31, జనవరి 2019, గురువారం

దత్తపది - 153 (జలగ-కప్ప-చేప-నత్త)

జలగ - కప్ప - చేప - నత్త
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

30, జనవరి 2019, బుధవారం

ఆహ్వానం (నెల్లూరులో పుస్తకావిష్కరణ)


సమస్య - 2916 (అల్పుఁ జెప్పనగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్పుఁ జెప్పనగు మహాత్ముఁ డనుచు"
(లేదా...)
"అల్పునిఁ జెప్పగాఁ దగు మహాత్ముఁ డటంచు జనుల్ భళీ యనన్"

29, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2915 (నీరజమునఁ గలువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్"
(లేదా...)
"నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్"

28, జనవరి 2019, సోమవారం

సమస్య - 2914 (సాధువుగ గ్రహింతుము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సాధువుగ గ్రహింతుము దురాచారు నెపుడు"
(లేదా...)
"సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చఁగన్"

27, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2913 (వరమది భక్తులను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వరమది భక్తులను మిగుల వంచించెఁ గదా"
(లేదా...)
"వరమది దేవుఁ డిచ్చినది వంచన సేసెను భక్తసంఘమున్"

26, జనవరి 2019, శనివారం

సమస్య - 2912 (వనమునన్ సంచరింప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనమునన్ సంచరింప వైభవము దక్కు"
(లేదా...)
"వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్"

25, జనవరి 2019, శుక్రవారం

అష్టావధానము

ది. 24-1-2019,
శ్రీ మాచవోలు శ్రీధర రావు గారి గృహంలో, మదీనాగూడ, హైదరాబాదు
అవధాని : శ్రీ బండకాడి అంజయ్య గౌడ్ గారు
సంచాలకులు : శ్రీ కంది శంకరయ్య గారు.

1. నిషిద్ధాక్షరి: శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
(సాహిత్య ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ పద్యం చెప్పండి)
శ్రీ(న)క(ర)మ(ద)లా(న)ల(మ)య(-)ద(య)త్త
మ్మైకా(మ)వ్య(ప)ంబై(-)స(ర)త(త)మ్ముమా(క)ధు (ర)క(-) మ(త)గు(-)చున్
లోక(మ)వి(న)ధీ(య)తి(న)య(గ)న(ద)ంగా
(వ)పాక(మ)ంబై వ(ర) న(ర)జ(భ)మ(ద)య్యెవా(క)ణీ(క)నీ(క)చేన్.

శ్రీకమలాలయదత్త
మ్మై కావ్యంబై సతమ్ము మాధుకమగుచున్
లోకవిధీతి యనంగా
పాకంబై వనజమయ్యె వాణీ నీచేన్.

2. సమస్య: శ్రీ చండ్రపాటి రామ్మోహన్
(కులపిచ్చియె సంతతమ్ము కూర్చును చెలిమిన్)
పొలమున కలుపును తీయుచు
నలసటగా తోచినప్పు నందరు గూడన్
కిలకిల నగుచు తమల పా
కులపిచ్చియె సంతతమ్ము కూర్చును చెలిమిన్

3. దత్తపది: శ్రీ  కామవరపు కామేశ్వర రావు
(రంభ – ఊర్వసి – మేనక – తిలోత్తమ పదాలను ఉపయోగిస్తూ బ్రహ్మచర్యం గూర్చి)
వీడె సంరంభమును తాను విద్యకొరకు
కనుల ముందర నూర్వశి కాన బడిన
మేన కంపర మేమియు పూన కుండ
నా తిలోత్తమ నైన తా నంటబోడు

4. వర్ణన: శ్రీ క్రొవ్విడి వెంకట రాజా రావు
(వసంత ఋతు వర్ణన ఉత్పల మాలలో)
పచ్చగ వృక్షరాజములు భాసిలుచుండగ గొప్ప శోభతో
వెచ్చని పిల్లవాయువులు వీయుచు నుండగ మత్తకోకిలల్
పొచ్చెము లేక కూయుచును మోదము గల్గగ జేయుచుండగా
వచ్చె వసంత లక్ష్మి కడు వైభవ మొప్పగ వత్సరాదిలో

5. ఆశువు: శ్రీ కవిశ్రీ సత్తి బాబు
(శ్రీ మాచవోలు శ్రీధర్ రావు, నాగలక్షి దంపతుల గురించి ఆశువుగా పద్యం)
నిండు నూరేండ్లు చల్లగా నుండగాను
నాగలక్ష్మి శ్రీధరులకు భోగ మొసగ
హరిహరాదుల వేడియు ననవరతము
కోరుచున్నారు మిత్రులు కూర్మితోడ.


6. ఛందోభాషణము : శ్రీ మాచవోలు శ్రీధర్ రావు
"స్వాగత మిదె యంజయ్యకు"
"మీ గృహమున పొందినాను మెప్పగు విందున్"
"బాగున్నద ఆతిథ్యము?"
"వాగీశ్వరి కరుణ చేత భాసిల్లె కవీ!"

7. వారగణన: ముద్దు రాజయ్య గారు.

8. అప్రస్తుత ప్రశంస: భమిడిపాటి వెంకటేశ్వర రావు

అవధానానంతరం కవిశ్రీ సత్తిబాబు గారి స్పందన....
1: కం. పుట్టె నవధాని యొక్కడు
పట్టము గట్టగ కవితకు వాగ్దేవి కృపన్
గట్టిగ శ్రీధరు నింటను
పట్టుదలగ నంజయ తన ప్రతిభను చూపెన్ .

2: ఉ. శ్రీధర మాచవోలు మరి శ్రీమతియౌ ఘన నాగలక్ష్మియున్ 
మోదము నొందగన్  కవి సమూహము బిల్చిరి విందుకోసమై
హ్లాదన మొంది మేము దరహాసము చిందగ మోమునందునన్
గాదిలి వంటకంబునయగారము నొప్ప భుజించి తీరమే !

కంది శంకరయ్య గారి స్పందన....
శ్రీ యంజయ్య వధానము
మా యందరి యెదలలో మహానందమ్మున్
హాయిగఁ గల్గించె నటం
చీ యవసర మందు మెప్పులే యందింతున్.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి స్పందన....
కడు ముదమ్మున నంజయ్య గౌడు చెప్పి
పద్యముల నద్భుతమ్ముగ వరలె తాను
క్రొత్త యష్టావధానియై కూడె వాణి
యితని గరుణతో దీవింప నిచ్చతోడ.

అవధాని అంజయ్య గౌడు గారి స్పందన... 

చూత ఫలమ్ముకన్న మనసున్ మురిపించు జిలేబి కన్న సం
ప్రీతిని గూర్చు లడ్డు మృదు ఫేణిక ఖర్జూర నారికేళముల్
నేతిమిఠాయి గారెలును నే దిను వేళను పొందనైతి నీ
భ్రాతలతో వధానము శుభంబుగ సాగెను వాణి సత్కృపన్. 

సమస్య - 2911 (భల్లూకము కడుపులోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"
(లేదా...)
"భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్"

24, జనవరి 2019, గురువారం

సమస్య - 2910 (దీపముపై నొక్క యీఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్"
(లేదా...)
"దీపముపైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా"

23, జనవరి 2019, బుధవారం

సమస్య - 2909 (పదములు లేకుండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పదములు లేకుండఁ గవిత వ్రాసినఁ గవియౌ"
(లేదా...)
"పదములు లేక సత్కవిత వ్రాసినవాఁడె కవీశ్వరుం డగున్"

22, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2908 (కొట్టుకొనిపోయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కొట్టుకొనిపోయె గాలికిఁ గొండలెల్ల"
(లేదా...)
"కొండలు గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్"

21, జనవరి 2019, సోమవారం

సమస్య - 2907 (పాపము లేకున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పాపము లేకున్న జగము పాడైపోవున్"
(లేదా...)
"పాపము లేనిచో జగము పాడయిపోవును నిశ్చయమ్ముగన్"

20, జనవరి 2019, ఆదివారం

దత్తపది - 152 (సంధి-సమాస-కారక-క్రియ)

సంధి - సమాస - కారక - క్రియ
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో 
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

19, జనవరి 2019, శనివారం

సమస్య - 2906 (కుక్కలు గడ్డిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును"
(లేదా...)
"కుక్కలు పచ్చగడ్డిఁ దిను గోవులు మ్రింగును పచ్చి మాంసమున్"

18, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2905 (చరణముతో భర్తృసేవ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చరణముతో భర్తృసేవ సతి యొనరించెన్"
(లేదా...)
"చరణముతోడ భర్తృ పరిచర్య యొనర్చె లతాంగి వేడుకన్"

17, జనవరి 2019, గురువారం

సమస్య - 2904 (వడఁకెను మేడసాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వధాన మన మేడసాని వడవడ వడఁకెన్"
(లేదా...)
"వడఁకెను మేడసాని కవివర్యుఁడు సేయు మనన్ వధానమున్"
(13-1-2019 నాడు తిరుపతిలో పాలడుగు శ్రీచరణ్ గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

16, జనవరి 2019, బుధవారం

అష్టావధానం

ది. 13-1-2019
వేదిక : ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
అవధాని : పాలడుగు శ్రీచరణ్ గారు, U. S. A.
అధ్యక్షులు : శ్రీ మేడసాని మోహన్ గారు
******
1. నిషిద్ధాక్షరి : ఆముదాల మురళి గారు.
(బ్రహ్మవిద్యను గురించి వివరిస్తూ పద్యం)
శ్రీ(శ) మ(త) ద్వా(స) క్ప(త)ద(మ) గో(మ) పున్
సామ(జ) గ(మ) తో(య) షున్(x) ప(వ) ర(మ) శి(వ) రు జ(న) డ(ల) భి(ర) త్తున్(x) నే
[రెండు పాదాలకే నిషేధం. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (X) చిహ్నం నిషేధం లేదు]
శ్రీమద్వాక్పదగోపున్
సామగతోషున్ పరశిరు జడభిత్తున్ నే
ఓమఖిలైక మటంచును
నీమంబున గొల్తు బ్రహ్మ నిష్ఠావిద్యన్.
******
2. సమస్య : కంది శంకరయ్య
(వడఁకెను మేడసాని కవి వర్యుఁడు సేయు మనన్ వధానమున్)
అడుగుటయే నిదానమఁట యాశుఝరీ పరిపుష్టిఁబొందఁగన్
నడకలు హంసరీతులను న్యాయము దప్పక పల్కువారికిన్
జడధులు పొంగు రీతిగను సారపు ధర్మ విలాస తంతులన్
వడఁకెను మేడసాని కవి వర్యుఁడు సేయుమనన్ వధానమున్.
******
3. దత్తపది : డా. మన్నవ గంగాధర ప్రసాద్ గారు
(తెలుఁగు, వెలుగు, జిలుఁగు, కలుఁగు పదాలతో సంక్రాంతి లక్ష్మి యొక్క వర్ణన చంపకమాలలో)
తెలుఁగుల తేట పొంగఁగను ధీరవి సంక్రమణంబు తేజమై
వెలుగులు విశ్వరూపమున వృద్ధినిఁ జెందఁ దమోధి నక్రమున్
జిలుగుల చేలముం గొనుచు శ్రీశుఁడు విక్రమ మొందఁగా భువిన్
కలుగును సర్వ సౌఖ్యములు జ్ఞాన బలోద్ధతి శాంతి నొందఁగన్.
******
4. వర్ణన : మల్లిశెట్టి శివప్రసాద్ గారు
(జన్మస్థలంలో అవధానం చేస్తున్న మీ అనుభూతిని మత్తేభంలో వర్ణించాలి)
కవి రత్నాకరమైన శ్రీనగమునం గాత్యాయనీ నాథుడే
దివిషట్కోటులు కింకరుల్ గనఁగ వేదీ మధ్యమున్ దుర్గ తాన్
సవనం బూనెడి వేదభూమి సకల జ్ఞానార్థ ధాత్రిన్ సదా
నివసింపంగ నిధానమై వెలయు శ్రీనీలేశు ధామంబునన్.
******
5. న్యస్తాక్షరి : కట్టా నరసింహం గారు
(శ్రీ వెంకటేశ్వర స్వామి వర్ణన - మొదటి పాదం 1వ అక్షరం 'శ్రీ'; రెండవ పాదం యతిస్థానంలో 'చ'; మూడవ పాదం యతిస్థానంలో 'ర'; నాల్గవ పాదం చివరి అక్షరం 'ణ')
శ్రీ రమానాథుఁ గలియుగ చిద్విలాసు
జనన మరణ చక్రాంతక చక్రధారి
లలిత శృంగారమూర్తికి రక్ష కొరకు
నంజలించెద పద్య విద్యార్థి చరణ.
******
6. ఆశువు : డా. వి. కృష్ణవేణి గారు
అ) ట్రంపు ఇంటిముందు సంక్రాంతి సంబరాలు జరిగితే ఎలా ఉంటుంది?
అతని కుట్రంపు కూతలె యంతరించు
సకల సౌభాగ్యముల్ మీరి ప్రకటమయ్యు
పశ్చిమంబున సంక్రాంతి వరవిధాత్రి
భోగి భోగేంద్రశయనుని పూర్ణకృపను.
ఆ) బ్రహ్మనాయుడు, నాగమ్మ ఇప్పుడు కోడిపందాలలో పాల్గొంటే ఎలా ఉంటుంది?
బ్రహ్మకైనను తప్పదు పంతమందు
వాగ్ధనుష్కోటి సంధింప ప్రణవమూని
నాగ యజ్ఞోపవీతుని నయముగాను
ప్రథమ పూజన్ జయంబును బడయగాను.
******
7. పురాణపఠనం : ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారు నిర్వహించారు.
అ) ఓ పుణ్యాత్మకులార... (భాగవతం)
ఆ) బహువనపాదపాబ్ధి కుల... (భారతం)
******
8. అప్రస్తుత ప్రసంగం : డా. ఇ.జి. హేమంతకుమార్ గారు నిర్వహించారు. 

సమస్య - 2903 (సిగరెట్ సిగపట్లు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సిగరెట్ సిగపట్లు మనకు శ్రేయముఁ గూర్చున్"
(లేదా...)
"సిగరెట్లున్ సిగపట్లు రెండు మనకున్ శ్రేయంబులన్ గూర్చెడిన్"

15, జనవరి 2019, మంగళవారం

దత్తపది - 151 (కర)

'కర'తో నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
మకర సంక్రమణాన్ని వర్ణిస్తూ 
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

14, జనవరి 2019, సోమవారం

సమస్య - 2902 (అజగరమును మ్రింగె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అజగరమును మ్రింగెఁ జీమ యాశ్చర్యముగన్"
(లేదా...)
"అజగరమున్ గుటుక్కుమని యచ్చెరువందఁగ మ్రింగెఁ జీమయే"

13, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2901 (అంబనుఁ బెండ్లాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంబనుఁ బెండ్లాడె సాల్వుఁ డందరు మెచ్చన్"
(లేదా...)
"అంబనుఁ బెండ్లియాడె జను లందరు మెచ్చఁగ సాల్వుఁ డాదటన్"

12, జనవరి 2019, శనివారం

సమస్య - 2900 (అరిషడ్వర్గమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అరిషడ్వర్గమ్ము లొసఁగు నానందమ్మున్"
(లేదా...)
"అరిషడ్వర్గము లాప్తమిత్రములుగా నానంద మందించులే"

11, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2899 (గద్వాల ప్రభవాగ్ని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గద్వాల ప్రభవ వహ్ని కాల్చెను లంకన్"
(లేదా...)
"గద్వాల ప్రభవాగ్ని కాల్చెఁగద లంకాపట్టణంబున్ వడిన్"

10, జనవరి 2019, గురువారం

సమస్య - 2898 (చదువనివాఁడు పండితుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చదువక పండితుఁడగు మఱి చదివి మొఱఁకునౌ"
(లేదా...)
"చదువనివాఁడు పండితుఁడు శాస్త్రము నేర్చినవాఁడు మూర్ఖుఁడౌ"

9, జనవరి 2019, బుధవారం

సమస్య - 2897 (రాక్షస గర్భమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాక్షస గర్భమ్మున రఘురాముఁడు పుట్టెన్"
(లేదా...)
"రాక్షస గర్భమందు రఘురాముఁడు పుట్టెను లోకరక్షకై"

8, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2896 (టీ వలన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"టీ వలన కవిత్వమే విలసిలు"
(లేదా...)
"టీతో వచ్చు కవిత్వసంపదకుఁ బోటీ లేదు ముమ్మాటికిన్"

7, జనవరి 2019, సోమవారం

సమస్య - 2895 (ననన నాన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాన నాన నాన ననన నాన"
(లేదా...)
"నననా నానన నాననా ననన నానానాననా నాననా"

6, జనవరి 2019, ఆదివారం

సమస్య - 2894 (పాలన్ దూరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పాలన్ దూరమునఁ బెట్ట స్వాస్థ్యము దక్కున్"
(లేదా...)
"పాలన్ దూరమునందుఁ బెట్టినపుడే స్వాస్థ్యంబు లభ్యం బగున్"
(నిన్న ఆకాశవాణిలో ప్రసారమైన మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

5, జనవరి 2019, శనివారం

సమస్య - 2893 (చంద్రుఁ డేతెంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చంద్రుఁ డేతెంచె మధ్యాహ్న సమయమందు"
(లేదా...)
"చంద్రుఁడు వచ్చెఁ జూడుఁడు ప్రచండ విభాకరుఁడై దినమ్మునన్"

4, జనవరి 2019, శుక్రవారం

సమస్య - 2892 (పెండ్లి వేదిపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పెండ్లి వేదిపై శ్రాద్ధముఁ బెట్టిరంట"
(లేదా...)
"శ్రాద్ధముఁ బెట్టినారఁట విశాల వివాహపు మండపమ్మునన్"

3, జనవరి 2019, గురువారం

సమస్య - 2891 (మల్లెల వాసనల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మల్లియలు గుబాళించఁగ మహిళ రోసె"
(లేదా...)
"మల్లెల వాసనల్ సెలఁగ మానిని రోయుచు ముక్కు మూయదే"
(డా. మునిగోటి సుందరరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

2, జనవరి 2019, బుధవారం

సమస్య - 2890 (పతిని త్యజియించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతిని త్యజియించి సతి పతివ్రత యనఁబడె"
(లేదా...)
"పతినిఁ బరిత్యజించి యొక భామ పతివ్రతగా నుతుల్ గొనెన్"

1, జనవరి 2019, మంగళవారం

నిషిద్ధాక్షరి - 47

కవిమిత్రులారా,
అంశము - నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నిషిద్ధము - శ, ష, స
ఛందస్సు - మీ ఇష్టము.