30, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 157

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కొంప కొల్లేరుఁ జేసెడి కొడుకె మేలు.

25, నవంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 156

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్.
మిత్రులకు గమనిక .....
నూతన దంపతులతో తిరుమలేశుని దర్శనానికి వెళ్తున్నాము. అలాగే తిరుపతిలో ఒక పెళ్ళికూడ ఉంది. ఆదివారం వరకు బ్లాగు చూడడం వీలు పడక పోవచ్చు. వీలుంటే సమస్యలను పోస్ట్ చేస్తాను. లేకుంటే పునర్దర్శనం సోమవారం నాడు.

24, నవంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 155

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.

23, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 154

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.

22, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 153

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
రమ్ము చేయగలదు ప్రాణరక్ష.

21, నవంబర్ 2010, ఆదివారం

16, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 152

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ఈటెలే మేలు బాధించు మాటకంటె.

15, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 151

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ!

14, నవంబర్ 2010, ఆదివారం

సమస్యా పూరణం - 150

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
రాగ తాళ దారిద్ర్యమ్ము రక్తి కట్టె.

చమత్కార పద్యాలు - 49

"కాకమాని రాయ!"
ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారిని మూర్తి కవి తన కవిత్వంతో మెప్పించాడు. సంతోషించిన రాయలు అతనికి కాకమాను అనే గ్రామాన్నీ, ఇంద్రనీల మణులు పొదిగిన కుండలాలను దానంగా ఇచ్చాడు.
మూర్తి కవి ఆ కుండలాలను ధరించి వచ్చి సభలో సాటి కవుల మధ్య కూర్చునేవాడు. నల్లని రాళ్ళు పొదిగిన ఆ కుండలాల కాంతి అన్ని దిక్కుల్లో ప్రసరించి మిగిలిన కవుల ముఖాలు నల్లబడుతుండేవి. ఓకరోజు రాయలవారు నవ్వుతూ "ఏమిటీ ... అష్టదిగ్గజాల ముఖాలు నల్లబడ్డాయి?" అన్నాడట.
ఇది మిగిలిన కవులకు అవమానంగా తోచింది. ఎలాగైనా మూర్తి కవి దగ్గర ఆ కుండలాలు లేకుండా చేయాలి. కాని ఎలా? ఎవరు చేయగలరు? అందరూ చర్చించి చివరికి ఆ భారాన్ని తెనాలి రామకృష్ణునిపై పెట్టారు. అతడూ సరేనన్నాడు.
ఒక సాయంత్రం రామకృష్ణుడు మూర్తి కవి ఇంటికి వెళ్ళాడు. మూర్తి కవి ఆ సమయంలో ప్రసన్న చిత్తంతో వీథి అరుగుపై కూర్చుని ఉన్నాడు.
"మూర్తి కవిరాజుకు ప్రణామాలు" అంటూ రామకృష్ణుడు అతన్ని సమీపించాడు.
"ఓహో .. రామకృష్ణుల వారా? ప్రణమాలు. రా .. కూర్చో. ఏమిటీ ఇలా దయచేసారు?" అన్నాడు మూర్తి కవి. ప్రక్కకు జరిగి రామకృష్ణునికి అరుగుపై చోటిచ్చాడు.
రామకృష్ణుడు కూర్చుని " ఆ .. ఏమీ లేదు మూర్తి కవి గారూ, మీ మీద ఒక పద్యం వ్రాసాను. అది మీకు వినిపిద్దామనీ ..." అన్నాడు.
"ఏమిటీ? మీరు నా మీద పద్యం చెప్పడమా? సంతోషం. ఏదీ వినిపించండి" అన్నాడు మూర్తి కవి.
"చిత్తగించండి...
అల్లసాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ విభుని పద గుంఫనంబును
కాకమాని రాయ! నీకె తగుర"
పద్యాన్ని వినగానే మూర్తి కవి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అంత గొప్ప కవుల కవితా విశిష్టతలు అన్నీ కలగలిసి తనలో ఉన్నాయట! అంతే కాక "కాకమాను" గ్రామానికి రాజు నని సంబోధించాడు. ఎంత గొప్ప పద్యం! మూర్తి
కవి ఆనంద పరవశుడై "ఏం కావాలో కోరుకో" అన్నాడు.
"మీ కుండలాలు ప్రసాదించండి" అని వేడుకున్నాడు వినయంగా రామకృష్ణుడు.
మూర్తి కవి సంతోషంగా కుండలాలను తీసి రామదృష్ణునికి ఇచ్చాడు.
మరునాడు సభలో రాయల వారు మూర్తి కవిని చూసి "కవి గారూ! ఈ రోజు మీరు కుండలాలు ధరించకుండా వచ్చా రేమిటి?" అని అడిగాడు.
మూర్తి కవి "మహారాజా! నిన్న రామకృష్ణ కవి నా మీద ఒక పద్యం చెప్పాడు. సంతోషించి ఆ కుండలాలను బహుమానంగా ఇచ్చాను" అన్నాడు.
"ఒక కవిని మెప్పించిన పద్యం అంటే చాల గొప్పదే అయి ఉంటుంది. ఏదీ .. వినిపించండి" అని అడిగారు రాయల వారు.
"నే నెందుకు? రామకృష్ణుడే వినిపిస్తాడు" అని మూర్తి కవి రామకృష్ణునికి సైగ చేసాడు వినిపించ మన్నట్లుగా.
రామకృష్ణుడు ఆ పద్యాన్ని ఇలా వినిపించాడు.
"అల్లసాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ విభుని పద గుంఫనంబును
కాక - మాని రాయ నీకె తగుర"

వినగానే సభ మొత్తం గొల్లుమంది. రాయల వారూ ముసిముసి నవ్వులు నవ్వారు. మూర్తి కవి ముఖం నల్లబడింది.
అసలు విషయం ఏమిటంటే ... మూర్తి కవికి వీపంతా గజ్జి. అందుకని ఆయన తన ఆసనాన్ని ఒక స్తంభం (మాను) దగ్గర వేసుకొని దురద పుట్టినప్పుడల్లా తన వీపును ఆ స్తంభానికి రాస్తూ ఉండేవాడు. ఈ విషయం అందరికీ తెలుసు.
రామకృష్ణుడు మొదట "కాకమాని రాయ" అన్నప్పుడు "కాకమాను అనే గ్రామానికి రాజా!" అనే సంబోధన ఉంది. సభలో "కాక - మాని రాయ" అని విరిచి చదివినప్పుడు " పైన చెప్పిన కవుల ప్రత్యేకతలు వారివే. అవి నీకు కాకుడ పోయి కేవలం "మాని రాయడం (స్తంభానికి వీపు రాయడం) నీకే తగును" అనే అర్థం వచ్చింది.
ఆ విధంగా మూర్తి కవికి శృంగభంగం జరిగింది.

13, నవంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 149

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
రుద్రుని భజించువాఁడు దరిద్రుఁ డగును.

12, నవంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 148

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
పదుగు రాడు మాట పాప మగును.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు "పదుగు రాడు మాట పాపమై ధరఁ జెల్లు" ను సమస్యగా ఇవ్వమని సూచించారు. దానిని కొద్దిగా మార్చాను. వారికి ధన్యవాదాలు.

10, నవంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 147

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్.

ప్రహేళిక - 30

ఈ వేడుక ఏది?
సీ.
తూరుపు కొండపై తొంగిచూచు నెవం
డావు కన్ను కిటికీ యయ్యె నేది?
సహియించు గుణ విశేష్యం బేది? విష్ణు రెం
డవ యవతార రూప విధ మేది?
తోబుట్టు వైనట్టి తొయ్యలి నేమందు
రమరు లసురుల మధ్య గల దేది?
పరగ నాయుర్వేద వైద్య గురు వెవండు?
విన నిమేషమునకు వికృతి యేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరముల నరసి చూడ
నిరువుర నొకటిఁ జేసెడి హితకరమగు
వేడుకై యొప్పు చెప్పుఁ డా వేడు కేదొ?
ఆ వేడుక ఏమిటో చెప్పండి.

ప్రహేళిక - 29 సమాధానం

ఎవరీ మూర్ఖ విద్యార్థులు?
సీ.
గోవింద రాజులు కొలువున్న నగరేది?
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు?
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు?
శివ వాహనము పేరి క్షేత్ర మేది?
ధరణికి నీటిని దాన మొసఁగు నేది?
యితరుల కొనరించు హిత మదేది?
వెనుకటి గాంధర విద్యాలయం బేది?
మానవుం డన వేఱు మాట యేది?
తే.గీ.
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె?
నన్నిఁటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు క్రమముగా మూడవ యక్షరములఁ
జదువ నొక గురువును జేరి చదువఁ గోరి
నట్టి మూర్ఖ విద్యార్థుల నరయుఁ డిపుడు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి వివరణ ...
గోవింద రాజులు కొలువున్న నగరేది? - తిరుపతి
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు? - ముకురము
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు? - వనమాలి
శివ వాహనము పేరి క్షేత్ర మేది? - మహానంది
ధరణికి నీటిని దాన మొసఁగు నేది? - అంబుదము?
ఇతరుల కొనరించు హిత మదేది? - సాహాయ్యము
వెనుకటి గాంధర విద్యాలయం బేది? - తక్షశిల
మానవుం డన వేఱు మాట యేది? - మనుష్యుడు
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె? - వలలుడు
తిరుపతి - ముకురము - వనమాలి - మహానంది - అంబుదము - సాహాయ్యము - తక్షశిల - మనుష్యుడు - వలలుడు
పై పదాల మూడవ అక్షరాలను చదివితే ...
సమాధానం - పరమానందయ్య శిష్యులు.
సమాధానాలు పంపిన వారు ...
నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంద పీతాంబర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
అందరికీ అభినందనలు.

9, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 146

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.
కృష్ణ శాస్త్రి గారి "నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు" ను చంద్రశేఖర్ గారు సూచించారు. వారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 29

ఎవరీ మూర్ఖ విద్యార్థులు?
సీ.
గోవింద రాజులు కొలువున్న నగరేది?
మన ప్రతిరూపమ్ముఁ గనెద మెందు?
వన పుష్పముల మాలికను దాల్చు నెవ్వఁడు?
శివ వాహనము పేరి క్షేత్ర మేది?
ధరణికి నీటిని దాన మొసఁగు నేది?
యితరుల కొనరించు హిత మదేది?
వెనుకటి గాంధర విద్యాలయం బేది?
మానవుం డన వేఱు మాట యేది?
తే.గీ.
విరటు కొలువున భీముఁ డే పేరఁ జొచ్చె?
నన్నిఁటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు క్రమముగా మూడవ యక్షరములఁ
జదువ నొక గురువును జేరి చదువఁ గోరి
నట్టి మూర్ఖ విద్యార్థుల నరయుఁ డిపుడు.
ఆ మూర్ఖ విద్యార్థు లెవరో చెప్పండి.

ప్రహేళిక - 28 సమాధానం

ఈ వాహనం ఏమిటి?
తే.గీ.
లక్ష్మి కూతురు సవతి బాలకుని తండ్రి
భక్తుని సహోదరునకు నభయ మొసంగు
వాని తమ్ముని గాచినవాని జనకు
పట్టి కగ్రజు తండ్రికి వాహనంబు.

కోడీహళ్ళి మురళీ మోహన్ గారి సమాధానం ....
లక్ష్మి కూతురు = గంగ
గంగ సవతి = గౌరి(పార్వతి)
ఆమె బాలకుడు = గణపతి లేదా కుమారస్వామి
అతని తండ్రి = శివుడు
అతని భక్తుడు = రావణుడు
అతని సహోదరుడు= విభీషణుడు
అతనికి అభయ మొసంగువాడు= రాముడు
వాని తమ్ముడు = లక్ష్మణుడు
వాని గాచినవాడు = హనుమతుడు
వాని జనకుడు= వాయువు
అతని పట్టి = భీముడు
అతనికి అగ్రజుడు= ధర్మరాజు
అతనితండ్రి= యమధర్మరాజు
అతనికివాహనంబు= దున్నపోతు.
సరియైన సమాధానం పంపిన డా. ఆచార్య ఫణీంద్ర గారికి, కోడీహళ్ళి మురళీమోహన్ గారికి అభినందనలు.

8, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 145

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 28

ఈ వాహనం ఏమిటి?
తే.గీ.
లక్ష్మి కూతురు సవతి బాలకుని తండ్రి
భక్తుని సహోదరునకు నభయ మొసంగు
వాని తమ్ముని గాచినవాని జనకు
పట్టి కగ్రజు తండ్రికి వాహనంబు.

ఆ వాహనం ఏమిటో చెప్పండి.

6, నవంబర్ 2010, శనివారం

ధన్యవాదాలు

ధన్యవాదాలు
దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రేపు మా అబ్బాయి "వరపూజ" కారణంగా సమయాభావం వల్ల ఈ రోజు వ్యాఖ్యలు కాని, ప్రహేళిక, సమస్యా పూరణం ఇవ్వలేక పోతున్నాను. రేపు కూడా ఇవ్వలేనేమో? పునర్దర్శనం 8 వ తేదీ, సోమవారం నాడు. సెలవు!
క్షమించమని కోరుతూ ...
మీ
కంది శంకరయ్య.

5, నవంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 27

ఎవరీ బ్లాగరి?
ఆ.వె.
పడగ యున్న దొకటి పవిధారి యొకఁడు స
వర్ణదీర్ఘసంధి వలనఁ గలియ
నాంధ్ర పద్య కవిత కాచార్యుఁడై బ్లాగు
లందు మెరయు డాక్ట రతఁ డెవండు?

ఆ బ్లాగరి ఎవరో చెప్పండి.

మిస్సన్న గారి శుభాకాంక్షలు

మిస్సన్న గారి
దీపావళి శుభాకాంక్షలు

దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్!


గురువర్యులకూ, సాటి మిత్రులకూ దీపావళి శుభా కాంక్షలు.

సమస్యా పూరణం - 144

కవి మిత్రులారా,
దీపావళి శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
భానుఁ డస్తమించఁగ సుప్రభాత మయ్యె.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు
జీవితమున పెను కష్టఁపు
భావనల తిమిర మడంగి ప్రాభాత రుచుల్
దేవలె సుఖముల నని దీ
పావళి పర్వదినమున శుభాకాంక్ష లివే!

బ్లాగు మిత్రులకు, హితులకు, ఇతర బ్లాగరులకు
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

ప్రహేళిక - 26 సమాధానం

ఈ కలహభోజనుడిని ఏమంటారు?
సీ.
కరములతో ముష్టిఘాత యుద్ధం బేది?
రంగస్థలముపై విరాజిలు నెది?
కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె?
భాగ్యనగర మయె నే భామ పేర?
భరియించరానట్టి పద్ధతి నే మందు
రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు?
మంచి దైనట్టి సమాచార మేమంద్రు?
ముక్కన్ను లుండు నే పూజ్యునకును?
తే.గీ.
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన?
నన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరమ్ముల ననుసరింపఁ
గలహభోజనుం డగుఁ దెలుపఁ గలరె మీరు?
వివరణ -
కరములతో ముష్టిఘాత యుద్ధం - బాహాబాహి
రంగస్థలముపై విరాజిల్లేది - నాటకము
కరినిఁ బట్టి కంజాక్షుచేత చచ్చింది - మకరము
భాగ్యనగర మయింది ఈ భామ పేర - భాగమతి
భరియించరానట్టి పద్ధతి - దుర్భరము
ఏ ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు? - వసంతము
మంచి దైనట్టి సమాచారము - శుభవార్త
ముక్కన్నులు ఏ పూజ్యున కుంటాయి? - శివునకు
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన? - పాండురాజు
బాహాబాహి - నాటకము - మకరము - భాగమతి - దుర్భరము - వసంతము - శుభవార్త - శివునకు - పాడురాజు.
పై పదాల రండవ అక్షరాలను చదివితే ...
సమాధానం - హాటకగర్భసంభవుడు.
సరియైన సమాధానం పంపినవారు -
రవీందర్ గారు, చంద్రశేఖర్ గారు, కోడీహళ్ళి మురళీ మోహన్ గారు.
ప్రయత్నించినవారు -
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు,
దీపావళి శుభాకాంక్షలు.

4, నవంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 143

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ధూమశకట మెక్కి రాముఁ డేగె.

ప్రహేళిక - 26

ఈ కలహభోజనుడిని ఏమంటారు?
సీ.
కరములతో ముష్టిఘాత యుద్ధం బేది?
రంగస్థలముపై విరాజిలు నెది?
కరినిఁ బట్టిన దేది కంజాక్షుచేఁ జచ్చె?
భాగ్యనగర మయె నే భామ పేర?
భరియించరానట్టి పద్ధతి నే మందు
రే ఋతువుతోఁ గ్రొత్త యేడు వచ్చు?
మంచి దైనట్టి సమాచార మేమంద్రు?
ముక్కన్ను లుండు నే పూజ్యునకును?
తే.గీ.
పాండవు లనుచుఁ బిలుతు రెవ్వాని వలన?
నన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లట ద్వితీయాక్షరమ్ముల ననుసరింపఁ
గలహభోజనుం డగుఁ దెలుపఁ గలరె మీరు?
ఆ కలహభోజనుణ్ణి ఏమంటారో చెప్పండి.

ప్రహేళిక - 25 సమాధానం

ఈ పదాలు ఏవి?
ఆ.వె.
కవితఁ జెప్పువాఁడు, ఘనమైన కాంతియు,
తేజ మొసఁగువాఁడు, త్రిదివంబు
ద్వ్యక్షరమ్ము లవి చివర "వి"కారంబు
గల పదంబు లేవొ తెలుపఁ గలరె?

కవిత చెప్పువాడు = కవి
ఘనమైన కాంతి = ఛవి
తేజ మొసగువాడు = రవి
త్రిదివము = దివి

సమాధానాలు పంపినవారు -
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మంద పీతాంబర్ గారు, మందాకిని గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

3, నవంబర్ 2010, బుధవారం

వారాంతపు సమస్యా పూరణం - 14

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
జారులు పూజ సేయఁ గని సాధుజనుల్ పులకించి రెల్లరున్.
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 142

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
పొట్టివాఁడె కాని గట్టివాఁడు.

ప్రహేళిక - 25

ఈ పదాలు ఏవి?
ఆ.వె.
కవితఁ జెప్పువాఁడు, ఘనమైన కాంతియు,
తేజ మొసఁగువాఁడు, త్రిదివంబు
ద్వ్యక్షరమ్ము లవి; చివర "వి"కార మొకటి
గల పదంబు లేవొ తెలుపఁ గలరె?

ఆ పదాలేమిటో చెప్పండి.

2, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 141

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే.
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 24

ఈ ఉద్యమం ఏమిటి?
తే.గీ.
ఆకుల రసమ్ము, విహరించునట్టివాఁడు,
గెలుపు, స్త్రీ, వైరి, స్వర్గము, చిలుక, తృటి, వి
మోచనమ్ము త్ర్యక్షర పదంబు లగు; నందుఁ
గన ద్వితీయాక్షరమ్ముల గాంధి గారు
నడిపినట్టి యుద్యమ; మది నుడువఁ గలరె?

ఆ ఉద్యమ మేమిటో చెప్పండి.

ప్రహేళిక - 23 సమాధానం

ఇది ఏమిటి?
సీ.
ఎలుకలు నివసించు కలుగు నేమందురు?
కలిగినవాఁ డేమి కలిగియుండు?
గడచిపోయినదానికై యే పదం బున్న
దన్నార్థు లగుదు మే మున్న వేళ?
గంగాళమున కున్న ఘనమైన పేరేది?
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె?
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది?
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది?
తే.గీ.
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁ
డన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లగు; ద్వితీయాక్షరముల నరసి చూడఁ
దెలుఁగుతో నొక ప్రాంగణం బలరె; నేడు
పేరు మార్పుతో జరిగెను పెద్ద గొడవ.
వివరణ -
ఎలుకలు నివసించు కలుగు నేమందురు? - బిలము
కలిగినవాఁ డేమి కలిగియుండు? - కలిమి
గడచిపోయినదానికై యే పదం బున్నది? - గతము
అన్నార్థు లగుదు మే మున్న వేళ? - ఆకలి
గంగాళమున కున్న ఘనమైన పేరేది? - కళాయి
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె? - హితోక్తి
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది? - క్షీరము
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది? - బాణము
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁడు? - భీముడు.
బిలము - కలిమి - గతము - ఆకలి - కళాయి - హితోక్తి - క్షీరము - బాణము - భీముడు
రెండవ అక్షరాలను చదివితే ......
సమాధానం .... లలితకళాతోరణము.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, మందాకిని గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, చంద్రశేఖర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మంద పీతాంబర్ గారు, భమిడిపాటి సూర్యలక్ష్మి గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు.

1, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 140

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
బారును సేవించి మంచి బాటను బట్టెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

గళ్ళ నుడి కట్టు - 64


అడ్డం
1. హరిత వర్ణం (4)
3. అంకుటం. పాటలో తాళం తప్పిందని చెవి మెలేస్తే కీచుమంటావేం? (4)
7. సూపం. "అప్పన్నా తన్నా మన్నా .... ఉడక లేదన్నా" (2)
8. విహారం (3)
9. అగ్గువ, ధర తక్కువ (2)
12. కల్పవృక్షమంటే బిడ్డలవైపు చూస్తావేం? (3)
13. కరుణా రాహిత్యం (3)
17. ఈ చుక్క బృహస్పతి భార్యా? వాలి భార్యా? (2)
18. విభీషణుడి భార్య ఆడకుక్కా? (3)
19. బాబోయ్ అని అరిచినా తప్పని ప్రమాదం (2)
22. సంతోషాన్ని కలిగించేది (4)
23. చెడ్డ బుద్ధి కలవారు (4)
నిలువు
1. పరాయి మగనిపై నమ్మకమా? (4)
2. పదవదా ఈ అవస్థ? (2)
4. గుండ్రనిది కదా. తలక్రిందయింది (2)
5. రవీంద్రుడు నోబుల్ బహుమతి పొంది ఇదయ్యాడు (4)
6. ఈ పర్వతం దేన్నైనా సహిస్తుందా? (3)
10. ప్రకృష్టమైన తాపం శౌర్యమా? (3)
11. పిసుకుడో, నూరుడో .. ఏదైతేనేం? నీకు నామర్దనా? (3)
14. అధోలోకములం దొకటి. పాతబడిన తాళమునందు వెదకుడు (4)
15. ఒక నక్షత్రం. భానుమతిగారి చిత్ర సంస్థ (3)
16. అందరి కందరూ రుద్రులు, కాని సంపన్నులు కారు (4)
20. నూకల గంజి (2)
21. పరిశ్రమించడం కష్టమే (2)

ప్రహేళిక - 23

ఇది ఏమిటి?
సీ.
ఎలుకలు నివసించు కలుగు నేమందురు?
కలిగినవాఁ డేమి కలిగియుండు?
గడచిపోయినదానికై యే పదం బున్న
దన్నార్థు లగుదు మే మున్న వేళ?
గంగాళమున కున్న ఘనమైన పేరేది?
మేలుఁ గూర్చెడి మాట మీ రెఱుఁగరె?
పెరుగుఁ జేయుట కక్కరపడు నది యేది?
వాలి ప్రాణముఁ దీయు వస్తు వేది?
తే.గీ.
కీచక ప్రాణమును దీసి గెలిచె నెవ్వఁ
డన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లగు; ద్వితీయాక్షరముల నరసి చూడఁ
దెలుఁగుతో నొక ప్రాంగణం బలరె; నేడు
పేరు మార్పుతో జరిగెను పెద్ద గొడవ.
అదేమిటో చెప్పండి.

ప్రహేళిక - 22 సమాధానం

ఎవరీ వ్యక్తి?
సీ.
ఫల్గుణుని ధ్వజముపై నుండు నేరాజు?
పోతన రాజైన ఖ్యాతి యేది?
విద్యతో పాటేది విధిగ నుండవలెను?
సరస మాడెడివాని సంజ్ఞ యేది?
స్తంభోద్భవుండైన శౌరి రూపం బేది?
అన్ని ప్రాణుల కేది యవసరమ్ము?
అలసిన డెందము లానందపడు నెట?
శాంతి చిహ్నఁపు పక్షి జాడ యేది?
తే.గీ.
నాలు గక్షరమ్ముల పద నర్తనమున
క్రమముగా ద్వితీయాక్షర గతిని గనిన
తెలుగు నామమ్ము ఢిల్లీకి తేజ మొసఁగ
ముఖ్యమంత్రి, ప్రధానియౌ ముఖ్యుఁ డెవఁడు?
వివరణ -
ఫల్గుణుని ధ్వజముపై నుండే రాజు - కపిరాజు
పోతన రాజైన ఖ్యాతి - కవిరాజు
విద్యతో పాటు విధిగ నుండవలసింది - వినయము
సరస మాడెడివాని సంజ్ఞ - సరసుడు
స్తంభోద్భవుండైన శౌరి రూపము - నృసింహుడు
అన్ని ప్రాణులకు అవసరమైనది - ఆహారము
అలసిన డెందము లానందపడు చోటు - ఆరామము
శాంతి చిహ్నఁపు పక్షి జాడ - పావురము
కపిరాజు - కవిరాజు - వినయము - సరసుడు - నృసింహుడు - ఆహారము - ఆరామము - పావురము
పై పదాల రెండవ అక్షరాలను చదివితే ....
సమాధానం - పి వి నరసింహారావు.
సమాధానాలు పంపినవారు ...
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మైథిలీరం గారు, అనఘ గారు, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు, మందాకిని గారు, చంద్రశేఖర్ గారు.
అందరికీ అభినందనలు.