30, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3503

 తేదీ : 01-10-2020 (గురువారం)
 కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఆగ్నేయాస్త్రమ్ము వేయ నభ్రము గురిసెన్"
(లేదా...)
"ఆగ్నేయాస్త్రము వేయఁగన్ గురిసె వర్షాభ్రమ్ము లుద్దండతన్"

సమస్య - 3502

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాంచనపుష్పాంజలిని బికారి హరి కిడెన్"

 (లేదా...)
"కాంచనపుష్పపూజను బికారి యొనర్చెను శేషశాయికిన్"

29, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3501

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గర్భములోనున్న బిడ్డ గ్రక్కునఁ దుమ్మెన్" 

(లేదా...)
"గర్భమునందు నున్న పసికందు గబుక్కునఁ దుమ్మె బిట్టుగన్"

28, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3500

కవిమిత్రులారా,
(మీ అందరి సహకారంతో సమస్యల సంఖ్య 3500 చేరుకున్నది. ధన్యవాదాలు.)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వాసికంటె మేలు రాసి గనఁగ" 

(లేదా...)
"వాసి యనంగనేలఁ దలవాకిటఁ గన్పడు రాసి గొప్పదౌ"

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3499

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చచ్చె సింహము చీమచే సత్యమిద్ది"

 (లేదా...)
"చచ్చెన్ సింహము చీమచేత నహహా సత్యమ్ము వాక్రుచ్చితిన్"

26, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3498

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుప్పలుగా సిరులు గూడ క్షోభింపఁ దగున్"

 (లేదా...)
"కుప్పలుఁ గుప్పలై సిరులు గూడిన ఖేదము నందఁగాఁ దగున్"

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3497

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రామారెడ్డికి వధాన నైపుణి గలదే"
(లేదా...)
"రామారెడ్డి యొనర్పజాలఁ డవధానక్రీడ నేనాటికిన్"
(యతిని గమనించండి)
(శతావధాని కొండపి మురళి గారు పంపిన సమస్య)

24, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య - 3496

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అయ్యనుఁ గని యాయమ విరహాతుర యయ్యెన్"

 (లేదా...)
"అయ్యనుఁ గాంచి యామె విరహాతుర యెయ్యెను సాజమే కదా"

23, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3495

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకరొ యిద్దఱొ యింకెందఱో యెఱుంగ" 

(లేదా...)
"ఒకరా యిద్దఱ ముగ్గురా నలుగురా యూహింప నింకెందఱో"

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3494

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"లక్ష్మీపతి భర్త యయ్యె లలన నగజకున్"

 (లేదా...)
"లక్ష్మీవల్లభుఁ డయ్యె భర్త యుమకున్ లక్షింపుఁడీ పండితుల్"

21, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3493

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్"

 (లేదా...)
"సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్"

20, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3492

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతినిఁ గని ముద్దులిడెను రాధ ముదమునన్"

 (లేదా...)
"రాతినిఁ గాంచి ముద్దిడెను రాధ మనంబున మోదమందుచున్"

19, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3491

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాధాకృష్ణుండు వటుఁడు రాకేందుముఖీ"

 (లేదా...)
"రాధాకృష్ణుఁడు బ్రహ్మచారి యగు నో రాకేందుబింబాననా"

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3490

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సోదరిం బెండ్లియాడెను సోదరుండు" 

(లేదా...)
"సోదరిఁ బెండ్లియాడె నిజసోదరుఁ డెల్లరు సంతసిల్లఁగన్"

17, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య - 3489

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుష్టుఁడు పరమందు గనఁడు దుర్దశనెపుడున్"

 (లేదా...)
"దుష్టుఁడు సర్వలోకముల దుర్దశనొంద కదృష్టవంతుఁడౌ"

16, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3488

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంతుఁడు శివునిఁ జంపెఁ జక్రమ్ముతోడ"

 (లేదా...)
"కంతుఁడు శంభు కంఠమును ఖండన చేసెను జక్రధారియై"

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3487

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాఁటిరోజు లిఁకరా వింకరావు"

 (లేదా...)
"నాఁటిరోజు లిఁకరా విఁకరా విఁకరావు మిత్రమా"(ఛందోగోపనము)

14, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3486

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి"

 (లేదా...)
"ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్"

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3485

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భరతుని లక్ష్మణుఁడు దునిమె భ్రాతయె మెచ్చన్"

 (లేదా...)
"భరతుని శీర్షమున్ దునిమి భ్రాతకుఁ దోడ్పడె లక్ష్మణుండొగిన్"

12, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3484

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కదనమ్మునుఁ దెచ్చిపెట్టెఁ గద శాంత్యుక్తుల్"(లేదా...)
"కదనముఁ దెచ్చిపెట్టెఁ గద కంజదళాక్షుని శాంతివాక్యముల్"

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3483

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంపెదను నన్ను కవిగ గుర్తింపకున్న"
(లేదా...)
"నన్నుఁ గవీశ్వరుండని ఘనంబుగ మెచ్చనివానిఁ జంపెదన్"
(ఈమధ్య 'చంటబ్బాయ్' సినిమాలో శ్రీలక్ష్మిని చూచినప్పుడు సిద్ధమైన సమస్య)

10, సెప్టెంబర్ 2020, గురువారం

దత్తపది - 171

కవిమిత్రులారా,
జుట్టు - కన్ను - ముక్కు - చెవి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

9, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3482

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దుర్మతి రాజైనఁ గనిరి తోషమును జనుల్" 

(లేదా...)
"దుర్మతి రాజు గాఁగఁ బరితోషముఁ గైకొని రెల్లవారలున్"

8, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3481

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరతంత్రులు దీనజనుల పాలి సురతరుల్" 

(లేదా...)
"పరతంత్రుల్ చరియింత్రు దీనజన కల్పక్ష్మాజ సాదృశ్యులై"

7, సెప్టెంబర్ 2020, సోమవారం

సమస్య - 3480

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పద్యమ్మునుఁ బాతిపెట్టు వారలకు నతుల్"

 (లేదా...)
"పద్యముఁ బాతిపెట్టఁగలవారి పదంబుల కేను మ్రొక్కెదన్"

(నిన్నటి అష్టావధానంలో గురుసహస్రావధాని శ్రీ  కడిమెళ్ళ వరప్రసాద్ గారికి నేనిచ్చిన సమస్య)

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

సమస్య - 3479

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సన్మానమ్మును బొందని కవి  మాన్యుం డగునా"

 (లేదా...)
"సన్మానముఁ బొందకున్న కవి మాన్యుఁ డంటంచు గణింతురా ప్రజల్"  

(ఛందోగోపనము)

5, సెప్టెంబర్ 2020, శనివారం

సమస్య - 3478

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

 ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తగవులం బెట్టువా రుపాధ్యాయు లనఁగ"

 (లేదా...)
"తగవుల్ బెట్టెడివారలే కద యుపాధ్యాయుల్ విచారించినన్"

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3477

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గండపెండెరము గుకవుల కొప్పు"

 (లేదా...)
"తలఁతురు గండపెండెరముఁ దాల్ప సదా కుకవుల్ యశోర్థులై"

3, సెప్టెంబర్ 2020, గురువారం

సమస్య - 3476

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మత్స్యక్షీరమ్ము మంచి మందు కవులకున్"

 (లేదా...)
"మత్స్యక్షీరముఁ బిల్లికొమ్ముఁ గలుపన్ మందౌఁ గవీంద్రాళికిన్"

2, సెప్టెంబర్ 2020, బుధవారం

సమస్య - 3475

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శంఖధ్వానము వినఁబడె శ్వానము మొఱుఁగన్" 

(లేదా...)
"శంఖధ్వానము విన్పడెన్ పృథులమై శ్వానంబు బిట్టార్వఁగన్"

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

సమస్య - 3474

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎన్నిక కానట్టివారె యేలుదురు ప్రజన్"

 (లేదా...)
"ఎన్నిక కానివారె ప్రజ నేలుదు రీ జనతంత్ర భూమిలో"