31, జులై 2010, శనివారం

సమస్యా పూరణం -52

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ఫలితమ్మును జూచి నేత వలవల వగచెన్.

గళ్ళ నుడి కట్టు - 26


అడ్డం
1. జెండాపై కపిరాజు కలిగిన అర్జునుడు (5)
4. వసువు కూతురు. వైశ్యుల ఆరాధ్య దేవత (3)
6. మన్మథుడు. రతీ కాంతుడు (3)
8. సపత్ని. సత్యవతిని "త్య"జించు (3)
12. వాయువు. వాసనను మోసుకు వచ్చేవాడు (5)
16. మనస్సులో తలచుకొనడం. పరధ్యానం పనికిరాదు (2)
17. విలాసం, మహిమ కూలీలకు ఉంటుందా? (2)
18. భారం. కాబట్టే చివరి అక్షరం మొదటికొచ్చింది (3)
22. మాంసం. నంజుకొనుడు (3)
23. కుటుంబంతో సహా 40 రోజులు పస్తులుండి దొరికిన ఆహారాన్ని దానం చేసినవాడు (5)
నిలువు
2. శివుని విల్లు. చూపినాను. కంటివా? (3)
3. ముచ్చటగా ఉండే ఈ సంఖ్య క్రింది నుండి (2)
5. అంగీకారం. తిమ్మ సముద్రంలో ఉందేమో? (3)
7. అల. అంతరంగంలో (3)
9. శ్రేష్ఠుడు. పెళ్ళికొడుకు (3)
10. సారం, ధైర్యం. యోచించే వచ్చావా? (2)
11. మూడు కాలాల్లో బ్రాహ్మణులు చేసే దైవ ప్రార్థన (5)
13. విల్లు (3)
14. జాగ్రత్త, సంతోషం. షాహుకారు నడగండి (3)
15. నల్లని మెడ కల శివుడు (5)
19. యుద్ధం. అదంటే సంబరం వద్దు (3)
20. సన్నని చెక్క. నీ ఏడుపేదో నువ్వేడు (2)
21. అస్మదీయమే. నీదేనా? (2)

30, జులై 2010, శుక్రవారం

దత్త పది - 7

కవి మిత్రులారా,
క్రింది పదాలను ఉపయోగించి "నగర జీవనం" విషయంగా మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
కరి, విరి, హరి, సిరి.
వారాంతపు సమస్యా పూరణానికి ఈ రోజు చివరి రోజు. గమనించండి.
వారాంతపు సమస్యా పూరణం - 2
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

గళ్ళ నుడి కట్టు - 25


అడ్డం
1. జగన్నాథ రథ చక్రాలను భూమార్గం పట్టించిన కవి (9)
6. జలువు చేస్తే వచ్చేవి, ప్రయాణాలను వాయిదా వేయించేవి (3)
7. స్త్రీ. లతలాంటి తనువు కలది (3)
8. తెల్లవారు జాము. దేవుళ్ళ సుప్రభాతాలు వినిపించే కాలం (3)
10. ఎటునుంచి చూసినా సంతోషం (3)
11. విజయం. "............ ఓటమి దైవాధీనం" అని కులగోత్రాలు చిత్రంలో రేలంగి పాడాడు (3)
13. వెదురు బుట్టెడు. ఆమెకు ....... సంతానం (3)
15. సముద్రంలో నావికులకు దారి చూపేది. చుక్కా! నిన్ను చూసి నడుపుతా (3)
17. భర్త తమ్ముడు, చెల్లెలి భర్త (3)
19. కరీం నగర్ జిల్లాలోని శివక్షేత్రం ఇంటిపేరైన శాపానుగ్రహ శక్తి కల కవి. ఈ పేరుతో సినిమా వచ్చింది (9)
నిలువు
1. సంపన్నుడు, ధనవంతుడు (4)
2. ఆపదలు. సుడిగుండాల వంటివి (3)
3. నిద్దుర చిన్నబోయింది (2)
4. నేటి స్త్రీ అబల కాదు (3)
5. దీని పాలు గరిటెడైనా చాలు అన్నాడు వేమన. క్రిందు మీదయింది (4)
8. ఉపన్యాసం, ప్రస్తావన, సంబంధం. ఇన్ని చెప్పడం అప్రస్తుతమా (3)
9. ఒక పూల చెట్టు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకం. ఎత్తుగా పెరుగవు. కాబట్టి ఎవడూ "గెంతడు" (3)
12. తలక్రిందైన శుక్రుడు, వేకువజామున పొడిచే నక్షత్రం (4)
14. తెలుగులో నన్నయ, సంస్కృతంలో వాల్మీకి (4)
16. స్వచ్ఛమైన నటి. తల్లి పాత్రలకు ప్రత్యేకం (3)
17. ఎట్నుంచి చూసినా అదే. యుద్ధంలో ఇది తిప్పనివాడే వీరుడు (3)
18. కుడ్యం (2)

29, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 51

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

చమత్కార పద్యాలు - 11

సయ్యదలీ, అజ్మతుల్లా కవులు
గత శతాబ్దికి చెందిన సయ్యద్ అలీ, అజ్మతుల్లాలు సోదరులు. వీరిది దేవరకొండ. సంస్కృతంలోను, తెలుగులోను కవిత్వం చెప్పేవారు. సంగీత, జ్యోతిష శాస్త్రాల్లో విశారదులు. వీరు నవీన హరిశ్చంద్ర, సత్యాద్రౌపదీ సంవాదము, సీతారామ శతకము మొదలైన రచనలు చేశారట! కాని ఇప్పుడవి అలభ్యాలు. వీరి చాటువు ఒకటి గోలకొండ కవుల సంచికలో ప్రకటింప బడింది.
సీ.
కొమ్మయో యది పూల రెమ్మయో బంగారు
బొమ్మయో తోఁచెఁ గందమ్ములకును
నింతియో వలరాజు దంతియో నతను చే
బంతియో వింత నా స్వాంతమునకు
బోఁటియో రతనాల పేటియో యచ్చర
మేటియో కంటి వనవాటికందు
చానయో యమృతంపు సోనయో ముద్దుల
బానయో చెదిరె నా మానసంబు
తే.గీ.
దాని వయసు వయారంబు తళుకు బెళుకు
సోయగము ప్రోడతనమును సొరిది నమర
నెట్లు చేసెనో విధి దీని కెనయ సాటి
కాంత గల్గునె గన ముజ్జగంబులందు.

గళ్ళ నుడి కట్టు - 24


అడ్డం
1. ఒంటె. క్రమమే దాని వాలకం (4)
3. ప్రసిద్ధ నవల "ది ప్రిన్స్ అండ్ ది పాపర్" ఈ పేరుతో ఎన్.టి.ఆర్ చిత్రంగా వచ్చింది (4)
7. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత సంధికాలం. జయలలిత తల్లి (2)
8. చెవి. ఒక నక్షత్రం (3)
9. తుచ్ఛం. హే రాం! న్యాయం కాదులో (2)
12. సముద్రం. అడవికి కాదు నీటికి నిలయం (3)
13. అర్థ రహితం, వేస్ట్ (3)
17. కాంతి. విద్యుతిస్తుందా? (2)
18. దండన, ఓర్పు. శని గ్రహంలో (3)
19. నవనీతం. నీ వెన్నడూ తినలేదా? (2)
22. దొంగ. తస్కరించేవాడు (4)
23. పాండవులు వనవాసం చేసిన అడవి (4)
నిలువు
1. సీరియల్ నంబర్ (4)
2. లాక్ష. సీలు వేసేది (2)
4. ప్లక్ష వృక్షం. జుట్టు దువ్వి చూడు (2)
5. నలుని భార్య (4)
6. తెలివి తక్కువవాడు, దద్దమ్మ. అచటివట (3)
10. పాతిపెట్టడం. సుఖ జననంలో (3)
11. వేడుట. ప్రేయర్ (3)
14. మెరుపు తీగ (4)
15. ఆ గ్రహం చూపే కోపం (3)
16. అన్న చేసిన దానం అన్ని దానాలకంటె గొప్పది (4)
20. మత్తునిచ్చే ఒక పానీయం. కబీరు ఎన్నడూ తాగలేదు (2)
21. తోడబుట్టినవాడు. విభ్రాజిత బంధువు

28, జులై 2010, బుధవారం

చమత్కర పద్యాలు - 10

మత్స్య రామాయణం
భోజరాజు కాళిదాసును విశేషంగా అభిమానించి, ఆదరించడం మిగిలిన కవులకు అసూయ కలిగించింది. ఎలాగైనా రాజుకు కాళిదాసుపై దురభిప్రాయం కలిగేలా చూడాలని ప్రయత్నించేవాళ్ళు. కాళిదాసుకు చేపలంటే ఇష్టం. ఒకసారి అంగడిలో ఒక చేపను కొని, సంచిలో వేసుకొని చంకలో పెట్టిలొని వస్తున్నాడు. చేప పెద్దది కావడంతో దాని తోక
కొద్దిగ బయటికి కనిపిస్తున్నది.అదే సమయంలో భోజరాజు ఏనుగునెక్కి ఆ దారి గుండా వస్తున్నాడు. కాళిదాసంటే
గిట్టని కవులు చేపల విషయాన్ని రాజుకు చెప్పారు. అప్పుడు రాజుకు, కాళిదాసుకు మధ్య జరిగిన సంభాషణ ఈ శ్లోకం. ఇది సంవాదాత్మక చాటువు.
కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం? కావ్యార్థ సారోదకం;
గంధః కిం? నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్ఛః కిం? నను తాళపత్ర లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం ||
ఆ సంభాషణ వివరంగా ....
భోజుడు: (కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు: పుస్తకం.
భోజుడు: (కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు: (కావ్యార్థ సారోదకం) కావ్యం యొక్క అర్థాల సారం.
భోజుడు: (గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు: (నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ యుద్ధంలో చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు: (పుచ్ఛః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు: (నను తాళపత్ర లిఖితం) మొదళ్ళ కొనలు తరగని కొత్త తాటాకుల కట్ట.
భోజుడు: (కిం పుస్తకం భో కవే?) ఓ కవీ! అది ఏ పుస్తకం?
కాళిదాసు: (రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం) ఓ రాజా! ఇది బ్రాహ్మణులు ఆదరించే రామాయణ పుస్తకం.
భోజుడు చూపించమంటే కాళిదాసు చూపించాడు. నిజంగానే ఆ చేప రామాయణ గ్రంథంగా మారిందట!

సమస్య పూరణం - 50

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

గళ్ళ నుడి కట్టు - 23


అడ్డం
2. వినాయకుడు. పెద్ద కడుపు కలిగిన దేవుడు అచ్చ తెలుగులో (5)
6. గోల. కలల లంకలో గందరగోళస్థితి (4)
8. స్త్రీ. ప్రశస్తమైన జఘనం కలది (4)
9. చతురస్రం. చదరంగంలో ఉంది (3)
10. కంఠం తిరగబడింది. "గుండె ...... లోన కొట్లాడుతాది" అన్నాడు కవి (3)
11. సమయం. అంత రుణం సమయానికి తీరుస్తావా? (3)
13. వాడు మురారి కాడు, దాశరథి ఇట్నుంచి (3)
15. హలం పట్టేవాళ్ళు తడబడ్డరు (4)
17. ఆఫీసు తిరగబడ్డది (4)
20. చంద్రముఖి. శశివదన (5)
నిలువు
1. చూపు. ఆలోచించి కనండి (4)
2. బొక్క. ఎముక (3)
3. సందేహం వద్దు శరీరమే (2)
4. వెండి. సెకండ్ ప్రైజ్ గా దీని పతకం ఇస్తారు (3)
5. తెర. మాయ వనిత కలదు దాని వెనుక (4)
7. ఆమ్యామ్యాలు అడిగేవాళ్ళు (5)
8. నిరంతరం అడ్డు లేనిది (5)
12. రాచగద్దె. సింహం కూర్చుంటుందా? (2)
14. పున్నమి చంద్రుడు. కాశిలో నిరాశలో వెదకండి (4)
16. గజనిమ్మ. కుచంలా ధ్వనిస్తుంది (3)
18. స్త్రీ. కలలలో నచ్చింది (3)
19. బాట. త్రోసి వస్తే సరి

27, జులై 2010, మంగళవారం

సమస్యా పూరణం - 49

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
గురువే శిష్యుల నడిగెను గూఢార్థములన్.
( మా బావ గారు, తెలుగు పండితులు మిట్టపెల్లి సాంబయ్య గారు ఇచ్చిన సమస్య )

గళ్ళ నుడి కట్టు - 22


అడ్డం
1. లేఖ, జవాబు, ఒక దిక్కు (3)
4. ఇచ్ఛ. ఒకరి కోసం వెనక్కి చూడు (3)
6. కూష్మాండం. దృష్టిదోష నివారణకు కట్టే కాయ (5)
7. అన్నం ఉడికాక పారబోసే రసం. సారమంతా దీనిలోనే ఉంటుందట! (2)
9. పందెం, స్వల్ప ధనం. తృణం కంటే మేలే (2)
10. సంపద, సౌఖ్యం. ఇమిడి పోయి ఇట్నుంచి చూడు (3)
12. పార్వతి. పర్వతం యొక్క కూతురు (4)
13. గోపకుల క్రీడ తిరగబడింది. కృష్ణుడు యమునా తీరాన గోపికలతో చేసింది (4)
14. వంగినట్టిది. మితం కానిదా? (3)
16. ఆ రోజు, దేశం. నాదే నేడులో ఆద్యంతాలు (2)
17. దిక్కు. ఆది శక్తిలో చూడు (2)
19. వ్యవహారానికి సంబంధించింది (5)
21. అన్నం ముద్ద. కంబళంలో చూడు (3)
22. మాంసం. చపలలం కాదు తినడానికి (3)
నిలువు
1. ఒడి, తొడ. ఉత్త సంగం కుదిస్తే (3)
2. వర్ణం. సారంగు నడగండి (2)
3. అతి స్వల్పం. మామిడి ఏమిడినా చూడు (4)
4. ఒక ఆటవిక జాతి. ఏమైనా కోయగలరు (2)
5. దున్నటం ఆకర్షణంగా ఉంటుందా? (3)
8. ఓడించిన ఇంద్రియాలు కలవాడు (5)
9. స్పర్షవేధి. ఇనుమును బంగారంగా మార్చే రస శిల (5)
10. భాగవత కవి. ఘన తపోధనుడులో (3)
11. కలిసిపోయింది. స్వామి కేళి మితంలో (3)
15. స్వల్పమైన తిండి (4)
16. రసనేంద్రియం. నాతోనా లుకలుకలు? (3)
18. ముక్క. సకలం కాదు (3)
19. పాము, పులి. వ్యాసాంగుళం ఆద్యంతాలు (2)
20. ముళ్ళ మండ. అదంటే కంపనమేల? (2)

26, జులై 2010, సోమవారం

సమస్యా పూరణం - 48

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
నరుఁడె నారాయణుఁడ నంచు నమ్మఁ బలికె.
వారాంతపు సమస్యా పూరణం - 2
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

గళ్ళ నుడి కట్టు - 21


అడ్డం
1. మేఘం, కృష్ణుని రథాశ్వాలలో ఒకటి. నీవలా ఉన్నావేం? హయకంఠుడివా? (4)
3. దినం దినం. అహమహమిక లాంటిది (4)
7. గజ్జె. ఈ గోపాలుడు ప్రసిద్ధుడు (2)
8. భాగాలు. టాటాలు పంచుకొనేవా? (3)
9. పోస్ట్. తిరగబడితే పాట (2)
12. నిప్పు మీది బూడిద (3)
13. వక్రం. శివంకరమా? (3)
17. క్షత్రియ ధర్మం. క్షామ చిత్రంలో (2)
18. నెమలి. వయారంగా ఉంటుంది (3)
19. వాణ్ణి పొమ్మను. పోరాటానికి (2)
22. సూర్యుడు తిరగబడ్డాడు. రమణి మనది (4)
23. కపటి. వాడు మెతకరి కాడు (4)
నిలువు
1. కోతి. వంకర మోము కలది. కావలిసినది ప్రముఖం (4)
2. హల్లో! అచ్చు కాదిది (2)
4. హస్తం కల ఏనుగు (2)
5. వ్రాతలో మరచిన అక్షరం కోసం వ్రాసే గుర్తు. ఆదిలోనే ఇదా? (4)
6. చెఱువు. తటాలున దూకండి (3)
10. కపోతం (3)
11. అంధకారం (3)
14. దక్షుని కూతురు సతీదేవి (4)
15. అమృతం. పేయం. విషం కాదు (3)
16. వ్యాసుడు. పరాశరుని కొడుకు (4)
20. స్త్రీ. మంచాన పడింది (2)
21. కొండంతలో
అంతా కాదు. (2)

25, జులై 2010, ఆదివారం

సమస్యా పూరణం - 47

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
(దాదాపు 40 సంవత్సరాల క్రితం "ఆకాశవాణి" వారిచ్చింది)
కలు సేవింపుఁడని పలికి గణ్యుండయ్యెన్.

వారాంతపు సమస్యా పూరణం - 2

కవి మిత్రులారా!
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
అమవస నాఁడు విస్తరిలె నాకసమందు మనోజ్ఞకాంతులే.

గళ్ళ నుడి కట్టు - 20


అడ్డం
1. మొదట. వెతలు తొలగ ఇట్నుంచి చూడు (3)
3. కాగడా, టార్చ్. చేతిలోని దీపమా? (5)
7. తల్లి. జననమిచ్చేది (3)
9. మొసలి. వక్రముగా నడచునా? (3)
11. కొండ నాలుక. "జాలంబిక చాలు"లో (3)
13. కప్పుకొనే వస్త్రం. కాదు ఇప్పటిది (3)
14. తాబేలు. ఒక మఠంలో ఉందట! (3)
16. క్షమించ తగింది (3)
18. అంతస్తులు చిత్రంలో భానుమతి ఈ పాటతో దుమ్ము దులిపింది (7)
నిలువు
2. కూతురు. నూతన్ చెల్లి, కాజోల్ తల్లి (3)
4. ఆశీస్సు. అదీ వెనకాల ఉందా? (3)
5. ఏనుగు వదనం కలవాడు. గణేశుడు (5)
6. గుండ్రటి ఆయుధం కల యోధుడు అచ్చ తెలుగులో. చక్రి (7)
8. నుదురు. నిటలాక్షుని స్మరిస్తే తెలుస్తుంది (3)
10. బొటన వ్రేలు, మధ్య వ్రేలు కొడితే వచ్చే శబ్దం (3)
12. దయ. కడ కంటి చూపు (3)
15. తీయనైన నగరం. ఈ నగరిలో చల్లనమ్మ బోతారట! (3)
17. కూర. అంజనం వేస్తే కనబడుతుందా?

24, జులై 2010, శనివారం

దత్తపది - 6

కవి మిత్రులారా!
క్రింది పదాలను ఉపయోగించి మీకు నచ్చిన విషయంపై, నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
కడప, బాసర, కొండపల్లి, యాదగిరి.

గళ్ళ నుడి కట్టు - 19


అడ్డం
1. మనస్సు. మనలోనుండే ఇంద్రియం (5)
4. సమర్థత (3)
6. మోసం చేసే నక్క. దానిని వంచకండి (3)
8. అర్థం లేకుండా వాగడం. విప్ర విలాపంలో (3)
12. శివుడు. నిలువు 11 యొక్క శత్రువు. నీకంత దర్పపు వైఖరి ఏల? (5)
16. రాత్రి మిగిలిన అన్నం. పెద్దల మాట ఈ మూట (2)
17. చెవి లోపలి భాగం. గుడ్లగూబకు అదిరేది (2)
18. ప్రకాశించినది. రాజ్యం పరాజితం అన్నచో (3)
22. ఇంగ్లీషు ప్రేమతో రాముని కొడుకు తిరగబడ్డాడు (3)
23. సిగ్గెందుకు? ఆదర్శకుటుంబం చిత్రంలో సినారె పాట ".... ఓ చెలి, అడిగె నిన్నే జాబిలి" గుర్తుందా?
(5)
నిలువు
2. దాని నుండి పుట్టినది. శ్రీ తత్సమమైతే,సిరి ...... ? (3)
3. మావటి, సారథి. నియంతకు కావాలి (2)
5. తుమ్మెద. దీనికి మధుపానం పాపం కాదు (3)
7. పిచ్చుక. ఎచట కంటివి? (3)
9. మైకం. లహరి నుండి పుట్టిందా? మాయాబజారులో ఓహో జగమే ఊగెనులే (3)
10. విభక్తి ప్రత్యయం లోపించిన పాము. సమర్పణలో (2)
11. ఐదు బాణాలు కలిగిన మన్మథుడు (5)
13. రావణ వధను సరదాగా చేసుకొనే పండగ (3)
14. వికృతంగా మారింది. అవైనా స్వకృతం (3)
15. వెంకన్నది తిరుమల, మరి అయ్యప్పది ... ? (5)
19. ఒక స్వీటు. గులాబిలా ధ్వనిస్తుంది (3)
20. ఊయల. అందు కలడో అని వెనక్కి చూడు (2)
21. హిందువుల సైతాను. దీనికి చిక్కి పాపాలు చేస్తామట. అమాయకులం కదా!

23, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 46

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
మానమ్మే లేనివాఁడు మాన్యుండయ్యెన్.
వారాంతపు సమస్యా పూరణం - 1
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
24-07-2010 వరకు పూరణలు "వారాంతపు సమస్యా పూరణం - 1"లొ పోస్ట్ చేయండి.

గళ్ళ నుడి కట్టు - 18


అడ్డం
1. అనుమానము వద్దు. మోసం ఈ దేహము, వలపు లేదు (7)
6. రాత్రి. నిశాచర జనితమా? (3)
7. ఒక నది. అస్తవ్యస్తమయింది. వెటకారివే (3)
9. భార్య. ఎంతదయినా తిరుగబడింది (3)
10. బాధ. అయాచితపు నస (3)
11. ఏమిటి (1)
12. కలయిక. కె.విశ్వనాథ్ చిత్రంలో సెకండ్ హాఫ్ (3)
13. కూల్ గా. అస్తవ్యస్తమయింది (3)
15. సముద్రం. ఒక ఓడ బలి (3)
17. శూన్యమయినది. ముక్తసరిలో సలోపము (3)
18. "మేక తోకకు మేక" పద్యం ఉన్న ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్ ల చిత్రం (7)
నిలువు
2. పట్టపు రాణి. దేవారి అంటే రాక్షసుడు సుమా (3)
3. స్త్రీ. అవని తలమున గొప్పది (3)
4. కండూతి. బురద రాస్తే పోతుందా? (3)
5. వీడు పిల్లి తల కొరిగాడట! (7)
7. కాశీకి పోవడమంటే కాటికి పోవడమని నమ్మే కాలంలో ఏనుగుల వీరాస్వామి అక్కడికి వెళ్ళి వచ్చి రాసిన ట్రావెలాగ్ (7)
8. బాధ. అవే మదన బాధలు (3)
12. తక్కువలో తక్కువ క్రిందినుండి (3)
13. స్పష్టము. అయినా అస్తవ్యస్తమయింది. ఉల్లము తెల్లనిదా? (3)
14. హిందీలో ఒక పువ్వు. కరీనా కపూర్ వేశ్యగా నటించిన చిత్రం (3)
16. నేను కృష్ణుడనంటూ తడబడ్డాడు

22, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 45

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపారు. అది ఇది ....
పంది యధర సుధలఁ గ్రోలి పరవశుఁడయ్యెన్.
వారాంతపు సమస్యా పూరణం - 1
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.
24-07-2010 వరకు పూరణలు "వారాంతపు సమస్యా పూరణం - 1"లొ పోస్ట్ చేయండి.

గళ్ళ నుడి కట్టు - 17

అడ్డం
1. నిరంతర సాధన. కూసువిద్య (3)
4. క్షామం - కంటకాకీర్ణ మార్గం (3)
6. తడబాటు - బిత్తరపాటు లాంటిది (5)
7. కుప్పసం - పాము విడిచేది (3)
9. ఖబర్ - వాకుబు చేయరుగా! (3)
11. అతిసార వ్యాధి. ఆంగ్ల తత్సమం. ఎలుకలకు రాదా? కలరా ఎవరైన? (3)
13. జోడీ తిరగబడింది. శతజయంతిలో (2)
14. పురుగు కుడితే, పైత్యం వల్లా, బెత్తం దెబ్బ వల్లా, అలర్జీ వల్లా ఒంటిపై తేలేది. దద్దురు (2)
15. తపస్సు చేసేవాడు. ఎంత పసివాడు? (3)
16. ప్రతిజ్ఞ. అప్రతిభుడనయితిని (3)
18. స్త్రీ. ఆమె పేరు లత (3)
20. వాగుడుకాయ. అనంత పురంలో కొందరు ఈ పేరుతో "సాక్షి" లాంటి వ్యాసాలు రాసారు (5)
22. పన్ను. ఉదంతమున ముప్రత్యయము మధ్యకు చేరింది (3)
23. ఎట్నుంచి చూచినా నిద్ర. కినుక లాంటిది (3)
నిలువు
1. విశాఖ జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక లోయ (3)
2. ఎట్నుంచైనా సంతోషం. సంతలో సంబరం (3)
3. భార్య. పంచదార లాంటిదా? (2)
4. కంటి లేపనం. కటు కారం కాదు (3)
5. కలవరపాటు చెందిన ఆస్ట్రేలియా మృగం (3)
8. గౌతమ బుద్ధుని పుట్టిన రోజు (5)
10. చిత్తడి భూమి. దురద ఏల? (5)
11. చెప్పబడిన. తకథిమిత (3)
12. రాక్షస స్త్రీ. పరాకా? సినదానా! (3)
16. ఆపద. దీనితో ప్రమోదం గోవిందా! (3)
17. నూతనత్వం. మానవత కోరేది (3)
18. అన్న కణం. ఈ సీమ ఇప్పుడు మెదక్ (3)
19. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పటి తారకపురం. దాని పేరంటే వణుకు ఎందుకో? (3)
21. వాయి. మనో రుగ్మతకు కారణమా?

21, జులై 2010, బుధవారం

సమస్యా పూరణ - 44

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
( దాదాపు నలభై ఏళ్ళ క్రితం "ఆకాశవాణి" వారిచ్చిన సమస్య )
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్.

గళ్ళ నుడి కట్టు - 16

అడ్డం
2. వెదురు బుట్ట - ఆపగంలో ఉంది (2)
4. ద్రోహం చేసినవాడు (2)
6. వ్రాత - మలిపి చూడు (2)
7. ప్రయాగ దగ్గరి సంగమం - త్రిజట కాదు (3)
9. సోదరి - కట్నం చెల్లించు (2)
13. కాంతి - అల్లసాని వాని అల్లికలో ఉంది (2)
14. చిలుక - ఆశు కవిత్వం చెప్తుందా? (2)
16. గడ్డి - కోరేది ఇదో, పణమో? (2)
17. అకార, ఉకార, మకార సమ్మేళనం - ప్రణవం (1)
18. నేత్రం (2)
19. పెరుగు (2)
20. సూర్య పుత్రుడైన గ్రహం (2)
23. విష్ణువు, ఇంద్రుడు, కోతి, సింహం (2)
24. సేన, నది - ఈ సినీ స్టూడియో మద్రాసులో ప్రసిద్ధం (3)
26. సమావేశం - సరభసంగా చేయండి (2)
28. కోతి - శుకపికాదులలో ఉంటుందా? (2)
29. సంస్కృతంలో జలం, తెలుగులో ఋణం (2)
నిలువు
1. ఊయలలో జోలపాట - వటపత్ర శాయికి వరహాల ... (2)
3. ఆకు - పెళ్ళి పత్రికలో (2)
4. దోనె - ద్రోణుడి జన్మస్థలం (2)
5. మత్కుణం - "శివు డద్రిని శయనించుట" దీని బాధ పడలేకనే (2)
8. మృగయ - "ది కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో" నవలను చిరంజీవి హీరోగా ఈ పేరుతో సినిమా తీసారు (2)
10. ఒక పువ్వు - రాజాజికి ఇష్టమా? (2)
11. మూడింటి కలయిక. ఆ,ఈ,ఏ లు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఏ సంధి? (3)
12. తల్లితనం. ఇందులోనే ఉంది ఆడజన్మ సార్థకం అని బడిపంతులు పాట (3)
15. విష్ణువు - వెన్ను చూపడు (3)
19. దూరం - నువ్వు దగ్గరివాడవా? (2)
21. గడచిన దినం (2)
22. అందం, కాంతి, విరహిణులకు ఉంటుందా? (2)
23. మర్డర్. సత్య హరిశ్చంద్రుడు చేస్తాడా? (2)
24. బావి - వాతాపి గణపతిని చూడు (2)
25. యుద్ధమని చెప్పి క్రింది నుండి పైకి చూడు (2)
27. దైవ తత్పరత. శుభ వ్యక్తిత్వం (2)

20, జులై 2010, మంగళవారం

వారాంతపు సమస్యా పూరణం - 1

కవి మిత్రులారా!
నేను వృత్తాలను పట్టించుకోవడం లేదని ఒక మిత్రుడన్నాడు. అనుభవజ్ఞులైన కవులకు వృత్తలేఖనం కొట్టిన పిండే. కొత్తగా పద్యాలు రాసే ఔత్సాహికులకు కష్టమే. అయితే వాళ్ళను కూడ వృత్త రచనలో పాల్గొనే అవకాశం కల్గించడానికి వారానికొక వృత్త సమస్య నిస్తాను. ఈ వారం పూరించ వలసిన సమస్య ఇది ....
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

సమస్యా పూరణం - 43

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

వారాంతపు సమస్యా పూరణం - 1
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో.

గళ్ళ నుడి కట్టు - 15

అడ్డం
1. విభీషణుడి భార్య - ఆమె అవసరమట! (3)
4. రాత్రికి వ్యతిరేకం. కార్పణ్యాలు (3)
6. విశ్వనాథ వారి నాటకం. నాట్యమందిరం - సినిమాగా వచ్చింది (5)
7. ఋషులు చేసేది. తుస్సుమంటుందా? (3)
9. పద్మ - లక్ష్మి - ఒక ఫలం (3)
11. రోజా - దీనికి గులామువా బీబి? (3)
13. శిశువు - పాలు పట్టు (2)
14. రయం - తప్పవే గండాలు (2)
15. ఒక నాటక భేదము - డిండిమములో ఉంది (3)
16. స్త్రీలు పేరు పేరంటా పిలిచి చేసుకొనే వాయనాల సంబరం (3)
18. కోతి - తరం నరునివా? (3)
20. పద్మ బాంధవుడు - సూర్యుడు - నీట బాసిన కమలములు ఇతని రశ్మి సోకి కమిలిపోతాయి (5)
22. నిజము - అసలే త్యజింతుము (3)
23. అరటి చెట్టు - కదన కేళిలో (3)
నిలువు
1. సమానత్వం - అంటే సతమత మౌతావేం? (3)
2. త్రికరణాలలో మొదటిది - ఉస్సురంటుందా? (3)
3. అడవి - మనకోసమా? (2)
4. పిల్లలు అక్షరాలను దిద్దే ఫలకం - కలపతో చేస్తారా? (3)
5. తిరగబడ్డ తీగలు - కలతలు వద్దు (3)
8. ఇతరులకు మేలు - ఇది చేసే పాపన్న ప్రసిద్ధుడు (5)
10. నిలువు 2 తో బాధ - తమరి నోట వేరే వాదన (5)
11. కూష్మాండం - ఇంటి పేరుతో ప్రసిద్ధుడీ నటుడు (3)
12. తిరిపెము - పిల్లికి కూడ పెట్టడా? (3)
16. గొప్ప ఆశ. పేదరాశి ముసలమ్మకు తెలుసా? (3)
17. నాణెము - ఆటంకమున్నదా? (3)
18. అలవాటు - వాడు కడు వ్యసనపరుడు (3)
19. విలాస జీవనం గడిపే ............ రాజా ఏయెన్నార్ (3)
21. విలాసంగా చేసే నాట్యం - బాలా! స్యందన మెక్కు! (2)

19, జులై 2010, సోమవారం

సమస్యా పూరణం - 42

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపారు. ( క్రొత్తది కాదు, ప్రాచీనమూ, ప్రశస్త మైనదే ) అది ఇది.
నానాటికి తీసికట్టు నాగంభొట్లూ!

గళ్ళ నుడి కట్టు - 14


అడ్డం
1. వాయువేగాన్ని మించింది (4)
3. ఖమ్మం జిల్లాలోని రాములవారి పుణ్యక్షేత్రం (4)
7. వృద్ధాప్యం - అందరికీ "జరూరు"గా వచ్చేది (2)
8. పనికి మాలినవాడు (౩)
9. వాసన - సాధారణంగా దుర్వాసనకు వాడతారు (2)
12. సంగీత సాధనాలు - బావా! పద్యాలున్నాయా? (3)
13. ఒక నక్షత్రం - మయాబజారులో ఛాయాదేవి (3)
17. యుద్ధం (2)
18. పాండవుల పురోహితుడు (3)
19. బరువు (2)
22. లీడర్ షిప్ తిరగబడ్డది (4)
23. అత్తిల్లు కాదు .. జన్మగృహం (4)
నిలువు
1. భూమినుండి పుట్టిన చెట్టు (2)
2. సమయం (2)
4. మృద్వీక ఫలం - అర్థం కాలేదా? గ్రేప్ (2)
5. రావణుని నగరం (4)
6. అర్జునుడు (3)
10. చదువును కోరే స్టుడెంట్ (3)
11. మంచి రంగు కలిగిన బంగారం (3)
14. వారసుడికి ఉండే లక్షణం (4)
15. సోమరసం తాగి సౌమ్యంగా ఉండేవాడు (3)
16. ఏకశిలా నగరం (4)
20. నీడ - సూర్యుని భార్య (2)
21. దీని కెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట (2)

18, జులై 2010, ఆదివారం

దత్త పది - 5

కవి మిత్రులారా!
ఈ రోజు దత్తపది ఇస్తున్నాను. క్రింది పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో "నేటి సినిమాలు" విషయంగా పద్యం వ్రాయండి.
పెన్, గన్, డన్, రన్.

గళ్ళ నుడి కట్టు - 13


( ఈ సారి ఆధారాలతో స్లిప్పులు ఇవ్వలేదు. ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాం )
అడ్డం
1. పూలబాణం (4)
3. ఎగతాళిగా నవ్వడం (4)
7. రెక్కలు గల పులుగు (2)
8. చీకటి (3)
9. పతి (2)
12. గొప్పదనం, మహిమ (3)
13. డాబుసరి (3)
17. లక్ష్మి (2)
18. సముద్రం (3)
19. తిరగబడ్డ మెడ, గొంతు (2)
22. మింట్ (4)
23. నలుని వంట (4)
నిలువు
1. దేవ నది, గంగ
2. బలం, దేవి (2)
4. ఏనుగు - తలక్రిందయింది (2)
5. స్తోత్రగానం (4)
6. యుద్ధం (3)
10.దాచదగింది, చెప్పకూడనిది (3)
11. హిందీ పోట్లాట (3)
14. ఒకవిషం - నల్లనిదా? (4)
15. అంగుళీయకం (3)
16. టిబెట్ పూర్వపు పేరు (4)
20. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (2)
21. అల్లరి (2)

17, జులై 2010, శనివారం

సమస్యా పూరణం - 41

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్పె.

గళ్ళ నుడి కట్టు - 12


అడ్డం
1. రామారావు, నాగేశ్వర్రావు బావమరదులై తలపడిన పౌరాణిక చిత్రం (7)
6. శివుని శత్రువు మన్మథుడు - దరిద్రారుణంలో వెనుకనుండి చూడండి (3)
7. కుబేరుని పట్టణం. అక్కడ అలకలల్లలాడుతాయా? (3)
9. అతని విన్నపంలో తృప్తి (3)
10. లోకోక్తి. మనసా! మెతకదన మెందుకే? (3)
11. సిరికి ప్రకృతి (1)
12. చులకన. అది తెలుసు కదా! (3)
13. గుడి. దానికో వెల చెప్పగలమా? (3)
15. ప్రథమా విభక్తి ప్రత్యయాలలో మొదటి మూడు అట్నుంచి (3)
17. ఈ ఒడ్డు. ఇక్కడిద్దరికే చోటు. ప్రథమాక్షరం మధ్యకు చేరింది (3)
18. కవుల లోకానికి ఆశ్రయమైన లక్షణగ్రంథం. వేములవాడ భీమకవిదా? మల్లియ రేచనదా?
నిలువు
2. వెంట్రుక. "కృష్ణా! శలవు"లో ద్వితీయ, పంచమాలు వర్జ్యం (3)
3. స్వల్పమైన అస్వస్థత. కాంచన లతకా? (3)
4. వ్యతిరేకం. కాబట్టే తలక్రిందులయింది (3)
5. అయ్యప్ప. శివ కేశవుల పుత్రుడు (7)
7. "స్వారోచిష మను సంభవము" కావ్య కర్త (7)
8. కవిత్వం. కవి తన్మయుడై రాసేది (3)
12. ఉద్దెర. అవురా! ఇవ్వవా? (3)
13. వాంఛ. ఒకరికో, ఇద్దరికో? (3)
14. పద్మం. జలంలో పుట్టి అలల తాకిడికి అస్తవ్యస్తమయింది (3)
16. జతనమునకు ప్రకృతి. కిందినుండి
(3)

16, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 40

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ధనమె గొప్ప మంచితనము కంటె.

గళ్ళ నుడి కట్టు - 11


అడ్డం
2. జంట. కలియుగం కదా! రివర్స్ లో ఉంది (2)
4. ఈ పురుగును పట్టుకో. దారం తీద్దాం (2)
5. చెట్టు మొద్దు. అంగదుండు తెచ్చాడా? (2)
6. ఆమ్యామ్యా. ఎక్కడైనా లాంఛనమే (2)
8. భారతం వినాలి. ఇవి తినాలి (3)
9. రావే! పళ్ళు తోముకుందాం ఈ పుల్లతో (2)
10. పాలివాడు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఏమవుతాడు? సమఝయినదా? యాదికొచ్చిందా? (3)
12. ఇంద్రజాలం. మ్యాజిక్ చేయమని వారడిగారా? (3)
15. "రమ్మంటావా?" అంటే "రాకుమారా! వద్దు" అని చెప్పు (2)
16. అమితతిమిరంలో 2-4-5 (3)
18. ప్రసవం జరిగిన ఇల్లు. పూరిటిల్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, మేడైనా కావచ్చు (4)
21. తాటిచెట్టు స్రవించేది అట్నుంచి లుకలుకలై తేలిపోయింది (2)
23. వేడి. సిగలోంచి వస్తోదా? (2)
25. మేనత్త కొడుకుతో పెళ్ళి. మంచిది కాదంటారు డాక్టర్లు (4)
28. గడ్డపార (3)
30. ఇంగ్లీషు అదృష్టం. చివర ద్విత్వం (2)
31. దీనంగా. జాబాలి గయునిలో చూసాడా? (3)
32. ఈ దేశపు రాకుమార్తె కనుక రాముని తల్లి కౌసల్య అయింది (3)
34. దర్పం లాంటిదే. డాక్టర్ బాబు ... ఆద్యంతాలు చూడండి (2)
35. ఉప్పు. సమరం సోదరుడు (3)
36. పుణ్యక్షేత్రం. వో చలాగయా క్యా? (2)
38. మమ్మేలు దైవమా! ఇది చేయి చాలు (2)
39. నాగటి గీత. ఇక చాలులే (2)
40. గిల్లు. నీమాట సాగిచ్చుకో! (2)
నిలువు
1. ఫలితం, పండు (2)
3. చైత్ర శుద్ధ పాడ్యమి. తెలుగు పండుగ సంస్కృతంలో (3)
4. లోకులు ........ వారివి పలుకులు గావు గోలలు (5)
5. కంద. తిట్టులో దీన్ని తెంచుతారు (2)
7. డబ్బు దాచండి. గణేశ మండపాల వాళ్ళు వస్తారు. ఇదివ్వాలి. కొందరి దందా (2)
9. ఉష్ణం. నిన్ను వేడి ఏమి లాభం? (3)
11. ఇక్కడి బసవన్న రంకె వేస్తాడని బ్రహ్మంగారు చెప్పారు. అక్కడ షూటింగయా! వెనక్కి చూడు (3)
13. గడ్డి మేట. ఏవా మిసమిసలు? (2)
14. ఇవాళ కాదా? బాపురే! (2)
17. స్పర్శ తెలియనితనం. ఓ లమ్మీ ..... ఎక్కిందా? (3)
19. గాలి ఇలా వీస్తుందా? బాణం ఇలా దూసుకొస్తుందా? విరినవ్వులో దాక్కుందా? (3)
20. లేటెస్ట్ హస్తభూషణం. ఖైదీని వేసేది ఇందులోనే. చివర ద్విత్వంతో తలక్రిందయింది (2)
22. దక్షప్రజాపతికి దీని తలను తగిలించారట! శాకమేల ఇదుండ? (2)
24. ఏటిలో నీటి సరిగమలు (5)
26. ఆపరా నస! ఆ పండు అస్తవ్యస్తమయింది (3)
27. ఒక లోహం. దీనిలాగా కనకం మ్రోగదు (2)
28. దేవాలయం (2)
29. పంచనద దేశం. భగత్ సింగ్ ఇక్కడివాడే (3)
32. కొంటె పనులు చేసేవాడు. త్రికోణం గియ్యండి (3)
33. విలయం రిదమిక్ గా ఉంటుందా? (2)
34. కత్తికి తోడు. ఆగడాలు చాలు. (2)
37. దీనిని పూర్వం నాణెంగా వాడారేమో? ఆరోగ్యం బాగవ్వదా? చేత ఇదికూడా లేదాయె!

15, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 39

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది .....
సెంటిమెంటు చేసె సెటిలుమెంటు.

గళ్ళ నుడి కట్టు - 10


అడ్డం
1. "చందమామ" వాళ్ళు నడిపిన సినిమా పత్రిక. ఆ కాలంలో చిత్ర విజయాలకు కారణమయిందా? (5)
4. వామ భాగం - మడమ కాదు (3)
6. నల దమయంతుల మధ్య రాయబారం నడిపిన మానస సరోవర పక్షి (2)
7. తడి, వాడి - పద! నువ్వు తడుస్తావేమో? (3)
8. అడుగు - పదమే తిరగబడింది (2)
11. ముద్దార నేర్పిస్తే వీళ్ళు నేర్వని విద్య కలదా అని ఒక కవి చెప్పాడు (4)
12. చేది రాజు - భీముని దెబ్బకు కీచుమన్నాడు (4)
14. పిచ్చి - ఈ శంకరయ్య నేను కాదు, ఎన్.టీ.ఆర్ (2)
15. 24 నిమిషాల పాటు తలుపులు తెరవకుండా అది వేస్తే ఎలా? (3)
16. చూస్తా మీ సంగతి అంటూ మెలిపెట్టేది (2)
20. గద్య ప్రబంధం అన్నారు కాని ఇంగ్లీషు పేరే స్థిరపడింది ఈ సాహిత్య ప్రక్రియకు (3)
21. చురుకైన బుద్ధి కలవాడు - కుశుని అగ్రజునికి ఇది ఉందా? (5)
నిలువు
1. పెండ్లి - వివాదం వద్దు. దీనితో విద్య నాశనమట! (3)
2. యాగం (2)
3. పదమూడవ తిథి (4)
4. పక్షులు, జలచరాల ఆహారం - దీన్ని ఎరగరా? (2)
5. భూమిని పాలిచేవాడు - మరీ హీనంగా పాలించేవాడా?
9. వాన కోయిల - చెప్పడం చాతకాదా? (3)
10. మాట - గద్యం అనికూడ అంటారు (3)
11. సత్యభామ చేత కృష్ణున్ని తన్నించిన ఈ కవికి ముక్కుపొడుం కావాలా? (5)
13. పిడికిట పట్టే చిన్న కత్తి (4)
17. పరిపూర్ణ జ్ఞానం. కనీసం బుద్ధి లేదంటారా? (3)
18. ప్రేమ - దీనిలో పడుచువారు పడతారు, చేపలూ పడతాయి (2)
19. గృధ్రం - తలక్రిందులయింది. కాకుల్ని కొట్టి దీనికేద్దామా?

14, జులై 2010, బుధవారం

సమస్యా పూరణం - 38

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను.

గళ్ళ నుడి కట్టు - 9


అడ్డం
1. అరిషడ్వర్గాలలో మొదటి నాలుగు (9)
5. దేవ పత్ని - ఇదే వినతి (2)
6. మౌని - యమునిలో చూడు (2)
7. దైన్యంతో ఉన్నవాళ్ళకు చుట్టం (5)
10. దీన్ని పూజించడం వల్లనే ఇంద్రునికి గోకులం పైన కోపం వచ్చింది (4)
11. విత్తనం - భవిష్యత్తులో చెట్టౌతుంది (2)
14. చీకటినుండి నన్ను వెలుగులోకి నడిపించు - సంస్కృతంలో చెప్పండి (9)
18. మన్మథుని భార్య - భారతి కాదు (2)
19. చిన్న శంఖాన్ని తయారుచేసే కీటకం - మేనత్తకు కావాలట! (2)
21. మద్యం ప్రమాణం ఇంగ్లీషులో - ఒక్కటైతే ఫరవాలేదట! ఎక్కువైతేనే తిప్పలు (2)
23. యోగ్యమైనది - ఎలిజబిలిటీ - అకారంతో అట్నుంచి మొదలయింది (2)
24. తీసుకురా (1)
25. ఒక రాక్షసుడు - ఇతని శత్రువు కనుకనే విష్ణువు మురారి అయ్యాడు (2)
26. వెళ్ళు (1)
నిలువు
1. కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా ఏదైనా కవిత్వానికి తగనివి కావు - శ్రీశ్రీ ఉవాచ (9)
2. వినమని వేడుకొనడం.
అస్తవ్యస్తమయింది. (3)
3. ముఖం - ఏమో ముద్దుగా ఉంది (2)
4. సహాయ నిరాకరణంలో కీడుంది (2)
8. సేవకుడు - ప్రతి కుటుంబంలో ఉంటాడా? (2)
9. అడవి - భవనం అక్కడే ఉంది (2)
12. మద్యం సేవిస్తే వచ్చేది గమ్మత్తైనదట! (2)
13. రామాయణ కాలంలోనూ ఉందట! కుబేరునిదైతే రావణుడు లాక్కున్నాడు (3)
15. బిచ్చము - "దీనికి ఇద్దరు పెళ్ళాలా?" అని శ్రీనాథుడు శివుణ్ణి నిలదీసాడు (4)
16. యంత్రం - అమరకోశంలో దొరుకుతుందా? (2)
17. పద్యంలో, మఠంలో ఉండాలి (2)
20. మామ పెండ్లాము - తలక్రిందులయింది (2)
22. ఇంగ్లీషు గొంగళి - క్రిందనుండి

13, జులై 2010, మంగళవారం

గళ్ళ నుడి కట్టు - 8


అడ్డం -
1. నాగరాజు - శేషుని సోదరుడు (3)
3. పనోళ్ళతో సరసాలు వద్దు. ఫ్రూట్ జ్యూస్ (5)
7. పోరాటం - అడ్డం 11లో చివరి సున్నా తీసేసి తిరగేయండి (3)
9. అట్నుంచి భూమి. చెప్పలేరా? ధారుణం! (3)
11. విష్ణు దేవుని ఖడ్గం - ఇదే అన్నమయ్యగా అవతరించిందట! (3)
13. దీని కడపట తిరుపతి ఉందట! అందుకే దీనికా పేరు. శయ్యను తిరగెయ్యండి (3)
14. కుక్క కదా! అస్తవ్యస్త మయింది. అయినా చిలక ఉంది (3)
16. రవిక లేదా చొక్కా. కంచుతో చేసిందా? (3)
18. దాశరథి గారి కావ్యం. చీకటితో యుద్ధమా? (7)
నిలువు -
2. కోపం - వానికి కనుక ఫరవా లేదు (3)
4. అందమైన స్త్రీ. కరుణశ్రీ గారి "అది యొక ...... పుష్పవన"మనే పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోడి (3)
5. నటించే వాళ్ళు పాత్రధారులు. మరి డబ్బింగ్ చెప్పే వాళ్ళు? వీళ్ళు తెరపై కనిపించరు కనుక తలక్రిందు లయ్యారు (5)
6. గణేశ చతుర్థి (7)
8. పైనుంచి చూసినా, క్రిందినుంచి చూసినా ఒకటే .. ఇంద్రుని ఉద్యాన వనం (3)
10. పసరం - తిరగబడింది (3)
12. ఎటునుంచైనా గుచ్చుకుంటుంది. ముల్లు (3)
15. చాతక పక్షి. తోకకంటే ఈకకందట! అందుకే తలక్రిందయింది (3)
17. గొయ్యి. ఎటునుంచి పడితేనేం?

సమస్యా పూరణం - 37

కవి మిత్రులకు నమస్కృతులు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము.

12, జులై 2010, సోమవారం

సమస్యా పూరణం - 36

కవి మిత్రులారా!
ఈరోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ప్రెస్సు మీడియాలు తుస్సుమనెను.

గళ్ళ నుడి కట్టు - 7
( దయచేసి మీ సమాధానాలను ఒకదాని క్రింద ఒకటిగా కాకుండా కామాలతో వేరు చేస్తూ వరుసగా ఇవ్వండి. లేకుంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి గూగుల్ నుంచి "ఎర్రర్" మెసేజ్ వస్తున్నది )

అడ్డం
1. శంకరుని ఆనందింపజేసే రాగం - దాసరి సినిమా (5)
4. మోసం - సిరివంచ నగరంలో (3)
6. చైత్ర వైశాఖ మాసాల ఋతువు - ఒక రాగం కూడా (3)
8. ఈ విందులో అందరు వినెదరు (3)
12. నజభజజజర - ఒక వృత్తం (5)
16. తొలి కాదు - కమలినిలో ఉంది (2)
17. పోతావా అంటే "వెళ్ళను" అన్నాడు ఫోనులో (2)
18. లోకం సుడులు తిరిగిందంటే అందులో కృష్ణుని మామ ఉన్నాడు (3)
22. అరిభంజనుడు ఇంద్రుడు - ఒక రాక్షసుని శత్రువు (3)
23. ఇవి వదలడమంటే శాశ్వతంగా వదులుకున్నట్లే - తిలోత్తమకు బోదకాలు? (5)
నిలువు
2. వస్త్రం - క్రిందినుంచైనా పైనుంచైనా ఒకటే (3)
3. నిజం లాంటిది కాలుతుంది (2)
5. నూనె - చమురుకుంటే సరి (3)
7. అనుమానం - కంచం కోసం కదా? ఇట్నుంచి నరుక్కు పో!
(3)
9. దుస్ససేనుల వారి సోదరి (3)
10. ఒక తెలుగు బ్లాగులో దీని దంపుడుంది (2)
11.సోషలిజం - సంఘంలో అందరూ సమానమే (5)
13. జెండా (3)
14. ఈ ఆకులతో పూజ శివునికి ఇష్టమట! (3)
15. "మరమరాలు కావాలి తాతా!" అందీ పిల్ల (5)
19. మంచి బుద్ధి- వసుమతికి ఉందా? (3)
20. సూకరం - పోకిరి జంతువా? (2)
21. అపవాదు (2)

11, జులై 2010, ఆదివారం

సమస్యా పూరణం - 35

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
కుంటివాఁడెక్కె తిరుమల కొండ పైకి.

గళ్ళ నుడి కట్టు - 6
అడ్డం
1. దేవుని సేవ ఆ రాధ నచ్చిన పని (4)
3. వెన్నెల రేడు వంకరయ్యాడు (4)
7. తినదగింది - ఖానా మద్యం .. ఆద్యంతాలు (2)
8. మనం దానికోసం అపసవ్యంగా ఆత్రపడక చూడాలి. ఇదే ప్రధాన మన్నారు పెద్దలు (3)
9. పచన క్రియ - బ్రహ్మచారికి తప్పవంట తిప్పలు (2)
12. శని రాకలో ఆశ లేదు (3)
13. మూర్తి - విగ్రహం - ప్రతి మందిరంలోను ఉంటుంది (3)
17. ఆకారం - సారూ! పండుకూ, పత్రికీ, కన్ను చూచే ప్రతిదానికీ ఇది ఉంది (2)
18. ముందు కాదు - వీవెనుడి కథలో ఉంది (3)
19. కార్నర్ - ఒక నక్షత్రం. మామూలట జాతదోషం (2)
22. వాని బంధనము తెంచుదామంటే 'రూల్' అడ్డమొస్తుంది (4)
23.పలికేది నారాయణ మంత్రం - పెట్టేవి కలహాలు. చెంచులక్ష్మి సినిమాలో రేలంగి (4)
నిలువు
1. రాసిన, రాయని స్టాంపు పత్రాలు - రామప్పంతులు ఇంట్లో అటకపైన కావలసినన్ని ఉన్నాయష!
2. ఇదే జగత్తుకు మూలమట! ఇంధనమా? కాదనుకుంటా! (2)
4. ఇంగ్లీషువాడి అదృష్టం. చిలక్కు చెప్పినట్లు చెప్పినా అర్థం కాలేదా? (2)
5. చెవి కింపైనది. మన శాస్త్రీయ సంగీతం ఏ సంప్రదాయం? (4)
6. ఇంచు మించు శంకర్ దాదా పుణ్యాత్ముడే ! (3)
10. చూచి రాకు. కాల్చి రా! కోపమా? విసుగా? (3)
11. తల్లి, తండ్రి, గురువు ఓకే! వేళాపాళా లేకుండా వచ్చే ఇతన్ని ఈ కాలంలో "దేవో భవ" అనగలమా? (3)
14. ఎవరూ? ప్రవరుని నిధిని కొల్లగొట్టేది? (4)
15. పూర్వం - ఇంతకు ముందు నునుపుగా ఉండేది (3)
16. విరటుని కొలువులో వంటవాడు (4)
20. అడ్డం 1 లోని కృష్ణ సఖి (2)
21. శాకం. అడ్డం 9 లోని బ్రహ్మచారికి దీనితోనే తంటా (2)

10, జులై 2010, శనివారం

దత్త పది - 4

కవి మిత్రులారా!
ఈ రోజు దత్తపది ఇస్తున్నాను. క్రింది పదాలను ఉపయోగిస్తూ "ఎన్నికల కోలాహలం" విషయంగా మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
అర, చెర, తెర, మర.

గళ్ళ నుడి కట్టు - 5
అడ్డం -
1. చింతల పాశంలో వెనక్కి చూడండి. మెరుపు తీగ కనబడుతుంది(4)
3. కేసరి గమనంలో మొదటి నాలుగు స్వరాలు (4)
7. ఈ బండ దగ్గర పరిష్కరించే కలహం (2)
8. షిరిడి సాయి కాడు - కటికవాడు. కనుగొంటివా సాయి ప్రవీణ్? (3)
9. ఇక్కడున్న కామాక్షికి కథలంటే అంతిష్టమా? అన్నీ అటే పోతాయి (2)
12. ఆగడు సుమా! వాని తత్త్వం కఠినం (3)
13. రుణమున్న దయ (3)
17. భూసురా! ఇది మీకు (మీకేనా? అందరికీ) నిషిద్ధం (2)
18. రాజు కాని రాజు. తూకం వేసేది (3)
19. అసత్యం. కపటం తోడిది (2)
22. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అంటే కృష్ణశాస్త్రి తలకేసి వేటికోసం చూస్తావు?
(4)
23. పద కవితా పితామహుడు. నీకు వందన మన్నామయ్యా! (4)

నిలువు -
1. ఈ బ్లాగు నిర్వాహకుడు (4)
2. లవంగంలో కొంచెం (2)
4. రెక్క కాదు నక్షత్రం (2)
5. ఎండమావి. ఒక ప్రసిద్ధ తెలుగు నవల (4)
6. రసాలూరే మామిడి (3)
10. అడుగు సున్నితంగా వెయ్యి. అందులో బురద ఉంది (3)
11. తరుణ వయస్కురాలైన స్త్రీ (3)
14. గిరిక మగడెవరో రామరాజ భూషణుడు చెప్పాలి (4)
15. చంద్రుడు. రాత్రికి రాజట! (3)
16. ఈ కన్నయ్య నల్లనివాడు (4)
20. రక్త పిపాసి పాపాత్ముడే కదా! (2)
21. పెద్ద కాదు

9, జులై 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 34

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
బొంకినట్టివాఁడె పుణ్యజనుఁడు.

గళ్ళ నుడి కట్టు - 4


అడ్డం
-
1. కాకర కాయల్ని రాలగొట్టేవాడా నటుడు?(4)
3.
అందమైనది - మనస్సును దొంగిలించేది(4)
7.
అప్పుడప్పుడు వాయించు - చర్మవాద్యం(2)
8.
వినోదంగా, అందంగా ఉన్న అడ్రసు(3)
9.
అక్క మొగుడు(2)
12.
కలంతో పాటు హలం పట్టిన కవి(3)
13.
పల్యంకిక(3)
17.
రుధిరం(2);
18.
శివుని నెత్తినెక్కిన గంగతో పార్వతికి పోరు(3)
19.
మానవా! తడవకు. అది వర్షం(2);
22.
అటునుంచి విజయవాడ(4)
23.
విలన్ గా నీరాజనా లందుకున్న నటుడు(4)
నిలువు -
1. మమకారం విడచిన ఘోరారణ్యం(4)
2.
నిశ(2)
4.
వ్రతం(2)
5.
వరంగల్లులో చివరి అక్షరాన్ని ఇకారాంతం చేసి సవరిస్తే ముగ్గు(4)
6.
నెమలి పింఛం - దీనివల్లనే నెమలిని కలాపి అన్నారు(3)
10.
ఇంద్రుని సారథి(3)
11.
పాట పల్లవించేది దీని తోనే(3)
14.
గిరీశం జాడ ఈయన్ని అడగాలి(4)
15.
కవి వచనంలో కవిత్వం(3)
16.
శాపానల దగ్ధులుండే బారు(4)
20.
తిరగబడ్డ ముసలితనం - ఒక రాక్షసి(2)
21. జనం - సంతానం అని కూడ అర్థం.

8, జులై 2010, గురువారం

సమస్యా పూరణం - 33

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.

7, జులై 2010, బుధవారం

గళ్ళ నుడి కట్టు - 3అడ్డం -
1. విశ్వనాథ వారి ప్రసిద్ధకావ్యం (9); 2. నువ్వులు (3); 7. పెంచే పని కంటూ ఒక పదం ఉంది (3); 10. తమాలపత్రం (5); 13. మీరు గొప్పవారండి. దయచేయండి (2); 14. వాదం చేసేవాడు (2); 16. రాత్రి - ఒక నటి పేరు (3); 20. దీనికి నరస భూపాలీయము అని నామాంతరం (9);
నిలువు -
2. ఒక పువ్వు - పాత తరం హీరోయిన్ (3); 3. కనిపిస్తే వినిపిస్తాడట పోయెట్ (2); 4. క్షణకాలం ఉండేది (3); 6. సున్నితంగా, అందంగా ఉండే దుర్గ అవతారం (3); 8. ఒక్క "ముక్క" చెప్పు (3); 9. చెక్కితే శిల్పమయ్యేది (2); 11. ఇది తాగి మరది తడబడ్డాడు (3); 12. పంపా వనిలో గాలి కొడుకు (3); 13. "రంగా! ఎక్కడినుంచి రాకా?" అంటే వెనక్కి తిరిగి అన్నాడు "జైలు" (4); 15. వదినగారి మణిహారంలో సూర్యుడు (4); 17. యముని సోదరి - సూర్యుని బిడ్డ తిరగబడింది (3); 18. కత్తిలో చివర ఉన్న తోక (2); 19. ఐతే మాడా! ఏదో మార్పు కనిపిస్తోంది (2)

సమస్యా పూరణం - 32

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...

పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్.

గళ్ళ నుడి కట్టు

అందరికి వందనాలు. నిన్న నా బ్లాగులో కామెంట్స్ మాడరేషన్ పెట్టాను. నా మెయిల్ కు వచ్చిన వ్యాఖ్యలను బ్లాగులో ప్రచురించబోతే "ఎర్రర్" వచ్చింది. మాడరేషన్ తొలగించి నా మెయిల్ లోని వ్యాఖ్యలను కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయబోతే బ్లాగులో వ్యాఖ్యలు కనిపించలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఆ తరువాత చూస్తే కొన్ని వ్యాఖ్యలు రిపీట్ అయ్యాయి. కొన్ని అసలే కనిపించ లేదు. అంతా గందరగోళ పరిస్థితి. దాంతో ఎవ్వరికీ సమాధానాలు ఇవ్వలేక పోయాను. తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేక ఇబ్బంది పడ్డాను. ఈ తికమకలో కొత్త గడి సిద్ధం చేయలేదు. అందుకే ఈ రోజు "గళ్ళ నుడి కట్టు" లేదు. వీలయితే రేపు కొత్త గడి పోస్ట్ చేస్తాను. నన్ను క్షమించండి.

6, జులై 2010, మంగళవారం

సమస్యా పూరణం -31

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్యను రవి గారు పంపించారు. అది ఇది ....

వీథిని బడి తన్నుకొనిరి విరిబోణు లటన్.

గళ్ళ నుడి కట్టు - 2

అడ్డం -
1. తమ్మి చుట్టం - సూర్యుడు (7); 5. దాసరి బేసి కాడు (2); 6. కారు కాని కారు - శీఘ్రవ్యాప్తం (3); 8. కసిరినంత మాత్రాన ఇది తగ్గుతుందా? (2); 10. యూకం - దీనికి పెత్తన మివ్వొద్దని నెత్తి కొట్టుకొని మునుపే చెప్పారు (2); 11.బాణాసనం - వీలునామా(2) 12. ముఖము - అక్షరభ్రంశతో రోదనము వచ్చింది (4); 14. అందరూ విచారంతో పాల్గొనే సమావేశం - తాపస సంభరంలో వెదకండి (5) 15. పూల తీగ - ఒక నటి (4) 16. వర విక్రయం నాటకంలో సూర్యుడు (2); 18. ఒసే! నా పతి సైన్యాధిపతి తెలుసా? (4); 20. మధురమైన - తొలగించనైన (4); 21. సంస్కృతంలో తండ్రి - తెలుగులో తండ్రి తండ్రి (2)
నిలువు -
2. పులుమ మంటే అడ్డంగా తిప్పుతావేం? (3); 3. ఖరీదైన భూమి (2); 4. పూల వాన (4); 7. నల్లనైన మృత్యువు - టైం ... బాబూ ... టైం! (3); 8. "కంటిలోని ప్రతిమ" అని శబ్ద రత్నాకరం - ఇది కరువైన కను లెందుకు అన్నాడు సినీకవి (4); 9. కలదటరా సుబుద్ధీ! - బద్దెన పద్యాల్లో చాలా వరకు చివర
వచ్చేది (6); 11. భూమి - విశ్వాన్ని భరిస్తుందా? (4) 13. మృచ్చకటికం నాటక నాయిక (5); 17. గరుత్మంతుని తల్లి (3); 19. పట్టించుకుంటే కొడుకైనా, కూతురైనా ఒకటే (2)

(సమాధానాలను వ్యాఖ్యల రూపంలో పంపేవాళ్ళు ఆ సమాధానాలను ఒకదాని క్రింద మరోకటి కాకుండా కామాలతో వేరు చేస్తూ వరుసగా, పైన నేను ఆధారాలను ఇచ్చిన విధంగా ఇవ్వండి)

5, జులై 2010, సోమవారం

గళ్ళ నుడి కట్టు - 1


గళ్ళ నుడి కట్టు
తెలుగు భాషాభిమానులకు, కవి మిత్రులకు నమస్సుమాంజలి. ఇన్ని రోజులుగా నా బ్లాగును వీక్షిస్తూ. సమస్యలనుపూరిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి ధన్యవాదాలు. నా బ్లాగులో మరిన్ని అంశాలను చేర్చాలని ఆలోచిస్తున్నతరుణంలోక్రాస్ వర్డ్ పజిల్ ప్రవేశపెట్టమని ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అందుకే ఈ ప్రయత్నం.
ఈ "గళ్ళ నుడి కట్టు" సమాధానలను వ్యాఖ్య రూపంలో పంపిస్తే సరి. ఎంత కాలంలో దీనికి సమాధానాలు వస్తాయోచూసి దీనిని రోజు కొక్కటి పెట్టాలా, లేక ఎన్ని రోజుల వ్యవధిలో పెట్టాలో నిర్ణయిస్తాను. మీ అందరి సలహాలను,సహకారాన్నికోరుతున్నాను.

గళ్ళ నుడి కట్టు - 1

అడ్డం
1. జ్ఞానజ్యోతిని వెదజల్లే బ్లాగు గురువు గారి ఇంటిపేరు (4)
3.
ఇంగ్లీషు కోతికి మధ్య, చివర దానిని కలిపితే గంగ (4)
7. "
శిరా కదంబం" బ్లాగులో సినిమా విశేషాల కుప్ప. తిరగేసి చూడండి (2)
8.
వాడికి పది లంఖనాలైనా అందులోనే క్షేమం ఉంది (3)
9.
అందమైన పచ్చి పులుసు (2)
12.
ఇదెత్తుకొచ్చిందట కన్నెపిల్ల - అక్కినేని పాటలో (3)
13.
శ్వేతం - చెప్పు (3)
17.
ఉదయంలో కారుణ్యం (2)
18.
ఇది ఉన్న రోజుల్లో నేరములు కానరావన్నాడు బద్దెన (3)
19.
దీన్ని చూడగనే సరస్వతి, నారదుడు, చిట్టిబాబు గుర్తుకొస్తారు (2)
22.
.. .. .. అంటూ తన పేరు చెప్పింది బొమ్మరిల్లు పాప. దానికి
మంచితనాన్ని చేరిస్తే ఒక నటి పేరయింది (4)
23.
తమిళశ్రీతో భర్త. ఒక పుణ్యక్షేత్రం (4)

నిలువు
1. నెట్ పట్టిన రాజా మన్మథుడు? (4)
2.
హిందీలో చెప్పవయ్యా (2)
4.
దాదాపుగా దగ్గర (2)
5.
పొడవైన నిశ్వాస. ఇంకా పొడవయింది. హూఁ .... (4)
6.
అన్న పెండ్లాము (3)
10.
ఇది వచ్చిందే పిల్లా అని పాడాడు అక్కినేని (3)
11. 13
అడ్డానికి వ్యతిరేకం (3)
14.
రామదాసు అడ్డదిడ్డంగా పాడితే ఆరవస్వరం హ్రస్వమైంది. చెన్నై (4)
15.
నది. మరో చరిత్ర నాయిక (3)
16.
చిలకమర్తి వారి ప్రసిద్ధ నవల (4)
20.
సదా సిరికి దూరం. స్వేచ్ఛ లేని పనిమనిషి (2)
21.
నేములో నేముందట