31, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1490 (ఖరపదము పరిగ్రహించి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
ఖరపదము పరిగ్రహించి కననగు ముక్తిన్.
ఈ సమస్యను సూచించిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 637

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 40

రామాయణము-
చం.    అనిపె వశిష్ఠసద్(ద్విజునికై; సమయ మ్మొకవేళ దప్ప)కా
యన కనె స్వేచ్ఛ నా(విజయుఁ; డగ్రజసమ్మతిఁ బ్రీతిభూమి)జే
శునిఁ గొనితెమ్మనెం (దనరి శుభ్రత నేడు; ప్రదక్షిణించి) బం
టును రఘురాముతో (గరిమనున్ మరలం జనె గార మెచ్చఁ)గన్. (౫౫)

భారతము-
గీ.       ద్విజునికై సమయ మ్మొకవేళఁ దప్ప,
విజయుఁ డగ్రజసమ్మతిఁ బ్రీతి భూమిఁ
దనరి శుభ్రత నేఁడు ప్రదక్షిణించి
గరిమనున్ మరలం జనె గారమెచ్చ. (౫౫)

టీక- సమయము = (రా) కాలము, (భా) ఒడంబడిక; విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; అగ్రజసమ్మతి = (రా) బ్రాహ్మణుఁడగు వశిష్ఠుని సమ్మతిని, (భా) అన్నయగు ధర్మరాజు సమ్మతిని; నేడు = (రా) రాజు, ఏడు = (భా) వత్సరము; భూమిజేశుని = రాముని; గారము = ప్రేమ; ఎచ్చన్ = హెచ్చగ.

రావిపాటి లక్ష్మీనారాయణ

30, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1489 (కాశి కేగినవానికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కాశి కేగినవానికిఁ గలుఁగు మిత్తి.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 636 (పెరుగన్నము)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 39

రామాయణము-
సీ.      ఇల, (ఖ్యాతి స్ఫూర్తియు తైణిలోచనల సత్
క్ష్మాపాత్మజుల్ గొప్పగాఁ) గొని ప్రియ
ముగ (నీతిశ్రేయపు బుద్ధి నేడు గలయన్
ధీ నొక్కొకండున్ ధృతిన్) సుకృతము
లెదఁ (బ్రీతి ప్రజ్వలితేచ్ఛ సల్పిరి జనుల్
ప్రేమం గనంగా లలిం), గనుకనుఁ,
దద్(భూతి శ్రేష్ఠతఁ దాఱి హెచ్చు సమయం
బుల్ పొందుచున్ మోదమున్) మనముల
గీ.       నెంచి రాముఁ డందఱలోన హె, చ్చతండు
క్ష్మాపుఁడై మూడుపూవు లాఱుకాయలగు న
టంచు వారు విధివిరామ మంత విడిరి;
ప్రభుఁడు కార్యనిర్వాహకోద్భటుని భటుని. (౫౪)

భారతము-
శా.     ఖ్యాతి స్ఫూర్తియు తైణిలోచన లసత్ క్ష్మాపాత్మజుల్ గొప్పగా
నీతిశ్రేయపుబుద్ధి నేడు గలయన్ ధీ నొక్కొకండున్ ధృతిం
బ్రీతిప్రజ్వలితేచ్ఛ సల్పిరి జనుల్ ప్రేమం గనంగా లలిన్
భూతి శ్రేష్ఠతఁ దాఱి హెచ్చు సమయంబుల్ పొందుచున్ మోదమున్. (౫౪)

టీక- (రా) ఖ్యాతిన్ = కీర్తితో; స్ఫూర్తియుత = కాంతిని గూడిన; (భా) ఖ్యాతిస్ఫూర్తియుత = కీర్తికాంతుల గూడిన, (ఒకటే సమాసము) నీతిశ్రేయపుబుద్ధి, ప్రీతిప్రజ్వలితేచ్ఛ, భూతిశ్రేష్ఠతయును నిట్లే. నేడు = (రా) రాజు (దశరథుఁడు); కలయన్ = (రా) పాల్గొనఁగా; ఏఁడుగలయన్ = (భా) సంవత్సరపర్యంతము పొందుటకు; సమయంబుల్ = (రా) కాలములు, (భా) ఒడంబడికలు. నాలుగుపాదములందు సీసమందు నాలవయక్షరములు, శార్దూలమున రెండవ యక్షరములగు ‘తి, తి, తి, తిలు రామాయణార్థమున లఘువులుగాను, భారతార్థమున గురువులుగా నున్నవి. ఏణిలోచన = లేడివంటి కన్నులుగలది. (రా) ఏణిలోచనల, సత్; (భా) ఏణిలోచన లసత్; మూడుపూవు లాఱుకాయ లగుట = వృద్ధిజెందుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

29, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1488 (గోపాలుడు మెచ్చునయ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
గోపాలుడు మెచ్చునయ్య కొంగ జపమ్మున్.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 635

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1487 (కుపతిని గని మెచ్చె సాధ్వి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కుపతిని గని మెచ్చె సాధ్వి కోర్కులు మించన్.

పద్యరచన - 634

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 38

రామాయణము-
సీ.      (పాయక మించఁగా స్వపురి వారు కడున్, రు
చి స్ఫూర్తియుక్తుఁడై) శ్రీఁ దలంచె
(న్యాయపథాన మిన్న జననాయకుఁడుం గృ
తిస్తుత్యుఁ డర్థభూ)తికలితారి
(ధీయుతరాజుగా ధృతి యుధిష్ఠిరు సన్మ
తి శ్రేష్ఠు రామునిన్) ధీరగుణునిఁ
(జేయఁగ, దుష్టులన్ సిలుగుఁ జెందిరి దుస్థి
తిక్షోభఁ గూడుచున్), దిట్టయయి శు
గీ.       భస్యశీఘ్రమ్మని నృపుఁడు పలికెఁ బురజ
నులకుఁ దనకోర్కె, వారి యనుజ్ఞఁ బొందె,
నొకటి తానెంచ దైవ మింకొకటి సేయుఁ
గాని యద్దానిఁ గలఁ గాంచఁ గలఁడె నరుఁడు. (౫౩)

భారతము-
ఉ.      పాయక మించఁగా స్వపురి వారు కడున్, రుచి స్ఫూర్తియుక్తుఁడై
న్యాయపథాన మిన్న జననాయకుఁడుం గృతి స్తుత్యుఁ డర్థభూ
ధీయుతరాజుగా ధృతి యుధిష్ఠిరు సన్మతి శ్రేష్ఠు రామునిన్
జేయఁగ, దుష్టులన్ సిలుగుఁ జెందిరి దుస్థితి క్షోభఁ గూడుచున్. (౫౩)

టీక- రుచిస్ఫూర్తియుక్తుఁడై- ఒకే సమాసము; (భా) రుచిన్, స్ఫూర్తియుక్తుఁడై; ఇట్లే కృతిస్తుత్యుఁడు, సన్మతిశ్రేష్ఠుఁడు, దుస్థితిక్షోభ- ఒకే సమాసములు, (భా) వేఱుపదములు. ఇందు సీసోత్పలమాలలలో నాలుగుపాదములయందు ౧౫వ యక్షరములగు ‘చి, తి, తి, తిలు రామాయణార్థమున గురువులు గాను, భారతార్థమున లఘువులుగా నున్నవి. కృతిస్తుత్యుఁడు (రా) కృతులవలన స్తుతింపదగువాఁడు, (భా) కృతియు, స్తుత్యుఁడు; అర్థభూతికలితారి = (రా) ఉనుకలయిన యైశ్వర్యముగల శత్రువులు గలవాఁడు; అర్ధభూధీయుతరాజు = (భా) సగము రాజ్యమునకు బుద్ధిప్రావీణ్యముగల రాజుగాన్; యుధిష్ఠిరు = (రా) యుద్ధమందు స్థిరమగువానిని; రామున్ = (భా) రమ్యమగువానిని.

రావిపాటి లక్ష్మీనారాయణ

27, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1486 (వారకాంతమీఁది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
వారకాంతమీఁది వలపు మేలు.

పద్యరచన - 633

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 37

రామాయణము-
సీ.      వచ్చిరి దశరథపతియు నా (పాండుస
మాఖ్యుని పుత్రులు) మహిత భరత
శత్రుఘ్నులును; (మెండుసరినిఁ గొనిరి కృష్ణ
మృగనయనను వ్యా)ళమేచకజట
నుర్వీజ రఘురాముఁ డూర్మిళన్ లక్ష్మణుం
డును మాండవి భరతుఁడు శ్రుతకీర్తి
శత్రుఘ్నుఁడు శుభాల్ పస గురుం డనల(సుండ
నఁ; బిలువఁగ ధృతరా)జ్యబలుని కొడు
గీ.       కులనుఁ గోడండ్రఁ గన నొండొరుల సతులు, నృ
పజులు కోసలరా(ష్ట్రుండు స్వపురికిఁ జని
రలరుచు రుచిరగతితో)డ సులువుగ భృగు
రాము గర్వంబు దారిలో రాముఁ డడఁచె. (౫౨)

భారతము-
కం.    పాండుసమాఖ్యుని పుత్రులు
మెండుసరిని గొనిరి కృష్ణ మృగనయనను వ్యా
సుం డనఁ, బిలువఁగ ధృతరా
ష్ట్రుండు స్వపురికిఁ జని రలరుచు రుచిరగతితో. (౫౨)

టీక- పాండుసమాఖ్యుని = (రా) తెల్లనికీర్తిగలవానిని, (భా) పాండురాజుయొక్క; కృష్ణమృగనయనను = (రా) కృష్ణమృగమువంటి కన్నులుగలదానిని, (భా) కృష్ణన్ = ద్రౌపదిని, మృగనయనను = లేడివంటి కన్నులు గలదానిని; శుభాల్ = (రా) శుభవచనములు; అన = (రెంటికి) చెప్పఁగా; వ్యాళమేచకజట = పామువంటి నల్లని జడగలది; భృగురాముఁడు = పరశురాముఁడు. 

రావిపాటి లక్ష్మీనారాయణ

26, జులై 2014, శనివారం

ఆహ్వానం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 504 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం.

జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2014 న సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 504 వ పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
07 - 08 - 2013వ తేదీన సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
అనేకమంది పెద్దలు వక్తలుగా పలురాష్ట్రాలనుండి వచ్చుచున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.

సమస్యా పూరణం – 1485 (బొమ్మా! నీకింత సిగ్గు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
బొమ్మా! నీకింత సిగ్గు పోలదు సుమ్మా.
(ఈ సమస్య ప్రసిద్ధమైనదే)

పద్యరచన - 632

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 36

పుష్పమాలికాబంధము

                             వే                 ము            ము          మా
జ    గా  వె     జా  న      న  దా  న  ఱి   క్రా  ల్మ      వై  చె  ను   ఖ్యా
     మీ          ద్బి           యా               దా              ల్ల           గా


                   ధృ              నా                        రి             పూ
తి     హిన్  న  తి   య  ఱ్ఱు     తో  న     తం బొ     దా  వు     నున్
   మన్             న్బ              నా           వీ             ల్వు           మా

రామాయణము-
చం.    జఱజఱ మీఱఁగా (వెస లసద్బిసజానన వేనయానఁ) దా
నఱిముఱిఁ దాఱి క్రాల్ (మనము నల్లన వైచెను మానుగాను) ఖ్యా
తి రసరమన్ రహిన్ (నతిధృతిన్ బతియఱ్ఱున నాన నాన)తో
నరవరవీరతం (బొనరి నల్వునఁ దావుల పూలమాల)నున్. (౫౧)

భారతము-
గీ.       వెస లసద్బిసజానన వేనయాన
మనము నల్లన వైచెను మానుగాను
నతిధృతిన్ బతి యఱ్ఱున నాన నాన
బొనరి నల్వునఁ దావుల పూలమాల. (౫౧)

టీక- (రెంటికి) నయాన = నయముతో; పతియఱ్ఱున = భర్తకంఠసీమను; ఆనన్ = తగులునట్లు; (రా) నతిన్ = మ్రొక్కుతో (భక్తిభావముతో); ధృతిన్ = సంతోషముతో; (భా) అతిధృతిన్ = ఎక్కువ సంతోషముతో; నరవరవీరతన్ = (రా) రామునియొక్క యుత్సాహముచే; వెస = వేగముగా; అఱిముఱి = సంభ్రమముతో; తాఱి = అడగి; మానుగాను = అందముగ; రహి = ప్రీతి; తావుల = వాసనలుగల.

రావిపాటి లక్ష్మీనారాయణ

25, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1484 (కల్లుఁ ద్రాగుమనెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల.

పద్యరచన - 631

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 35

రామాయణము-
చం.    అదరెను భూమియున్ (మలయు చబ్ధులు ఘూర్ణిలె క్ష్మాధరాళి)యుం
బెదరెను దారకల్ (కదలె జిష్ణుఁడు రాముఁడు కమ్రభీము) వి
ల్లుఁ దనదు భీష్మమౌ (బలిమి లోపడఁ జేయఁగ, వాలు కర్ణ)భీ
ప్రదరవమూపరాణ్(ముఖుల, రాల్పగ దివ్యులు పుష్పరాజి)నిన్. (౫౦)

భారతము-
గీ.       మలయు చబ్ధులు ఘూర్ణిలె క్ష్మాధరాళి
కదలె జిష్ణుఁడు రాముఁడు కమ్రభీము
బలిమి లోపడఁ జేయఁగ, వాలు కర్ణ
ముఖుల, రాల్పగ దివ్యులు పుష్పరాజి. (౫౦)

టీక- జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; భీము = (రా) శివుని, (భా) భీముని; వాలు = విజృంభించు; కర్ణభీప్రదరవము = చెవులకు భయమునిచ్చు ధ్వని; రాణ్ముఖులు = రాజశ్రేష్ఠులు; (భా) కర్ణముఖులు = కర్ణుఁడు మొదలగువారు.

రావిపాటి లక్ష్మీనారాయణ

24, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1483 (చవట కదా నిన్ను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
చవట కదా నిన్నుఁ దలప శంకరపత్నీ!
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్యరచన - 630

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1482 (తార తనయుఁడై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
తార తనయుఁడై పుట్టె సుధాకరుండు.

పద్యరచన - 629

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1481 (మీసములే సొబగుఁ గూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య...
మీసములే సొబగుఁ గూర్చు మెలఁతల కెల్లన్.

పద్యరచన - 628

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1480 (తత్త్వదర్శి చెప్పు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
తత్త్వదర్శి చెప్పుఁ దప్పు లెల్ల.

ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 627

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1479 (వేయికనులవాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వేయికనులవాఁడు వినత కొడుకు.

పద్యరచన - 626

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, జులై 2014, శనివారం

సమస్యా పూరణం – 1478 (రావణుఁ డా సీత మగఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రావణుఁ డా సీత మగఁడు రక్షించు మిమున్.
(ప్రసిద్ధమైన ఈ సమస్య ఎన్నో అవధానలలో ఇవ్వబడినది. మన బ్లాగులోను ఇచ్చానేమో? గుర్తు లేదు!)

పద్యరచన - 625

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 34

రామాయణము-
చం.    రవిసమతేజుఁడున్ (బలుఁడు రాముఁడు జిష్ణుఁడు వచ్చి, వీఁక) బ
ల్మి వెలయ శౌర్యముం (బఱువ లీలనుఁ ద్రుంచెను బంచసాయ)కా
రి విలునుఁ దోషపా(కముల శ్రీ మెఱయం దెఱగంటిమిన్న)లు
బ్బ, వఱలు సిగ్గుతోఁ (దలలు వంచఁగఁ దక్కిన ధాత్రిపాళి)యున్. (౪౯)

భారతము-
గీ.       బలుఁడు రాముఁడు జిష్ణుఁడు వచ్చి, వీఁక
బఱువ లీలనుఁ ద్రుంచెను బంచసాయ
కముల శ్రీ మెఱయం దెఱగంటిమిన్న
దలలు వంచఁగఁ దక్కిన ధాత్రిపాళి. (౪౯)

టీక- పంచసాయక = మన్మథునియొక్క; అరి = శత్రుఁడగు శివుని; జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; తెఱగంటిమిన్న = (రా) దేవత, (భా) చేప; రాముఁడు = (భా) రమ్యమగువాఁడు.

రావిపాటి లక్ష్మీనారాయణ

18, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1477 (వరము వైషమ్యములఁ దెచ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వరము వైషమ్యములఁ దెచ్చె ప్రజలలోన.

పద్యరచన - 624

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 33

రామాయణము-
గీ.       (అని యనిరి కొందఱు నృపజు లనుకొని రెద
గెలువ రేరు నంచును మఱి గెల్చిన భుజ
బలమున నని యందునఁ గూల్చి పడఁతిఁ గొనెదె
మనుచుఁ గొందఱు వే) సతిఁ గనుగొనుచును. (౪౮)

భారతము-
కం.    అని యనిరి కొందఱు నృపజు
లనుకొని రెద గెలువ రేరు నంచును మఱి గె
ల్చిన భుజబలమున నని యం
దునఁ గూల్చి పడఁతిఁ గొనెదె మనుచుఁ గొందఱు వే. (౪౮)

టీక- ఏరు = ఎవరు; అని = యుద్ధము.

రావిపాటి లక్ష్మీనారాయణ

17, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1476 (పుట్టినవాఁ డెవఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై.

పద్యరచన - 623

కవిమిత్రులారా,
నేడు నా పుట్టినరోజు.
అరవై నాలుగేళ్ళు నిండి అరవై ఐదులో పడ్డాను. 
ఇన్నేళ్ళ జీవితంలో సాధించిం దేమిటని వెనక్కు తిరిగి చూసుకుంటే
“శూన్యం!”
అందరూ ఉండికూడా ప్రేమాభిమానాలకు నోచుకోక ‘వృద్ధాశ్రమం’ దిక్కయింది.

నిర్వచన భారత గర్భ రామాయణము - 32

రామాయణము-
చం.    అవని ని కెవ్వరున్ (వలదు యత్నము సేయగ, వట్టి మాయ)గా
కెవరు జయింతురో (యెవరి కెయ్యది ప్రాప్తమొ యేఁడు సెప్పు) స
ర్వవిదుఁడు దక్కఁగా? (ధరణి వానిని కానిది దక్క, దేల) యీ
తివురుట లోడుటల్, (నవులు దీనికి లోపడ నానలేక)యున్. (౪౭)

భారతము-
గీ.       వలదు యత్నము సేయగ, వట్టి మాయ
యెవరి కెయ్యది ప్రాప్తమొ యేఁడు సెప్పు
ధరణి వానిని కానిది దక్క, దేల
నవులు దీనికి లోపడ నానలేక. (౪౭)

టీక- ఏడు = ఎవడు; సర్వవిదుడు = సర్వము తెలిసిన భగవంతుడు; తివురుట = కోరుట; నాన = సిగ్గు.

రావిపాటి లక్ష్మీనారాయణ

16, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1475 (కామక్రోధములు దెలియ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
కామక్రోధములు దెలియఁగా సద్గుణముల్.

పద్యరచన - 622

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 31

రామాయణము-
చం.    ఎనయు చభావమున్ (వనిత నెందు ననర్థము వచ్చు నంచుఁ) బొం
దిన సువిరక్తిచే (ధృతినిఁ దృప్తినిఁ గొందఱు దెచ్చికొంచుఁ) బా
యని గరిమంబులం (దలచి రప్పుడు, నక్కయు ద్రాక్షపండు) లూ
నిన తమిఁ గోరి లీ(లఁ గొననేరక యాత్మఁ దలంచు రీతి)గన్. (౪౬)
         
భారతము-
గీ.       వనిత నెందు ననర్థము వచ్చు నంచు
ధృతినిఁ దృప్తినిఁ గొందఱు దెచ్చికొంచుఁ
దలచి రప్పుడు, నక్కయు ద్రాక్షపండు
లఁ గొననేరక యాత్మఁ దలంచు రీతి. (౪౬)

టీక- గరిమము = గొప్పతనము.

రావిపాటి లక్ష్మీనారాయణ

15, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1474 (హరిని హరియింప)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
హరిని హరియింప వరియించె హరిని హరిణ.

పద్యరచన - 621

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 30

రామాయణము-
చం.    ఇనసమతేజుఁడున్ (బిరుదు నేనును నోడితి, బిట్టు మాయ)నున్
జనకుఁడు క్రూరుఁడుం (గుమతి సల్పె నటంచునుఁ గొంద ఱంత)టం
బనివడి కిన్కతో (ననిరి; పల్కిరి కొందఱు నల్క నీపె) యే
ఘనుఁడగు నాకునున్ (గతియె? కాక వివాహము కాదె యంచు)నున్. (౪౫)

భారతము-
తే.      బిరుదు నేనును నోడితి, బిట్టు మాయ
గుమతి సల్పె నటంచునుఁ గొంద ఱంత
ననిరి; పల్కిరి కొందఱు నల్క నీపె
గతియె? కాక వివాహము కాదె యంచు. (౪౫)

టీక- బిట్టు = ఎక్కువ.

రావిపాటి లక్ష్మీనారాయణ

14, జులై 2014, సోమవారం

సమస్యా పూరణం – 1473 (దశరథుని శబ్దభేది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె.

పద్యరచన - 620

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 29

రామాయణము-
చం.    అన (విని, పోరి, కొందరు వరావనినాథజు లోడి, సిగ్గు పైఁ
గొనఁ జని రం)తటన్ విడచి; కొందఱు గుందిరి కొందలాన, బల్
ఘన(తనుఁ గొందఱాసనములన్ ఘనభాతిని నుండి రంత గ్ర
మ్ము నళుకునన్;) రొదం గనక పోయిరి కొందఱు బుద్ధిమంతులను. (౪౪)

భారతము-
కం.    విని, పోరి కొందఱు వరా
వనినాథజు లోడి, సిగ్గు పైఁగొనఁ, జని రం
తనుఁ గొంద ఱాసనములన్
ఘనభాతిని నుండి రంత గ్రమ్ము నళుకునన్. (౪౪)

టీక- కొందలము = దుఃఖము; అళుకు = భయము; ఘనభాతి = గొప్పరీతి.

రావిపాటి లక్ష్మీనారాయణ

13, జులై 2014, ఆదివారం

సమస్యా పూరణం – 1472 (పూవులో రెండు పూవులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.

పద్యరచన - 619

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 28

రామాయణము-
చం.    జనకుఁడు సాధుఁడున్ (నుడివె క్ష్మాపజులార వినుండు చోఱ) డా
లునహితువిల్లు బెం(గుఱిని లోఁగొని; బీరము గూడ, దాని)ఫు
ల్లనలిననేత్రకై (నయనలక్ష్యము వేడుక నాటఁ గొట్టు)చుం
దనరుచు నెక్కిడున్ (మెఱసి, తద్బలుడుం గొను మించుబోఁడి)నిన్. (౪౩)

భారతము-
గీ.      నుడివె క్ష్మాపజులార వినుండు చోఱ
గుఱిని లోఁగొని; బీరము గూడ, దాని
నయనలక్ష్యము వేడుక నాటఁ గొట్టు
మెఱసి, తద్బలుడుం గొను మించుబోఁడి. (౪౩)

టీక- (రా) చోఱడాలు = మీనకేతనుఁడగు మన్మథునియొక్క అహితు- శత్రుఁడగు శివుని; లక్ష్యము = గుఱి; వేడుకనాటఁగొట్టుచున్ = (రా) సంతోషమును నాటు రీతినిఁ గొట్టుచు, (భా) వేడుకనాట = సంతసము నాటగా, దాని నయన లక్ష్యము = చేపక న్నను గుఱిని కొట్టు; మించుబోడి = మెఱపువంటి శరీరము కలది.

రావిపాటి లక్ష్మీనారాయణ

12, జులై 2014, శనివారం

సమస్యా పూరణం – 1471 (జనకుని పెండ్లాడు మనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
జనకుని పెండ్లాడు మనుచు జానకి కోరెన్.
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

పద్యరచన - 618

కవిమిత్రులారా,
గురుపూర్ణిమ శుభాకాంక్షలు!
వ్యాసభగవానుఁడు
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 27

అచ్చ తెలుఁగు
రామాయణము-
చం.    పనివడి దిట్టలై (పరఁగ వచ్చిరి వీటికి వారు రాచ)చె
ల్వొనరఁగ నంత రా(కొమరు, లొక్కొకరుండును గొప్ప వేడ్కఁ) బెం
డ్లి నగుదు నేనె బల్(గొనబు నేర్పరి పెండిలికూఁతు రన్న)నం
చనుకొని రెచ్చునై (పొరలి హాళియుఁ గోరిక పుట్టుచుండఁ)గన్. (౪౨)

భారతము-
గీ.       పరఁగ వచ్చిరి వీటికి వారు రాచ
కొమరు, లొక్కొకరుండును; గొప్ప వేడ్కఁ
గొనబు నేర్పరి పెండిలికూఁతు రన్న
పొరలి హాళియుఁ గోరిక పుట్టుచుండ. (౪౨)

టీక- పెండిలికూఁతురన్న = (రా) సీత యనినచో, (భా) ద్రౌపది కగ్రజుఁడు. [భారతమునఁ గ్రిందిపద్యమున కన్వయము]; పనివడి = ఎక్కువ; గొనబు = మనోజ్ఞమగు.

రావిపాటి లక్ష్మీనారాయణ

11, జులై 2014, శుక్రవారం

సమస్యా పూరణం – 1470 (వీఁపుఁ జూపువాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వీఁపుఁ జూపువాఁడు వీరవరుఁడు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 617

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 26

రామాయణము-
గీ.       (పరఁగఁ జిగురాకుచేతుల గురువుగ శ్రమ
వాయ విసరెఁ గొమ్మలపరి; భాసురముగ
ద్విజరవముల మధ్య రహిన్ నృపజులపయి ర
మ నలరులు నొలసెన్;) హెచ్చె మంజులతలు. (౪౧)

భారతము-
కం.    పరఁగఁ జిగురాకుచేతుల
గురువుగ శ్రమ వాయ విసరెఁ గొమ్మలపరి; భా
సురముగ ద్విజరవముల మ
ధ్య రహిన్ నృపజులపయి రమ నలరులు నొలసెన్. (౪౧)

టీక- (రెంటికి సమము) చిగురాకుచేతులన్ = చిగురులను చేతులతో; కొమ్మలపరి = వృక్షశాఖలగుంపు; ద్విజరవముల = పక్షుల పలుకుల; అలరులు = పుష్పములు; మంజులతలు = సుందరములగు తీవలు; [చిగురాకుచేతుల = చిగురులవంటి చేతులతో; కొమ్మలపరి = స్త్రీసమూహము; ద్విజరవములు = బ్రాహ్మణుల పలుకులు (మంత్రములు); అలరులు నొలసెన్ = సంతోషములు వ్యాపించెను; మంజులతలు = మనోహరత్వములు- అని అర్థాంతరము. ముందు కాఁబోవు వివాహమునకు సూచనలు.]

రావిపాటి లక్ష్మీనారాయణ

10, జులై 2014, గురువారం

సమస్యా పూరణం – 1469 (వాణి వారవనితలందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
వాణి వారవనితలందు వాసికెక్కె.
(‘రౌడిరాజ్యం’ బ్లాగునుండి)

పద్యరచన - 616

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 25

అష్టవిధకందము.

రామాయణము-
ద్రుమములఁ గరులనుఁ వెలికుసు
మములను ఘనతఁ గుశలతను మఱి మఱి కనుచున్
సమరహితరమను ఖలముల
గుములయి తనిసి రతులితులు గురుమతివినుతుల్. (౪౦)

భారతము-
వెలికుసుమములను ఘనతఁ గు
శలతను మఱి మఱి కనుచును సమరహితరమన్
ఖలముల గుములయి తనిసి ర
తులితులు గురుమతి వినుతులు ద్రుమములఁ గరులన్. (౪౦)

టీక- సులభము. ఇట్లే “ఘనతఁ గుశలతనునుండి, “మఱి మఱి కనుచును నుండి “సమరహితమను నుండి, “ఖలముల గుములయి నుండి, “తనిసి రతులితులు నుండి, “గురుమతి వినుతులు నుండి చదువ వచ్చును. అప్పకవీయమున నష్టవిధకందమున కీయబడిన లక్ష్యప్రకారము, “కనుచున్- కనుచును గాను, రమన్- రమను గాను, గుములై- గుములయి గాను, వినుతుల్- వినుతులు గాను రావచ్చును.
ద్రుమముల = చెట్లను; వెలి కుసుమములు = తెల్లని పుష్పములు; ఖలము = చోటు.

రావిపాటి లక్ష్మీనారాయణ

9, జులై 2014, బుధవారం

సమస్యా పూరణం – 1468 (ఏలూరున నుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
ఏలూరున నుండువార లెల్లరు కవులే.

పద్యరచన - 615

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 24

రామాయణము- (ముక్తపదగ్రస్తము)
సీ.      ఘనఘనశ్యాము రాఘవునిఁ గాంచి (మురిసి
పురివిప్పి యాడు కొమరునమిళ్ల)
నమిలియాట కనుగుణ్యపుటలల, (నలల
యం దుయ్యెలల నూఁగు నంచలగమి,)
నంచలగమి వెక్కిరించు చుఱికి (వల్ల
రుల లీల నూఁగెడు బలితకపులఁ)
గపితతిచేతఁ మెక్కఁబడు పండ్లనుఁ (బండ్ల
బరువునఁ దలలను వంచు చెట్లఁ)
గీ.       జెట్లకొమ్మల నెఱుపుఁ జేసెడు చివుళ్లఁ,
జివురులఁ దిని క్రొవ్వి పలుకు చిలుకపౌజు
చిలుకపౌజున కులుకు జింకల గలిగి క
ర మలరించె నారామ మా రామముఖులు. (౩౯)

భారతము-
గీ.       మురిసి పురివిప్పి యాడు కొమరునమిళ్ల
నలల యందుయ్యెలల నూఁగు నంచలగమి
వల్లరుల లీల నూఁగెడు బలితకపులఁ
బండ్లబరువునఁ దలలను వంచు చెట్ల. (౩౯).

టీక- నమిలి = నెమలి; అంచలగమి = హంసలగుంపు; వల్లరులు = తీగలు; ఆరామము = వనము; రామముఖుల = రాముఁడు మొదలగు వారిని. (భారతమునఁ గ్రింది పద్యమున కన్వయము.)

రావిపాటి లక్ష్మీనారాయణ

8, జులై 2014, మంగళవారం

సమస్యా పూరణం – 1467 (రాముని భార్యలకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.

పద్యరచన - 614

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

నిర్వచన భారత గర్భ రామాయణము - 23

రామాయణము-
సీ.      ఆ వనశోభను నతిమోద మెసఁ(గంగఁ
గన్నులారన్ వారు గాంచి; రచట)
నంబురుహహితాన్వయాంబుధిశశి (భూరి
వీరుండు జిష్ణుఁ డంగారపర్ణ)
సదృశ తామ్రౌష్ఠ్యుండు క్ష్మాజారుచిర (శక్తి
జాలఁ గామించెఁ బ్రచండపుఁ దమి)
గౌతమాశ్రమము దగ్గరి రంతట (ననల
సొనందభరితాత్ము లయిరి వారు;
ఆ.      రామచంద్రపాదరజము సోఁకినయంత
శాపవశముచేతఁ జట్టయిన య
హల్య పూర్వరూప మందె నచ్చొటువాసి
వారు మిథిలతోటఁ జేరి రచట. (౩౮)

భారతము-
గీ.       గంగఁ గన్నులారన్ వారు గాంచి రచట
భూరివీరుండు జిష్ణుఁ డంగారపర్ణ
శక్తిఁ జాలఁగా మించెఁ బ్రచండపుఁ దమి,
ననలసానందభరితాత్ము లయిరి వారు. (౩౮)

టీక- అంగారపర్ణము = (రా.) అగ్నిశకలములు గల యాకు (ఎఱ్ఱనిది); జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; తమి = (రా) కోరిక, (భా) రాత్రి; తామ్ర = ఎఱ్ఱనిప్; ఓష్ఠ్యుండు = పెదిమలు గలవాఁడు, చాలఁ గామించె = (రా) చాలన్ + కామించె, (భా) చాలఁగా - మించె; అనలస = మందము కాని.
రావిపాటి లక్ష్మీనారాయణ