31, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1636 (భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున.
(శ్రీ శలాక రఘునాథ శర్మగారి స్ఫూర్తితో...)

పద్య రచన - 865

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణము - 1635 (అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్.
(శ్రీ శలాక రఘునాథ శర్మగారి స్ఫూర్తితో...)

పద్య రచన - 864

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, మార్చి 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1634 (మత్తేభమునకు గణములు మసజసతతగల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మత్తేభమునకు గణములు మసజసతతగల్.

పద్య రచన - 863

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28, మార్చి 2015, శనివారం

న్యస్తాక్షరి - 28

అంశం- రామకథ. 
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.

పద్య రచన - 862 (భారతరత్న)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, మార్చి 2015, శుక్రవారం

ఆహ్వానం!


సమస్యా పూరణము - 1633 (ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ప్రవరుఁడు పాదలేపనము వద్దనె సిద్ధుఁ డొసంగవచ్చినన్.

పద్య రచన - 861

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణము - 1632 (దారము లేకుండ పుష్పదామము లల్లెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దారము లేకుండ పుష్పదామము లల్లెన్.

పద్య రచన - 860

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, మార్చి 2015, బుధవారం

ప్రాసభేదాలు

మిత్రులు కొందరు ప్రాసభేదాలను కూడా వివరించ మన్నారు. చాలాకాలం క్రితమే ప్రాసభేదాలపై 5 పాఠాలు ఇచ్చాను. బ్లాగులో కుడివైపున ‘వర్గాలు’ అన్నచోట ‘ఛందస్సు’ అన్న శీర్షికను ఎంచుకుంటే ఆ పాఠాలను చూడవచ్చు. అఖండయతి, సరసయతి మొదలైన వాటిపై వివరంగా కూడా పాఠాలున్నాయి. 

సమస్యా పూరణము - 1631 (సున్న మున్నఁ జాలు నన్న మేల?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సున్న మున్నఁ జాలు నన్న మేల?

పద్య రచన - 859

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, మార్చి 2015, మంగళవారం

యతిభేదాలు -3

ఇ. ఉభయ యతులు 
పరరూపసంధి వలన ‘వేద+అండ=వేదండ’ అవుతుంది. ఇక్కడ ఉత్తరపదంలోని అచ్చుకే (అకారానికే) యతి వేయాలి. కాని ఆ అచ్చుతో కూడిన హల్లుకు (దకారానికి)కూడ కవులు యతి చెల్లించారు. కనుక వేదండ వంటి పదాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చని లాక్షణికులు అంగీకరించారు. అచ్చుకు, హల్లుకు (ఉభయానికి) యతి చెల్లడంవలన ఇటువంటివాటిని ‘ఉభయయతి’ అన్నారు.

1. అఖండయతి :- యతి చెల్లించాల్సిన చోట అచ్‍సంధి ఉన్నప్పుడు పరపదాది అచ్చుకే కాక, ఆ అచ్చుతో కూడిన హల్లుకు కూడా యతి చెల్లించడం అఖండయతి. 
ఉదా-
*భాను సహస్రభాసి వృష*భాధిపుఁ డన్నటు లర్థయుక్తమై. [కవిజనాశ్రయం]
(ఈ యతిని అప్పకవి, అనంతుడు మొదలైన లాక్షణికులు అంగీకరించలేదు. దానివల్ల ఉభయయతుల సంఖ్య పెరిగిందని గమనించండి)

2. యుష్మదస్మచ్ఛబ్దయతి :- యుష్మత్, అస్మత్ పదాలకు అచ్చుతో కూడిన పదాలు పరమైనపుడు (యుష్మత్+ఆజ్ఞ) ఆ అచ్చునకు కాని, సంధిగత (యుష్మదాజ్ఞ) ‘ద’కారానికి కాని యతి కూర్చడం. 
ఉదా-
*ధర్మతనయ యుష్మ*దాజ్ఞానిగళని... [అధర్వణ భారతము]
*త్రస్తాత్ములమైన యస్మ*దాదుల కెల్లన్. [భారత.ఆది. ౨.౨౧౯]
ఈ పద్ధతిలోనే త్వత్, భవత్ మొదలైనవాటికి యతి చెల్లించవచ్చు. 
*తావక సేవకుండ భవ*దంఘ్రుల నేనిటఁ గొల్చి వచ్చెదన్. [భాస్క.రామా.అయోధ్య. ౧౪౩]

3. పరరూపయతి (శకంధుయతి) :- పరరూపసంధి రూపాలైన శకంధు మొదలైనవాటిలో అచ్చుతో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.(శక+అంధుః=శకంధుః, వేద+అండ=వేదండ,  మనస్+ఈషా=మనీషా; పతత్+అంజలిః=పతంజలిః మొ.)
ఉదా-
వే|*దండముఖాంగము ల్తృణవి*తానముగాఁ గొని నిర్వికారులై. [భారత.భీష్మ. ౧.౨౩౪]

4. ప్రాది యతి :- ప్ర, పరా మొదలైన ఉపసర్గలతో అచ్చుతో మొదలయ్యే పదాలతో సంధి జరిగినపుడు అచ్చుకు, అచ్చుతో కూడిన హల్లుకు రెండింటికి యతి చెల్లుతుంది. (ప్ర, పరా, అప, సమ్, అను, అవ, నిస్, నిర్, దుస్, దుర్, వి, అజ్, ని, అధి, అపి, అతి, సు, ఉత్, అభి, ప్రతి, పరి, ఉప అనేవి ప్రాది ఉపసర్గలు).
ఉదా- 
*ప్రమదాజనేక్షణ *ప్రార్థితసౌందర్య
*యాచకసంతతి*ప్రార్థనీయ
*పృథివీసురప్రజా*భీష్టసంధాయక
*యిభముఖ్యసైన్యకా*భీష్టయాత్ర.... [విక్ర.చరి. ౪.౨౧౦]

5. ఆదేశయతి (నసమాసయతి) :- ద్వి, ప్ర మొదలైనవాటికి పరమైన ‘ఆప’ అన్న పదానికి  (పాణిని సూత్రం ప్రకారం) ఈప, ఊప అనేవి ఆదేశంగా వస్తాయి.  ద్వి+ఆపః=ద్వి+ఈపః=ద్వీపః, ప్ర+ఆపః=ప్ర+ఈపః=ప్రేపః, న+ఆపః=న+ఊపః=అనూపః.... ఇటువంటి సంధిరూపాలలో ఆదేశంగా వచ్చిన ఈకార, ఊకారాలకు, వాటితో కూడిన హల్లులకు యతి చెల్లుతుంది. 
ఉదా-
*ద్వీపులఁ జంపి విశ్వజగ*తీపతి యుత్తమశక్తి జాంబవ
*ద్వీపమునందు గోవులకు *నిమ్ముగఁ జేయుటకుం బ్రసన్నమై. [కా.చూ. ౭.౬౫]

6. నిత్యసమాసయతి :- పదాలను విభజించి విగ్రహవాక్యం చెప్పడానికి వీలుకానివి, ఇతర పదాల సాయంతో విగ్రహవాక్యం చెప్పబడేవి నిత్యసమాసాలు. అవి జనార్దన, రామాయణ, కర్ణాట మొదలైనవి. ఇటువంటి సమాసాలలో పరమైన అచ్చుకు కాని, దానితో కూడి ఉన్న హల్లుకు కాని యతి చెల్లించవచ్చు. 
ఉదా-
*నగనగియేనియున్ విను జ*నార్దన యెన్నఁడు బొంకువల్క ను... [భారత.అరణ్య. ౪.౩౯౭]

7. దేశ్య నిత్యసమాసయతి (దేశీయయతి) :- రూపఱు (రూపు+అఱు), పెంపఱు (పెంపు+అఱు) మొదలైనవి నిత్యసమాసాలుగా భావింపబడ్డాయి. ఇటువంటి సమాసాలలో అచ్చుకు, హల్లు రెండింటికి యతి చెల్లించవచ్చు. 
ఉదా-
చి|*చ్చఱ పిడుగుల్ వడిం దొఱఁగు *చాడ్పున నంబరవీధి నుగ్రమై. [భారత.విరాట. ౫.౧౪౩]
క్ర|*చ్చఱ మునివర్గవాహనుఁడ*వై చనుదెమ్మను మంతఁ దీరెడున్. [భారత.ఉద్యో. ౧.౧౭౬]

8. నిత్యయతి :- ‘ఏని’ అనేది ఒక పదంతో చేరినపుడు ‘ఏ’కే కాక, అది కలిసిన హల్లుకు కూడా యతి చెల్లించవచ్చు.
ఉదా-
ఎన్నడు|*న్నేని మోఘము గాదు దిగ్ధర*ణీరవీందు లెఱుంగఁగాన్. [భారత.ఆది. ౭.౧౪౨]
*ఎట్టి యపరాధ మొనరించె*నేని తల్లి [కాశీ. ౪.౨౬౯]

9. నిత్యసంధియతి :- ఉత్+లాసమ్=ఉల్లాసమ్, స్ఫురత్+లీలా=స్ఫురల్లీలా, సత్+చిత్=సచ్చిత్, ఉత్+జ్వలం=ఉజ్జ్వలమ్, తత్+టీకా=తట్టీకా మొదలైన సంధిరూపాలలో సంధికారణంగా ద్విత్వమైన హల్లుకే కాక, పూర్వపదాంత ‘త’వర్ణానికి కూడా యతి చెల్లుతుంది. 
ఉదా- 
వే|*ళ లతాంతాయుధు సంగరంబునకు ను*ల్లాసంబు కల్పించు ను... [పారి. ౧.౬౦]
విస్ఫుర|*ల్లీలన్ నివ్వరిముంటిచందమున నెం*తే పచ్చనై సూక్ష్మమై [కూ.తిమ్మకవి. భర్గశతకము]

10. రాగమసంధియతి :- జవరాలు (జవ+ఆలు), బీదరాలు (బీద+ఆలు)  ఇట్టి రాగమసంధి రూపాలలో అచ్చుకు, రకారానికి రెంటికి యతి చెల్లుతుంది.
ఉదా-
జవ|*రాలో యచ్చరయొ కిన్న*రవధూమణియో [చారుధేష్ణ చరిత్ర]
ఏ|*కాంతమునందు నున్న జవ*రాండ్ర నెపం బిడి పల్కరించు లా.. [మనుచ. ౨.౪౧]

11. విభాగయతి :- పరిమాణార్థకమైన ‘ఏసి’ చేరగా ఏర్పడిన గంపెడేసి (గంపెడు+ఏసి), నాలుగేసి (నాలుగు + ఏసి) మొదలైన రూపాలలో అచ్చుకు, హల్లుకు యతి చెల్లుట.
ఉదా-
సంఘ|*టించినప్పుడు యతులు రెం*డేసి యగు, ను
*పేంద్రుఁ డిచ్చు నర్థము మోపె*డేసి యనఁగ. [అనం.ఛంద. ౧.౧౨౦]

12. నామాఖండయతి (ప్రభునామయతి, ప్రభునామాంతయతి, ప్రభునామాభంగయతి) :-  అన్న, అయ్య, అమ్మ, అప్ప, ఆయి మొదలైనవి వ్యక్తినామాల చివర చేరుతాయి. కొమ్మన్న, రామయ్య, సీతమ్మ, వెంకప్ప, సీతాయి... అన్న, అమ్మ మొదలైనవాటిలోని ద్విత్వంలోని ఒక హల్లు లోపించి అన, అమ అనేవి రావచ్చును. కొమ్మన, రామయ, సీతమ. ఇటువంటి చోట్ల అచ్చుకు, హల్లుకు యతి చెల్లించవచ్చును.
ఉదా- 
*మహి నయోధ్యకు రాజు రా*మన యనంగ
*నతని పట్టపుదేవి సీ*తమ యనంగ. [అనం.ఛంద. ౧.౧౧౯]

13. చతుర్థీవిభక్తియతి :- తెలుగులో చతుర్థీవిభక్తిలో ‘కై’ (కు+ఐ) అనునది చేరినప్పుడు ఐ అనే అచ్చుకే కాక, దానితో కూడిన హల్లు(క)కు కూడా యతి చెల్లును.
ఉదా-
వేదగుప్తి|*కై జనించె నెవ్వఁ *డవ్వసుదేవనం|దను... [భారత.శాంతి. ౨.౨౩]
*క్రాంతినిఁ బాపపుణ్యముల*కై వశమౌ నది నట్లుగాన నే. [బ్రహ్మోత్తరఖండము]

14. పంచమీవిభక్తియతి :- పంచమీవిభక్తిలో ‘అన్నన్, అంటెన్’ అనునవి చేరి ‘రామునికన్నన్, రామునికంటెన్’ అని ఉన్నప్పుడు అచ్చు(అ)కే కాక, దానితో కూడిన హ ల్లు(క)కు కూడా యతి చెల్లుతుంది.
ఉదా-
*కన్నన్ దోర్వీర్య మెక్కు*డగు భార్గవులీ...
*కన్నన్ శూరుండు ముజ్జ*గంబులఁ గలఁడే. [చమత్కార రామాయణము]

15. కాకుస్వరయతి :- శోకభయాదులవల్ల కలిగే ధ్వనివికారం కాకువు. పదాంతంలోని అచ్చును ఉచ్చరించే రీతిలో ఈ భయాదులు స్ఫురిస్తాయి. ఆ అచ్చు దీర్ఘంగా ఉండి ప్లుతోచ్చారణ కలిగి ఉంటుంది. అటువంటి అచ్చుకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది. 
ఉదా-
*మేలవించినవి సు*మ్మీ దీని మెట్లని....
*ఇది జపోచితము సు*మ్మీ జతనం బని... [పారి. ౫.౮౬]

16. ప్లుతయతి :- పదాంతంలోని అచ్చుయొక్క ప్లుతోచ్చారణం వల్ల పిలుపు, రోదనం, సంశయం స్ఫురించినపుడు, ఆ ప్లుతాచ్చునకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది. 
ఉదా-
*ఆయాచోటులఁ గల్గు వింతలు మహా*త్మా నా కెఱింగింపవే. [మనుచ. ౧.౬౮]
అధి|*పా కలిగినవారు పంక్తి*పావనులు గడున్. [భారత. అను. ౩.౧౮౦]

17. ప్లుతయుగయతి (స్వరయుగయతి) :- కాకుస్వర, ప్లుత యతులకు చెందిన పదాంతాచ్చులు పరస్పరం యతి చెల్లినా, అచ్చులతో కూడిన హల్లులు పరస్పరం యతి చెల్లినా ‘ప్లుతయుగయతి’ అవుతుంది. 
ఉదా-
మాయరవి యేలఁ గ్రుంకడొ
*కో యను నిట్లేలఁ దడసె*నో యనుఁ గ్రుంకం... [భారత.విరాట. ౨.౩౧౨]

18. నఞ్‍సమాసయతి :- అనంత (న+అంత), అనేక (న+ఏక) మొదలైనవి నఞ్‍సమాసాలు. ఇటువంటి సమాసాలలో అచ్చుకు, దానితో కూడిన హల్లుకు యతి చెల్లుతుంది.
ఉదా-
వాజులుం| *డిగ్గి తొలంగు సైనికు ల*నేకులు కష్టపుపాటు చొప్పడన్. [భారత.కర్ణ. ౨.౩౫౫]
*ఆశ్రితపోషణంబున న*నంతవిలాసమునన్ మనీషి వి... [భారత.ఆది. ౧.౬]

19. ఘఞ్‍యతి :- ‘ఆలాప’ శబ్దంలోని లకారానికి, దానిమీది అచ్చుకు యతి చెల్లుతుంది.
ఉదా-
శ్రీ పరిఢవిల్ల సత్యా
*లాపవిలాసియగు కృష్ణు*నటువలె రంగ
క్ష్మాపతి శ్రీకరసత్యా
*లాపవిలాసములఁ బ్రజల *లాలనసేయున్. [రంగ.ఛంద. ౩.౨౩౩]

20. సౌభాగ్యయతి :- ఉభయయతులు చెల్లుటకు వీలైన పదాలలో ఒక పదానికి మరొక పదం యతి చెల్లడం.
ఉదా-
*ప్రాంచితామరవినుత వే*దండవరద. (ప్ర+అంచిత=ప్రాంచిత అనేది ఉపసర్గయతి ప్రకారం, వేద+అండ=వేదండ అనేది పరరూపయతి ప్రకారం ఉభయయతి చెల్లే పదాలు. ఈ రెండింటి ఉత్తరపదాద్యచ్చులకు యతి చెల్లింది).
*నాకరిపుశిక్ష శౌరి య*నంత యనఁగ.  (‘నాక’ ఆదేశయతి ప్రకారం, ‘అనంత’ నఞ్‍సమాసయతి ప్రకారం ఉభయయతి చెల్లే పదాలు. ఈ రెండింటిలో హల్లులకు యతి చెల్లింది).

ఈ. ప్రాస యతి -
యతి చెల్లించవలసిన స్థానంలో ప్రాస చెల్లించడం ‘ప్రాసయతి’.  యతిస్థానంలో ప్రాస చెల్లించినపుడు ప్రాసకు సంబంధించిన నియమాల నన్నింటిని పాటించాలి. తెలుగులో ‘ఉపజాతి’ పద్యాలలోనే ఈ ప్రాసయతి చెల్లుతుంది. (‘ప్రాసభేదాలు’ చూడండి) 
ఉదా-
*నిన్ను నెన్నడు చూతునో *కన్నులార [శివరా.మాహా. ౨.౨౬]

దత్తపది - 71 (గాలి-నీరు-నిప్పు-నేల)

కవిమిత్రులారా!
గాలి - నీరు - నిప్పు - నేల
పైపదాలను ఉపయోగిస్తూ ఆకాశాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్య రచన - 858

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“ఆకాశ రామన్న”

23, మార్చి 2015, సోమవారం

యతిభేదాలు - 2

ఆ. వ్యంజన యతులు:- 
1. ప్రాణియతి :- అచ్చులను ప్రాణాలంటారు. అచ్చులతో కలిసి ఉండే హల్లులను ప్రాణులు అంటారు.  హల్లుతో పాటు దాని మీది అచ్చుకు  కూడా  (స్వరయతుల ప్రకారం) యతిమైత్రి పాటించాలి.
ఉదా-
i) క-కా-కై-కౌ; ii) కి-కీ-కృ-కౄ-కె-కే; iii) కు-కూ-కొ-కో.

2. సంయుక్తాక్షరయతి :- ఒకటికంటె ఎక్కువ హల్లులు కల అక్షరం సంయుక్తాక్షరం. అటువంటి సంయుక్తాక్షరం పాదం మొదటి అక్షరంగా కాని, యతిస్థానంలో కాని ఉంటే అందులో ఏదో ఒక హల్లుకు మైత్రిని పాటించవచ్చు. 
ఉదా-
*స్మరసన్నిభ సుభగమూర్తి *మల్లియరేచా [కవిజనా. ౧.౭౧]
*స్మరజనకా వాసుదేవ *సజ్జనవినుతా.
*శివ భవ కరుణాలవాల *శ్రీకంఠ హరా.
*రేబవలున్ గొలుతు నిన్ను *శ్రీకంఠ హరా.

3. వర్గయతి :- క,చ,ట,త,ప వర్గా లైదు. ఒక్కొక్క వర్గంలో మొదటి నాలుగు అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. i) క-ఖ-గ-ఘ; ii) చ-ఛ-జ-ఝ; iii) ట-ఠ-డ-ఢ; iv) త-థ-ద-ధ; v) ప-ఫ-బ-భ.

4. బిందుయతి (అనుస్వారయతి) :- బిందువు అంటే అనుస్వారం (సున్న). ప్రతివర్గంలో మొదటి నాలుగు అక్షారాలు బిందుపూర్వకాలైనపుడు ఆయా వర్గాల పంచమ (అనునాసిక) అక్షరాలతో యతి చెల్లుతుంది. i) ంక,ంఖ,ంగ,ంఘ - ఙ; ii) ంచ,ంఛ,ంజ,ంఝ - ఞ; iii) ంట,ంఠ,ండ,ంఢ - ణ; iv) ంత,ంథ,ంద,ంధ - న; v) ంప,ంఫ,ంబ,ంభ - మ.
ఉదా-
*ఙాకు వడి చెల్లు రత్నకం*కణ మనంగ
*ఞాకు వడి చెల్లు బర్హిపిం*ఛం బనంగ
*ణాకు వడి చెల్లుఁ గనకమం*డప మనంగ
*నాకు వడి చెల్లు దివ్యగం*ధం బనంగ
*మాకు వడి చెల్లు విజితశం*బరుఁ డనంగ. [కవిజనా. ౬౯]

5. అనుస్వార సంబంధయతి :- బిందుపూర్వకాలైన టవర్గ, తవర్గాల మొదటి నాలు గక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. ంట,ంఠ,ండ,ంఢ - ంత,ంథ,ంద,ంధ. 
ఉదా- 
*దాలం బండు నొకప్పుడుం దరుగ దిం*టం బాడియున్ బంటయున్. [మనచ. ౧.౫౫]

6. అనునాసికాక్షర యతి :- బిందుపూర్వకాలైన టవర్గలోని మొదటి నాలు గక్షరాలు నకారంతోను, బిందుపూర్వకాలైన తవర్గలోని మొదటి నాలు గక్షరాలు ణకారంతోను యతి చెల్లుతాయి. ంట,ంఠ,ండ,ంఢ - న; ంత,ంథ,ంద,ంధ - ణ.
ఉదా-
భం|*డన నిర్జిత కార్తవీర్య *నరనాయక ఖం...
నం|*దన చందన చక్రవార*ణల సత్కీర్తీ [అప్పక. ౩.౬౩]

7. తద్భవ వ్యాజయతి (జ్ఞాయతి, ప్రాకృతాదేశయతి) :- ‘జ్ఞ’కారం తద్భవాలలో ‘న’కారంగా మారుతుంది. (ఆజ్ఞ-ఆన). ఈ వ్యాజంతో జ్ఞ - న లకు యతి చెల్లుతుంది.  సరసయతి ‘న-ణ’ల యతిని చెప్పినందున జ్ఞ-న-ణ లకు యతి చెల్లుతుంది.
ఉదా-
*జ్ఞాని చేతోంబుజాత శో*కర యనంగ
*జ్ఞాతివిద్వేషి నృపనాశ*నకర యనంగ. [అప్పక. ౩.౫౪.]

8. విశేషయతి :- ‘జ్ఞ’తో  క, ఖ, గ, ఘ లకు యతి చెల్లడం. దీనిని అప్పకవి యొక్కడే చెప్పినాడు.
ఉదా-
*జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం... [భారత.శాం. ౪.౨౫౫]
*కర్మ మధర్మ మ*జ్ఞాన మాగడము [పండితా.పురాతన. ౨౮౪ పు.]
*జ్ఞానేంద్రియజ్ఞాన*కళ లౌరుసౌరుగా [కాశీ. ౧.౧౩౯]

9. మువిభక్తియతి (పోలికయతి) :- ప్రథమావిభక్తి ప్రత్యయమైన ‘ము’కారానికి, ఉత్వ ఓత్వాలతో కూడిన ప,ఫ,బ,భ లకు యతి చెల్లుతుంది. (వన‘ము’-పు-ఫూ-బొ-భో మొ.)
ఉదా-
*బుట్టిన సదసద్వివేక*ములు గలిగిన దా [భారత.ఆది. ౫.౫౮]
భూనుత ధాన్యంబు బీజ*ములు వణిజులకున్ [భారత.సభా. ౧.౪౪] 

10. ముకారయతి (చక్కటియతి) :- ప్రథమావిభక్తి ప్రత్యయం కానట్టి ‘ము’ వర్ణంతో ఉత్వ ఓత్వాలతో కూడిన ప,ఫ,బ,భ లకు యతి చెల్లుతుంది. (తో‘ము’-పు,ఫూ,బొ,భో)
ఉదా-
*పొడఁగాంచి తాను త*మ్ములు నెదురేగి [గౌరన హరిశ్చం. ౭౩ పం.]
*ముందు మీ రెఱిఁగిన *భూతలాధీశు [గౌరన హరిశ్చం. ౮౫ పం.]

11. మవర్ణయతి :- బిందుపూర్వకాలైన అంతఃస్థాలు (య,ర,ల,వ లు), ఊష్మాలు (శ,ష,స,హ లు) మకారంతో యతి చెల్లుతుంది.
ఉదా-
*మర్దితదైత్యసం*యమిమనోబ్జాదిత్య
*మహితమేఘాభ సం*రక్షితేశ
*మాయాప్రవర్తి సం*లబ్ధనిర్మలకీర్తి
*మణిహార సురవశం*వదవిహార
*మందరధైర్య వం*శ నినాద చాతుర్య
*మా భూప యువతి పుం*షండరూప
*మంజులస్వాంత కం*స ధరావరకృతాంత
*స్మరహరారాధ్య సిం*హనిభమధ్య.... [అప్పక. ౩.౭౬]

12. ఋజుయతి :- య, హ లకు యతి చెల్లుతుంది. (చూ. సరసయతి)
ఉదా-
*హాయను ధర్మరాజతన*యా యను నన్నెడఁ బాయనీకు... [భార.ద్రోణ. ౨.౨౪౨] 

13. ప్రత్యేకయతి :- ‘అది’ అనేది చేరినప్పుడు సంధి వికల్పము. చేతి+అది = చేతిది అని సంధి జరిగినప్పుడు ‘తి’కారానికి, చేతి+అది= చేతి యది అని సంధి జరుగనప్పుడు ఆగమ యకారానికి సంధి చెల్లుతుంది.
ఉదా-
*అరయ శార్ఙ్గంబు హరి చేతి*యది యనంగ
*దివ్యచాపంబు శూలి చే*తిది యనంగ. [అప్పక. ౩.౮౦]

14. భిన్నయతి :- ‘ధరించు, ధరియించు’ మొదలైన ఉభయరూపాలలో మొదటి రూపానికి ‘రి’, రెండవరూపానికి ‘యి’ యతిమైత్రి చెల్లించాలి.
ఉదా-
*ఎత్తిన నెత్తనిమ్ము వచి*యించెదఁ గల్గినమాట గట్టిగా [విజయ. ౩.౧౫]
*చిత్తజాంతకుఁడు వ*చించె నిట్లు.

15. ఎక్కటియతి (ఏకతరయతి) :- ‘మ-ర-ఱ-ల-వ’ ఈ ఐదింటిలో ఏ అక్షరాని కా అక్షరమే యతి చెల్లుతుంది. (మకారం బిందుపూర్వకాలైన పవర్గంలోని మొదటి నాలు గక్షరాలకు, ల-ళ లకు, పఫబభ లకు వకారంతో చెల్లుతాయి) ర-ల యతిని అధికులు అంగీకరించలేదు. ర-ఱ యతిని ఎవరూ ఒప్పుకొనలేదు. 
ఉదా-
*రార బాలకృష్ణ *రచ్చల గుమిఁగూడి
*ఱాఁగ యనుచు నిన్ను ఱవ్వఁబెట్టు. [అప్పక. ౩.౯౫]

16. అభేదయతి :- i) వ-బ; ii) ల-డ; iii) ల-ళ; iv) ళ-డ. పై నాలుగు వర్గాలలో ఆయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. v) ర-ల; vi) ఱ-ల; vii) ద-డ లకు కూడా యతి చెల్లుతుందని కూచిమంచి వెంకటరాయడు చెప్పినాడు.
ఉదా- 
*వసుమతీకళత్ర *బకజైత్ర గానక
*లాలసత్కలాప *డంభగోప
*లలితదేహ పింగ*ళపుర దక్షిణగేహ... [అప్పక. ౩.౮౮]
*డే కదలక జలధిఁ బవ్వ*ళించె ననఁగ. [అనం.ఛంద. ౧.౯౫]
*లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రే [కాశీ. ౬.౨౧౦.]
*దంతునే కాలదం*డమున నభవ. [కాశీ. ౭.౮౦]

17. అభేదవర్గ యతి :- ‘వబయోరభేదః’ అని చెప్పబడటం వల్ల వకారానికి బకారంతోను, బకారమైత్రి వల్ల ప,ఫ,భ లకు యతి చెల్లుతుంది. 
ఉదా-
*వనజనయన భక్త*పారిజాత
*వాసవాది వినుత *ఫాలనేత్ర
*వచ్చె రాజు భటులు బరా*బరి యొనర్ప
*వందితాఖిలమునిగణ *భక్తపాల.

18. ఊష్మయతి :- ‘శ,ష,స’ ఊష్మాలలోని మొదటి మూడక్షరాలు. వీటికి పరస్పరం యతి చెల్లుతుంది. నాల్గవదైన ‘హ’కు ఋజుయతి ప్రకారం యకారంతో యతి చెల్లింది.
ఉదా-
*శతమఘోపల భూషాను*షంగ యనఁగ
*షడ్జయుత వేణునాద ప్ర*సంగ యనఁగ. [అప్పక. ౩.౧౦౪]

19. సరసయతి :- i) అ-ఆ-ఐ-ఔ-య-హ; ii) చ-ఛ-జ-ఝ-శ-ష-స; iii) న-ణ; ఈ మూడు వర్గాలలో అయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతుంది.
ఉదా-
i) *అంబుజాక్ష కంస*హర పార్థసారథి
*యాదవకులభూష *హరి ముకుంద.
ii) *శకటదానవసంహార *చక్రధారి
*షట్పద శ్యామమూర్తి స్వే*చ్ఛాప్రవర్తి
స్వర్ణపట పరిధాయి భు*జంగశాయి. [అప్పక. ౩.౧౦౬]
iii) *నరక దైత్యవిరోధి ఘృ*ణాపయోధి. [అప్పక. ౩.౧౦౭] 

20. అంత్యోష్మసంధియతి :-  సంధిలో పొల్లులైన క చ ట త ప లకు హకారం పరమైనపుడు ఆ హకారానికి ఆయా వర్గాల చతుర్థాక్షరాలు వికల్పంగా ఆదేశ మౌతాయి.  వాక్+హరి = వాగ్ఘరి, వాగ్హరి.   'గ్ఘ' కు  క, హ లతో యతిమైత్రి. 
ఉదా-
*కైరవకామ దు*గ్ఘరవాహ కవికుంద
హైరణ్యగర్భ వా*గ్ఘరి సబృంద. [అప్పక. ౩.౧౧౫]

21. వికల్పయతి :- వికల్పసంధి జరిగినపుడు పూర్వ పదాంతవర్ణానికి కాని, ఆదేశవర్ణానికి కాని యతి చెల్లించవచ్చు.  సత్+మతి = సన్మతి లో 'న్మ' కు త,న,మ లతో యతిమైత్రి. 
ఉదా- 
*నందసుకుమార గూఢపా*న్మదవిహార
*దళిత శిశుపాల గోత్రభి*న్మణి వినీల
*నాగపర్యంకశాయి స*న్మార్గయాయి
*ధాతృనుతనామ యోగిహృ*న్మధ్యధామ. [అప్పక. ౩.౧౧౭]

(ఉభయయతులు రేపు)....

యతిభేదాలు - 1

యతి భేదాలు
అ) స్వరయతులు, ఆ) వ్యంజన యతులు, ఇ) ఉభయ యతులు, ఈ) ప్రాస యతి.

అ) స్వర యతులు - స్వరం అంటే అచ్చు. అచ్చులయొక్క మైత్రిని చెప్పడం వల్ల ఇవి స్వరయతులు.

1. స్వరప్రధానయతి:- పదాలమధ్య సంధి జరిగినపుడు రెండవపదం మొదటిఅచ్చుకే యతి చెల్లించాలి. 
(ఉభయయతులలో ఈ నియమం చెల్లదు).
ఉదా-
*అతులవిక్రముఁ డతఁడు వి*ద్యాధికుండు (విద్యా +*అధికుండు)

2. స్వరయతి :- i) అ-ఆ-ఐ-ఔ; ii) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ; iii) ఉ-ఊ-ఒ-ఓ. ఈ మూడు వర్గాలలో ఆయా వర్గాలలోని 
అచ్చులతో పరస్పరం యతి చెల్లడం.
అప్పకవి ఉదా-
i) *అబ్జపత్రనేత్ర *ఆర్తావనచరిత్ర
    *ఆతతాయిజైత్ర *ఐంద్రమిత్ర
    *ఐందవప్రగోత్ర *ఔర్వశేయస్తోత్ర.
ii) *ఇందువంశసోమ *ఈశ్వరీనుతనామ
     *ఈడితాంగధామ *ఋషభభీమ
     *ఋక్షజాభిరామ *ఎటులైన మాభామ
     *ఎడఁ గటాక్ష ముంచి *ఏలు మనఁగ.
iii) *ఉరగరాజశాయి *ఊర్ధ్వవిష్టపదాయి
       *ఊర్జితోరుకీర్తి *ఒడలికార్తి
       * ఒడవకుండఁ బ్రోచి *ఓలి దాసునిఁ గాంచి.

౩. గూఢస్వరయతి:- అన్యోన్య, పరోక్ష మొదలైన పదాలలో గూఢంగా ఉన్న పరపదం మొదటి అకారానికి మాత్రమే యతి చెల్లడం.
ఉదా- అ|*న్యోన్యవిరుద్ధభాషణము *లాడినఁ దత్ఫల మాతఁ డందెడున్. (అన్య+*అన్య... భాషణములు+*ఆడిన) [భారత.ఉద్యోగ. ౧.౩౨]

4. లుప్తవిసర్గకస్వరయతి :- దాసః+అహం, తమః+అర్క మొదలైన చోట్ల అకారం తరువాతి విసర్గకు అకారం పరమైనపుడు విసర్గ, దాని ముందువెనుకల అకారాల స్థానంలో ఓకారం ఆదేశమై దాసోహమ్, తమోర్క అవుతుంది. ఇక్కడ ఉత్తరపాదాది అకారానికే యతి చెల్లుతుంది. 
ఉదా-
*అపరిమితానురాగసుమ*నోలసమై చిగురాకు జేతులం (*అపరిమిత.... సుమనః+*అలసమై) [మనుచ. ౩.౨౭]
తే|*జోऽసహ్యున్ శరజన్ముఁ గాంచి యల నీ*హారక్షమాభృత్కుమా (తేజః+*అసహ్యున్... నీ*హార...) [విజయ. ౧.౧౧౪]

5. ఋయతి:- ఇ,ఈ.ఎ.ఏ లతో కూడిన రేఫ(రి,రీ,రె,రే)లకు ఋకారంతో యతి చెల్ల్లుతుంది. దీనినే ‘రియతి’ అనికూడ అంటారు.
ఉదా-
*ఋత్విజుండని విచా*రించి పూజించితే... [భారత.ఆది. ౨.౧౧]

6. ఋత్వసంబంధయతి:-  ఒక హల్లుతో కూడిన ఋకారానికి (కృ, తృ, పృ మొ.) ఇ,ఈ,ఎ.ఏ,ఋ,ౠలు ఈ అచ్చులతో కూడిన య,హలకు యతి చెల్లుతుంది. (కృ- ఇ,ఈ.ఎ.ఏ,ఋ,ౠ,హి,హె,హృ,యి,యె మొ.).
అప్పకవి ఉదా-
*ఇనతనూభవుండు *పృషదశ్వసుతు నేసె
*ఋభునదీసుతుండు *కృష్ణు నేసె
*ఏమిసెప్ప నపుడు *దృఢశక్తి శల్యుండు
*హీనబలునిఁ జేసె *వృష్ణికులుని. 

7. ఋత్వసామ్యయతి:- ఋకారంతో కూడిన భిన్నహల్లులు పరస్పరం యతి చెల్లడం. 
ఉదా-
*మృతుని గావించెఁ గంసునిఁ *గృష్ణుఁ డనఁగ. [అప్పక. ౩.౩౪]
*గృహసమ్మార్జనమో జలాహరణమో *శృంగారపల్యంకికా [ఆముక్త. ౨.౯౧]

8. వృద్ధియతి:-  వృద్ధిసంధిలో ఆదేశంగా వచ్చిన అచ్చుకు యతి చెల్లడం.  ఏక+ఏక=ఏకైక... ఇందు స్వరప్రధాన యతివల్ల ఏకారానికి యతి చెల్లుతుంది. ఆదేశంగా వచ్చిన ఐకారానికి కూడ యతి చెల్లడం వృద్ధియతి.
ఉదా-
*ఇభభయవిదార సర్వలో*కైకవీర
అఖిలభువనప్రశస్త జి*తైణహస్త
ఉదధిజాశ్రితపక్ష భ*క్తౌఘరక్ష
హతపరానీక నందప్ర*జౌక యనఁగ [అప్పక. ౩.౩౮]

9. ఌకారయతి:- ఌకారానికి ‘ళి’తో యతి చెల్లుతుంది. ఌకారానికి ప్రత్యేకస్థితి లేనందున ఇది ఏదో ఒక హల్లును ఆశ్రయించి ఉంటుంది.    
ఉదా-
*కౢప్తి లేదు శౌరి గుణావ*ళికి ననంగ. [అనం.ఛంద. ౧.౮౯]

(వ్యంజన యతులు .... తరువాత...)

సమస్యా పూరణము - 1630 (తేటగీతి యయ్యె నాటవెలఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తేటగీతి యయ్యె నాటవెలఁది.

పద్య రచన - 857 (మేధావు లనఁగా నెవరు?)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“మేధావు లనఁగా నెవరు?”

22, మార్చి 2015, ఆదివారం

కవిసమ్మేళనంలో నా కవిత (వీడియో)

మొన్న హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ నగర్‍లో జరిగిన కవిసమ్మేళనంలో నా కవితాగానం. 
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో)


సమస్యా పూరణము - 1629 (దశకంఠున్ దునుమాడె నర్జునుఁ డనిన్ దారాశశాంకమ్మునన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దశకంఠున్ దునుమాడె నర్జునుఁ డనిన్ దారాశశాంకమ్మునన్.

పద్య రచన - 856 (క్రొత్త రాష్ట్రము - క్రొత్త సంవత్సరము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“క్రొత్త రాష్ట్రము - క్రొత్త సంవత్సరము”

21, మార్చి 2015, శనివారం

కవిసమ్మేళనం చిత్రాలు...

హదరాబాద్, మియాపూర్‍లో 20-3-2015 నాడు జరిగిన 
కవిసమ్మేళనం చిత్రాలు...
సభకు నన్ను పరిచయం చేస్తున్న 
‘ఆంధ్రామృతం’ చింతా రామకృష్ణారావు గారు.

నాకు జరిగిన సన్మానం.

సభలో చింతా రామకృష్ణారావు గారు, చంద్రమౌళి సూర్యనారాయణ గారు, 
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ తదితర మిత్రులతో... 
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు.  ఫోటోలు తీసిందే వారు!)

సమస్యా పూరణము - 1628 (కరిముఖుని జన్మదినమె యుగాది గాదె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కరిముఖుని జన్మదినమె యుగాది గాదె.

పద్య రచన - 855


కవిమిత్రులకు మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు!
నేటి పద్యరచనకు అంశం...
“ఉగాది”

20, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1627 (కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కవిసమ్మేళన మనంగఁ గడు భయ మగురా.

పద్యరచన - 854

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“వీడ్కోలు”

19, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణం - 1626 (జయనామాబ్దమున జయము సాధించితివా?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జయనామాబ్దమున జయము సాధించితివా?

పద్యరచన - 853

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, మార్చి 2015, బుధవారం

ఆహ్వానం (కరీంనగర్‍లో కవిసమ్మేళనం)


సమస్యా పూరణం - 1625 (భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భామను వేధింపఁ దగును పదుగురు మెచ్చన్. 
ఈ సమస్యను పంపిన పిరాట్ల వేంకట శివరామకృష్ఝ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 852

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(ఈ చిత్రాన్ని పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు)

17, మార్చి 2015, మంగళవారం

ఆహ్వానం!


పద్యరచన - 851

కవిమిత్రులారా,
అవధాని రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి మృతికి 
శంకరాభరణం బ్లాగు ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నది.

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యా పూరణం - 1624 (ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఆరోగ్యమె భాగ్య మనెద రజ్ఞుల్ మూర్ఖుల్.

16, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1623 (తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తీగలులేనట్టి వీణ తీయగ మ్రోగెన్.
(అవధాని డా. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

పద్యరచన - 850

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, మార్చి 2015, ఆదివారం

దత్తపది - 70 (కాకి-జాజి-పాపి-వావి)

కవిమిత్రులారా!
కాకి - జాజి - పాపి - వావి.
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 849

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, మార్చి 2015, శనివారం

సమస్యా పూరణం - 1622 (రమ్ము జనులకు శరణమ్ము గాదె!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రమ్ము జనులకు శరణమ్ము గాదె!
(గరికిపాటివారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

పద్యరచన - 848

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1621 (గానము సేయంగ నొప్పు గాడిదల కడన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గానము సేయంగ నొప్పు గాడిదల కడన్.
(గరికిపాటి వారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

పద్యరచన - 847

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణం - 1620 (కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కన్యాదానఫలమ్ముగా నరకమే కల్గున్ గదా దాతకున్.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 846

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1619 (కర్ణహస్తాభరణ మయ్యె గాండివమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కర్ణహస్తాభరణ మయ్యె గాండివమ్ము.

పద్యరచన - 845

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1618 (అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అయినను పోయి రావలెను హస్తినకున్ నిధు లివ్వఁ గోరుచున్.

పద్యరచన - 844

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1617 (అమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమవసనాఁడె పున్నమి యటంచును బల్కిరి శాస్త్రకోవిదుల్.
ఈ సమస్యను పంపిన పిరాట్ల శివరామకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 843

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(వ్యంగ్యచిత్రకారులు రంగాచారి గారికి ధన్యవాదాలతో)

8, మార్చి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1616 (వంకాయను చెఱకురసము వడియుచునుండెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వంకాయను చెఱకురసము వడియుచునుండెన్.
(‘కవిజనోజ్జీవని’ గ్రంథంనుండి)

పద్యరచన - 842

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7, మార్చి 2015, శనివారం

సమస్యా పూరణం - 1615 (అమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమ్మా యని పిలిచినంత నాగ్రహమందెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 841

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

6, మార్చి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1614 (స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
స్త్రీలోలుఁడె సజ్జనుఁడని చెప్పెదరు బుధుల్. 

పద్యరచన - 840

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణం - 1613 (గట్రాచూలికి తనయుఁడు కాముండు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గట్రాచూలికి తనయుఁడు కాముండు గదా.

పద్యరచన - 839

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1612 (మాట లన్ని నీటిమూట లయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మాట లన్ని నీటిమూట లయ్యె.
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 838

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1611 (హరిని పూజింత్రు నాస్తికు లనవరతము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరిని పూజింత్రు నాస్తికు లనవరతము.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 837

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, మార్చి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1610 (అక్కఱకు రావు నీతివాక్యములు మనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అక్కఱకు రావు నీతివాక్యములు మనకు.

పద్యరచన - 836

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, మార్చి 2015, ఆదివారం

దత్తపది - 69 (కసి-పసి-మసి-రసి)

కవిమిత్రులారా!
కసి - పసి - మసి - రసి
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 835

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.