31, జులై 2020, శుక్రవారం

సమస్య - 3443

కవిమిత్రులారా,
వరలక్ష్మీ వ్రత మహోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వరలక్ష్మీ వ్రతముఁ జేయవలె పురుషు లిలన్"
(లేదా...)
"వరలక్ష్మీ వ్రత మాచరింపవలె సద్భక్తిన్ దగం బూరుషుల్"

30, జులై 2020, గురువారం

సమస్య - 3442

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కమలాక్షుఁడు విషముఁ గ్రోలెఁ గద శుభకరుఁడై"
(లేదా...)
"కమలాక్షుండు విషమ్ముఁ గ్రోలెనఁట లోకక్షేమముం గోరుచున్"

29, జులై 2020, బుధవారం

సమస్య - 3441

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మతి లేనట్టి పవనజుని మానక గొల్తున్"
(లేదా...)
"మతి లేనట్టి మరుత్సుతున్ గొలిచెదన్ మాంగల్యముం గోరుచున్"

28, జులై 2020, మంగళవారం

సమస్య - 3440

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెలికి రవిక మాత్రము చాలు చీర యేల"
(లేదా...)
"మానధనాఢ్యకున్ రవిక మాత్రము చాలును చీర యేటికిన్"

27, జులై 2020, సోమవారం

సమస్య - 3439

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రోగులు సంపన్నులే కరోనా వలనన్"
(లేదా...)
"రోగులె భాగ్యవంతులు కరోన కురోగ నియోగమందినన్"

26, జులై 2020, ఆదివారం

సమస్య - 3438

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వంచకులకు మాధవుఁ డిడు వరమోక్షమ్మున్"
(లేదా...)
"వంచన సేయువారల కవారిత మోక్షము మాధవుం డిడున్"

25, జులై 2020, శనివారం

సమస్య - 3437

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారము గల మాట మెప్పు గల దెల్లపుడున్"
(లేదా...)
"కారముఁ గల్గి యున్న కలకాలము మెత్తురు నీదు మాటలన్"

24, జులై 2020, శుక్రవారం

సమస్య - 3436

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సానితోఁ జేయవలె నవధానములను"
(లేదా...)
"అవధానం బొనరింపఁగా వలెను వేశ్యాసంగతిన్ బొందుచున్"

23, జులై 2020, గురువారం

సమస్య - 3435

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కర్ణుఁడు పినతండ్రి గాఁడె కౌంతేయులకున్"
(లేదా...)
"కర్ణుండే పినతండ్రి పాండవులకున్ గాంగేయుఁడే మామయౌ"

22, జులై 2020, బుధవారం

సమస్య - 3434

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూలు సెగలఁ బొగలఁ బుక్కిళించె"
(లేదా...)
"పూవులు మంటలం బొగలఁ బొల్తుకపై వడిఁ బుక్కిళించెరా"

21, జులై 2020, మంగళవారం

సమస్య - 3433

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమ్ముఁ జంపి సద్యశమ్ముఁ గొనుము"
(లేదా...)
"తమ్ముం జంపి సుకీర్తిచంద్రికల నందంగం దగున్ భూవరా"

20, జులై 2020, సోమవారం

సమస్య - 3432

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పిల్లినిన్ మ్రింగి యాఖువు బిలముఁ జొచ్చె"
(లేదా...)
"పిల్లిని మ్రింగి మూషకము వేగమె చొచ్చె బిలమ్ములోనికిన్"

19, జులై 2020, ఆదివారం

సమస్య - 3431

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీర విప్పి చూపెఁ జెలువ మతివ"
(లేదా...)
"చీరను విప్పి చూపినది చెల్వము నా సతి యెల్లవారికిన్"

18, జులై 2020, శనివారం

సమస్య - 3430

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వ్యాఘ్ర సింహములకుఁ బుట్టె వానరుండు"
(లేదా...)
"వ్యాఘ్రము సింహమున్ గలియ వానరుఁ డొక్కఁడు పుట్టె వింతగన్"

17, జులై 2020, శుక్రవారం

'సప్తతి'

కవిమిత్రులారా,
          ఈరోజు నా పుట్టినరోజు. కవిమిత్రులు నా 'సప్తతి ఉత్సవం' ఘనంగా చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది. 
          'మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ' పూనికొని అవుసుల భానుప్రకాశ్ గారి సంపాదకత్వంలో సర్వాంగ సుందరంగా 'శంకరాభరణం' పేరుతో 240 పేజీల నా సప్తతి సంచిక సిద్ధమయింది. పరిమితంగా ఆహ్వానింప బడిన కవిమిత్రుల సమక్షంలో, మా ఆశ్రమంలోనే ఈరోజు పుస్తకావిష్కరణ జరుగనున్నది. ఈ సంచిక కోసం వ్యాసాలు, పద్యాలు వ్రాసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా యీ సాహితీ ప్రయాణం ఇలాగే కొనసాగడానికి తగిన ఆయురారోగ్యాలను ప్రసాదించ వలసిందిగా చదువుల తల్లి సరస్వతీ దేవిని వేడుకుంటున్నాను.


సమస్య - 3429

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంది శంకరయ్య కవులఁ జెఱచు"
(లేదా...)
"కందిశంకరయ్య ఘనుఁడు కవులను జెడఁగొట్టఁగన్"
(కవితాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

16, జులై 2020, గురువారం

ఆహ్వానం


సమస్య - 3428

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భారతము సంస్కృతిభ్రష్టమై రహించు"
(లేదా...)
"భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై"

15, జులై 2020, బుధవారం

దత్తపది - 169

కవిమిత్రులారా,
పాపి - ఖలుఁడు - హీనుడు - ద్రోహి
పై పదాలను ప్రయోగిస్తూ స్వేచ్ఛాఛందంలో
విష్ణుస్తుతి చేయండి.

14, జులై 2020, మంగళవారం

సమస్య - 3427

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అందియల వీడనొప్పు నాట్యమున రంభ"
(లేదా...)
"మంజీరమ్ముల వీడి చేయఁదగు రంభా నాట్య మీ వేదికన్"

13, జులై 2020, సోమవారం

సమస్య - 3426

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁడే రావణుండైన ప్రజకు మేలు"
(లేదా...)
"రాముఁడె రావణుండయి ధరాతల మేలుట పాడియౌఁ గదా"

12, జులై 2020, ఆదివారం

నేదునూరి రాజేశ్వరి అక్కయ్య ఇక లేరు

        
          శంకరాభరణం బ్లాగు ప్రారంభం నుండి క్రమం తప్పకుండా పూరణలు చేస్తూ ఉండిన అక్కయ్య గారు పరమపదించారన్న విషాద వార్త ఇంతకు ముందే తెలిసింది. వారు కొంత కాలంగా హాస్పిటల్లో ఉన్నారని మొన్ననే వారి కోడలు ఫోన్ చేసి చెప్పారు. అక్కయ్య గారు నాతో మాట్లాడాలని ఉన్నదని చెప్పారని నా ఫోన్ నెం. తీసుకున్నారు కూడా! ఇంతలోనే ఈ దుర్వార్త!
                       భగవంతుడు వారికి పుణ్యగతులను కల్పించు గాక!

ఆహ్వానం!


సమస్య - 3425

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్వ్యాపారంబె జనుల దుఃఖముఁ ద్రోఁచున్"
(లేదా...)
"దుర్వ్యాపారము క్షేమదాయకము సంతోషంబు పౌరాళికిన్ "

11, జులై 2020, శనివారం

సమస్య - 3424

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గీత మార్చఁ గలదె గీఁతఁ గృష్ణ"
(లేదా...)
"గీతాశాస్త్రము గీఁత మార్చఁ గలదా కృష్ణా యశోదాత్మజా"

10, జులై 2020, శుక్రవారం

సమస్య - 3423

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తన సతి పెండ్లిం గనుటకుఁ దానేఁగెఁ ద్వరన్"
(లేదా...)
"తన యర్ధాంగి వివాహముం గనుటకై తానేఁగె నుత్సాహియై"

9, జులై 2020, గురువారం

సమస్య - 3422

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవికంటెను మేలు గాదె గాడిద భువిలో"
(లేదా...)
"కవికంటెన్ బరికింప గాడిదయె మేల్గాదే భువిన్ మిత్రమా"

8, జులై 2020, బుధవారం

సమస్య - 3421

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పగలు శశి పూర్ణకళలతో నెగడె దివిని"
(లేదా...)
"పగలు శశాంకుఁ డంబరముపై విలసిల్లెఁ గళాసమగ్రుఁడై"

7, జులై 2020, మంగళవారం

సమస్య - 3420

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుంతికిన్ గుంభకర్ణునకు సుత సీత"
(లేదా...)
"కుంతికిఁ గుంభకర్ణునకుఁ గూఁతురుగా జనియించె సీతయే"

6, జులై 2020, సోమవారం

సమస్య - 3419

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తన్నిన నవ్వంగ నొప్పు దాప ముడుగుచున్"
(లేదా...)
"తన్నిన ధిక్కరించినను దాపము నొందక నవ్వుటొప్పగున్"

5, జులై 2020, ఆదివారం

ఆహ్వానం


సమస్య - 3418

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోమలి తలమీద రెండు కొమ్ములు వుట్టెన్"
(లేదా...)
"కొమ్ములు రెండు పుట్టినవి కోమలి శీర్షమునందుఁ గాంచఁగన్"  

4, జులై 2020, శనివారం

సమస్య - 3417

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పయ్యెదనున్ లాగువానిఁ భామిని మెచ్చెన్"
(లేదా...)
"పయ్యెద లాగు ధూర్తుని సెబాసని భామ నుతించెఁ బ్రీతితోన్"

3, జులై 2020, శుక్రవారం

సమస్య - 3416

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వానరులనుఁ గాంచి వగచఁ దగునె"
(లేదా...)
"వానర జాతిఁ గాంచి కడు వంతనుఁ జెందుట నీకు యుక్తమే"

2, జులై 2020, గురువారం

సమస్య - 3415

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నత్తనుఁ గని బల్లిదుండు నమ్రుండయ్యెన్"
(లేదా...)
"నత్తనుఁ గాంచి బల్లిదుఁడు నమ్రతతోఁ బ్రణమిల్లె నత్తఱిన్"

1, జులై 2020, బుధవారం

సమస్య - 3414

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుత్రుఁ జంపి శివుఁడు పొలఁతి నందె"
(లేదా...)
"పుత్రునిఁ జంపి శంకరుఁడు పొందెను పర్వతరాజ పుత్రికన్"