో  తన కొడుకు (ప్రహ్లాదుడు ) సతతము హరి నామము  చేయుచు పెరుగు చుండ   అతనిని పగ వాడిగా దలచి బాధలు బెట్ట సాగగా  హరి  నరసింహుడుగా అవతరించి హిరణ్య కశిపుని చంపెను   అట్టి  నరసింహునికి వందనము చేసెదను

అడవినెల వరులు = మునులు,  అడచు =  ఆపు ,  అడయరి = బంటు,  ఆమడ  =జంట , పనుపడు =  పొందు , ఆకరిణి = శాపము,  బెరయు  = పుట్టు , వెసనము = బాధ  ,తొరలు  =కలుగు , కొనలిడు   =పెరుగు ,   పెఱ  = శత్రువు, మెరమెర = బాధలు ,పొరలి  =పుట్టి సరిగొనె= చంపెను,  నర నెపరి =   నర సింహుడు

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

26, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2609 (నిందలు మోపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నిందలన్ మోపి మేల్గోరి నెమ్మి మెచ్చె"
(లేదా...)
"నిందలు మోపి పిమ్మటను నెమ్మిని మెచ్చెను మేలు గోరుచున్"
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

25, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2608 (సంసారికి లేని చింత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంసారికి లేని చింత సన్యాసి కగున్"
(లేదా...)
"సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

24, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2607 (జీతము లేనట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జీతము లేనట్టి కొలు విసీ యనఁ దగునే"
(లేదా...)
"జీతము లేని కొల్వుల నిసీ యనువారలు గూడ నుందురే"
(డా. వెలుదండ సత్యనారాయణ గారికి ధన్యవాదాలతో...)

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సమస్య - 2606 (రా రమ్మని పిలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రా రమ్మని పిలిచె సీత రాధాలోలున్"
(లేదా...)
"రారా రమ్మని పిల్చె సీత యెలమిన్ రాధాప్రియుం జెచ్చెఱన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

22, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2605 (లెక్క యెక్కువైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లెక్క యెక్కువైన లేదు సుఖము"
(లేదా...)
"లెక్కయె యెక్కువైనపుడు లేదు గదా సుఖ మెంతమాత్రమున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

21, ఫిబ్రవరి 2018, బుధవారం

సమస్య - 2604 (పుత్రోత్సాహమ్ము పొంగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుత్రోత్సాహమ్ము పొంగుఁ బోఁగాలమునన్"
(లేదా...)
"పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

ఆధునిక సామాజిక పద్య ప్రబంధ రచనా స్పర్థ

*ఆధునిక సామాజిక పద్య ప్రబంధ రచనా స్పర్థ*

నమస్కారం. స్వాగతం.
పాల్గొను మిత్రులు 28/02/2018 ( ఈ నెల చివరి లోగా) లోగా తమ సంసిద్ధతను ఈ పోస్టు కింది కామెంటు బాక్సులో తెలియజేయాలి. ఆ తరువాత వచ్చిన ఎంట్రీలు అంగీకరించబడవు.
పోటీ 01-03-2018 ఉదయం 6 గం. IST నుండి ప్రారంభం అవుతుంది.
ప్రబంధానికి ఇతివృత్తము మీరు స్వయముగా కల్పించినదైనా కానీ, లేదా కింద ఇవ్వబడిన మూడు ఇతివృత్తాల్లో 
ఒకటిగా కానీ ఉండొచ్చు.( కేవలం కథ టూకీగా మాత్రమే ఇవ్వబడుతుంది. ఇక మీ సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ఒకవేళ మేమిచ్చిన ఇతివృత్తాన్ని స్వీకరిస్తే మొత్తం మీద కథ చట్రాన్ని దాటకుండా దానిలో ఎన్ని మార్పులనైనా చొప్పించే స్వేచ్ఛ ఉంటుంది)
1. మీ తుది రచన చేరడానికి చివరి తేదీ : 15/06/2018, సాయంత్రం 6గంటలు IST. ఒకరు ఒక ఎంట్రీ మాత్రమే పంపాలి.
2. పద్యాలు కనీసం 150కి తగ్గకుండా 250కి మించకుండా ఉండాలి. ఆశ్వాస విభజనతో ఉండాలి. అయిదు 
ఆశ్వాసాలు తప్పనిసరి. కనీసం ఒక్కో ఆశ్వాసంలో 30 పద్యాలకు తగ్గకుండా ఉండాలి.
3. మొత్తం పద్యాల్లో 1/4 వంతుకు తగ్గకుండా వృత్త పద్యాలుండాలి. వృత్త లక్షణాలకు అప్పకవీయమే ప్రమాణం.
4. మొత్తం మీరు రాసిన, పూర్తైన ప్రబంధం పద్యాల్లో 1/8 వంతులను మించి వచనం ఉండరాదు. ఒక్క పదమైనా సరే అది వచనంగానే లెక్కించబడుతుంది.
5. ప్రబంధాల్లో ఎలాంటి వర్ణనలు ఉండాలి, ఏమేమి అలంకారాలు ప్రయోగించాలి అన్నది కవులూ/కవయిత్రులూ 
నిర్ణయించుకోవచ్చు. అయితే అవి ఆధునిక సమాజంను దృష్టిలో పెట్టుకొని ఉండాలి.
6. ఒక పదానికి అనేకమైన అర్థాలున్నప్పుడు లోక వ్యవహారంలో ఉన్న అర్థంలోనే ప్రయోగించడం మంచి సంప్రదాయం. అలాగే సామాన్య వ్యాకరణ సూత్రాలు పాటించాలి.
7. మీరు రాసిన పద్యాలను మార్చి నెల నుండి ప్రతి 15 రోజులకొకసారి prajapadyam@gmail.com కు పంపాలి. (ఎన్ని రాస్తే అన్ని)
8. గడువులోగా మొత్తం ప్రబంధాన్ని "ఆధునిక సామాజిక పద్య ప్రబంధ స్పర్థ కోసం నేను పంపుతున్న ఈ రచన నా 
స్వంతం. దేనికీ అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు. గతంలో పత్రికల్లోకానీ, దృశ్య శ్రవణ మాధ్యమాల్లో కానీ, 
అంతర్జాలంలో కానీ (బ్లాగులు, పేజీలు, గ్రూపులతో సహా) ఏ విధంగానూ ప్రచురణ, ప్రసారం, పోస్టింగ్ అయ్యి ఉండలేదు. దీని మీద వచ్చే అన్ని వాద వివాదాలకు నాదే స్వయముగా బాధ్యత" అన్న స్పష్టమైన హామీతో పాటు మీ లేటెస్టు పాస్ పోర్టు సైజు ఫోటో, చిరునామా రాసి prajapadyam@gmail.comకు పంపాలి.
దీనితో పాటు మీకు మెసేజ్ బాక్సులో తెలియజేయబడే చిరునామాకు టైపు చేయించిన మీ రచనను తప్పకుండా 
పంపాలి. ఈ రెండు రకాలుగా పంపబడిన ఎంట్రీ మాత్రమే పరిశీలింపబడుతుంది. (అంటే అటు gmail చేయడంతో 
పాటూ HARD COPY కూడా పంపాలన్న మాట!)
9. బహుమతుల వివరాలు:
ప్రథమ బహుమతి: రూ. 5000/
ద్వితీయ బహుమతి: రూ. 4000/
తృతీయ బహుమతి: రూ. 3000/
మూడు ప్రోత్సాహక బహుమతులు: రూ.1000/
10. బహుమతుల విషయంలో ప్రజ-పద్యం ఎంపిక చేసిన న్యాయనిర్ణేతల సంయుక్త నిర్ణయమే అంతిమం. దీనిమీద 
ఎలాంటి వాద వివాదాలకు, సంప్రదింపులకు ఆస్కారం లేదు. గడువు తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబడదు.
బహుమతి మొత్తాలను పెంచడానికి, తగ్గించడానికి, ఒక బహుమతికి అర్హమైన రచనలు రాలేదని భావించిన పక్షంలో దాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ప్రజ-పద్యం (లోకాస్సమస్తాస్సుఖినోభవంతు) ADMINSకు సర్వ హక్కులూ 
ఉంటాయి.
ప్రజ-పద్యం వారు సూచిస్తున్న ఇతివృత్తాలు: 
ప్రబంధానికి కవులూ, కవయిత్రులూ తమకు తోచిన పేరు పెట్టుకోవచ్చు. (ఇతివృత్తాన్ని కూడా వీటిలోనుండే 
ఎన్నుకోవాలని తప్పని సరి కాదు)
*ఇతివృత్తం ఒకటి*
1. ఒక నలభయ్యేళ్ళ క్రిందట.
2. పచ్చని చిన్న పల్లెటూరు.
3. దొరికిన పనినల్లా చేసుకుని బ్రతుకుతున్న ఒక పేద కుటుంబం.
4. ఒకడే కొడుకు. పది, పన్నెండేళ్ళ వయస్సు. చదువుకొంటున్నాడు. తల్లి చనిపోతుంది.
5. ఏదో ఒక తప్పనిసరి పరిస్థితిలో వాడు ఎవరికీ చెప్పకుండా కన్నతండ్రిని, ఇంటిని వదిలి పారిపోతాడు. 
6. ఎట్లాగో దూరంగా వున్న మరో రాష్ట్రంలోని మహా నగరానికి చేరుకుంటాడు.
7. అనేక ప్రయత్నాలు, అవమానాలు, అగచాట్లు, పస్తుల తరువాత ఒక చిన్న పనిని సంపాదించుకుంటాడు.
8. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది, డబ్బు, పలుకుబడి సంపాదించుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు 
కలుగుతారు. పిల్లలు అతడి వ్యాపారాలలో తోడ్పడుతూ వుంటారు. భార్య చనిపోతుంది.
9. నలభయ్యేళ్ళ తరువాత తన ఊరి పైకి ధ్యాస మళ్ళుతుంది. తనొక్కడే వెళ్తాడు.
10. ఊరు పెద్దగా మారలేదు. ఇతడి విషయం తెలిసి జనం స్వాగతిస్తారు. ఊరి మేలు కోసం కొన్ని వాగ్దానాలు చేసి 
తిరిగి వస్తాడు.
11. సంవత్సరం తరువాత తన వ్యాపారాలను పిల్లలకు అప్పజెప్పి తను ఊరికెళ్ళి పోయి, అనేక సంక్షేమ 
కార్యక్రమాలను చేపట్టుతాడు. అక్కడే ఉండిపోతాడు.
*ఇతివృత్తం రెండు*
1. ఒక చిన్న పల్లెటూరు. ఒక రైతు కుటుంబం. వ్యవసాయం తప్ప మరేమీ తెలియని పెద్దగా చదువుని రైతు. అతడు, భార్య, ఇద్దరు కొడుకులు. చిన్న పిల్లలు.
2. వ్యవసాయంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక నష్టాలు ఎదుర్కొని, అప్పుల పాలౌతాడు.
3. ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని భావిస్తున్న తరుణంలో అతడికి గల్ఫ్ దేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది.
4. అక్కడ చాలా కష్టపడి పనిచేసి సంపాదించినదల్లా ఇంటికి పంపుతాడు. భార్యకూడా జాగ్రత్తగా పిల్లలను 
పెంచుతుంది. పిల్లలు బాగా చదువుకుంటారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. 
5. అప్పులన్నీ తీరిపోతాయి. భార్య వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వుంటుంది. పిల్లలు చదువులు పూర్తి చేసుకుని 
ఉద్యోగాలు సంపాదించుకుంటారు.
6. ఇరవయ్యేళ్ళకు పైగా కుటుంబానికి, దూరంగా ఉండి ఒక డబ్బులు సంపాయించే యంత్రం లాగా శ్రమించిన 
అతడు చివరికి ఉద్యోగాన్ని వదులుకుని తిరిగి వస్తాడు.
7. ఇద్దరు పిల్లలు వాళ్ళ సంస్థల తరఫున విదేశాలకు వెళ్లి భార్యా బిడ్డలతో అక్కడ స్థిరపడుతారు.
8. పాతికేళ్ళు ఎడారి దేశాలలో శ్రమించికోల్పోయిన కుటుంబ వాతావరణాన్ని ఆశించి పిల్లలతో, మనుమలతో కాలం 
గడుపుదామని అతడు కన్న కలలన్నీ కల్లలౌతాయి.
9. ఫోన్లలో పిల్లల పలకరింపులు. ఇక్కడి గాలి, నీరు, మట్టి, వాతావరణాన్ని ఈసడించుకునే మనుమలు.
10. అతడు, అతడి భార్య... అదే ఏకాంతము... మళ్ళీ అదే వ్యవసాయం.
*ఇతివృత్తం మూడు*
1. విదేశంలో పెద్ద వుద్యోగి. భార్య, ఇద్దరమ్మాయిలు. ఆయన తల్లిదండ్రులు హైదరాబాదు/విశాఖపట్నంలో. రెండేళ్ళ
కోసారి ఇంటికి వచ్చి వెళ్తుంటారు. సంతృప్తికరమైన కుటుంబం.
2. భార్య మూడో కాన్పులో ఆడబిడ్డను కని మరణిస్తుంది. 
3. కాన్పు కొచ్చిన అత్తగారు పాపను తీసుకుని ఇండియా వస్తుంది.
4. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. 
5. ఇక్కడ ఇంటిపెత్తనం మేనత్త, మేనమామలది. పాపకోసం తండ్రి పంపుతున్న డబ్బులన్నీ దిగమింగేసి, పాపను 
పట్టించుకోరు. అమ్మమ్మ నిస్సహాయురాలు.
6. ఇంట్లో పెంపకం బాగాలేని కారణం చేత చెడు సాంగత్యం పడుతుంది పాప. ఎవడినో ప్రేమించి వాడితో 
వెళతానంటుంది. 
7. అప్పటికే ఇండియా వచ్చి స్థిరపడ్డ తండ్రి ఈ విషయం తెలిసి తీసుకెళతాడు.
8. అప్పటికే అక్కలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడు. పాపకు కూడా మంచి సంబంధం ఖాయం 
చేస్తాడు.
9. కొన్ని కారణాల వలన తను ప్రేమించిన యువకుడి దగ్గరకు వెళ్ళిపోయి వాడిని పెళ్లిచేసుకుంటుంది.
10. వాడు చెడు అలవాట్లకు బానిస అని, వాడికి ఇంతకు ముందే పెళ్ళయిందన్న సంగతి తెలిసి కుమిలిపోతుంది. 
వాడు కట్నం తెమ్మంటూ హింసిస్తాడు. ఇంట్లోంచి పారిపోతుంది.
11. అప్పటికే సవతి తల్లి అనారోగ్యంతో మంచం పడుతుంది. సవతి చెల్లెలు ఎవడితోనో లేచిపోతుంది. తండ్రి 
పాపను వెతుక్కుంటూ వస్తాడు. తన యింటికి తీసుకెళతాడు. సవతి తమ్ముడు, అతడి భార్య ఈమెను ఆదరిస్తారు. 
కుటుంబానికి అన్నీ తానే అవుతుంది.

క్రింది లింకుని తెరచి అక్కడి కామెంటు బాక్సులో మీ అంగీకారాన్ని తెలియజేయవచ్చు. వివరాలను తెలుసుకొనవచ్చు. సందేహాలు తీర్చుకొనవచ్చు.
https://www.facebook.com/groups/1033816143430286/?
multi_permalinks=1329754363836461&comment_id=1333113003500597&notif_id=
1519123933263996&notif_t=feedback_reaction_generic&ref=notif

20, ఫిబ్రవరి 2018, మంగళవారం

సమస్య - 2603 (పతి సరసము లాడఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి సరసము లాడఁగ సతి పరువులు వెట్టెన్"
(లేదా...)
"పతి సరసమ్ములాడ సతి పర్వులు వెట్టె నదేమి చిత్రమో"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

19, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2602 (రాముని సుతుఁ డర్జునుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముని సుతుఁ డర్జునుండు రావణు గెలిచెన్"
(లేదా...)
"రాముని పుత్రుఁ డర్జునుఁడు రావణు గెల్చె రణాంగణమ్మునన్" 
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

18, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2601 (దుష్ట దుర్యోధనుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుష్ట దుర్యోధనుని భార్య ద్రోవది గద"
(లేదా...)
"దుష్ట సుయోధనున్ వలచి ద్రోవది పెండిలియాడె వేడుకన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

17, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2600 (ఎంతయో యనుకొంటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఎంతయో యనుకొంటి మీ రింతె యంద్రు"
(లేదా...)
"ఎంతయొ యంచు నెంచితిని యింతియయే యని మీర లెంతురే"

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సమస్య - 2599 (శారదయే బలిగొనె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శారదయే బలిగొనెఁ గద జను లెందరినో"
(లేదా...)
"శారదయే బలింగొనెను సర్వుల వీతదయాంతరంగయై"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

15, ఫిబ్రవరి 2018, గురువారం

ఆహ్వానము!


సమస్య - 2598 (అనలమ్మే సుమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అనలమ్మే సుమ్మి చల్లనైనది యిలలో"
(లేదా...)
"అనలమె సుమ్మి చల్లన మహాహిమశైలము వేడి యీభువిన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు రామమోహన రావు గారికి ధన్యవాదాలు.

14, ఫిబ్రవరి 2018, బుధవారం

సమస్య - 2597 (దారముపై వ్రాలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్"
(లేదా...)
"దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

న్యస్తాక్షరి - 51 (శి-వ-రా-త్రి)


అంశము - శివస్తుతి
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలది.
న్యస్తాక్షరములు... 
అన్ని పాదాల యత్యక్షరాలు వరుసగా "శి - వ - రా - త్రి" ఉండాలి.

ఏకాదశ రుద్ర మండల బంధ సీసముపద్యము చదువు విధానము :  
బాణము  గురుతు పెట్టిన (జ) దగ్గిర నుంచి మొదలు పెట్టాలి (  డు)తో ఆపి  తిరిగి (ని)తో మొదలు పెట్టాలి  చిత్రములో (పంచ...... భైరవుండు) తో ఆపి  అంతర వృత్తములో ఉన్న (సాం)తో  మొదలు పెట్టి  సుబలుడు తో  ఆపి  పైన తిరిగి బాణము గుర్తు  దగ్గిర గల జ తో మొదలు బెట్టి  (జనని శాంభవి యనగగ  కలకాలము  దయను పంచు) తో ముగించాలి .  దీనిలో విశేషము (డు) అన్న పదము మధ్య శివ లింగములో బందిమ్చబడినది               
సీ:
జడముడి జంగము, శాంభరీ  భిల్లుడు,
నిటలాక్షుడు, నియంత, నీలగళుడు,
భద్రేశుడు, ఉదర్చి, భవానీపతి, భవుడు,
యజ్ఞము, ధూర్జటి, అఖిల గురుడు,
గట్టురా జల్లుడు,  ఖట్వాంగి,  ఉగ్రుడు,
కల్మషకంఠుడు,  ఖరువు,  హరుడు,
కాలాంతకుడు, కాల కాలుడు, చండుడు,
ముక్కంటి, స్వంజుడు, మృడుడు, ధృవుడు,
తే:
యమున రత గురువు, భగాలి, అజుడు, శివుడు,
పంచ వక్త్రుడు, ఫాలుడు, భైరవుండు,
సాంబుడు, విధుడు, సుబలుడు, జనని శాంభ
వి యనగను  కలకాలము  దయను పంచు.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

12, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2595 (అనృతమ్ములఁ బల్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"
(లేదా...)
"అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

11, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2594 (మీసములన్ గనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్"
(లేదా...)
"మీసములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్"
ఈ సమస్యను పంపిన వేటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

గదాబంధ తేటగీతి

హనుమత్ ప్రార్థన 

రమ్ము, రమ్ము, మమ్ముల గాచ రమ్ము, రామ
భక్త! మిమ్ము నమ్ముట దప్పు, పవన జీవ
న! కనుమా, హనుమా! వినుమిక నుత, దయ
నిడి వడి వడిగా వేంచేసి తడవు మమ్ము 

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

10, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2593 (తెలుఁగును నేర్చుకొమ్మనుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తెలుఁగు నేర్చు కొనుమనుచుఁ బల్కఁ దేలిక కొలువు లేవి?" (ఛందోగోపనం)
(లేదా...)
"తెలుఁగును నేర్చుకొమ్మనుట తేలిక నేర్చినఁ గొల్వు లిత్తురే"
ఈ సమస్యను పంపిన మంద పీతాంబర్ గారికి ధన్యవాదాలు.

ఏకముఖీ రుద్రాక్ష మాలికా బంధ తేటగీతి


వర హర!సతి పతి! ,భవ!శివ!ననుగను, సు
ర వర! పుర హర! హరహర! రసధర! నిను
కొలుతు,మరిమరి, పరిపరి, పొలముల, శివ
శివ! యని యని, మనమున జేసెదను బూజ


కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

గోబంధ తేటగీతిక - గోమాత విశిష్టత


తేటగీతిక
కొమ్ములందున కొలువాయె కుంద, శలులు
నొసలి చూపువేల్పుయు, సతి, నొసల వెలిగె,
చెవుల పై నశ్వని సుతులు చేరి యుండె,
కలువ రేడు. కలువ గొంగ. కనుల లోన
నిలచె, నభము పై కందుడు వెలసె శుభము
, పలువరుసన పవనుడు, కడలి రేడు
పన్నమున వెల్గె, బాహువు పైన బాణ 
కూర్చొనగ,గట్టుదాయయు కూరుచుండె 
గళము లో,సూర్యులుండెను కంజరంబు 
లోన పన్నిద్దరును,గుండె లోన సంధ్య 
మాత యుండె, సు డెక్క ల మధ్య నుండె
నాగ సురలు, గంధర్వులు, నప్సరసలు
తొడల పైనుండెను జముడు ,తోక లోన 
సోమ దేవుడు, ముక్కోటి రోమములన 
దాగె దేవతల్,మయమున తూగె లక్ష్మి ,
పొదుగులోన పయోనిధి నొదుగు చుండె
పాలలో సరస్వతి ,తనూపమున నగ్ని 
కాయ జలమందు గంగయు, గంగ డోలు 
నందు నసురులు నర్తించ, నమసములను 
యట్టి గోమాతకు నిపుడు బెట్టు చుంటి

కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

సమస్య - 2592 (సంకటములఁ గూర్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంకటములఁ గూర్చువాఁడు సంకర్షణుఁడే"
(లేదా...)
"సమకూర్చుం గద సర్వ సంకటములన్ సంకర్షణుం డెప్పుడున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

8, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2591 (అక్కా యిటు రమ్మని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్"
(లేదా...)
"అక్కరో యిటు రాగదే యని యాలిఁ బిల్చెను భర్తయే"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

కమల బంధ తేటగీతిక - లక్ష్మీదేవి ప్రార్థనఅంబుజాసన! అతిచర! అమల! అబ్ధి
తనయ! తమ్మియింటిగరిత! తల్లితల్లి!
కలిమి చెలి! కమలాలయ! కలిమి గుబ్బె
త! రమ! రామ! గోమిని! మరుతల్లి! మాత!
పద్మలాంచన! పద్మిని! పద్మవాస!
పద్మగుణ! పద్మకర! పద్మ! పార్దివి! సిరి !
పాల మున్నీటి రాకన్య! పైడి నెలత!
లక్ష్మి! లిబ్బుల జవరాలు! లంబ! లాస్య 
లోకమాత! జలధిజ! వృషాకపాయి!
విష్ణు వల్లభ! సింధుజ! విష్ణు పత్ని! 
జయ! విజయ! జన రoజని! జగము తల్లి! 
శ్రీ సినీ వాలి! శ్రీదేవి! శ్రీ విరక్త!
శ్రీ సునాసిక! శ్రీ దివ్య! శ్రీ మరీచి!
పంచ లోచన! చంద్రిక! భగవతి! శివ!
సుప్రజాత! సునందన! సుద్యుపాశ్య!
బ్రహ్మ విష్ణు శివాత్మిక! భగళ! బాల!
ఇంది! ఇందిర! ఈశ్వర! నందిని! సిత!
సత్య!  చంద్ర సహోదరీ! సంధ్య! సంప
దా! కరుణ జూపి కాచుము దాసునెపుడు. 


పూసపాటి కృష్ణ సూర్య కుమార్

7, ఫిబ్రవరి 2018, బుధవారం

దత్తపది - 134 (ఏరు-పారు-ఊరు-మారు)

ఏరు - పారు - ఊరు - మారు
పై పదాలను ఉపయోగిస్తూ
పల్లీయ సౌందర్యాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఇందిరా శ్రీనివాస్ గారు ఇచ్చిన దత్తపది)

6, ఫిబ్రవరి 2018, మంగళవారం

సమస్య - 2590 (కాటుకగ ధరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్"
(లేదా...)
"కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్"

5, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2589 (దుర్మార్గము గాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుర్మార్గము గాదు గురుల దూషించినచో"
(లేదా...)
"దుర్మార్గం బిసుమంత లేదు గురులన్ దూషింపగా శిష్యులే"
(గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలతో...)

మత్స్యావతార బంధ తేటగీతి లో శ్రీ హరి ప్రార్ధనమనువును, మునులను, మనుజుల ననువుగ, 
హనమున నయించి  ఘనముగ తనువును నిడు
దగ నడపి నిడుజడిన ముదముగ వనధి
న గమనమిడి నభవమున నరసిన  నమి
 నిలుపు గల హరి నమసము సతము నిడెద.
  
నడపు = చేయు; నిడుజడి = విడవని వాన; వహనము = ఓడ; నయించు = చేర్చు; నిడుద = దీర్గము; 
వనధి = సముద్రము; అభవము = ప్రళయము; అరయు = రక్షించు; నిలుపు = రూపము.
రచన -
పూసపాటి కృష్ణ సూర్యకుమార్

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

సమస్య - 2588 (తద్దినమే శుభము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తద్దినమే శుభము లొసఁగు ధరణి జనులకున్"
(లేదా...)
"తద్దినమే శుభంబు లిడు ధారుణిలోని జనాళి కెప్పుడున్"

3, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2587 (అల్లా క్రీస్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ"
లేదా...
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా"
ఈ సమస్యను పంపిన జిలేబీ గారికి ధన్యవాదాలు.

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

సమస్య - 2586 (లక్ష్మణుఁ బెండ్లియాడినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"లక్ష్మణుఁ బెండ్లాడె సీత రాగాన్వితయై"
(లేదా...)
"లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా"
ఈ సమస్యను పంపిన పులికొండ సుబ్బాచారి గారికి ధన్యవాదాలు.

1, ఫిబ్రవరి 2018, గురువారం

సమస్య - 2585 (హనుమంతుఁడు పెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"హనుమంతుఁడు పెండ్లియాడె నద్రితనూజన్"
(లేదా...)
"హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్"