31, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 953 (కాలిన నా కలికి మోము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాలిన నా కలికి మోము కళకళ లాడెన్.!
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

పద్య రచన – 238

కవిమిత్రులారా, 
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

30, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం – 952 (శంకరుండు వద్దు మాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ గదా!
ఈ సమస్యను పంపిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.

పద్య రచన – 237

తిరుచ్చి రంగనాథస్వామి
కవిమిత్రులారా,  
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 951 (మేను శాశ్వతంబు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మేను శాశ్వతంబు మిత్తి రాదు.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

పద్య రచన – 236

కవిమిత్రులారా,   
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

28, జనవరి 2013, సోమవారం

సమస్యాపూరణం – 950 (చినవానిని పెండ్లియాడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చినవానిని పెండ్లియాడి చేడియ మురిసెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.


పద్య రచన – 235

కవిమిత్రులారా,   
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 949 (రాహుకేతువు లిరువురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రాహుకేతువు లిరువురు రవి తనయులు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

పద్య రచన – 234


కవిమిత్రులారా,  
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, జనవరి 2013, శనివారం

సమస్యాపూరణం – 948

కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అయినను పోయి చూడవలె హస్తినలో గణతంత్ర పర్వమున్.

పద్య రచన – 233

భారత రాజ్యాంగ నిర్మాతలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 948

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తెలివి లేనివారలు గదా  తెలుఁగువారు.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 232

కవిమిత్రులారా, 
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం – 947
                                  కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తేలును ముద్దాడి మగువ తియ్యగ నవ్వెన్.

పద్య రచన - 231


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం – 946 (ఉత్తరమ్మున జరిగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉత్తరమ్మున జరిగె సూర్యోదయమ్ము

పద్య రచన - 230
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22, జనవరి 2013, మంగళవారం

మన భావ్యము"శంకరాభరణము" బ్లాగు మిత్రులకు శుభాశీస్సులు!

మన భావ్యము

సీ.
మనము సరస్వతీ మాతృకృపారస
         
పానమ్ము నొనరించు వారమనియు
విద్యయనఁగ బ్రహ్మవిద్యయే యనెడు స
         
ద్భావమ్ము గలిగిన వారమనియు
ద్వేష రాగమ్ములెంతేనియు లేనట్టి
         
పరమ సంస్కృతి గల వారమనియు
శంకర గురుకృత శంకరాభరణపు
         
బ్లాగు హితముఁ గోరు వార మనియు
తే.గీ.
నిత్య మెల్లరి యెడ సాన్నిహిత్య మలర
నొండురుల జ్ఞానసంపద లొప్పుమీర
కలసి మెలసి పెంపొందింప కంకణమ్ము
దాల్చి పాటించుటే మన ధర్మ మగును 

నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 945 (హితమతిని గూల్చితే?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హితమతిని గూల్చితే? దేవ! శ్రితహితైషి!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 229

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, జనవరి 2013, సోమవారం

సమస్యాపూరణం - 944 (తనయుఁ జంపి చేసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తనయుఁ జంపి చేసె జనహితమ్ము.

పద్య రచన - 228

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం - 943 (కరుణ సెలంగ సర్పము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరుణ సెలంగ సర్పము సుఖమ్మును గూర్చెను కప్ప కయ్యెడన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 227

రాయప్రోలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, జనవరి 2013, శనివారం

సమస్యాపూరణం - 942 (బంధములను దొలఁచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బంధములను దొలఁచు విభుఁడు బంధింపబడెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 226

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 941 (శిల్పము జూడ వేడుకను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శిల్పము జూడ వేడుకను జిమ్మె రసాంచిత శీకరమ్ములన్.
ఆకాశవాణి సౌజన్యంతో ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 225

నేడు నందమూరి తారక రామారావు వర్ధంతి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం - 940 (గయలో పొంగిన భక్తి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గయలో పొంగిన భక్తి యిద్ధరణికిన్ గాంధర్వ భిక్షంబిడెన్.
ఈ సమస్యను పంపిన డా. ప్రభల రామలక్ష్మి గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 224

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం - 939 (కనుమ నాటి పూజ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కనుమ నాటి  పూజ  కాటిఁ జేర్చె.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 223

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం - 938 (కనుమ యనుచు బావ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కనుమ యనుచు బావగారి కనులను మూసెన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 222

కవిమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, జనవరి 2013, సోమవారం

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

                     సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

సీ. 
ఎండమావులు రైతు గుండె లవియజేసి
          మడికట్లు సైతమ్మునడుగుపెట్టె
చినుకు రాలదటంచు సిగలెల్ల సారించి
          గగనతలముజూచి వగచు రైతు
కన్నీరె వర్షమై మన్ను తడుపునేమొ ?
          కరుణించి మేఘాలు కురవవాయె
ఏ మొగమ్మును బెట్టి ఝాము ప్రొద్దులొ నిన్ను
          సంక్రాంతి లక్ష్మి ! సుస్వాగతించు
ఆ.వె. 

మ్రింగ ముద్ద లేదు ముంగిట రంగుల
ముగ్గులెట్లు వేయ ముదితకగును
కరుణజూపవమ్మ తరుణీ లలామ ! సం
క్రాంతి లక్ష్మి ! తగు ప్రశాంతినిమ్మ .


ఆ.వె. 
మంచు కురియు వేళ సంచిత భక్తితో
ముగ్గులేయబోవు ముదిత పుస్తె
మ్రుచ్చిలించి పారిపోవును దొంగ , సం
క్రాంతి లక్ష్మి ! తెలియరావె తల్లి !


ఆ.వె. 
అంబరాన్ని తాకినట్టి సరుకులధ
రలను జూచి కండ్ల రంగులీను
మరల రంగుముగ్గు కరువైనదా తల్లి !
మకర సంక్రమణము మార్పునిడునె ?


ఆ.వె. 
ప్రాంగణాలు లేవు పైపైన మిద్దెలే
మా నివాసమయ్యె పూనుకొనుచు
గడపలందు మెచ్చ కళ్ళాపి చల్లి , గొ
బ్బెమ్మల నిలుప సుకరమ్మె మాకు ?


ఆ.వె. 
బుడతల తలలకని భోగి పండ్లనుపోయ
బుట్ట రేగుపండ్లు పుత్తడయ్యె
మండుటెండలవియె మహి భోగి మంటలై
ధాత్రినేలుచుండె తరుణి ! కనుమ .


తే.గీ. 
పసిడి గజ్జెల సవ్వడి పరిఢవిల్ల
కాంతులేపార యింట సంక్రాంతి లక్ష్మి !
అడుగుపెట్టవే మేలైన గడపలందు
స్వాగతించెదమమ్మ సౌభాగ్య లక్ష్మి !


డాక్టర్ మాడుగుల అనిల్ కుమర్
తిరుపతి

సమస్యాపూరణం - 937 (పండువులన్న సంబరము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పండువులన్న సంబరము బామ్మకు తాతకె ముచ్చటల్ గదా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 221

                                                                  
కవిమిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
                                                      

13, జనవరి 2013, ఆదివారం

సమస్యాపూరణం - 936 (సంకటంబుల సంక్రాంతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సంకటంబుల  సంక్రాంతి! స్వాగతంబు.
ఈ సమస్యను పంపిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 220

కవిమిత్రులకు భోగి పండుగ శుభాకాంక్షలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, జనవరి 2013, శనివారం

సమస్యాపూరణం - 935 (మూడు పూవులు, నారు కాయలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మూడు పూవులు, నాఱు కాయలు, ముప్పదాగు ముచ్చటల్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 219

నేడు వివేకానంద జయంతి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, జనవరి 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 934 (భారతమున రావణుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భారతమున రావణుండు ప్రౌఢిని జూపెన్.
డా. జొన్నలగడ్డ మృత్యుంజరావు గారి 'కచ్ఛపి' నుండి
సేకరించి పంపిన తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 218

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, జనవరి 2013, గురువారం

సమస్యాపూరణం - 933 (రమణి విల్లు విఱిచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రమణి విల్లు విఱిచె ప్రమద మెసఁగ.
సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 217

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, జనవరి 2013, బుధవారం

సమస్యాపూరణం - 932 (పెద్ద మనస్సులంచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పెద్ద మనస్సులంచు మన పెద్దలతో పరిహాస మేలనో?
సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 216

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, జనవరి 2013, మంగళవారం

సమస్యాపూరణం - 931 (అది విన్నన్ గనినంత)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అది విన్నన్ గనినంత మండు నొడ లత్యంతాగ్రహోదగ్రతన్.
ఆకాశవాణి సౌజన్యంతో
సమస్యను సూచించిన తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.

పద్య రచన - 215

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

7, జనవరి 2013, సోమవారం

పద్య రచన - 214

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యాపూరణం - 930 (రంగులఁ బూజింతురు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రంగులఁ బూజింతు రెల్ల ప్రాంతములందున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

6, జనవరి 2013, ఆదివారం

సమస్యా పూరణం - 929 (ఉంగరమ్మె యొడ్డాణమై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉంగరమ్మె యొడ్డాణమై యొప్పెనుగద!

పద్య రచన - 213

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, జనవరి 2013, శనివారం

సమస్యా పూరణం - 928 (బాలుఁడు భండనమునందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బాలుఁడు భండనమునందు వైరులఁ గూల్చెన్.

పద్య రచన - 212

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4, జనవరి 2013, శుక్రవారం

సమస్యా పూరణం - 927 (ఉన్నది కన్పట్టు నొక్కొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఉన్నది కన్పట్టు నొక్కొ యోగివరేణ్యా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 211

శ్రీమంతం
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈరోజు మా కోడలు సౌ|| కల్పన శ్రీమంతం. 
కవిమిత్రులు ఆశీస్సు లందజేయవలసిందిగా మనవి.

3, జనవరి 2013, గురువారం

సమస్యా పూరణం - 926 (కంటి కింపు గొలుపు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కంటి కింపు గొలుపు గాన సుధలు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 210

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, జనవరి 2013, బుధవారం

సమస్యా పూరణం - 925 (ధర నీ పాదమె నౌక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధర నీ పాదమె నౌక యంచు దలఁతున్ దండంబు నేఁ బెట్టుదున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 209

చెక్క భజన
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, జనవరి 2013, మంగళవారం

రైలెక్కిన శ్రీనాథ కవి

    ఆరోజు విజయవాడలో ఆఫీసర్ల క్లబ్ వార్షికోత్సవం. ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు భార్యలతో సహా వచ్చారు. సాహిత్యం మీద ఇష్టాగోష్ఠి. స్టేజీమీద రైల్వే డి.ఆర్.ఎం గారు ముఖ్య అతిథిగా ఆసీనులయ్యారు. ఆ క్లబ్బుకి వారి సతీమణి కార్యదర్శి. ముఖ్యాంశం శ్రీనాథుని కవితా వైభవం.
    శ్రీనాథుని కవిత్వం గురించి సీస పద్యాలు ఉదహరిస్తూ ఒకరు మాట్లాడారు. ఆయన ప్రసంగం అవగానే అందరూ చప్పట్లు కొట్టారు. డి.ఆర్.ఎం గారు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.
    చివర వందన సమర్పణ చేస్తూ డి.ఆర్.ఎం గారి సతీమణి "శ్రీనాథుని కవిత్వం గురించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ఆ శ్రీనాథుని ఒక వారం రోజుల క్రితమే నేను తమిళ్‌నాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో చూసాను. ఆయన ఫలానావారు అని తెలిసేలోగానే వారు రాజమండ్రిలో రైలు దిగి వెళ్ళిపోయారు. అలాంటి మహాకవిని కలిసి మాట్లాడలేకపోవడం నా దురదృష్టం" అని విచారంగా చెప్పింది.
    సభలో అంతా అవాక్కయ్యారు. ఆ నిశ్శబ్దానికి కారణం తెలియక భర్త వైపు చూసింది. డి.ఆర్.ఎం గారు భార్యకేసి కోపంగా చూసారు.
    సరే కార్యక్రమం పూర్తి అయింది. డి.ఆర్.ఎం గారు సతీమణితో కార్లో ఇంటికి వెళ్తున్నారు.
మౌనంగా వున్న భర్తతో "ఏమండీ! నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, నాకేసి కోపంగా చూసారు?" అని అడిగింది.
    "నీకు బుద్ధిలేదు. ఏం వాగావో తెలుసా?"
    "నేనేమన్నానండి?" అంది భయంభయంగా.
    "తమిళ్‌నాడు ఎక్స్‌ప్రెస్ రాజమండ్రి మీదుగా వెళ్తుందా? ఆ మాత్రం ఇంగితఙ్ఞానం లేకుండా మాట్లాడితే నలుగురూ నవ్వరూ? చూసావా అందరు విస్తుపోయి నీకేసి ఎలా చూసారో?"
    "అవునండి. అది హౌరా మెయిల్ అనబోయి తమళ్‌నాడు అన్నా" అంది ఖిన్నురాలై.

- ఫేస్‌బుక్‌ నుండి ‘జాజిశర్మ’గారికి ధన్యవాదాలతో....

ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు!

సమస్త సన్మంగళాని భవంతు.
అమ్మ సరస్వతీ పద నవాంబుజ సేవల జేయుచుండి ని
త్యమ్మును సాహితీ సుమవనాంతర సీమలలోన కల్ప వృ
క్షమ్ముల ఛాయలందు విలసన్మతి రాజిలుచుండు నట్టి నే
స్తమ్ములు సత్కవీశ్వరులు, జ్ఞానధనాఢ్యులు, సద్గుణోన్నతుల్
సమ్మతి శంకరాభరణ సత్కవన స్థలి శంకరార్య సౌ
ధమ్మున రమ్య వేదిక సదా యలరారుచునుండు హృద్య భా
వమ్ముల వెల్వరింపగల పద్య వికాస విలాస సంపదల్
కమ్మని తెల్గు బాష నుడికారపు గౌరవ ముప్పతిల్ల భా
గ్యమ్ముగ నెంచి పండువుల నచ్చట ముచ్చట గొల్పు రీతి స్వ
ఛ్ఛమ్మగు చిత్త వృత్తి పద సంపద లింపులు సొంపు లీను చం
దమ్ముల పెక్కు ఛందముల తళ్కులు బెళ్కులు  నొల్కు మంచి ప
ద్యమ్ముల హేల లందలర తద్దయు వేడుక తోడ రండు చి
త్తమ్ములు చిత్తముల్ కలిసి తన్మయమందుచు నూగ వచ్చు నం
దమ్మహితాత్ము శంకర మహాశయు సత్కృతులంద వచ్చు తే
జమ్మున నూత్న వత్సరము సర్వ సుఖప్రద యౌచు వచ్చె భ
ద్రమ్ముగ స్వాగతిమ్మడగ రండివె మీకు శుభాభినందనల్  

 
స్వస్తి. 
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు  

సమస్యా పూరణం - 924 (హ్యాపీ న్యూ యియర్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హ్యాపీ న్యూ యియ రటన్న నాగ్రహ మొందెన్.

పద్య రచన - 208

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.