31, మే 2017, బుధవారం

సమస్య - 2374 (దోషమే కాదు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దోషమే కాదు చేయుట దొంగతనము" 
(లేదా...) 
"దొంగతనమ్ము సేయుటయు దోషముగా దది పుణ్యకార్యమే"
ఈ సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

30, మే 2017, మంగళవారం

సమస్య - 2373 (కోపాగ్నులు గురిసినంత...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోపాగ్నులు గురిసినంతఁ గూరిమి హెచ్చెన్"
(లేదా...)
"కోపపు టగ్నులే కురియఁ గూరిమి హెచ్చె నదేమి చిత్రమో"
ఈ సమస్యను పంపిన శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలు.

29, మే 2017, సోమవారం

దత్తపది - 114 (కాంత-నారి-మగువ-వనిత)

కాంత - నారి - మగువ - వనిత
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మర్యాదా పురుషోత్తముడైన రాముని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

28, మే 2017, ఆదివారం

సమస్య - 2372 (అమ్మ నమస్కరించినది...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు" 
(లేదా...) 
"అమ్మ నమస్కరించినది యాత్మతనూజకు భక్తియుక్తులన్"
ఈ సమస్యను పంపిన గొరిగె వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. 

27, మే 2017, శనివారం

సమస్య - 2371 (మండుటెండలోఁ గురిసెను...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు"
(లేదా...)
"మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్"
ఈ సమస్యను పంపిన శిష్ట్లా శర్మ గారికి ధన్యవాదాలు.

26, మే 2017, శుక్రవారం

సమస్య - 2370 (రతిపతి మన్మథుఁడు గాఁడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రతిపతి  మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్"
(లేదా...)
"రతిపతి మారుఁ డెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్"
ఈ (ఆకాశవాణి వారి) సమస్యను పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

25, మే 2017, గురువారం

సమస్య - 2369 (ముని సాంగత్యమున...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్"
(లేదా...)
"ముని సహవాసమంది సతి పొందె ముదంబున పుత్రు లిద్దఱన్"
ఈ సమస్యను సూచించిన 'కవితశ్రీ' శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు.

24, మే 2017, బుధవారం

సమస్య - 2368 (నేరమగుఁ జేయ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నేరమగుఁ జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము"
(లేదా...)
"ఘన దోషమ్మగుఁ గీ డొసంగు సతికిన్ గాత్యాయనీ పూజలే"

23, మే 2017, మంగళవారం

సమస్య - 2367 (శ్రీరామునిఁ గని యహల్య...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్" 
(లేదా...) 
"రామునిఁ గన్నులారఁ గని రాయిగ మారె నహల్య చిత్రమే"
(శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారికి ధన్యవాదాలతో...)

22, మే 2017, సోమవారం

సమస్య - 2366 (కలికి కౌగిలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలికి కౌగిలి ప్రాణాంతకారి గాదె" 
(లేదా...) 
"కలికి కవుంగిలింత కనఁగా నుసురుల్ గొను నట్టిదే కదా"
ఈ సమస్యను పంపిన చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలు.

21, మే 2017, ఆదివారం

దత్తపది - 113 (కోపము - తాపము - పాపము - శాపము)

కోపము - తాపము - పాపము - శాపము
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(దత్త పదాలను అన్యార్థంలో ప్రయోగించాలన్న నియమం లేదు)

20, మే 2017, శనివారం

సమస్య - 2365 (మండు వేసవిలోఁ జలి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మండు వేసవిలోఁ జలి మెండు సుమ్ము"
(లేదా...)
"వేసవి కాలమంందు చలి వెక్కసమై వడకించు నెల్లరన్"

19, మే 2017, శుక్రవారం

సమస్య - 2364 (ధ్యాన మొనరించ...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధ్యాన మొనరించ మిగుల నజ్ఞాన మొదవు"
(లేదా...)
"ధ్యాన మొనర్చుటే మిగుల నజ్ఞతగా గణియింత్రు సజ్జనుల్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు రామమోహన రావు గారికి ధన్యవాదాలు.

18, మే 2017, గురువారం

సమస్య - 2363 (కనఁగ గతజల...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కనఁగ గతజల సేతుబంధనమె మేలు"
(లేదా...)
"గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్"

17, మే 2017, బుధవారం

సమస్య - 2362 (గాడిదపై నెక్కి హరుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"గాడిదపై నెక్కి హరుఁడు కంసునిఁ జంపెన్"
(లేదా...)
"గాడిద నెక్కి శంకరుఁడు కంసునిఁ జంపె దయావిహీనుఁడై"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

16, మే 2017, మంగళవారం

న్యస్తాక్షరి - 42 (ప్ర-భా-త-ము)

అంశము- సూర్యోదయ వర్ణనము.
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా ప్ర - భా - త - ము ఉండాలి.

15, మే 2017, సోమవారం

సమస్య - 2361 (కనులు వేయి గలిగి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కనులు వేయి గలిగి కాంచలేఁడు" 
(లేదా...)
*కన్నులు వేయి గల్గినను గాంచఁగలేఁడు గదా ప్రకాశమున్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు. 

14, మే 2017, ఆదివారం

సమస్య - 2360 (పోయిన దేదియును దిరిగి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పోయిన దేదియును దిరిగి పొందగ వశమే"
(లేదా...)
"పోయిన దేదియున్ దిరిగి పొందగ నెవ్వరికైన సాధ్యమే"

13, మే 2017, శనివారం

సమస్య - 2359 (చీమలఁ గొల్చిననె కలుగు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చీమలఁ గొల్చిననె కలుగు శ్రీభాగ్యమ్ముల్"
(లేదా...)
"చీమల గొల్చినన్ సతము జేకుఱులే ఘన భోగభాగ్యముల్."
(ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు)

12, మే 2017, శుక్రవారం

దత్తపది - 112 (కమ్-సిట్-గో-రన్)

కమ్ - సిట్ - గో - రన్
(లోకము - ఈసిటుల (ఈసు+ఇటుల) - గోవు - కోరను... ఈ విధంగా)
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు. వ్రాసి+ఇటుల = 'వ్రాసి యిటుల' అవుతుంది. 'వ్రాసిటుల' అని సంధి చేయరాదు)

11, మే 2017, గురువారం

సమస్య - 2358 (సారంగధరుండు వలచె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సారంగధరుండు వలచె సతి చిత్రాంగిన్"
(లేదా...)
"అదె సారంగధరుండు దా వలచెఁ జిత్రాంగిన్ మనోజార్తుఁడై"

10, మే 2017, బుధవారం

సమస్య - 2357 (ముద్దిమ్మనె జానకి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ముద్దిమ్మనె జానకి దశముఖునిన్ బ్రీతిన్"
(లేదా...)
"ముద్దిమ్మంచు ధరాతనూజ యడిగెన్ మోహమ్మునన్ రావణున్"

9, మే 2017, మంగళవారం

నిషిద్ధాక్షరి - 36

కవిమిత్రులారా,
అంశం - వానరుల సహాయముతో రాముడు వారధిని నిర్మించుట.
నిషిద్ధాక్షరములు - ఓష్ఠ్యములు (ప-ఫ-బ-భ-మ)
ఛందస్సు - మీ ఇష్టము.

8, మే 2017, సోమవారం

సమస్య - 2356 (సుగుణాకర! పట్టపగలె...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సుగుణాకర! పట్టపగలె చుక్కలఁ గనుమా"
(లేదా...)
"సుగుణనిధీ కనుంగొనుము చుక్కలనే నడిప్రొద్దు జామునన్"
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

7, మే 2017, ఆదివారం

సమస్య - 2355 (భరతుని రాఘవుఁడు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భరతుని రాఘవుఁడు దునిమె భామిని కొఱకై"
(లేదా...)
"భరతునిఁ జంపె రాఘవుఁడు భామినికై సురలెల్ల మెచ్చఁగన్"
(వైద్యం వేంకటేశ్వరాచార్యులకు ధన్యవాదాలతో...)

6, మే 2017, శనివారం

సమస్య - 2354 (పురుషుని గళమందు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పురుషుని గళమందు చాన పుస్తెను గట్టెన్"
(లేదా...)
"పురుషుని కంఠమం దపుడు పుస్తెను గట్టెను చాన వేడ్కతో"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

5, మే 2017, శుక్రవారం

సమస్య - 2353 (డాండడ డాండాం....)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"డాండడ డాండాం డడాండ డా మ్మనె వీణెల్"
(లేదా...)
"డడ డండం డడ డాండ డాండ డడడం డండ మ్మనెన్ వీణియల్"

4, మే 2017, గురువారం

న్యస్తాక్షరి - 41 (తి-రు-మ-ల)

అంశము- శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ రూప వర్ణనము.
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలఁది.
నాలుగు పాదాల 'చివరి' అక్షరాలు వరుసగా తి - రు - మ - ల ఉండాలి.

3, మే 2017, బుధవారం

సమస్య - 2352 (నడక హానికారకము...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నడక హానికారకము మానవుల కెపుడు"
(లేదా...)
"నడచుట హానికారక మనాగరకం బగు మానవాళికిన్"
ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

2, మే 2017, మంగళవారం

సమస్య - 2351 (కారమ్మును మించి తీపి...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కారమ్మును మించి తీపి కలదే పుడమిన్"
(లేదా...)
"కారము కంటె తీయనిది కల్గునె లోకమునందు చూడగన్"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

1, మే 2017, సోమవారం

దత్తపది - 111 (నేల-నీరు-అగ్గి-గాలి)

నేల - నీరు - అగ్గి - గాలి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.