28, ఫిబ్రవరి 2015, శనివారం

చమత్కార పద్యాలు - 213

‘హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే’ 
ఇది మొన్న (26-2-2015 నాడు) ఇచ్చిన సమస్య.

దీనికి ‘ఊకదంపుడు’ రామకృష్ణ గారి పూరణ.....
వరరామాయణకావ్యకారణము గువ్వన్జంపుటౌనందురే
ధరణిన్ బాండవపత్నిబాధకు నిమిత్తమ్మౌనుగా జూదమే 
అరవిందాక్షుని లీల చౌర్యమగుచో నాలింప నాగాధలన్
హరియించున్ ఘన పాతకమ్ములను హత్యాద్యూత చౌర్యమ్ములే.

నా (కంది శంకరయ్య) పూరణ.....
సురవైరిన్ దశకంఠుఁ జంపెనఁట సుశ్లోకుండు రాముండు, చి
చ్చు రగిల్చెన్ గద ద్యూత మా భరతవంశ్యుల్ పోరు సేయంగ, మో
హ రహస్యమ్ములఁ దెల్పె గోపికల దేహభ్రాంతిఁ బోఁద్రోచి శ్రీ
హరియే చీరల దొంగిలించె, కథ లత్యంతమ్ము శ్రావ్యంబులై
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే.

పై రెండు పూరణలకు క్రింది సంస్కృత చాటుశ్లోకం ఆధారం.
ప్రాతర్ద్యూత ప్రసంగేన 
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన 
కాలో గచ్ఛతి ధీమతామ్ ॥
(బుద్ధిమంతులు ఉదయం ద్యూతప్రసంగంతో, మధ్యాహ్నం స్త్రీప్రసంగంతో, రాత్రి చోరప్రసంగంతో కాలం గడుపుతారు. అనగా ద్రూతప్రసంగం ఉన్న మహాభారతాన్ని, స్త్రీప్రసంగంతో ఉన్న రామాయణాన్ని, వెన్నదొంగ ప్రసంగంతో ఉన్న భాగవతాన్ని పఠిస్తారు అని భావం.)

దీనికి నా తెనుఁగుసేత...
ఉదయము ద్యూతాసక్తిని
పదపడి మధ్యాహ్నమందు భామాసక్తిన్
తుది రాత్రిఁ చౌర్యకృత్యం
బిదె కాలము గడిపెడి విధమే యగును బుధుల్. (అనువాదం  అంత తృప్తికరంగా లేదు)

శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారికి, శ్రీ డా. విష్ణునందన్ గారికి ధన్యవాదాలతో....

సమస్యా పూరణం - 1609 (మల మది రంజింపఁజేయు మన మనములనే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల మది రంజింపఁజేయు మన మనములనే.

పద్యరచన - 834

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1608 (టీవీ లుండెనట మునికుటీరములందున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
టీవీ లుండెనట మునికుటీరములందున్.
(ఆకాశవాణి వారి సమస్య ఆధారంగా) 

పద్యరచన - 833

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
 వ్యంగ్యచిత్రకారులు వి. రామకృష్ణ గారికి ధన్యవాదాలతో...

26, ఫిబ్రవరి 2015, గురువారం

సమస్యా పూరణం - 1607 (హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరియించున్ ఘనపాతకమ్ములను హత్యాద్యూతచౌర్యమ్ములే.

పద్యరచన - 832 (గళ్ళనుడికట్టు)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1606 (కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కర్ణునకుఁ దల్లి గాంధారిగా నెఱుఁగుము.

పద్యరచన - 831 (ఆధ్యాత్మిక ప్రవచనములు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“ఆధ్యాత్మిక ప్రవచనములు”

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1605 (మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా!)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మదిరాపానమ్ము ముక్తిమార్గమ్ము గదా!

పద్యరచన - 830 (క్రికెట్టు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“క్రికెట్టు”

23, ఫిబ్రవరి 2015, సోమవారం

న్యస్తాక్షరి - 27

అంశం- ధర్మరాజు. 
ఛందస్సు- ఆటవెలది.
నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘ధ - ర్మ - రా - జు’ ఉండాలి.

పద్యరచన - 829 (చిన్ముద్ర)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1604 (దుగ్ధధారఁ గురిసె దున్నపోతు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దుగ్ధధారఁ గురిసె దున్నపోతు.

పద్యరచన - 828

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, ఫిబ్రవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1603 (దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దుర్గను బెండ్లాడెను హరి దుష్టాత్ముండై.
(గరికిపాటి వారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)

పద్యరచన - 827

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1602 (భాష రానివాఁడు పండితుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భాష రానివాఁడు పండితుండు

పద్యరచన - 826

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, ఫిబ్రవరి 2015, గురువారం

దత్తపది - 68 (మబ్బు-వాన-నది-వరద)

కవిమిత్రులారా!
మబ్బు - వాన - నది - వరద
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 826

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1601 (భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భానుం డస్తాద్రిఁ గ్రుంకెఁ బద్మము విరిసెన్

పద్యరచన - 825

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1600 (సిరికి మగఁడు చంద్రశేఖరుండు)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సిరికి మగఁడు చంద్రశేఖరుండు.

పద్యరచన - 824

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, ఫిబ్రవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1599 (రాముని పదదాసుఁ డయె జరాసంధుండే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముని పదదాసుఁ డయె జరాసంధుండే. 

పద్యరచన - 823

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1598 (పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పదిమందిన్ హతమార్చకున్న నగునా వైద్యుండు క్రూరాత్ముఁడై.

పద్యరచన - 822

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, ఫిబ్రవరి 2015, శనివారం

సమస్యా పూరణం - 1597 (దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దనుజా! యేతీరుగ నను దయఁ జూచెదవో?

పద్యరచన - 821

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1596 (కందములను వ్రాయు కవులు గాడిదలు గదా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కందములను వ్రాయు కవులు గాడిదలు గదా.
ఈ సమస్యను సూచించిన మిట్టపల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 820

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, ఫిబ్రవరి 2015, గురువారం

దత్తపది - 67 (పాలు-పెరుగు-వెన్న-నేయి)

కవిమిత్రులారా!
పాలు - పెరుగు - వెన్న - నేయి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 819

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1595 (రాముఁ డడవి కేఁగె రంభతోడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁ డడవి కేఁగె రంభతోడ.  
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 818

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1594 (పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పుడమి వెలుఁగును మిణుగురు పురుగు వలన.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 817

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, ఫిబ్రవరి 2015, సోమవారం

న్యస్తాక్షరి - 26

అంశం- చందమామ.
ఛందస్సు- తేటగీతి.
నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘చం - ద - మా - మ’ ఉండాలి

పద్యరచన - 816

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, ఫిబ్రవరి 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1593 (భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భారతయుద్ధమందు దశవక్త్రునిఁ జంపె నృసింహుఁ డుద్ధతిన్.

పద్యరచన - 815

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7, ఫిబ్రవరి 2015, శనివారం

నిషిద్ధాక్షరి - 32

కవిమిత్రులారా,
అంశం- వాస్తుదోషము.
నిషిద్ధాక్షరములు - శ-ష-స.
ఛందస్సు - ఆటవెలఁది.

పద్యరచన - 814

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1592 (చీరఁ గట్టుకొనుము శ్రీనివాస)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చీరఁ గట్టుకొనుము శ్రీనివాస.

పద్యరచన - 813

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, ఫిబ్రవరి 2015, గురువారం

దత్తపది - 67 (హరి-మాధవ-చక్రి-శ్యామ)

కవిమిత్రులారా!
హరి - మాధవ - చక్రి - శ్యామ
పైపదాలను ఉపయోగిస్తూ
శివుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

పద్యరచన - 812

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, ఫిబ్రవరి 2015, బుధవారం

సమస్యా పూరణం - 1591 (బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రహ్మ కడిగిన పాదముఁ బట్టవలదు.

పద్యరచన - 811

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, ఫిబ్రవరి 2015, మంగళవారం

న్యస్తాక్షరి - 25

అంశం- కంచెర్ల గోపన్న
ఛందస్సు- ఆటవెలది.
నాలుగుపాదల మొదటి అక్షరాలు వరుసగా ‘రా - మ - దా - సు’ ఉండాలి

పద్యరచన - 810

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, ఫిబ్రవరి 2015, సోమవారం

సమస్యా పూరణం - 1590 (సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సారము లేనివాఁడు ఘనశైలము నెత్తె జనుల్ నుతింపఁగన్.

పద్యరచన - 809

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, ఫిబ్రవరి 2015, ఆదివారం

నిషిద్ధాక్షరి - 31

కవిమిత్రులారా,
అంశం- శిశుపాలవధ.
నిషిద్ధాక్షరము - శ.
ఛందస్సు - తేటగీతి.

పద్యరచన - 808

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.